Enadu
-
‘అసైన్డ్’పై తప్పుడు కథనాలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో అసైన్డ్ భూముల వ్యవహారంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఆ కథనాలున్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆనందపురం మండలం రామవరం గ్రామంలోని సర్వే నం.164–3లో 1.53 ఎకరాలు, సర్వే నం.169–2లో 0.87 ఎకరాల్ని జీఓ నం.596 ప్రకారం ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కథనాలు వచ్చాయన్నారు. అయితే, 1977 రెÐవెన్యూ చట్టానికి లోబడే ప్రొసీడింగ్స్ మంజూరు చేశామని స్పష్టంచేశారు. అక్కిరెడ్డి బంగారయ్యకి సంబంధించి సర్వే నంబర్ 169–2లోని 0.87 ఎకరాలకు ఎలాంటి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీచేయలేదన్నారు. అదేవిధంగా.. 2020లో భీమునిపట్నం మండలం అన్నవరం, భోగాపురం మండలం తూడెం గ్రామాల్లో జరిగిన ల్యాండ్ పూలింగ్ విషయంలో ఈనాడు రాసిన కథనంపై కలెక్టర్ మండిపడ్డారు. వాస్తవానికి.. అన్నవరం గ్రామంలోని సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్, భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలోని సర్వే నం.1/101.పరిధిలోని భూమి వర్గీకరణ, మొత్తం విస్తీర్ణం 199.28 ఎకరాలు గయాలుగా నమోదైందన్నారు. ఇందులో తాము అనుభవిస్తున్నట్లుగా సదరు రైతులు ఆధారాలతో తమకెలాంటి ఫిర్యాదులూ చేయలేదన్నారు. హక్కు పత్రాలు ఏమైనా ఉంటే సమర్పించాలని పలుమార్లు రైతుల్ని కోరినా ఇవ్వలేదన్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పూలింగ్ జరిపినప్పుడు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే చేపట్టామని కలెక్టర్ స్పష్టంచేశారు. గ్రామసభలు సైతం నిర్వహించామని.. ఇందులో భాగంగానే 2019 నవంబర్ 28న ఎంజాయ్మెంట్ సర్వేచేసి రైతుల సమ్మతితోనే భూ సమీకరణ చేసుకునేందుకు అదే నెల 30న ఫారం–1 నోటీసులు సైతం జారీచేసినట్లు ఆయన వివరించారు. ఈ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు రాలేదనీ, దానికనుగనంగా.. సమీకరణ చేపట్టామన్నారు. రిజి్రస్టేషన్ల ప్రక్రియ కూడా తుదిదశలో ఉందని.. ఎవరైనా రైతులు మిగిలి ఉంటే.. తగిన డీ–పట్టాలతో అ«దీకృత అధికారిని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్క రైతుకీ న్యాయం చేసేలా వ్యవహరించామే తప్ప.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించినట్లుగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వలేదని కలెక్టర్ డా.మల్లికార్జున స్పష్టంచేశారు. -
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్‌కు అంత సీను లేదబ్బా!
తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్‌కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్‌గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్‌లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్‌ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో పనిచేసే కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం సృష్టించడం, వాటిని కించపరచడమే లక్ష్యంగా ఈనాడు దురుద్దేశపూర్వక కథనాలను ప్రచురిస్తోందంటూ పౌర సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రెండు వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చి, ప్రజల్లో చులకన చేసే లక్ష్యంతో పెన్షన్ల పంపిణీపై ‘ఎవరి ఆధీనంలో ఎవరు’ అంటూ కథనాన్ని ప్రచురించారంటూ ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం ఆదివారం ఫిర్యాదు చేశాయి.ఈ సందర్భంగా ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పి. విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడు కథనం ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం పారదర్శకత, సమగ్రత, నిబద్ధతను ఈ కథనం ప్రశి్నంచేదిగా ఉందన్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా వార్తలు పత్రికా విలువలను, నైతికతను దిగజార్చేలా ఉన్నందున, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా జోక్యం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చందని, వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ కూడా పాటించిందని చెప్పారు. అయినప్పటికీ, ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం లేదనే విధంగా ఈనాడు కథనం ఉండటం శోచనీయమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం ఇస్తున్న ఆదేశాలను సీఎస్ తూచ తప్పకుండా పాటిస్తున్నప్పటికీ, ఆయన పనితీరుపై అపోహలు కలి్పంచేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాలను దించి వేయడం, వాటికి అనుకూలమైన పార్టీలను అందలం ఎక్కించడం అనే రాజ్యాంగ విరుద్ధమైన బాధ్యతను భుజాలకెత్తుకున్నాయని కృష్ణంరాజు విమర్శించారు. ప్రభుత్వాల పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రజలే వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారని, కానీ వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను ప్రచురించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
సీఎం జగన్ హత్యకు పెద్ద కుట్ర.. ‘ఎల్లో బ్యాచ్’పై అనుమానాలెన్నో!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగినప్పుడు తెలుగుదేశం స్పందన, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పిచ్చి రాతలు, నిందితులను పోలీసులు ట్రేస్ చేయడంతో టీడీపీకానీ, వారి మీడియా కానీ మాటలు మార్చిన వైనం చూస్తే కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతా ఒక మాట మీద ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడరాదు. నిందితులకు మద్దతుగా సానుభూతి వచనాలు చెప్పడానికి యత్నించకూడదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక పదునైన రాయి ద్వారా హత్యాయత్నం నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నిటిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎక్కువగా కంగారు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఖండన తప్ప ఇతరత్రా స్పందించనవసరం లేని వాటిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలుత ఖండన చేసినట్లు కనిపించినా, ఆ తర్వాత నాటకం అంటూ ఆరోపించడం ఆరంభించారు. కానీ పోలీసులు కచ్చితంగా ఇది హత్యాయత్నమేనని తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అజిత్ సింగ్ నగర్ వద్ద జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ట్రాక్ రికార్డు అంత సవ్యంగా లేదు. ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి తగినట్లే ఆయన అనుచరులే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఇప్పుడు పోలీసుల రిమాండ్‌లోని అంశాలను బట్టి అర్థం అవుతుంది. ఈ రిపోర్టులో ఇంకా కుట్రదారులదాకా వెళ్లలేదు కానీ, భవిష్యత్తులో ఈ కేసులో కుట్రకు పాల్పడింది ఎవరు అన్న దర్యాప్తు జరుగుతుంది. అప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుతానికి ఒక నిందితుడు వేముల సతీష్‌ను పోలీసులు పట్టుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అజిత్ సింగ్ నగర్ వద్ద ఒక స్కూల్‌కు, ఒక దేవాలయానికి మధ్య ఉన్న చెట్ల వద్ద ఎవరికి కనబడకుండా ఈ దాడి చేశారు. పొరపాటున ఆ రాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంటికి తగిలి ఉంటే ఏమిటి పరిస్థితి! అంతేకాదు, నవరగంత వద్ద ఆ పదునైన రాయి తగిలి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేది. అంత పెద్ద గాయం కంటిపైన తగిలితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా అది కేవలం గులకరాయి దాడిగా అభివర్ణించడం నీచంగా ఉంది. పవన్ కల్యాణ్ వంటి రాజకీయ అజ్ఞాని ముఖ్యమంత్రికి వేసిన దండలో వచ్చిన రాయి కావచ్చని పిచ్చి వాదన తెచ్చారు. లోకేష్ వంటి పరిణితిలేని వ్యక్తి ఈ రాయిని తాడేపల్లి పాలెస్ నుంచి వచ్చిందని అహంకారపూరిత, కనీసం ఇంగితం లేని వ్యాఖ్య చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా తొలుత అయితే ఇదంతా పోలీసుల వైఫల్యంగా తేల్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసురుతున్నప్పుడు పోలీసులు ఏమి చేస్తున్నారని, వారు ఎందుకు ఆపలేకపోయారని నిలదీస్తూ వార్తలు రాశారు. అప్పటికి వీరికి ఒక నమ్మకం ఉండి ఉండాలి. ఈ రాయి విసిరిన వ్యక్తులను విజయవాడ పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని భావించి ఉండాలి. అందుకే అంత ధైర్యంగా పోలీసులదే వైఫల్యం అన్నట్లు ప్రొజెక్టు చేసే యత్నం చేశారు. చంద్రబాబు తన సహజ శైలిలో దీనిపై కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడి తన లక్షణాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారు. ఇక్కడ కీలకమైన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలుత ఈ దాడి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కలిసి ఆడిన డ్రామా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అనుమానితులను, నిందితులను పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయన్న సమాచారం రాగానే మాట మార్చి, అదేదో కావాలని చేసింది కాకపోవచ్చన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు అన్నా క్యాంటిన్ ఎత్తివేశారని కోపంతో, తన తల్లికి రోడ్‌షోకు వచ్చినందుకు ఇస్తానన్న 200 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో రాయి విసిరి ఉండవచ్చని బొండా అన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ కేసులో కనుక తనను కూడా ఇరికించాలని చూస్తే జూన్ నాలుగు తర్వాత ఆ పోలీసుల సంగతి చూస్తానని బెదిరించారు. ఇది అచ్చం చంద్రబాబు, లోకేష్‌ల నుంచి తర్ఫీదు పొందినట్లే మాట్లాడారు. వారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా, అధికారులను ,ముఖ్యంగా పోలీసులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ స్వరం మార్చింది. బీసీ వర్గానికి చెందినవారిని కేసులో పెడతారా అని అచ్చెన్నాయుడు విమర్శించారు. హత్యాయత్నం ఘటనలలో కులం చూసి కేసు పెట్టాలని కొత్త రాజ్యాంగాన్ని వీరు చెబుతున్నారు. అలాగైతే చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగినప్పుడు కూడా కులం చూసే కేసులు పెట్టారా? ఇక చంద్రబాబు అయితే ఈ కేసులో బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు కేసు దర్యాప్తే ఒక దశకు రాకుండానే చంద్రబాబుకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? అంటే ఈ హత్యాయత్నం ఎలా జరిగింది? అందులో ఎవరు ఉన్నారు? ఎవరికి సంబంధించినవారో ముందే తెలుసునని అనుకోవాలి. పోలీసు రిమాండ్ రిపోర్టులో వేముల సతీష్ అనే వ్యక్తి పదునైన రాయి విసిరితే, అందుకు ప్రేరేపించింది మరో వ్యక్తి అని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలపలేదు. ఈ రెండో నిందితుడు బొండా ఉమా అనుచరులలో ఒక ముఖ్యుడన్న ప్రచారం జరుగుతోంది. లేదా బొండా తన పేరును నిందితులు చెబుతారన్న భయం ఏమైనా ఏర్పడిందా?ఇప్పటికే సతీష్ తాను నేరానికి పాల్పడ్డానని అంగీకరించారు. ఆ తర్వాత అందుకు ఎవరు ప్రోద్బలం చేసింది కూడా చెప్పి ఉంటారు. తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం వీరికి పట్టుకుంది. దాంతో వెంటనే పోలీసులను విమర్శించడం ఆరంభించారు. అందుకు ఈనాడు, జ్యోతి వంటి అనైతికంగా మారిన మీడియాను వాడుకున్నారు. ఒక ముఖ్యమంత్రిపై అంత దాడి జరిగితే, సానుభూతి చూపకపోతే మానే, ఏకంగా నిందితులకు మద్దతు ఇచ్చేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వారు మాట్లాడుతున్నారు. నిజానికి టీడీపీలో ఎవరికి సంబంధం లేకపోతే, అసలు ఈ అంశం గురించి వారు ప్రస్తావించవలసిన పనే లేదు. కానీ అందుకు భిన్నంగా అతిగా వ్యవహరించి తెలుగుదేశం నేతలు వారికివారే ఆత్మరక్షణలో పడ్డారనిపిస్తుంది. ఈనాడు మీడియా నిందితులు ఉన్న వడ్డెర కాలనీకి వెళ్లి నిందితుల కుటుంబాలు చాలా బాధలో ఉన్నట్లు, వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నట్లు వార్తలు ప్రచారం చేశారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు వైఫల్యం అని రాసిన ఈ మీడియా ఇప్పుడు పోలీసులు నిందితులను పట్టుకోవడాన్ని తప్పు పడుతోంది. నిందితుడు రాళ్ళు విసరడంలో నేర్పరి అయి ఉండాలి. లేకుంటే ముఖ్యమంత్రి కంటిపై భాగానికి తగిలేలా ఎలా వేయగలుగుతారు? ఇతనికి సహకరించినవారిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తన పేరు ఎక్కడ వస్తుందోనని బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్లినటట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీసులను బెదిరించారు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా అతనికి అనుకూలంగా వాదించడానికి లాయర్లు వచ్చారు. రోజుకు 250 రూపాయలు సంపాదించుకునే కుటుంబానికి ఇంత పెద్ద లాయర్లను పెట్టుకునే శక్తి ఎక్కడ నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఇక్కడ కూడా సరిగ్గా చంద్రబాబు పై వచ్చిన కేసుల్లో వాదించిన రీతిలోనే ఈ లాయర్లు వాదన చేసినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబుకు ఐటి నోటీసులు వస్తే, ఫలానా ఆఫీస్‌కు జ్యురిస్ డిక్షన్ లేదని సమాధానం ఇచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదించారు. ఇప్పుడు వేముల సతీష్ మైనర్ అని చెప్పడానికి ఆయన లాయర్లు యత్నించారు. కానీ పోలీసులు పకడ్బందిగా అతనికి పందొమ్మిదేళ్లని నిరూపించారు. తదుపరి సతీష్ రాయి వేయలేదన్న వాదనకు వెళ్లారు. సీఎంకు వేసిన దండ కర్ర గీసుకుని ఉండవచ్చని వాదించినట్లు అతని తరపు లాయర్ చెప్పారు. జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయం అయిన సంగతిని విస్మరించారేమో తెలియదు. దండ కర్ర గీసుకుంటే ఒకరికే గాయం అవుతుంది కానీ, ఇద్దరికి అవ్వదు కదా! ఈ లాజిక్ మిస్ అయి మాట్లాడినట్లు అనిపిస్తుంది. మరో సంగతి చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకుడు అప్రూవర్‌గా మారడంతోనే అతనికి బెయిల్ వచ్చేసింది. కానీ ఆ కేసు కుట్రదారులన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి మాత్రం నెలల తరబడి బెయిల్ రావడం లేదు. ఈ కేసుతో ముఖ్యమంత్రి పై జరిగిన హత్యాయత్నం కేసును పోల్చి చూస్తే, రాయి విసిరిన వ్యక్తి సంగతి ఎలా ఉన్నా, వెనుక ఉన్న కుట్రదారులకు కీలక పాత్ర ఉంటుందన్నమాట. కుట్రదారులను పట్టుకుని జైలులో పెట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రముఖ నేతలపై జరిగిన హత్యాయత్నం, దాడుల కేసుల్లో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు సుముఖంగా ఉండేవారు కారు. కానీ ఇక్కడ సతీష్ రిమాండ్ సమయంలోనే లాయర్లు రావడం విశేషం. మామూలుగా అయితే పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగానే రిపోర్టు చూసుకుని న్యాయమూర్తి రిమాండ్‌కు పంపిస్తుంటారు. కానీ అతని తరపు లాయర్లు రావడంతో వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామం చూసిన తర్వాత, అతని ఆర్దిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, నిందితుడిని కాపాడడానికి పెద్దప్రయత్నమే జరుగుతోందన్న అనుమానం వస్తోంది. దీనికి కారణం ఆ నిందితుడు విచారణలో తమ పేర్లు చెబితే అది సమస్య అవుతుందన్న భయం కావచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత తెలుగుదేశం నేతలుకానీ, ఎల్లో మీడియా కానీ వ్యవహరించిన వైనం అనుమానాస్పదంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. వారు అతిగా స్పందించడం, గులకరాయి దాడి అని పనికిమాలిన రాతలు రాయడం, నిందితుడిని రక్షించే యత్నం చేయడం ఇవన్నీ గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు కనిపించడం లేదూ! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా!
ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు టీడీపీని ముంచేశారు. వారిద్దరూ కలిసి ఏపీలో వేళ్లూనుకున్న వలంటీర్ల వ్యవస్థపై విషం కక్కుతూ రాసిన రాతలన్నీ నిజమేనని భ్రమపడి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విలవిలలాడుతున్నారు. ఆయనకు తత్వం బోధపడేసరికి టైమ్ ముగిసిపోయింది. జరగవలసిన డామేజీ జరిగిపోయింది. అందుకే రామోజీ, రాధాకృష్ణలు స్వరం మార్చి తాము చేసిన తప్పును వైఎస్సార్సీపీపై నెట్టేస్తూ పూర్తిగా దొరికిపోయారు. వలంటీర్లు పెన్షన్లు తీసుకునే వృద్దుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బు ఇవ్వరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వగానే తమ పన్నాగం ఫలించిందని వారు చంకలు గుద్దుకున్నారు. కొద్ది గంటలలోనే తాము ఎంత బ్లండర్ చేసింది అర్ధం చేసుకుని దానిని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను టీడీపీ ఏజెంట్‌గా మార్చుకుని, ఆయన ద్వారా అకృత్యాలు చేయిస్తూ ఏపీ ప్రజలను పీడించడమే టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు పనిగా పెట్టుకున్నాయి. అందులో భాగంగానే ఆయన ద్వారా హైకోర్టులో వలంటీర్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేయించడం, అది చాలదన్నట్లు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటివి చేయించారు. అంతేకాక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక, కేంద్రంలో ఎవరి ద్వారానో ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన నిర్ణయాలను టీడీపీ తెప్పించుకుంటోందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ క్రమంలో వలంటీర్లు ఈ మూడు నెలలు తమ సేవలు అందించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం అయినా ఇందులో ఉన్న మతలబు ఏమిటి? వృద్దులకు అందుతున్న సదుపాయం రద్దు చేయడం వల్ల వారు పడే బాధలు ఏమిటి? అన్నవి ఆలోచించకుండా టీడీపీ ఏజెంట్ కోరిందే తడవుగా ఆదేశాలు ఇచ్చేసింది. నిజానికి మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదు. అసలు అలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేయకూడదు. ఈ ఆదేశాలు ఇవ్వడానికి ముందుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా అడగవచ్చు కదా! ఇది ఎప్పటి నుంచో అమలు చేస్తున్న విధానం అయినా ఎన్నికల కమిషన్ వలంటీర్ల సేవలు అందకుండా చేసిందంటే రాజకీయ కుట్ర కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వలంటీర్లు పెన్షనర్లను కలిసి డబ్బు ఇస్తేనే వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనుకుంటే, ఇప్పుడు మాత్రం వేయకుండా ఉంటారా? టీడీపీ కుట్ర చేసి పెన్షన్లు తమ ఇంటికి రాకుండా ఆపిందని వారు తెలుసుకోకుండా ఉంటారా? ఇప్పటికే తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబును వారు బండబూతులు తిడుతున్నారు. ఎవరైనా టీవీవారు దీని గురించి ప్రశ్నిస్తే టీడీపీపై విరుచుకుపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న తమను మళ్లీ ఆఫీస్‌ల చుట్టూ తిప్పుతారా అని నిలదీస్తున్నారు. దీంతో.. పరిస్థితి అర్ధం చేసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే యుటర్న్ తీసుకుని పెన్షన్ దారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాశారు. ఆ రాసేదేదో ఎన్నికల సంఘానికి రాసి, వలంటీర్ల ద్వారానే పెన్షన్లు ఇళ్లకు పంపిణీ చేయాలని రాసి ఉంటే కాస్త గౌరవం అయినా మిగిలేది. కానీ అన్నిటిలోను డబుల్ స్టాండర్స్ పాటించే చంద్రబాబు ఇందులో కూడా ఆ ధోరణిలోనే వెళ్లారు. వలంటీర్లను గతంలో తిట్టింది ఆయనే. ఆయనకు తోడు పవన్ కల్యాణ్. మళ్లీ ఇద్దరూ యు టర్న్ తీసుకుని వలంటీర్లకు అనుకూలంగా మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక బినామీ సంస్థను స్థాపించి వలంటీర్లకు, ఇతరత్రా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడం, కోర్టులలో, ఇతర వ్యవస్థలలో లిటిగేషన్ పెట్టించడం చేశారు. అందులో భాగంగానే ఈ వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు అని చెప్పాలి. ఆ ఫిర్యాదుల ఫలితం తెలుగుదేశం మెడకే చుట్టుకుంటోందన్న విషయం తెలుసుకుని అంతే స్పీడ్‌గా రామోజీ, రాధాకృష్ణలు యుటర్న్ తీసుకుని చంద్రబాబును రక్షించడం కోసం కొత్త కథనాలు అల్లారు. వైఎస్సార్సీపీవారే పెన్షన్లను ఇళ్ల వద్ద ఇవ్వకుండా అడ్డుకున్నారని వీరు అడ్డగోలు కథనాలు రాశారు. వృద్దులు గ్రామ, వార్డు సచివాలయాలలో పెన్షన్ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే, అమ్మో వారిని ఎండలో తిప్పుతారా అంటూ వారిపై ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ బానర్ కథనాలు ఇచ్చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడింది అర్దం అవుతుంది. తాము అతి తెలివితో వలంటీర్ల వ్యవస్థపై బురదచల్లి చంద్రబాబుకు ఏదో మేలు చేశామని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయి టీడీపీకి ఉరితాడుగా మారడంతో మళ్లీ మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి యత్నించారు. గ్రామ, వార్డు సచివాలయాలలో 1.35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారిని పెన్షనర్ల ఇళ్లకు పంపించి డబ్బు ఇప్పించవచ్చని ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి కథనాలు వండాయి. బహుశా ఈ నాలుగేళ్లలో గ్రామ,వార్డు సచివాలయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని రామోజీ, రాధాకృష్ణ అంగీకరించారు. 'చిత్రమేమిటంటే.. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి డబ్బు ఇస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్లటా! అదే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వృద్దుల ఇళ్లకు వెళ్ళి డబ్బు ఇస్తే అది ఎన్నికలను ప్రభావితం చేయడం కాదట. ఇవేమి పిచ్చి రాతలు, ఈ సచివాలయాల ఉద్యోగులు సైతం వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్‌లో వచ్చినవారే కదా! వీరు వెళ్లి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది అనికాక, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని చెబుతారా? వలంటీర్లను నిలుపుదల చేయడంతో వృద్దులంతా టీడీపీని బండబూతులు తిడుతుండడంతో భయపడి రామోజీ, రాధాకృష్ణలు ఏమి చేయాలో దిక్కుతోచక ఇలాంటి కథనాలు రాసి వైఎస్సార్సీపీపై పడి ఏడ్చారు. పైగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బాధ్యతలు వేరుగా ఉంటాయి. ఒకవేళ వీరు కోరుకున్నట్లు వృద్దుల ఇళ్ల వద్దకు వీళ్లను పంపుతూ ఉత్తర్వులు ఇచ్చి ఉంటే అప్పుడు మళ్లీ ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి దానిని కూడా విమర్శిస్తూ డబ్బును వృద్దుల చేతికి ఇస్తున్నారని, ఇదంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్ర అని రాసి ఉండేవి. గతంలో టీచర్లను స్కూళ్ల బాగు చేతకు సంబంధించిన విధులలో పెడితేనే, వారిని అలా వాడతారా? ఇలా వాడతారా? అంటూ ఇదే మీడియా నానా యాగి చేసింది. సచివాలయ ఉద్యోగులను మాత్రం ఇప్పటికిప్పుడు వారికి సంబంధం లేని డ్యూటికీ వేయాలట. అంతా రామోజీ ఇష్టం అన్నమాట! ఎన్నికల సంఘం పవిత్రతపైన బురద చల్లేలా వైఎస్సార్సీపీ ఏదో చేసింది అంటూ ఆ వ్యవస్థపై ఏదో తెలుగుదేశంకు అంత గొప్ప అభిప్రాయం ఉన్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోకపోతే, అదే సంస్థను ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగ తిట్టిపోసేవి. జగన్మోహన్రెడ్డి వారిని మేనేజ్ చేసేశారని ఏకిపారేసేవారు. '2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ కార్యాలయానికి వెళ్లి ఎంత రచ్చ చేశారో గుర్తు లేదా?' అప్పుడు మాత్రం ఎన్నికల సంఘం పవిత్రమైనదని ఈనాడు రాయలేదే! బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఎన్నికల కమిషన్‌ను కేంద్రం ద్వారా ప్రభావితం చేయడానికే అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్నికలు 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకొండున ఎందుకు జరిగాయి. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన తర్వాత ఎన్నికలు మే పదమూడు వరకు ఎందుకు వెళ్లాయి? ఇందులో మేనేజ్మెంట్ లేదని ఎవరైనా అనుకుంటారా? అందులోను చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో తెలియదా! లేకుంటే వారికి కావల్సినట్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎలా ఇస్తుంది? కనీసం ఏపీ ప్రభుత్వ అభిప్రాయం అయినా తీసుకుందా? కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్‌కు ఈ వ్యవహారంలో బాద్యత లేదట! ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి, దారుణమైన ఆదేశాలు తెప్పించిన రమేష్ ఉత్తముడట! ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించిన ఏపీ ప్రభుత్వ అధికారులు చెడ్డవారట. వలంటీర్ల వ్యవస్తపై నీచమైన విమర్శలు చేస్తూ పలు కదనాలు రాసిన రామోజీ గొప్పవాడట. ఆ విమర్శలను సమర్దించిన చంద్రబాబు,పవన్‌లు గొప్ప నాయకులట. అంత గొప్పగా ఫీల్ అయితే వలంటీర్ల పై ఆంక్షలు పెట్టిన కొద్ది గంటలలోనే చంద్రబాబు కానీ, ఈ మీడియా సంస్థలు కానీ తమకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుని వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. రామోజీ, రాధాకృష్ణలు తనకు ఎంత డామేజీ చేశారో చంద్రబాబుకు అర్దం అయ్యే ఉంటుంది. కానీ ఆయన నిస్సహాయుడిగా మిగిలారు. వారి చేతిలో ఒక బందీగా ఉండి, వారు చెప్పినట్లు ఆడే పరిస్థితికి చంద్రబాబు చేరుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే తప్పుడు వార్తలు, అబద్దాలనే మహా ప్రసాదంగా భావించి చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలేసరికి లబోదిబో అంటున్నారు. ఇంటింటికి పంపీణీ సులువేనని టీడీపీవారు కానీ, 'ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కానీ కొత్త రాగం ఎందుకు అందుకున్నారో ప్రజలు అర్ధం చేసుకోలేరా? ఇంటింటికి పెన్షన్ ఇచ్చేటప్పుడు వలంటీర్లు అయితేనేమి? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అయితేమి?' ఈ మాత్రం ఇంగితం లేకుండా వలంటీర్లపై విషం కక్కిన ఎల్లో మీడియా, తాము చేసిన దిక్కుమాలిన చర్యవల్ల, తాము జాకీలేసి లేపుతున్న తెలుగుదేశంకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అర్ధం అయిందని అనుకోవాలి. కొన్నిచోట్ల వలంటీర్లు టీడీపీ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నారు. ఒక్క మచిలీపట్నంలోనే 1227 మంది వలంటీర్లు రాజీనామా చేశారట. ఇదంతా టీడీపీకి తల బొప్పి కట్టించేదే. అసలే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రచార సభలలో ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. టిప్పర్ డ్రైవర్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి టిక్కెట్ ఇస్తారా అని చంద్రబాబు అన్న ఫలితంగా లక్షల సంఖ్యలో ఉన్న డ్రైవర్లకు ఆగ్రహం తెప్పించారు. ఇప్పుడు వృద్దాప్య పెన్షన్లు ఇళ్లకు ఇవ్వకుండా ఆపి పాపం మూటకట్టుకోవడంతో అరవై లక్షలమంది టీడీపీకి, చంద్రబాబుకు శాపనార్ధాలు పెడుతున్నారు. దీని అంతటికి కారణం ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారేనని కూడా ప్రజలకు తెలిసిపోయింది. చంద్రబాబుకు కూడా అవగతమైంది కానీ, ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దెబ్బమీద దెబ్బపడుతుండడంతో ఏపీలో టీడీపీ గెలవడం అసాద్యమన్న భావన సర్వత్రా ఏర్పడడంతో దానిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా రకరకాల విన్యాసాలు, యుటర్న్‌లు చేస్తోంది. టీడీపీని ఆకాశానికి జాకీలతో ఎత్తాలని ప్లాన్ చేసిన వారిద్దరూ చివరికి పెద్ద గోతిలో పడేశారు. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ గోయినుంచి పైకి లేవడం అంత తేలిక కాదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. సంస్థలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, అనుభవిస్తున్న మానసిక క్షోభను భర్తతో పంచుకున్నప్పటికీ.. అవి మరింత తీవ్రతరం కావడంతో తనకిక చావే శరణ్యం అనుకుంది. తాను పనిచేస్తున్న ఈనాడు కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు, మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ గజ్జి స్వామియాదవ్ కాలనీలో నివాసముండే ఎర్రగొల్ల శ్రీనివాస్, సాయికుమారి (34)కి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. శ్రీనివాస్ పదిహేనేళ్లుగా, సాయికుమారి తొమ్మిదేళ్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనాడు కాల్ సెంటర్లో పనిచేసే సాయికుమారికి కొంతకాలంగా సంస్థలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో తరచూ ఇబ్బంది పడుతుండేది. భర్తకు చెప్పుకుని బాధ పడేది. ఆదివారం సరదాగా గడిపి.. ఈ క్రమంలోనే భార్యకు మానసిక ధైర్యాన్నిచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తిప్పాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. సోమవారం విధుల్లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీకి బయలుదేరిన సాయికుమారిని ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జాతీయ రహదారి వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చాడు. అయితే 9 గంటల సమయంలో ఈనాడు హెచ్ఆర్ విభాగం నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. సాయికుమారి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పడంతో హుటాహుటిన ఫిల్మ్‌సిటీకి వెళ్లాడు. అప్పటికే తలకు తీవ్ర గాయమైన సాయికుమారి మృతి చెందింది. శ్రీనివాస్ ఇచ్చింన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. ఈనాడు సిబ్బంది అత్యుత్సాహం ఈనాడు సంస్థ ఒత్తిళ్ల కారణంగా తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చింన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పీఎస్‌లో ఉన్న శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అతని చుట్టూ కంచెలా ఉన్న ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. తన భార్య మృతికి దారితీసిన పరిస్థితులను మీడియాకు వివరించేందుకు సిద్ధమవుతున్న శ్రీనివాస్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
Fact Check: బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు
కృష్ణా పుష్కరాలవేళ చంద్రబాబు ప్రభుత్వం పదుల సంఖ్యలో ఆలయాలు కూల్చేస్తే రామోజీకి చీమకుట్టినట్టయినా లేదు. అప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆయనకు అనిపించలేదు. పచ్చ కళ్ల మత్తులో జోగుతున్న ఈనాడుకు నిలదీయాలన్న ధ్యాసే లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని బాధ్యతగా పునరుద్ధరిస్తే కనీసం ప్రశంసించేందుకు కూడా మనసురాలేదు. పైగా కరోనా కల్లోల వేళ కొన్ని అసాంఘిక శక్తులు చేసిన దుష్టచర్యలను ఆనాడే జగన్ హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తే ఇప్పుడు సర్కారును బాధ్యులను చేస్తూ ఈనాడులో వికృతరాతలు. ఎలాగోలా భక్తుల్లో అలజడి రేపితే మతఘర్షణలకు దారితీయదా... తద్వారా తెలుగుదేశానికి కలసిరాదా... ఈ ప్రభుత్వానికి అప్రదిష్ట కలగదా... అన్న ఉన్మాద రాతలకు తెగబడింది. ‘జగన్ ఏలుబడిలో దేవుళ్లకూ రక్షణ కరవే’ అంటూ ఓ అబద్ధాన్ని వండివార్చింది. సాక్షి, అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు ‘ఈనాడు’ పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించేందుకు యత్నించింది. కరోనా విపత్కర వేళ ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయిన రోజుల్లో వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న 26 దుస్సంఘటనలను ఉదహరిస్తూ దానికీ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టింది. 2020 మార్చి 12 నుంచి 2021 ఏప్రిల్ 16వ తేదీ మధ్య కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకొని ఆలయాల్లో కొన్ని దురాగతాలకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆలయాల్లో స్వామివార్ల నిత్య పూజలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్పటికప్పుడే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో మరోచోట అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలతోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ఆలయాల్లో యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాత్రివేళల్లో ఆలయాల వద్ద పోలీసు గస్తీని పెంచింది. తద్వారా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండాచేసింది. కానీ చంద్రబాబుపై తనకున్న ‘స్వామి భక్తి’తో పూర్తిగా ఉన్మాదిగా మారిన ‘ఈనాడు’ ఇప్పుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. నాడు ఆలయాలు కూల్చేస్తే నోరెత్తలేదేమీ... టీడీపీ హయాంలో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో పవిత్ర దేవాలయాలను అధికారికంగా కూల్చేశారు. ఆ సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా.. ‘ఈనాడు’ కనీసం స్పందించనైనా లేదు. పైగా చంద్రబాబు ఓ గొప్ప విజనరీగా, దార్శనికుడిగా చూపిస్తూ ఆకాశానికెత్తేసింది. నాడు కూల్చేసిన ఆలయాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి పునర్నిర్మించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, కొత్తగా ఆలయాలు నిర్మించింది. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దేవుడి ఆస్తుల రక్షణకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ♦ రాష్ట్రంలోని దేవుడి ఆస్తులు, విలువైన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు పెత్తందార్లు దర్జాగా వాటిని కైంకర్యం చేసేశారు. ♦ అలాంటి దుశ్చర్యలను కట్టడి చేస్తూ జగన్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి... వారం రోజుల తర్వాత ఆ భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా దేవదాయశాఖకు కట్టబెట్టింది. ♦ ఇప్పటి వరకు ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ వేయాల్సి ఉండేది. ట్రిబ్యునల్ ఆక్రమణదారునికి సైతం తమ లాయర్ల ద్వారా వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చింది. ట్రిబ్యునల్ దానిపై నిర్ణయం వెలువరించేవరకూ ఆ భూములు అనుభవించుకునే వెసులుబాటు ఆక్రమణదారులకే లభించేది. ♦ ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పునిస్తే, దానిపై మళ్లీ అప్పీల్ చేసుకుని కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకుంది. దానివల్ల స్వాధీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేది కాదు. కొత్త చట్టంతో దానికి కళ్లెం వేయగలిగింది. ♦ ఇంకోవైపు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి తొలిసారి ఆలయ అభివృద్ధి పనులకు నేరుగా నిధులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. ♦ ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ కేవలం ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదంటే వంశపారంపర్య అర్చకులకు, ఇతర హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ♦ రాష్ట్రంలోనూ ఆలయాల నిర్వహణ, దేవదాయ శాఖ నిర్వహణలోనూ రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తగ్గిస్తూ వివిధ స్వామీజీలు, రిటైర్డు జడ్జిలు, రిటైర్డు దేవదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్‌ను సుదీర్ఘకాలం తర్వాత 2022లో జగన్ ప్రభుత్వం రెండో విడత ఏర్పాటు చేసింది. -
కబ్జా కోరులు టీడీపీ నేతలే!
(కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): కుక్కకి చెప్పు రుచి తెలుసు కానీ.. చెరకు తీపి తెలుస్తుందా? టీడీపీ నేతలూ అంతే. టీడీపీ నాయకులకు విశాఖ నగరంలో భూములను మేయడం తెలుసు కానీ, అదే విశాఖ నగరాన్ని రాజధానిగా ప్రపంచ పటంలో నిలిపితే రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు తెలియవు. పైపెచ్చు.. విశాఖ భూముల్ని కొల్లగొట్టిన టీడీపీ నాయకులే... భూములు ఆక్రమించడానికే వైఎస్సార్సీపీ విశాఖను రాజధాని అంటోందంటూ గొంతు చించుకుంటున్నారు. అచ్చం దొంగే.. దొంగా.. దొంగా.. అని అరిచినట్టుగా. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా వేల కోట్ల రూపాయల భూముల్ని చెరపట్టారు టీడీపీ నేతలు. గయాలు, పోరంబోకు, గోర్జి, వాగులు, కాలువలు, గెడ్డలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా ఏ భూమి కనిపిస్తే దానిని చెరబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీడీపీ రాబందుల ఆటలు సాగలేదు సరికదా... వారి చెర నుంచి వందలాది ఎకరాలను విడిపించింది. ఇలా టీడీపీ కబ్జాదారుల కోరలు పీకడమే రామోజీ కడుపు మంటకు కారణం. టీడీపీలోని భూ కబ్జాదారులను వెనకేసుకొచ్చేందుకు ఈనాడు పత్రికలో ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఓ పెద్ద కథే వేశారు. విషపు రాతలతో విశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే విశాఖ నగరం, చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూముల సంరక్షణపై దృష్టి సారించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోంది. ఇప్పటివరకు 270 ప్రాంతాల్లో రూ.2,600 కోట్లు విలువైన 430.81 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకుంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికారుల అంచనా. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ కబ్జా పర్వం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలోని ఈ స్థలంలో 2 ఎకరాల్లో కళాశాల భవనం, మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. రూ.500 కోట్లు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. అక్రమాల ‘పల్లా’.. ఆక్రమణల పర్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధుగణం దోచుకున్న భూముల బాగోతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. నగర శివారు ప్రాంతాల్లోని ఆ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల్ని తొలగించింది. రూ.669 కోట్ల విలువైన 38.45 ఎకరాల ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంది. జగ్గరాజుపేటలో 1.26 ఎకరాలు వాగు స్థలం, తుంగ్లాంలో 0.92 ఎకరాల పోరంబోకు రాస్తా, 6.15 ఎకరాల యూఎల్సీ ల్యాండ్, 1.85 ఎకరాల పోరంబోకు చెరువు, 21.67 ఎకరాల పోరంబోకు చెరువు, 0.70 ఎకరాల ఈనాం భూములు, 0.80 ఎకరాల పోరంబోకు బంద, 2.04 ఎకరాల గయాలు భూములు, 1.50 ఎకరాల పోరంబోకు రాస్తా, 0.24 ఎకరాల పోరంబోకు భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూర్మన్నపాలెంలో 1.35 ఎకరాల పోరంబోకు భూమిలోని ఆక్రమణలను కూడా తొలగించారు. ‘భూ’చోడు గంటా అంటూ అయ్యన్న ఫిర్యాదు.! టీడీపీ హయాంలో విశాఖలో భారీ భూకుంభకోణమే జరిగింది. దీనిని అధికారులే బహిర్గతం చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది. సిట్ పేరుతో హడావుడి చేసింది. ఈ కుంభకోణంలో తమ పార్టీ నాయకులే ఉన్నారంటూ ఆధారాలతో సహా సిట్ బృందానికి టీడీపీ సీనియర్ నేత, అప్పట్లో మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల పత్రాల్ని ట్యాంపరింగ్ చేసి ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు అక్రమాలకు పాల్పడ్డారంటూ బహిరంగంగానే ఆరోపించారు. ఇదంతా గంటా శ్రీనివాసరావు నిర్వాకమేనంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గంటాపై స్వయంగా తమ మంత్రే అయిన అయ్యన్న ఫిర్యాదు చేసినా, టీడీపీ ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. దసపల్లాపై ఇదేమి దందా! దసపల్లా భూములపై ఈనాడు సిగ్గూ ఎగ్గూ లేని రాతలు రాసింది. ఈ భూములపై సర్వోన్నత న్యాయ స్థానం కూడా తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చేయగలిగేది ఏముంటుంది? అసలు ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే, సీఎంగా ఉండి, ఆ భూములను సొంత పార్టీకే కేటాయించేసుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించేసుకున్నదే చంద్రబాబు. దిగువ కోర్టులు, హైకోర్టు కూడా ఆ భూములు ప్రైవేటు వ్యక్తులవేనని తీర్పునిచ్చాయి. మునుపటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. సుప్రీంకోర్టు కూడా ఆ అప్పీలును, ఆ తర్వాత వేసిన రివ్యూ పిటిషన్‌ను, చిట్ట చివరి అస్త్రం ‘క్యూరేటివ్’ పిటిషన్’ను కూడా కొట్టేసింది. ఆ తీర్పు ప్రకారం నడవటం తప్ప ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని ఏజీ వేణుగోపాల్ కూడా చంద్రబాబు ప్రభుత్వానికే చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా తీర్పును అమలు చేయలేదు. అందుకు కోర్టు ధిక్కారం కింద ఇద్దరు అధికారులకు జైలు శిక్ష కూడా పడింది. సర్వోన్నత న్యాయస్థానం వరకు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి కనకే భూ యజమానులు డెవలపర్లతో ఒప్పందం చేసుకున్నారు. ఎవరికెంత శాతమన్నది ఇరుపక్షాల ఇష్టం. డెవలపర్లతో ఒప్పందం చేసుకున్న భూ యజమానుల్లో రామోజీ కుమారుడి వియ్యంకుడూ ఉన్నారు. ఒకవేళ తక్కువ వాటా వచ్చిందని భావిస్తే మీ వియ్యంకుడైనా ఒప్పందం ఎలా చేసుకుంటారు? రామోజీకి అలవాటైన అబద్ధం కూర్మన్నపాలెంలో 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మాణాల్లో భూ యజమానులకు 0.96 శాతం వాటా.. అంటే 14,400 చదరపు అడుగులే ఇస్తున్నారని మరో అబద్ధాన్ని ఈనాడు కుమ్మరించింది. ఇది కేవలం గొట్టిపల్లి శోభారాణి, ఇతరులకు ఇచ్చిన వాటానే. ఈ భూమిపై వివాదం ఉన్న డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులకు 160 మందికి 1,000 చదరపు అడుగుల ఫ్లాట్ చొప్పున మొత్తం 1,60,000 చదరపు అడుగులు, కొప్పిశెట్టి శ్రీనివాస్‌కు మరో 30 వేల చదరపు అడుగులు ఇవ్వాలని ఒప్పందం ఉంది. మొత్తం కలిపి 2,04,400 చదరపు అడుగులు. కూర్మన్నపాలెం భూమిని అభివృద్ధి చేసి పరిష్కరించాలని డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు 2012లో కోరారని, అప్పటి నుంచి మొదలై 2017లో అందరితో మాట్లాడి ఒప్పందం కుదిరిందని డెవలపర్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. ఆ పార్టీలకు 2 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలతోపాటు దాదాపు రూ.10 కోట్ల నగదు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ఇదంతా పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని, ఎక్కడాప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. ఏ ప్రతిఫలంతో జీవో ఇచ్చారు.? రుషికొండ వద్ద రేడియంట్ భూముల విషయంలో గత టీడీపీ ప్రభుత్వమే జీవో జారీ చేసిందని ఈనాడే స్పష్టంగా పేర్కొంది. ఏ ప్రతిఫలంతో ఆ జారీ చేశారు? బాబు హయాంలో జరిగితే ప్రైవేటు వ్యవహారం, ఈ ప్రభుత్వంలో జరిగితే కబ్జాలా? ఇదేమి వాదన? టీడీపీ నేతల నుంచి స్వాధీనం చేసుకున్న కబ్జా భూములు ► ఆనందపురం–శొంఠ్యాం సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు సహా పలువురు టీడీపీ నేతలు టైటిల్ డీడ్ నం.1180లో ఆక్రమించుకున్న రూ.256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూముల్ని 2020 నవంబర్‌లో స్వాధీనం చేసుకున్నారు. ► టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్నదొరపాలెంలో సర్వే నం.156లో 60 ఎకరాల భూమిని ఆక్రమించుకోగా.. 2020 డిసెంబర్లో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల మార్కెట్ విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ► టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించిన రుషికొండ బీచ్‌రోడ్డులో సర్వే నం.21లోని సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ► టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువర్గం పేరుతో గాజువాక నియోజకవర్గంలోని మూడు గ్రామాల పరిధిలో ఆక్రమించుకున్న సుమారు రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని 2021లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ► సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నంబర్ 7లో సుమారు రూ.3 కోట్లు విలువైన 212 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కబ్జా చేసి ప్రహరీ, రెస్ట్ రూమ్‌లు నిర్మించేసినట్లు గుర్తించిన జీవీఎంసీ అధికారులు వాటిని 2020 అక్టోబర్ 3న తొలగించారు. ► టీడీపీ హయాంలో ఆనందపురంలో సర్వే నంబర్ 122, 123లోని రూ.15 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్‌గా మార్చి దర్జాగా కబ్జా చేసిన విశ్వనాథ∙విద్యా సంస్థల నుంచి 2021 నవంబర్‌లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ గ‘లీజు’లు నీతులు చెప్పేటందుకే.. పాటించడానికి కాదన్నది రామోజీరావు ప్రధాన సిద్ధాంతం. కుటుంబ సభ్యుల్ని కూడా మోసం చేసే వ్యక్తిగా, వ్యవస్థల్ని మేనేజ్ చేసే పెద్దమనిషిగా, బంధువులను సైతం కోర్టుల చుట్టూ తిప్పించి వాళ్ల భూములను కారుచౌకగా కొట్టేసే వ్యాపారిగా ప్రసిద్ధుడు. విశాఖ స్థలాన్నీ అలానే కొట్టేయాలని చూసి భంగపడ్డారు. ఆ కథ ఇదీ..1974లో విశాఖ సీతమ్మధారలో 2.78 ఎకరాల భూమిని, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 10 భవనాలను నెలకు రూ.3 వేలు అద్దె చొప్పున 33 ఏళ్లకు మంతెన ఆదిత్యవర్మ నుంచి రామోజీరావు లీజుకు తీసుకున్నారు. లీజు గడువు ముగిసినా ఖాళీ చెయ్యకపోగా, కోర్టులో కేసు వేశారు. 1985లో ఈ స్థలానికి ఉత్తరం వైపున కొంత స్థలాన్ని రోడ్డు విస్తరణకు ప్రభుత్వానికి అప్పగించినందుకు ప్రతిగా వెనక ఉన్న స్థలాన్ని కేటాయించాలని రామోజీ లేఖ రాయగా, ప్రభుత్వం 1986లో ఆయన కోరిన స్థలాన్ని కేటాయించింది. దాన్ని రామోజీ తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. స్థలం తనది కాకపోయినా, ప్రభుత్వానికి అప్పగించడం, దానికి ప్రతిగా మరో స్థలాన్ని పొందడం పక్కా మోసమే. ఇదే విషయాన్ని పేర్కొంటూ రామోజీపై స్థల యజమాని ఆదిత్యవర్మ క్రిమినల్ కేసు వేశారు. దీని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా విశాఖపట్నం జోనల్ డెవలప్మెంట్ ప్లాన్‌ని రామోజీరావు ఫోర్జరీ చేశారు. మొత్తం వివరాల్ని పరిశీలించిన న్యాయస్థానం.. ఫోర్జరీకి ప్రాథమిక ఆధారాలున్నాయని, రామోజీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కుట్ర, ఫోర్జరీ, మోసపూరిత చర్యలకు గాను ఐపీసీ 120బి, 193, 196, 471, 465, 466 సెక్షన్ల కింద కేసు నమోదయింది. కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఖాళీ చేసేందుకు ఇష్టపడని రామోజీరావు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. మరోవైపు అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో వర్మ విశాఖలోని రెంట్ కంట్రోల్ కోర్టు (ఆర్సీసీ)ని ఆశ్రయించారు. నెలలో భవనాన్ని ఖాళీ చేయాలని కోర్టు రామోజీరావును ఆదేశించింది. ఈ వ్యవహారం హైకోర్టు వరకు నడిచింది. అప్పటి స్థలం విలువపై 5 శాతం అద్దెను ప్రతినెలా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రామోజీరావు స్థల యజమాని వర్మకు రూ.17 లక్షల చొప్పున ప్రతినెలా 10వ తేదీ లోపు అద్దె చెల్లించాలని, అద్దె బకాయిలు రూ. 2.57 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే విధించాలన్న రామోజీరావు వినతిని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. 2014 ఫిబ్రవరి 10లోగా అద్దెతోపాటు బకాయిలు రామోజీరావు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఎక్కడా తన పప్పులు ఉడకకపోవడంతో చివరికి ఆ స్థలాన్ని యజమాని వర్మకు అప్పగించారు రామోజీ. -
fact check: అండగా ఉన్నా ఆర్తనాదాలే..
సాక్షి, అమరావతి: వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలంటారు. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇదే సిద్ధాంతంతో లక్షలాది అబద్ధాలు ఆడైనా సరే సీఎం వైఎస్ జగన్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. అందుకే నిత్యం ఉన్నవీ లేనివీ పోగేసి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తున్న ఈనాడు దినపత్రిక కథనాల్లోని అంశాలనే తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు పాచిపోయిన ఆరోపణలనే చేస్తున్నాయి. తాజాగా.. రైతుల మద్దతు ధర విషయంలోనూ వాటి రంకెలు తారాస్థాయికి చేరాయి. రైతులకు అడుగడుగునా అండగా ఉన్నా విపక్షాల ఆర్తనాదాలు మామూలుగా లేవు. ఎందుకంటే.. రైతుకు తాను పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 99.5 శాతం తుచ తప్పకుండా అమలుచేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లుతూ ఈనాడు అబద్ధాలను అచ్చేస్తోంది. ఈ క్షుద్ర పత్రిక రాసిన అంశాలనే పట్టుకుని కొందరు అవగాహన, అర్థంపర్థంలేకుండా అదే పనిగా ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. మార్కెట్లో జోక్యంతో రైతులకు మేలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేయడమే కాదు సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మద్దతు ధర దక్కేలా సీఎం జగన్ సర్కారు చేస్తోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తితో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కని ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ వంటి పంటలకు దేశంలో మద్దతు ధర ప్రకటించడమే కాదు..ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసింది. ఉదా.. మిరపకు రూ.7వేలు, పసుపుకు రూ.6,850, ఉల్లికి రూ.770, చిరుధాన్యాలకు రూ.2,500, అరటికి రూ.800, బత్తాయికి రూ.1,400 వచ్చేలా చూస్తోంది. మద్దతు ధర కల్పనకు పంచసూత్రాలు.. మద్దతు ధర కల్పించే విషయంలో ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారానే రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం, కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వడం, నాణ్యతకు పెద్దపీట వేయడం, నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలను నిక్కచ్చిగా అమలుచేస్తూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ ఏడాది కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా కన్పించడంలేదు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పడిపోయినపుడు ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. చంద్రబాబు హయాంలో రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఐదేళ్లలో ఏ ఒక్క బడ్జెట్లోనూ పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించిన పాపాన పోలేదు. గతంలో అరకొరగా ధాన్యం సేకరణ.. నిజానికి.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితం అయ్యేది. అవికూడా అరకొరగానే ఉండేవి. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా ఫాంగేట్ వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతుల భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు ఈ ప్రభుత్వంలో హయాంలోనే జరుగుతోంది. రైస్‌మిల్లు ఎంపికలో మిల్లర్లను సంప్రదించాల్సిన అవసరంలేకుండా చేసింది. కొనుగోలు కేంద్రం వారే బ్యాంకు గ్యారంటీ లభ్యత, ధాన్యం రకం, మిల్లు లక్ష్యము, మిల్లు దూరం వంటి అంశాల ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో ఎంపిక చేసి రవాణా చేస్తోంది. బాబు కంటే రెట్టింపు కొనుగోలు.. ఇక పంట ఉత్పత్తుల కొనుగోలు విషయానికి వస్తే టీడీపీ తన ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. సీఎం వైఎస్ జగన్ హయాంలోని ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేసింది. అంటే.. రెట్టింపు కన్నా అధికం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే అదీలేదు. టీడీపీ ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.65 వేల కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు వెచ్చిస్తే, ఈ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. సగటున ఏడాదికి చంద్రబాబు హయాంలో రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. అంటే.. బాబు ఐదేళ్లతో పోలిస్తే ఈ 57 నెలల్లో రెట్టింపు విలువైన పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘జీఎల్టీ’ భరిస్తున్న ఏకైక ప్రభుత్వం.. మరోవైపు.. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలుకు అయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్‌లు, లేబర్, ట్రాన్స్‌పోర్టు) ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా ఛార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. ఇక గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలకు సంబందించి 2022–23 పంట కాలానికి 15,74,285 మంది రైతుల ఖాతాలకు రూ.237.11 కోట్లు జమచేయగా, ఖరీఫ్ 2023–24 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు 6,83,825 మంది రైతుల ఖాతాలకు రూ.91.47 కోట్లు జమచేశారు. గతంలో ఈ పరిస్థితిలేదు. ఇలా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల (జీఎల్టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, గతంలో రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. అవి సరిపడా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్ పెట్టింది. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, పీఎస్ఏలు రైతులకు గోనె సంచులను సమకూరుస్తున్నాయి. పైగా.. సేకరించిన ధాన్యాన్ని గతంలో రవాణా అనేది గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేవు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని ఏజెన్సీలను, రవాణాదారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కొనసాగుతోంది. ఇంత చేస్తున్నా దీన్ని మొక్కుబడిగా కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా? ధరల స్థిరీకరణ ద్వారా మద్దతు ధర కల్పన విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. -
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: విజయవాడ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు..
మనం ఎవరిమైనా అమెరికాకు వెళ్లినప్పుడో, ప్రత్యేకంగా న్యూయార్క్ నగరానికి వెళ్లినప్పుడో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని అనుకుంటాం. మనం ఆ నగరానికి వెళ్లామన్న సంగతి తెలిసిన స్నేహితులు కూడా లిబర్టి విగ్రహాన్ని చూసి వచ్చావా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అమెరికానే వెళ్లనవసరం లేదు. ఆ స్థాయి విగ్రహాన్ని చూడాలంటే విజయవాడ నగరాన్ని సందర్శిస్తే చాలు. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం అంతకన్నా గొప్పగా కనిపిస్తుంంది. కృష్ణానది ఆవల నుంచి సుమారు పది, పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహం దర్శనమిస్తుంది. దేశ రాజ్యాంగ నిర్మాతగా వాసికెక్కిన డాక్టర్ BR అంబేడ్కర్ భారీ విగ్రహం అది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా, ఒక ప్రఖ్యాత టూరిస్టు కేంద్రంగా రూపుదిద్దుకునే అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుంది. ఇది వినడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది! మూడేళ్ల క్రితం వరకు విజయవాడలో ఇంత పెద్ద టూరిస్ట్ స్పాట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని ఒక నేత సమర్ధతకు నిదర్శనంగా ఇది రూపొందింది. ఆయన ఎవరో కాదు.. ఏపీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అని వేరే చెప్పనవసరం లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా మూడు అంతస్థులలో అంబేడ్కర్‌కు చెందిన వివిధ చిత్రపటాలు, డాక్యుమెంటరీలు, ఆయన గురించి తెలియచేసే సినిమాను వేయడానికి వీలుగా ఒక హాలు, ఎన్నో విశేషాలు అందులో కనిపిస్తాయి. 206 అడుగుల ఎత్తున తయారైన ఈ విగ్రహ ప్రాంగణం అంతా రంగు, రంగుల కాంతుల మధ్య అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. అక్కడే పలు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. నగర ప్రజలకే కాకుండా, విజయవాడ సందర్శించే టూరిస్టులకు కూడా అదొక విజ్ఞాన, వినోద కేంద్రంగా భాసిల్లబోతోంది. దేశ ప్రజలకు స్వేచ్చను, ప్రత్యేకించి బలహీనవర్గాలకు ఎంతో స్పూర్తిని ఇచ్చే ఈ విగ్రహ ప్రతిష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటికీ, దానిని మించిన రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఢిల్లీలో విగ్రహం తయారీతో పాటు హంగులను స్థానికంగా హనుమాన్ జంక్షన్‌కు చెందిన శిల్పిద్వారా చేయించడం కూడా హర్షించదగిన అంశమే. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నారు. అందులో వివిధ బలహీనవర్గాల ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెబుతున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలియజేసినట్లయింది. కేవలం విగ్రహంతోనే అభివృద్ది అయిపోతుందని కాదు. కాని ఆ విగ్రహాన్ని చూస్తే వచ్చే చైతన్యం, అనుభూతి చెప్పనలవికానిది. ఏదో కొద్ది మంది అగ్రవర్ణ దురహంకారులకు తప్ప, సమానత్వం కోరుకునే ఎవరికైనా ఈ విగ్రహం చూడగానే ఒక అనుభూతి కలుగుతుంది. ఏపీలోని వివిద జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ విగ్రహాన్ని వీక్షించనున్నారు. గతంలో అమరావతి రాజధాని పేరుతో ఒక భ్రమరావతిని సృష్టించాలని భావించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడో మారుమూల, ఎవరికి కనిపించని చోట అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని చూశారు. ఇందు కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయం చేశారు. అయినా ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. చంద్రబాబు హయాంలో చాలామంది అంబేడ్కర్ అభిమానులు ఎవరికి కనిపించని చోట విగ్రహం పెట్టడమేమిటని విమర్శించేవారు. అయినా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదు. చిత్తశుద్దితో చేసి ఉంటే అక్కడ విగ్రహం తయారై ఉండేదేమో! మొక్కుబడి కార్యక్రమంగా సాగించారన్న భావన ఉంది. తదుపరి వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కన్నా, విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలనే కాక, దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకర్షించవచ్చని భావించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరుగాంచిన అంబేడ్కర్ విగ్రహంతో పాటు విజయవాడ నగరవాసులకు ఆహ్లాదంగా ఉండేలా అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తలపెట్టారు. మూడేళ్ల నుంచి అందుకు సన్నాహాలు సాగించారు. నిజానికి ఆరు నెలల క్రితమే ఈ పనులు పూర్తి చేయాలని అనుకున్నారు కాని, సాధ్యపడలేదు. అయినా పనుల వేగం పెంచి జనవరి 19న ప్రారంభోత్సవానికి రంగం సిద్దం చేశారు. ఇది జగన్ సమర్ద నాయకత్వ లక్షణానికి దర్పణం పడుతుంది. 'చెప్పాడంటే చేస్తాడంతే!' అన్న నమ్మకానికి అనువుగా ఈ విగ్రహం ఏర్పాటు పూర్తి అయింది. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఏర్పాటు అవుతోంది. ఇప్పటికే విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద, కనకదుర్గమ్మ గుడి వద్ద భారీ వంతెనలను పూర్తి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణలంక ప్రాంతంలో నివసించే వేలాది మంది బీద ప్రజలకు పెద్ద ఊరట కల్పిస్తూ.. నది అంచున రిటైనింగ్ వాల్ నిర్మించింది. కిలోమీటర్ల కొద్ది నిర్మించిన ఈ వాల్ కూడా విజయవాడ అభివృద్ధికి మారుపేరుగా కనిపిస్తుంది. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేని విశిష్టమైన పనులను చేపట్టి, పూర్తి చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మన్ననలు పొందగలుగుతున్నారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అందరికి ఆహ్వానం పలుకుతూ జగన్ ఇచ్చిన సందేశం కూడా హృద్యంగా ఉంది. ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశగతిన మార్చిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని ఆయన ప్రశంసించారు. పెత్తందార్ల భావాలపై తిరుగుబాటుకు స్పూర్తి ఇచ్చేలా అంబరాన్ని తాకేలా ఈ సమాజిక న్యాయ మహాశిల్పం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) ఏర్పాటు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు తన చేతితో ఒక దిశను చూపుతున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం నిజంగానే విజయవాడ ప్రతిష్టను అకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంత బ్రహ్మాండంగా విగ్రహ ప్రారంభోత్సవం జరుగుతుంటే నిత్యం ఏడ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా యధా ప్రకారం పెత్తందారి, అగ్రవర్ణ దురహంకార మనస్తత్వంతో చెత్త కథనాలను ప్రచురించింది. నీచత్వానికి పరాకాష్టగా రామోజీ, రాధాకృష్ణలు వ్యవహరిస్తూ తమ మీడియాను దిగజార్చుతూ ఈ రోజు కూడా ఛండాలపు స్టోరీలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. సుమారు నాలుగు వందల కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
డెల్టాలను ముంచి ఉల్టా రాతలా!?
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆ రెండు డెల్టాల్లో అక్కడక్కడ పల్లపు ప్రాంతాల్లో కొంతమేర పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వమే ఆ పంటలను ముంచేసినట్లు చిత్రీకరిస్తూ సీఎం జగన్‌పై రామోజీరావు ఇష్టమొచ్చినట్లు రాసిపారేశారు. డ్రెయిన్లు, కాలువల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంవల్లే డెల్టాల్లో పంటలు ముంపునకు గురైనట్లు చేతికొచ్చింది అచ్చేశారు. నిజానికి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణాడెల్టా ఆధునీకరణకు వినియోగించాల్సిన రూ.175 కోట్లను కృష్ణా నది కరకట్టపై తాను నివాసం ఉంటున్న అక్రమ నివాసాన్ని సుందరీకరించేందుకు చంద్రబాబు మళ్లించారు. అలాగే, గోదావరి డెల్టా ఆధునీకరణ నిధులనూ గోదావరి పుష్కరాలకు మళ్లించారు. ఆ పనులు చేయకుండానే కాంట్రాక్టర్ల ముసుగేసుకున్న టీడీపీ నేతలకు రూ.150 కోట్లకు పైగా దోచిపెట్టారు. ఏటా డ్రెయిన్లలో గుర్రపుడెక్క, తట్టెడు పూడిక ఎత్తకుండానే ఎత్తినట్లు చూపి రూ.వందల కోట్లను పచ్చమందకు దోచిపెట్టారు. చంద్రబాబు అవినీతివల్లే కృష్ణా, గోదావరి డెల్టాల్లో డ్రెయిన్లలో పూడిక పేరుకుపోయింది. గత నాలుగున్నరేళ్లుగా కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఆయకట్టు చివరి భూములకు నీళ్లందిస్తూ దన్నుగా నిలుస్తున్న సీఎం జగన్‌కు రైతులు అండగా నిలుస్తుండటాన్ని భరించలేక రామోజీరావు నిద్రపట్టడంలేదు. దీంతో చంద్రబాబు అవినీతిని కప్పెట్టి.. ఆ నెపాన్ని సీఎం జగన్‌పై రుద్దుతూ ‘ప్రభుత్వం ముంచింది’ అంటూ ‘ఈనాడు’లో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు గత నాలుగున్నరేళ్లుగా గోదావరి, కృష్ణా డెల్టాల్లో రబీ పంటల కోతలు పూర్తికాగానే కాలువలకు మరమ్మతులు చేస్తూ.. డ్రెయిన్లలో గుర్రపుడెక్కను తొలగిస్తూ.. ఆయకట్టు చివరి భూములకు అధికారులు నీళ్లందిస్తున్నారు. గోదావరి డెల్టాతోపాటు కృష్ణాడెల్టా చరిత్రలో గత నాలుగేళ్లుగా రబీ పంటకూ నీళ్లందిస్తున్నారు. కాలువలు, డ్రెయిన్లను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమృద్ధిగా నీళ్లందిస్తుండటంతో పంటల ఉత్పత్తులు పెరగడం.. గిట్టుబాటు ధరలు దక్కడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. తుపాన్లు, భారీ వర్షాలవల్ల పంటలకు నష్టం వాటిల్లితే.. ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపోయిన రైతులకు సీఎం జగన్ పరిహారం చెల్లిస్తూ దన్నుగా నిలుస్తున్నారు. దీంతో సీఎం జగన్‌కు రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆదరణ పెరుగుతున్నట్లుగానే.. కృష్ణా, గోదావరి డెల్టా రైతుల్లోనూ ఆయనకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. డెల్టాల ఆధునీకరణ నిధులు స్వాహా.. కృష్ణా, గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా పంటలకు సమృద్ధిగా నీళ్లందించి రైతులకు బాసటగా నిలవాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. జలయజ్ఞం కింద గోదావరి, కృష్ణా డెల్టాల ఆధునీకరణ పనులు చేపట్టారు. తన హయాంలో గోదావరి డెల్టా ఆధునీకరణకు రూ.748.58 కోట్లు, కృష్ణాడెల్టా ఆధునీకరణకు రూ.1,093.77 కోట్లు ఖర్చుచేసి కాలువలు, డ్రెయిన్లను అభివృద్ధి చేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బాబు.. డెల్టాల ఆధునీకరణ నిధులను దోచేశారు. ► కృష్ణాడెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.1,239.24 కోట్లు ఖర్చుచేస్తే.. ఇందులో రూ.175 కోట్లను తాను నివాసం ఉంటున్న అక్రమ కట్టడం సుందరీకరణకు మళ్లించారు. ► కాలువలు, డ్రెయిన్ల ఆధునీకరణ పనులు తూతూమంత్రంగా చేపట్టి కాంట్రాక్టర్ల ముసుగులోని టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు దోచేశారు. ► గోదావరి డెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.813.02 కోట్లు ఖర్చుచేసిన చంద్రబాబు.. అందులో చాలావరకు నిధులను గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు మళ్లించేశారు. ►పనులు చేయకుండానే చేసినట్లు చూపి పచ్చమందకు దోచిపెట్టారు. -
fact check: మేలెంచినా కీడెంచుతారా!?
సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపాటిగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా? రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది. ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..! పేదలకు మేలు జరుగుతుంది.. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ రుసుం, డీఎంఎఫ్, మెరిట్ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు.. ప్రతి ఖరీఫ్ సీజన్‌కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు. ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది? ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది. ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీలు, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
Fact Check: ‘సోలార్’పై వక్రించిన ఈనాడు కథ
సాక్షి, అమరావతి: కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి, వాటిని కంపెనీలకు అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ). అదీ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఒప్పందాలూ అప్పుడే జరిగాయి. ఆ ప్రాజెక్టులు పొందిన సంస్థల్లో అదానీ లేదు. 250 మెగావాట్ల ప్రాజెక్టు పొందిన ఓ సంస్థను అదానీ సంస్థ గతంలో ఎప్పుడో టేకోవర్ చేసింది. అయినా రామోజీరావు వక్రబుద్ధితో సీఎం జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతూ ‘అదానీ అయితే ఓకే‘ శీర్షికన శనివారం ఈనాడులో తప్పుడు కథనం అచ్చేశారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టులు అమలు కాకపోవడానికి కోర్టుల్లో వ్యాజ్యాలు వేసిన కంపెనీలే కారణమైనా సీఎం జగన్ సర్కారే కారణమంటూ మరో బండ వేసే ప్రయత్నం చేశారు. నిజానికి డిస్కంలు కోరిన వెంటనే ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టు వ్యాజ్యాల నుంచి అందరూ తప్పుకునేలా కృషి చేసి, ప్రాజెక్టులను శంకుస్థాపన వరకు తెచ్చింది. వీటన్నింటినీ విస్మరించి.. కనీస ఆలోచన, జ్ఞానం లేకుండా అసత్యాలతో, ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా కథనాన్ని అచ్చేసింది ఈనాడు. ఈ ప్రాజెక్టులు, వాటి వ్యవహారాలపై అసలు వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ, సీఈవో డాక్టర్ ఎం.కమలాకర్‌బాబు వెల్లడించారు. ఇది ఏ ఒక్కరి లబ్ధి కోసమో చేసింది కాదని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టుల కోసం మైలవరం వద్ద 3 వేల ఎకరాలకు పైగా భూమిని సిద్ధంగా ఉంచినప్పటికీ, సోలార్ పవర్ డెవలపర్ (ఎస్పీడీ)లు కాలయాపన చేశారని, ఈ వాస్తవాలను దాచి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు కట్టుకథలు అల్లడంలో అర్ధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన తెలిపిన వాస్తవాలివీ.. ఈ ప్రాజెక్టుల ‘కథ’ ఇదీ.. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు సోలార్ ప్రాజెక్టులకు టెండర్లను సెకీ 2018 జూలై 6నే పూర్తి చేసింది. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దానిని దక్కించుకుంది. ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఆ తరువాత ఎస్బీ ఎనర్జీ సెవెన్ సంస్థను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. టారిఫ్‌ను అనుమతించాలని 2019 ఫిబ్రవరిలో విద్యుత్ నియంత్రణ మండలిని డిస్కంలు కోరాయి. సెకీ, ఎస్పీడీలు, ఎస్‌పీడీలకు ఏపీఎస్పీసీఎల్కు మధ్య ఒప్పందాలు 2019 మార్చికి పూర్తయ్యాయి. అంటే ఇదంతా చంద్రబాబు సీఎంగా ఉండగానే జరిగాయి. ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసేలోగానే ఎస్పీడీలు వివిధ రకాల కారణాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అంటే ఈ నాలుగేళ్ల కాలయాపన ఎస్‌పీడీలదే గానీ ప్రభుత్వంది కాదన్నది సుస్పష్టం. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ పరిష్కరించి, ప్రాజెక్టులు అమలయ్యేందుకు చర్యలు చేపట్టింది. బాబు తప్పిదాన్ని మోయక తప్పదు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులకు వన్ టైమ్ డెవలప్మెంట్ చార్జీలు, లాండ్ లీజు చార్జీల కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే టెండర్ దక్కించుకున్న సంస్థలు రూ.309.39 కట్టేశాయి. ఈ మొత్తంలో డెవలప్మెంట్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.41.2 లక్షలను ఒక్కో సంస్థ చెల్లించింది. లాండ్ లీజ్ చార్జీలుగా మెగావాట్‌కు మరో రూ.5 వేలు చెల్లించాయి. ఇవిగాక యాన్యువల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.3.2 లక్షలు కట్టాయి. లోకల్ ఏరియా డెవలప్మెంట్ చార్జీగా మెగావాట్‌కు రూ.1 లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. వాటితో సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం, స్థానిక ప్రాంతాల అభివృద్ధి జరిగింది. పైగా, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు గ్రాంట్ కింద రూ. 54 కోట్లను ఏపీఎస్పీసీఎల్కు ఇచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టులను కంపెనీలకు అప్పగించి ప్రారంభించకపోతే ఈ మొత్తం డబ్బును వడ్డీతో సహా తిరిగివ్వాలి. అదీగాక ఏపీఈఆర్సీ ఆమోదంతో కుదుర్చుకున్న పీపీఏలన్నింటినీ ప్రభుత్వం కొనసాగించాలి్సందే. అందువల్ల ఇప్పుడు వీటిని కాదనడానికి లేదు. పైగా, మొత్తం 750 మెగావాట్లలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్‌కు వచ్చింది 250 మెగావాట్ల ప్రాజెక్టు. అంటే ఆ సంస్థను టేకోవర్ చేసిన అదానీ సంస్థకు ఈ ప్రాజెక్టులో ఉన్నది మూడో వంతు మాత్రమే. ఇందులో అదానీకి కొత్తగా జరిగే లబ్ధి ఏమీ లేదు. నష్టం జరిగిందనడంలో అర్థం లేదు గత నాలుగేళ్లలో సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టుకి నిర్దిష్ట పరిస్థితులు ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ధరను నిర్ణయించాలి. నష్టం జరిగిందని చెప్పడంలో అర్ధం లేదు. సోలార్ ప్రాజెక్టుల వల్ల మైలవరం ప్రాంతం అభివృద్ధితో పాటు సంప్రదాయేతర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12కు కొనే బదులు గ్రీన్ పవర్‌ను యూనిట్ రూ.2.70కి కొనడం వల్ల డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. జగన్ ప్రభుత్వంలో అంతా పారదర్శకంగానే.. వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ప్రతి పనినీ, ప్రతి ప్రాజెక్టునూ పారదర్శకంగా, అవినీతి రహతంగా, ప్రజలకు మేలు చేకూరే విధంగానే చేపడుతోంది. అందుకోసం న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ పద్ధతులు ప్రవేశపెట్టింది. ఇవి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఏ ప్రాజెక్టు కోసమైనా అర్హత ఉన్న ఎవరైనా టెండర్ ద్వారా పోటీ పడవచ్చు. ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, క్లియరెన్స్ వస్తేనే కేటాయిస్తున్నారు. అంత పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే, ఒక కంపెనీకి లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఈనాడు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమే. ఎక్కువ ధరకు కొన్నదే బాబు ప్రభుత్వం.. ఆదా చేస్తున్నది జగన్ సర్కారు వాస్తవానికి ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నదే చంద్రబాబు ప్రభుత్వం. ఈ విషయంలో చంద్రబాబుకు పెద్ద చరిత్రే ఉంది. బాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, ఇప్పుడు ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు పొంతన లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ళ వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. దీనినే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తప్పుపట్టారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10గా ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ. 3,750 కోట్లను ఆదా చేయనుంది. చంద్రబాబు హయాంలో ఎంత ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నా పట్టని రామోజీ, ఇప్పుడు అతి తక్కువకు విద్యుత్ కొంటుంటే నేరమన్నట్లుగా రాస్తున్నారు. పైగా, ఈ విద్యుత్‌ను పూర్తిగా వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందించనుంది. అలా ఇవ్వాలనుకోవడం తప్పంటారా? అన్నదాతలకు సాగు కోసం నీరు ఇవ్వద్దంటారా? మీ తప్పుడు రాతల పరమార్ధం అదేగా రామోజీ.! -
జనంపై భారం లేదు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ కొనసాగుతుంటే ఏపీ మినహా మరెవరూ స్మార్ట్ మీటర్లు అమర్చడం లేదంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను అచ్చేస్తోంది ఈనాడు. ప్రభుత్వ, వాణిజ్య, పారిశ్రామిక సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తుంటే ‘జనం జేబుకు చిల్లు‘ అంటూ వక్ర భాష్యాలు చెబుతోంది. ఆ కథనంలో దాచిపెట్టిన వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ‘సాక్షి’కి వెల్లడించారు. ♦ విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2025 నాటికి ప్రతి సర్వీసు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు అన్నిటికి స్మార్ట్ మీటర్లను అమర్చాలనే నిబంధన విధించాయి. వినియోగదారులపై ఎటువంటి అదనపు భారం లేకుండా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పధకాన్ని రూపొందించారు. ఈమేరకు దేశవ్యాప్తంగా డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. ♦ రాష్ట్రంలో 200 యూనిట్లు అంతకుమించి వాడకం ఉన్న సర్వీసులకు, ప్రభుత్వ సర్వీసులకు డిస్కమ్‌లు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తాయి. తద్వారా పేద, మధ్య తరగతిపై భారం లేకుండా చర్యలు తీసుకున్నాయి. ప్రీపెయిడ్ మీటర్లలో కొత్త టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, నాణ్యతను తెలుసుకునే వీలుంది. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చు. డబ్బులు కట్టలేదని లైన్మెన్ కరెంట్ నిలుపుదల చేసే పరిస్థితి ఉండదు. ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు 2025 మార్చి వరకు గడువు ఉంది. రెండు నెలల వ్యవధిలో ఏర్పాటు చేయాలన్నది అవాస్తవం. ♦ దేశంలో 19.792 కోట్ల మంది వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు ఆమోదం లభించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్, బిహార్, అసోం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, త్రిపురలో 7.517 కోట్ల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు టెండర్లను ఖరారు చేశారు. బిగించే ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ♦ మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు, వాణిజ్య భవనాలకు, పారిశ్రామిక వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లకు, 11 కేవీ ఫీడర్లకు కలిపి 42 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ఒక్కో సింగిల్ ఫేజ్ మీటర్‌కు నెలకు రూ.86.32, త్రీ–ఫేజ్ మీటర్‌కు రూ.176.02 చొప్పున 93 నెలల వ్యవధిలో టెండర్ దక్కించుకున్న సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, పదేళ్ల పాటు నిర్వహణకు రూ.5 వేల కోట్లు వ్యయం కానుంది. అయితే ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా మీటరుకు రూ.1,350 వరకు కేంద్రం గ్రాంట్ ఇస్తుంది. ఇదంతా వదిలేసి రూ.20 వేల కోట్ల భారమంటూ ‘ఈనాడు’ కాకి లెక్కలతో తప్పుడు రాతలను అచ్చేసింది. -
రుషికొండ టూరిజం పునర్నిర్మాణ ప్రాజెక్టుపై 'ఈనాడు' విష ప్రచారం
-
మళ్లీ మళ్లీ అవే అబద్ధాలా?
చంద్రబాబు నాయుడి కోసం ‘ఈనాడు’ రాతలను లేఖలుగా సంధిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చిన్నచిన్న లాజిక్కులు కూడా మిస్ అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్కిల్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన బావ చంద్రబాబు మెప్పుకోసం కొన్ని రోజులుగా రాష్ట్రంలో ‘మద్యంపై పోరాటం’ అంటూ ఆమె చేస్తున్న హంగామా అంతా చూస్తున్నదే. తాజాగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ అందజేశారు. తమ పార్టీ ప్రభుత్వానికే ఇలా వినతి పత్రాలివ్వటమేంటని అంతా ఆశ్చర్యపోతున్నా... టీడీపీ సంక్షేమం కోసం పాటుపడుతున్న పురంధేశ్వరికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. లేఖలో ఆమె పేర్కొన్న కొన్ని అంశాలు ఎంత అసంబద్ధమైనవంటే... అనుమతులిచ్చిన చంద్రబాబును ప్రశ్నించరేం? రాష్ట్రంలో మద్యం నాణ్యతపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న పురంధేశ్వరికి... దాన్ని తయారు చేస్తున్న డిస్టిలరీలకు అనుమతులిచ్చింది తన బావ చంద్రబాబు నాయుడేనని తెలియదా? ఒకవేళ తెలియకుంటే తెలుసుకోవాలి కదా? వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం 20 మద్యం డిస్టిలరీలుండగా... వాటిలో 14 డిస్టిలరీలకు అనుమతిచ్చింది చంద్రబాబు నాయుడే. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. అంతే తప్ప వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు అనుమతిచ్చిన డిస్టిలరీల్లో చాలావరకూ ఆయన హితులు, సన్నిహితులవే. వాళ్లు అప్పట్లో తయారు చేసిన మద్యాన్నే ఇప్పుడూ తయారు చేస్తున్నారు. మరి అప్పట్లో నాణ్యంగా ఉన్న మద్యం ఇప్పుడు ఎందుకు మారిపోయింది? ప్రభుత్వం మారింది కాబట్టా? ఇదెక్కడి తీరు పురంధేశ్వరి గారూ?! నాడు నాలుగు డిస్టిలరీలకే 70 శాతం ఆర్డర్లు.. పురంధేశ్వరి తన లేఖలో వాస్తవానికి సమాధి కట్టి వినిపించిన మరో అందమైన అబద్ధమేంటంటే... వైఎస్సార్ సీపీ నాయకులకు చెందిన డిస్టిలరీలకే ఎక్కువ మద్యం సరఫరా చేసే అవకాశమిస్తున్నారని. నిజం చెప్పాలంటే వైఎస్సార్సీపీ నేతలకు డిస్టిలరీలే లేవు. అన్నీ చంద్రబాబు నాయుడి హయాంలో అనుమతులిచ్చిన ఆయన సన్నిహితులు, టీడీపీ నేతలవే. పైపెచ్చు చంద్రబాబు హయాంలో డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగేది. తమ వారికి చెందిన 4 డిస్టిలరీల నుంచే ఏకంగా 70 శాతం మద్యాన్ని కొనుగోలు చేసేవారు. అంటే తనకు కావాల్సిన ఈ 4 డిస్టిలరీలకూ సగటున ఒక్కోదానికీ 17.5 శాతం ఆర్డర్లు ఇచ్చారు. మిగిలిన 16 డిస్టిలరీలకూ కలిపి 30 శాతం ఆర్డర్లు ఇచ్చారు. అంటే వీటికి సగటున 2 శాతంలోపే ఆర్డర్లు దక్కాయి. కానీ ఇంతటి అవినీతిని పురంధేశ్వరి ఎన్నడూ... ఏ పార్టీలో ఉన్నప్పుడూ ప్రశ్నించలేదు. వాస్తవానికి ఇప్పుడు ప్రతి డిస్టిలరీకీ సమానంగా అవకాశం కల్పిస్తున్నారు. దాదాపు 4 నుంచి 6 శాతం వరకు ప్రతి డిస్టిలరీకీ తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఇలా చేస్తున్నందుకే... ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే జరుగుతున్నాయని ఒక నివేదిక కూడా ఇచ్చింది. కేంద్ర సంస్థే ఇలా చెప్పినపుడు... కేంద్రానికి పురంధేశ్వరి చేసిన ఫిర్యాదులో ఏ కొంచెమైనా అర్థం ఉన్నట్టా? సత్ఫలితాలనిస్తున్న దశలవారీ మద్య నియంత్రణ.. మద్యం విక్రయాలను ప్రభుత్వ అధీనంలో చేపట్టడం... షాపుల సంఖ్యను తగ్గించటం... విక్రయ వేళల్ని పరిమితం చేయటం... పర్మిట్ రూముల్ని రద్దు చేయటం... బెల్టు షాపుల్ని తొలగించటం... వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2018–19లో మద్యం విక్రయాలు 3.84 కోట్లు కేసులు. అదే ఏడాది బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోయాయి. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక విక్రయాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. 2022–23లో మద్యం విక్రయాలు 3.35 కోట్ల కేసులకు, బీర్లు 1.16 కోట్ల కేసులకు పరిమితమయ్యాయి. మద్యం తాగేవారు వెనుకంజ వేసేలా... రేట్లను షాక్ కొట్టేలా పెంచుతామని గత ఎన్నికల హామీల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాన్ని అమలు చేశారు. రేట్లను పెంచటంతో పాటు అదనపు పన్నునూ విధించారు. ఇది కూడా మద్యం విక్రయాలు తగ్గటానికి కారణమే. నిధులు మళ్లించింది చంద్రబాబు కాదా? తెలుగుదేశం, ‘ఈనాడు’ బాటలోనే... రాష్ట్రంలో మద్యం విక్రయించగా వచ్చిన సొమ్ము ఖజానాకు కాకుండా ఇంకెక్కడికో తరలిపోతోందంటూ పురంధేశ్వరి సైతం గగ్గోలుపెట్టారు. రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది తలా రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారని నోటికొచ్చినట్లు చెప్పేశారు. ఇలా చూస్తే మద్యం అమ్మకాల ద్వారా సంవత్సరానికి రూ.57,600 కోట్లు రావాలని, కానీ రూ.32,600 కోట్లే చూపిస్తున్నారు కనక మిగతా రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారని నమ్మశక్యం కాని కూతలు కూసేశారు. నిజానికి కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక 2019–21 ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడ్డవారిలో మద్యం అలవాటు ఉన్నవారు 63.88 లక్షలమంది. వీరిలో రోజూ తాగేవారు సగటున 18.24 లక్షల మందే. మరి 80 లక్షల లెక్క ఎవరు చెప్పారు పురంధేశ్వరి గారూ? వాస్తవానికి ఈ ప్రభుత్వ హయాంలో తక్కువ మద్యం విక్రయిస్తున్నా ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ సొమ్ము సమకూరుతోంది. కానీ చంద్రబాబు హయాంలో ఇప్పటికంటే చాలా ఎక్కువ మద్యాన్ని విక్రయించినా కూడా... ఇప్పటికన్నా తక్కువ మొత్తమే ఖజానాకు చేరేది. మరి నిధుల మళ్లింపు అప్పుడు జరిగినట్టా? ఇప్పుడు జరుగుతున్నట్టా? కాస్త ఆలోచన ఉండాలి కదా? చంద్రబాబును విమర్శించడానికి మనసు ఒప్పుకోకుంటే... ఇలాంటి పనికిమాలిన ఆరోపణలైనా చేయకుండా ఉండాలి కదా?. -
పూర్తవని ఈ–టెండర్‌పై.. ఈ తప్పుడు రాతలేంటి.!
సాక్షి, అమరావతి: వెన్నంటి ఉండేవారిని సన్నిహితులంటారు. వదిలేసి వెళ్లిపోయిన వారిని సన్నిహితులని ఈనాడు రామోజీరావు మాత్రమే అనగలరు. న్యాయ సమీక్షను తప్పుబట్టగలరు. రివర్స్ టెండరింగ్ చెడ్డదని రాయగలరు. ఆయన అనుకున్నది సాధించడానికి ఏదైనా అచ్చేయగలరు. నిస్సిగ్గుగా అబద్ధాలను జనంపై రుద్దేయగలరు. అంతమాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియవనుకుంటే పొరపాటే. అసలు ఈనాడు రామోజీరావు దృష్టిలో అవినీతి అంటే ఏమిటి? ఎక్కడా లేని రీతిలో రూ.2.28 లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో రాష్ట్ర ప్రజలకు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది అవినీతా? లేక గత ప్రభుత్వంలా దోచుకోవడం పంచుకోవడం అవినీతా? సీఎం స్థానంలో చంద్రబాబును కూర్చోబెట్టాలనే ఆరాటంలో పత్రిక విలువలను దిగజార్చి, జర్నలిజం నియమాలను తుంగలో తొక్కి, సొంత అజెండాతో కథనాలు రాయడం ఈనాడుకు నిత్యకృత్యమైంది. ఇదే ధోరణితో ఇంకా పూర్తి కాని భూగర్భ విద్యుత్ లైన్ల టెండర్లపై ఓ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఆ రాతల వెనుక అసలు నిజాలు ఇలా ఉన్నాయి.. ఆరోపణ: అది జగన్‌కు అత్యంత సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వాస్తవం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నిహితుడు అయితే వైఎస్సార్సీపీని ఎందుకు విడిచిపెట్టి వెళ్లారు? జగన్ మీద రాజకీయ ప్రతీకారంగా కేసులు పెట్టి, జైల్లోకి పంపిన కాంగ్రెస్‌లోకి ఎలా వెళ్తారు? ఏ రకంగా సన్నిహితుడని చెప్తారు? అసలు ఎవరు ఎవరికి సన్నిహితులో ఈనాడుకు తెలియంది కాదు. రామోజీ వియ్యంకుడు నవయుగ వారికి చెందిన సంస్థ కాదా? ఆర్వీఆర్ అనే సంస్థ వారికి చెందిన వారిది కాదా? సుధాకర్ యాదవ్ యనమలకు వియ్యంకుడు కాదా? అందుకే పోలవరంలో నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టు దక్కలేదా? సీఎం రమేష్ మీవాడు కాదా? వారి సంస్థ రిత్విక్‌కు నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టలేదా? నామా నాగేశ్వరరావు, గరికపాటి మోహన్‌రావు మీ వాళ్లు కాదా? రామోజీరావు ఓన్ చేసుకోవాలంటే వీళ్లని ఓన్ చేసుకోవాలి. ఆరోపణ: ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంస్థల్లో దేనికి ఏ కాంట్రాక్టు వెళ్లాలో ముందే ఖరారైపోతుంది. వాస్తవం: రాష్ట్రంలోని జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. ముందుగా టెండర్లు తీసుకుని 2 వారాల సమయం ఇచ్చి పబ్లిక్ డొమైన్లో వాటిని పెట్టి అభ్యంతరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి స్వీకరిస్తారు. ఆ మేరకు మార్పులు చేస్తారు. మళ్లీ టెండర్లు పిలుస్తారు. టెండర్లు ఖరారు చేశాక రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. ఇంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ దేశంలో ఎక్కడాలేదు. మరి భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల టెండర్ల ప్రక్రియలో రామోజీరావు ఎందుకు పాల్గొనలేదు? ఆరోపణ: టెండర్ నిబంధనలు ఎలా ఉండాలో అధికారులకు ఆయనే నిర్దేశిస్తారు. వాస్తవం: ‘ఆర్డీఎస్ఎస్’ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పటిష్టత కోసం భూగర్భ విద్యుత్ కేబుళ్లు అమర్చాలని ప్రణాళిక రూపొందించారు. రూ..1,165.41 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు నివేదికను 2022 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.699.25 కోట్లు గ్రాంట్ రూపంలో వస్తుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన నోడల్ ఏజెన్సీ పీఎఫ్సీ ఆమోదించిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్‌కి అనుగుణంగా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. దీని నిబంధనలను ఎవరో ఒకరు మార్చేసే అవకాశం లేదు. ఆరోపణ: పనులు అవే.. అంచనాలు పెంచేయడం వల్ల అదనంగా ఖర్చు వాస్తవం: భూగర్భ విద్యుత్ పనుల్లో అధికంగా వినియోగించే కేబుల్స్ ధరల్లో భారీ వ్యత్యాసం కారణంగా టెండర్ ధర అధికంగా వచ్చింది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను 2021లో తయారు చేశారు. ఆ సమయంలో కేబుల్ ధరలు 2018–19 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరంలో డిస్కం కొనుగోలు చేసిన ధరలకు అనుగుణంగా తీసుకున్నారు. అయితే కోవిడ్ మహమ్మారి తెచ్చిన సంక్షోభం, విధించిన ఆంక్షల కారణంగా సరఫరా వ్యవస్థ బాగా ప్రభావితమైంది. ముడిసరుకులైన అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి వాటి ధరలు బాగా పెరిగాయి. కవర్ కండక్టర్, ఎక్స్ఎల్పీఈ కేబుల్స్, 33 కేవీ, 11 కేవీ ఆర్‌ఎంయూలు మొదలైనవి, అలాగే లేబర్ రేట్లు కూడా పెరిగాయి. వీటి ఆధారంగా మంజూరైన ధరతో పోలిస్తే బిడ్డర్లు కోట్ చేసిన రేట్లలో సహజంగానే పెరుగుదల ఉండవచ్చు. ఆరోపణ: పోటీలో ఆ రెండు కంపెనీలే వాస్తవం: రింగ్ మెయిన్ యూనిట్లు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం పోర్టల్‌లో టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇందులో బీహెచ్ఎల్, ఏబీబీ, సీమెన్స్, స్పైడర్ వంటి తయారీ సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ టెండర్ ప్రక్రియ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా పూర్తి పారదర్శకంగా జరుగుతోంది. ఆసక్తి కలిగిన గుత్తేదారులందరూ ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఈ సాధారణ ప్రక్రియలో కనీస ధర ప్రతిపాదించి ఎల్ 1గా అర్హత పొందిన గుత్తేదారుకు మాత్రమే పనులు దక్కించుకొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ గ్రాంటును పొందడానికి టెండర్‌ను నిర్ణీత వ్యవధిలో ఖరారు చేయవలసి ఉంది. ఈ కారణంగా టెండర్ వివరాలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ పరిశీలనకు పంపించారు. వాస్తవాలు ఇలా ఉంటే అడ్డగోలుగా కట్టబెట్టేశారని రామోజీ గగ్గోలు దేనికో..!! ఆరోపణ: రివర్స్ టెండరింగ్ ఓ బూటకం వాస్తవం: 2022 డిసెంబర్ 9న జ్యుడిషియల్ ప్రివ్యూ ఇచ్చిన ఆమోదం మేరకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా 2022 డిసెంబర్ 12న మొదటి టెండర్ ప్రకటన జారీ చేశారు. ఈ బిడ్ నెం.09/2022–23లో ఇద్దరు గుత్తేదార్లు పాల్గొన్నారు. సాంకేతిక పరిశీలన అనంతరం షిర్డీ సాయి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీల బిడ్లు అర్హత సాధించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రైస్ బిడ్స్‌లో ఎల్ 1 బిడ్డర్‌గా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆర్సీఐఎల్ అర్హత సాధించింది. గుత్తేదార్లు కోట్ చేసిన రేటు అధికంగా ఉండటం వల్ల రివర్స్ టెండర్ ప్రక్రియ కొనసాగించారు. గుత్తేదార్ల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో టెండర్‌ను రద్దు చేశారు. తిరిగి ఏప్రిల్‌లో రెండోసారి టెండర్ ఆహ్వానించారు. ఈ రీ టెండరీంగ్ సమయంలో రింగ్ మెయిన్ యూనిట్ల పరికరాలను టెండర్ నుంచి మినహాయించారు. ఈ పరికరాల నాణ్యత, దీర్ఘకాల గ్యారెంటీ సౌకర్యం కోసం వాటిని డిస్కం ప్రత్యేకంగా కొనాలని నిర్ణయించింది. రింగ్ యూనిట్లు మినహాయించిన ఈ టెండర్లలో నలుగురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు. ఇందులో ఇద్దరు అర్హత సాధించగా సంబంధిత ధర నిర్ణయం కోసం రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ధరల ప్రకారం 2022–23 ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) ఆధారిత అంచనాలకు మించి 8 శాతం అధికంగా ఎల్1 బిడ్డర్ ఆర్సీఐఎల్ దాఖలు చేసింది. ఇంత పక్కాగా, పూర్తి పారదర్శకంగా ఈ టెండర్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో బూటకం ఏముంది? -
AP: అనిశ్చితి నుంచి నిశ్చింతగా!.. జీపీఎస్‌తో పూర్తి గ్యారెంటీ
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారంలో ఉండగా 2003లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు బీజం పడింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సీపీఎస్ రద్దు గురించి వినడానికి కూడా ఇష్టపడలేదు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేస్తామని గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ప్రకటించడంతో చంద్రబాబు హడావుడిగా రిటైర్డ్ ఐఏఎస్ టక్కర్ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేస్తుంటే తప్పుడు కథనాలతో ఈనాడు రామోజీ బురద చల్లుతున్నారు. రాష్ట్రం, ఉద్యోగాల ప్రయోజనాలను కాపాడుతూ.. సీపీఎస్ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల చివరి నెల బేసిక్‌లో 20 శాతం కూడా పెన్షన్ కింద వస్తుందని గ్యారెంటీ లేదు. అదే జీపీఎస్ విధానం ప్రకారం రిటైర్డ్ ఉద్యోగుల చివరి నెల బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుందని గ్యారెంటీ కల్పిస్తుంటే రామోజీకి రుచించడంలేదు. ఉద్యోగులకు మంచి చేస్తుంటే భరించలేకపోతున్నారు. ఓపీఎస్ అమలు చేయడం వల్ల భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పెన్షన్ భారం ఉద్యోగుల జీతాలను సైతం దాటేసి మోయలేని స్థాయికి చేరుతుంది. రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 తరహాలోనే రద్దు చేసి ప్రత్యామ్నాయం తేవాల్సి వస్తుంది. ఇవన్నీ అధ్యయనం చేసిన తరువాతే సీపీఎస్ కన్నా మెరుగ్గా జీపీఎస్‌ను రూపొందించారు. ఇటు రాష్ట్ర భవిష్యత్తుతో పాటు అటు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని వెనుక రెండున్నరేళ్ల పాటు కసరత్తు చేసింది. మంత్రుల కమిటీని నియమించి అధ్యయనం చేసింది. సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్ నిపుణులతో అధ్యయనం జరిపింది. ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో వారి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని సమతూకం పాటిస్తూ జీపీఎస్‌ను తెచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఓపీఎస్ తెస్తున్నట్లు పేర్కొన్నా అమలులోకి రాకపోవడం గమనార్హం. సీపీఎస్‌లో అనిశ్చితి ♦ సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత చేరిన ఉద్యోగులకు వర్తిస్తుంది. ♦ సీపీఎస్ విధానంలో పెన్షన్ ఎంత వస్తుందనేది గ్యారెంటీ లేదు. ♦ రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ వేతనం రూ.లక్ష అయితే పెన్షన్ సుమారు రూ.20 వేలు మాత్రమే వస్తుంది. ఇది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు తగ్గితే పెన్షన్ కూడా తగ్గుతుంది. ♦ వడ్డీ రేట్లు ఇంకా తగ్గిపోతే 20 శాతం పెన్షన్ కూడా వస్తుందా రాదో అనే అనిశ్చితి. ఇదంతా మార్కెట్‌తో లింక్ అయి ఉంటుంది. మారుతున్న వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. దశాబ్దం కాలంగా వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ♦ ద్రవ్యోల్బణం వల్ల కాలం గడిచేకొద్దీ పెరిగే జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి డీఆర్లు ఇందులో ఇవ్వడం లేదు. ♦ 62 ఏళ్లకు ఉద్యోగి రిటైరైతే మరో 20 ఏళ్ల తరువాత పెన్షన్ విషయంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ♦ ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్ ఫండ్‌కు బదిలీ చేయాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ♦ సీపీఎస్ పెన్షన్‌లో పూర్తి అనిశ్చితి ఉంటుంది. మార్కెట్లో పరిస్థితుల ప్రకారం హెచ్చు తగ్గులుంటాయి. ♦ పెన్షన్‌కు గ్యారెంటీ, భద్రత లేదు ♦ పదవీ విరమణ తరువాత ఉద్యోగికి ద్రవ్యోల్బణం నుంచి రక్షణ లేదు. జీపీఎస్‌తో పూర్తి గ్యారెంటీ ♦ జీపీఎస్ విధానంలో పెన్షన్‌కు పూర్తి గ్యారెంటీ ఉంటుంది. పెన్షన్ ఎంత వస్తుందో ఉద్యోగికి ముందుగానే తెలుస్తుంది. ♦ సీపీఎస్ తరహాలోనే ఉద్యోగి 10 శాతం చెల్లిస్తే ప్రభుత్వం దానికి సమానంగా అందచేస్తుంది. ♦ మార్కెట్ స్థితి గతులతో, వడ్డీ రేట్లతో ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి అనిశ్చితికి తావేలేదు. పెన్షన్ విషయంలో పూర్తి భరోసా. ♦ రిటైర్మెంట్ చివరి నెల వేతనం బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా కచ్చితంగా అందుతుంది. సీపీఎస్‌తో పోలిస్తే జీపీఎస్‌లో అందే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ♦ ద్రవ్యోల్బణాన్ని, పెరిగే ధరలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తారు. దీని వల్ల పెన్షన్ ఏటా పెరుగుతూ పోతుంది. ♦ రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి రెండు డీఆర్‌లతో కలుపుకొని ఇది పెరుగుతూ పోతుంది. ♦ 62 ఏళ్లకు రిటైరైన ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చేసరికి జీపీఎస్ ద్వారా పెన్షన్ రూ.1,10,000కి చేరుతుంది. తద్వారా రిటైరైన ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లు అవుతుంది. ♦ పదవీ విరమణ అనంతరం జీవన విధానానికి ఆటంకాలు లేకుండా, సంతోషంగా గడిపేలా జీపీఎస్‌లో రక్షణ చర్యలు తీసుకున్నారు. సీపీఎస్‌లో ఇలాంటి వెసులు బాటే లేదు. -
సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ?
సాక్షి, అమరావతి: తనకు నచ్చినవారిని నెత్తిన పెట్టుకుంటూ.. నచ్చనివారిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల నిధులను చట్టానికి విరుద్ధంగా తన సొంత ప్రయోజనాలకు రామోజీరావు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆ కేసుపై ప్రస్తుతం సీఐడీ చేస్తున్న దర్యాప్తుపై కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నించడం విస్మయపరుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ, రామోజీ కోడలు శైలజా కిరణ్‌ను హైదరాబాద్‌లో రెండోసారి మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తమకు చట్టాలు, నిబంధనలు వర్తించవనే రీతిలో సీఐడీ అధికారులకు ఏమాత్రం సహకరించలేదు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ అధికారులు ప్రశ్నలు అడిగినా ‘తెలియదు’ అంటూ సమాధానాలు చెప్పకుండా దాటవేత వైఖరిని ప్రదర్శించారు. తాను విదేశాల నుంచి వచ్చానని, తనకు ఆరోగ్యం బాగోలేదని, కళ్లు తిరుగుతున్నాయంటూ సాకులు చెబుతూ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. విచారణకు అడుగడుగునా అడ్డుపడుతూ.. మంగళవారం దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణ ప్రక్రియలో సీఐడీ అధికారులు తాము ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిలో కనీసం 25శాతం ప్రశ్నలను కూడా శైలజను అడగలేకపోయారు. దీన్ని బట్టి ఆమె అడుగడుగునా విచారణకు అడ్డుపడుతూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని స్పష్టమవుతోంది. ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో వైద్యులు పరీక్షించేందుకు సీఐడీ అధికారులు అవకాశం ఇచ్చారు. భోజనానికి, మందులు వేసుకోవడానికి కూడా విరామం ఇచ్చారు. అయినప్పటికీ శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకపోవడం గమనార్హం. అంతే కాకుండా విచారణకు సీఐడీ అధికారులతోపాటు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులైన ఆర్థిక వ్యవహారాల నిపుణులను ఇంటిలోకి రానీయకుండా అడ్డుకునేందుకు యత్నించడం రామోజీ కుటుంబం బరితెగింపునకు నిదర్శనం. అసలు వాస్తవం ఇది.. కాగా అసలు వాస్తవం ఏమిటంటే.. తమ విచారణకు శైలజా కిరణ్ ఏమాత్రం సహకరించలేదని దర్యాప్తు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారిస్తామని కూడా ఆయన వెల్లడించారు. దర్యాప్తు అధికారి చెప్పిన విషయాలను కాకుండా తమకు అనుకూలంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే తన విష పత్రికలో అబద్ధపు రాతలు రాయించారు. ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో తమ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ మీడియాపై కూడా రామోజీరావు అక్కసు వెళ్లగక్కారు. శైలజా కిరణ్ విచారణ ప్రక్రియకు సబంధించిన వార్తలు సాక్షి మీడియాలో ప్రసారం చేశారని గగ్గోలు పెట్టారు. వాస్తవానికి సాక్షి మీడియానే కాకుండా ఇతర చానళ్లు కూడా శైలజా కిరణ్‌ను సీఐడీ విచారించడంపై ప్రముఖంగా వార్తలను ప్రసారం చేశాయి. ఓ సంచలనాత్మకమైన కేసులో.. అందులోనూ ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కేసులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత. కానీ, తాము ఎవరిపైన అయినా విషం చిమ్ముతాం.. ఇంకెవరూ తమపై మాత్రం వాస్తవాలను కూడా రాయకూడదనే తీరులో రామోజీరావు ఉండటం విడ్డూరంగా ఉంది. దశాబ్దాలుగా చంద్రబాబుకు కొమ్ము కాసేందుకు నాడు ఎన్టీ రామారావు నుంచి ఇతర ప్రత్యర్థి పార్టీల నేతలపై పెద్ద ఎత్తున దు్రష్పచారం చేసిన రామోజీ నేడు శ్రీరంగ నీతులు చెబుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తమ ఆర్థిక అక్రమాల సామ్రాజ్యమైన ‘మార్గదర్శి’ కుప్పకూలుతుండటంతో సీఐడీ దర్యాప్తును కూడా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నిస్తున్నారనేది స్పష్టమవుతోంది. ‘ఈనాడు’లో అబద్ధపురాతలు షురూ.. విచారణకు ఏమాత్రం సహకరించని రామోజీ కుటుంబం తమ పత్రిక ‘ఈనాడు’లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వార్తలు ప్రచురించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. శైలజా కిరణ్ విచారణకు పూర్తిగా సహకరించారని సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్ తెలిపినట్టుగా ‘ఈనాడు’ తనకలవాటైన రీతిలో అబద్ధపు రాతలు వండి వార్చేసింది. అంతేకాదు.. ఇక శైలజా కిరణ్ విచారణ పూర్తయిపోయిందని.. ఇక ఆమెను విచారించాల్సిన అవసరమే లేదని ఆయన వెల్లడించినట్టు కూడా నిర్ధారించేసింది. -
తప్పుడు కథనాలు రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది: కొడాలి నాని
-
ఇంటర్నెట్ ఎఫెక్ట్!
ఈతరం యువత ఎక్కువగా ఇంటర్నెట్కి అలవాటు కావడం వల్ల సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనే కథతో రూపొందుతున్న సినిమా ‘ఈనాడు’. రామ్, వరుణ్, దివ్య, ప్రియా ముఖ్య తారలుగా నల్లూరి శ్రవణ్ దర్శకత్వంలో పులికొండ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి క్లాప్ ఇవ్వగా, నిర్మాత మద్దినేని రమేశ్ కెమేరా స్విచాన్ చేశారు. తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. ‘‘ఫిబ్రవరి రెండోవారంలో చిత్రీకరణ ప్రారంభించి, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత రామ్. ‘‘కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. ఓ ప్రముఖ హీరోయిన్ చిత్రంలో నటించనున్నారు’’ అని దర్శకుడు తెలిపారు.