సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆ రెండు డెల్టాల్లో అక్కడక్కడ పల్లపు ప్రాంతాల్లో కొంతమేర పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వమే ఆ పంటలను ముంచేసినట్లు చిత్రీకరిస్తూ సీఎం జగన్‌పై రామోజీరావు ఇష్టమొచ్చినట్లు రాసిపారేశారు. డ్రెయిన్లు, కాలువల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంవల్లే డెల్టాల్లో పంటలు ముంపునకు గురైనట్లు చేతికొచ్చింది అచ్చేశారు.
నిజానికి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణాడెల్టా ఆధునీకరణకు వినియోగించాల్సిన రూ.175 కోట్లను కృష్ణా నది కరకట్టపై తాను నివాసం ఉంటున్న అక్రమ నివాసాన్ని సుందరీకరించేందుకు చంద్రబాబు మళ్లించారు. అలాగే, గోదావరి డెల్టా ఆధునీకరణ నిధులనూ గోదావరి పుష్కరాలకు మళ్లించారు. ఆ పనులు చేయకుండానే కాంట్రాక్టర్ల ముసుగేసుకున్న టీడీపీ నేతలకు రూ.150 కోట్లకు పైగా దోచిపెట్టారు.
ఏటా డ్రెయిన్లలో గుర్రపుడెక్క, తట్టెడు పూడిక ఎత్తకుండానే ఎత్తినట్లు చూపి రూ.వందల కోట్లను పచ్చమందకు దోచిపెట్టారు. చంద్రబాబు అవినీతివల్లే కృష్ణా, గోదావరి డెల్టాల్లో డ్రెయిన్లలో పూడిక పేరుకుపోయింది. గత నాలుగున్నరేళ్లుగా కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఆయకట్టు చివరి భూములకు నీళ్లందిస్తూ దన్నుగా నిలుస్తున్న సీఎం జగన్‌కు రైతులు అండగా నిలుస్తుండటాన్ని భరించలేక రామోజీరావు నిద్రపట్టడంలేదు. దీంతో చంద్రబాబు అవినీతిని కప్పెట్టి.. ఆ నెపాన్ని సీఎం జగన్‌పై రుద్దుతూ ‘ప్రభుత్వం ముంచింది’ అంటూ ‘ఈనాడు’లో తప్పుడు కథనాన్ని అచ్చేశారు.
రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు..
సీఎం జగన్ ఆదేశాల మేరకు గత నాలుగున్నరేళ్లుగా గోదావరి, కృష్ణా డెల్టాల్లో రబీ పంటల కోతలు పూర్తికాగానే కాలువలకు మరమ్మతులు చేస్తూ.. డ్రెయిన్లలో గుర్రపుడెక్కను తొలగిస్తూ.. ఆయకట్టు చివరి భూములకు అధికారులు నీళ్లందిస్తున్నారు. గోదావరి డెల్టాతోపాటు కృష్ణాడెల్టా చరిత్రలో గత నాలుగేళ్లుగా రబీ పంటకూ నీళ్లందిస్తున్నారు.
కాలువలు, డ్రెయిన్లను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమృద్ధిగా నీళ్లందిస్తుండటంతో పంటల ఉత్పత్తులు పెరగడం.. గిట్టుబాటు ధరలు దక్కడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. తుపాన్లు, భారీ వర్షాలవల్ల పంటలకు నష్టం వాటిల్లితే.. ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపోయిన రైతులకు సీఎం జగన్ పరిహారం చెల్లిస్తూ దన్నుగా నిలుస్తున్నారు. దీంతో సీఎం జగన్‌కు రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆదరణ పెరుగుతున్నట్లుగానే.. కృష్ణా, గోదావరి డెల్టా రైతుల్లోనూ ఆయనకు నానాటికీ మద్దతు పెరుగుతోంది.
డెల్టాల ఆధునీకరణ నిధులు స్వాహా..
కృష్ణా, గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా పంటలకు సమృద్ధిగా నీళ్లందించి రైతులకు బాసటగా నిలవాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. జలయజ్ఞం కింద గోదావరి, కృష్ణా డెల్టాల ఆధునీకరణ పనులు చేపట్టారు. తన హయాంలో గోదావరి డెల్టా ఆధునీకరణకు రూ.748.58 కోట్లు, కృష్ణాడెల్టా ఆధునీకరణకు రూ.1,093.77 కోట్లు ఖర్చుచేసి కాలువలు, డ్రెయిన్లను అభివృద్ధి చేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బాబు.. డెల్టాల ఆధునీకరణ నిధులను దోచేశారు.
► కృష్ణాడెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.1,239.24 కోట్లు ఖర్చుచేస్తే.. ఇందులో రూ.175 కోట్లను తాను నివాసం ఉంటున్న అక్రమ కట్టడం సుందరీకరణకు మళ్లించారు.
► కాలువలు, డ్రెయిన్ల ఆధునీకరణ పనులు తూతూమంత్రంగా చేపట్టి కాంట్రాక్టర్ల ముసుగులోని టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు దోచేశారు.
► గోదావరి డెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.813.02 కోట్లు ఖర్చుచేసిన చంద్రబాబు.. అందులో చాలావరకు నిధులను గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు మళ్లించేశారు.
►పనులు చేయకుండానే చేసినట్లు చూపి పచ్చమందకు దోచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment