ఆ రెండు పత్రికలు అబద్ధాల్ని ప్రచురించాయి
విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో అసైన్డ్ భూముల వ్యవహారంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఆ కథనాలున్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆనందపురం మండలం రామవరం గ్రామంలోని సర్వే నం.164–3లో 1.53 ఎకరాలు, సర్వే నం.169–2లో 0.87 ఎకరాల్ని జీఓ నం.596 ప్రకారం ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కథనాలు వచ్చాయన్నారు. అయితే, 1977 రెÐవెన్యూ చట్టానికి లోబడే ప్రొసీడింగ్స్ మంజూరు చేశామని స్పష్టంచేశారు.
అక్కిరెడ్డి బంగారయ్యకి సంబంధించి సర్వే నంబర్ 169–2లోని 0.87 ఎకరాలకు ఎలాంటి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీచేయలేదన్నారు. అదేవిధంగా.. 2020లో భీమునిపట్నం మండలం అన్నవరం, భోగాపురం మండలం తూడెం గ్రామాల్లో జరిగిన ల్యాండ్ పూలింగ్ విషయంలో ఈనాడు రాసిన కథనంపై కలెక్టర్ మండిపడ్డారు. వాస్తవానికి.. అన్నవరం గ్రామంలోని సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్, భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలోని సర్వే నం.1/101.పరిధిలోని భూమి వర్గీకరణ, మొత్తం విస్తీర్ణం 199.28 ఎకరాలు గయాలుగా నమోదైందన్నారు.
ఇందులో తాము అనుభవిస్తున్నట్లుగా సదరు రైతులు ఆధారాలతో తమకెలాంటి ఫిర్యాదులూ చేయలేదన్నారు. హక్కు పత్రాలు ఏమైనా ఉంటే సమర్పించాలని పలుమార్లు రైతుల్ని కోరినా ఇవ్వలేదన్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పూలింగ్ జరిపినప్పుడు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే చేపట్టామని కలెక్టర్ స్పష్టంచేశారు. గ్రామసభలు సైతం నిర్వహించామని.. ఇందులో భాగంగానే 2019 నవంబర్ 28న ఎంజాయ్‌మెంట్ సర్వేచేసి రైతుల సమ్మతితోనే భూ సమీకరణ చేసుకునేందుకు అదే నెల 30న ఫారం–1 నోటీసులు సైతం జారీచేసినట్లు ఆయన వివరించారు.
ఈ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు రాలేదనీ, దానికనుగనంగా.. సమీకరణ చేపట్టామన్నారు. రిజి్రస్టేషన్ల ప్రక్రియ కూడా తుదిదశలో ఉందని.. ఎవరైనా రైతులు మిగిలి ఉంటే.. తగిన డీ–పట్టాలతో అ«దీకృత అధికారిని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్క రైతుకీ న్యాయం చేసేలా వ్యవహరించామే తప్ప.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించినట్లుగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వలేదని కలెక్టర్ డా.మల్లికార్జున స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment