సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను యథావిధిగా ప్రజలకు అందిస్తామని, సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంతో తమకు ఏ సంబంధం లేదని ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తమ అసోసియేషన్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,150 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయని వాటిల్లో సేవలు నిరంతరాయంగా అందుతాయని చెప్పారు.
ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రొసీజర్‌లను భారీగా పెంచడమే కాకుండా, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment