విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మల్లికార్జునఖర్గే. చిత్రంలో భట్టి విక్రమార్క
ఇప్పటివరకు ఇలాంటి ప్రధానిని చూసి ఉండరు
తెలంగాణలో బీజేపీ ఏ అభివృద్ధీ చేయలేదు
ఇప్పటికే తెలంగాణలో కొన్ని హామీలు అమలు చేశాం
మీడియా భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన 6 హామీల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, 500 సిలిండర్, 200 ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ లాంటివి ఇప్పటికే ప్రారంభించాం. మిగిలిన ఒకటి కూడా త్వరలోనే ప్రారంభి స్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే ప్రకటించారు. ఎన్నికల కోడ్ కారణంగా హామీల అమలు తాత్కాలికంగా ఆగిందని, కోడ్ ముగియగానే అమలు చేస్తామని చెప్పారు.
తాము తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇచ్చిన వాగ్దానా లను అమలు చేస్తూ పోతున్నామని, బీజేపీ ఎన్ని కల మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా, కాంగ్రెస్‌ను తిట్టడంపైనే ఫోకస్ చేసిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన మల్లి కార్జున ఖర్గే తాజ్‌కృష్ణలో విలేకరులతో మాట్లా డారు. పూర్తి వివరాలు ఆయన మాట్లల్లోనే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు. ఐదేళ్లపాటు అద్భుతపాలన అందిస్తాం.
మీ సీబీఐ ఏం చేస్తోంది..?
జనగణనను మోదీ బయటపెట్టడం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, పిల్లలు ఎందరున్నారు? వారి స్థితిగతులేంటి? వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఏ సంక్షేమ పథకాలు చేపట్టాలి? విద్య, వైద్యం పరిస్థితి ఏంటీ? అయితే మోదీ సర్కారు ఈ గణాంకాలను దాచిపెడుతోంది. మోదీ అబద్ధాలపై అబద్ధాలు చెబుతున్నారు. అదానీ, అంబానీలు రాహుల్‌గాంధీకి టెంపోలో డబ్బులు పంపిస్తున్నారని మోదీ ఆరోపిస్తున్నారు.
మీ సీబీఐ ఏమైంది..ఈడీ, ఆదాయపు పన్నుశాఖ ఏం చేస్తోంది? కావాలంటే విచారణ జరిపించు. ప్రతిపక్ష నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్న కేంద్రం.. అసలు అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ సంస్థల రైడింగ్ ఎందుకు జరపడం లేదో మోదీకే తెలియాలి. వారితో అమిత్‌షా ఎప్పుడూ కలిసే తిరుగుతారు. 50 కోట్ల మంది వద్ద ఎంత సంపద ఉందో ఆ ఇద్దరి వద్ద అంత ఉంది.
దేశాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు
‘మోదీ, అమిత్‌షా ఆందోళనలో ఉన్నారు. అభివృద్ధి చూసి ఓటు వేయమని మోదీ అడగం లేదు. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనారిటీలు లాంటి అంశాలనే ప్రధాని మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రధానిని ఇంత వరకు ఎవరూ చూసి ఉండరు. కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోంది. అందుకే మమల్ని టార్గెట్ చేసి మోదీ విమర్శలు చేస్తున్నారు.
అధికారంలోకి రాగానే పథకాలు..
‘ఆలిండియా సర్వీసెస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలెందరో చెప్పడం లేదు. మేం అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులిస్తాం. మహిళలకు 50%... జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం. మహాలక్ష్మీ యోజన కింద రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తాం. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతుకు కనీస మద్దతు ధర ఇస్తాం. పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏమీ చేయలేదు. దేశరాజధాని స్థాయిలో హైదరా బాద్‌లో అభివృద్ధి జరగాల్సి ఉండగా, ఆ మేరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
హైదరాబాద్, బెంగళూరు, ముంబైలను పక్కకు పెట్టి అన్నీ ఒక్క గుజరాత్‌కే తరలిస్తే ఎంతవరకు సమంజసం. చేయిని తీసివేయడం ఎవరికీ సాధ్యం కాదు. మరోసారి నొక్కి చెబుతున్న హామీలన్నీ అమలు చేసి తీరుతాం’ అని మల్లికార్జున ఖర్గే వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్‌మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, మధు యాష్కీగౌడ్, జబీర్ అహ్మద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment