ప్రజాస్వామ్యానికి ముప్పు
రిజర్వేషన్లు, ప్రాథమిక హక్కులు పోతాయి
వాటిని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతుంది
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన చేస్తాం
మోదీకి ధైర్యం ఉంటే అదానీ, అంబానీ మీద ఈడీ, ఇన్‌కంటాక్స్ దాడులు చేయించాలి
ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ బందే
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ’’బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంది.. ప్రజాస్వామ్యా నికి ముప్పు ఏర్పడుతుంది.. రిజర్వేషన్లు పోతా యి, ప్రజల ప్రాథమిక హక్కులనూ తొలగిస్తా రు’’ అని ఆఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలో ప్రజల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి, మోదీకి ఒక్కసీటు కూడా రావద్దని, వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనన్నారు.
శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం రక్షించే కాంగ్రెస్ పార్టీకి, రాజ్యాంగం రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఈ ఎన్నికలు జరుగుతు న్నాయన్నారు. పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుతంత్రాలు పన్నుతాయని ధ్వజమెత్తారు.
అదానీ, అంబానీలపై ఐటీ దాడులు చేయించగలరా?
మోదీ దేశాన్ని ధనవంతులైన తన మిత్రులకు ప్రభుత్వరంగ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నా రని ఖర్గే ఆరోపించారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెట్టి తిరిగి కాంగ్రెస్‌పైనే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీ ట్రక్కులు, టెంపోలలో డబ్బులు పంపుతున్నా రని అమిత్‌షా, మోదీ మాట్లాడుతున్నారని, వా రు డబ్బులు పంపిస్తుంటే మరి మోదీ, అమిత్‌షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించాలని ఖర్గే సవాల్ విసిరారు.
ఆటో డ్రైవర్లుకు ఏటా రూ.12 వేలిస్తాం
తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్ని గ్యారంటీలు అమలవుతున్నాయని ఖర్గే వెల్లడించారు. ఉచిత బస్‌ప్రయాణం, ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామ ని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీన రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతా మన్నారు. ఆటో వారికి ఏటా రూ.12 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. కులగణన తరువాత కుటుంబ యజమాని అయిన మహిళల ఖాతాలో ఏటా రూ.లక్ష జమ చేస్తామన్నారు.
ఇవన్నీ నెరవేరాలంటే హస్తం గుర్తుకు ఓట్లు వేసి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం,
మందుల సామేలు పాల్గొన్నారు.
ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ ఉండదు
ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ బంద్ కావడం ఖాయమని ఖర్గే జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. మోదీ రాజ్యాంగాన్ని మారు స్తామని చెప్పినా దానిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment