
సాక్షి, అమరావతి: ‘‘ఏపీకి పెట్టుబడులను వెల్లువలా తీసుకురాబోతున్నాం’’ ఈ ఏడాది జనవరిలో దావోస్‌కు వెళ్లడానికి ముందు కూటమి ప్రభుత్వం (Kutami Prabhutvam)చెప్పిన మాట. ‘‘పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాం.. సుమారు 15 కంపెనీల అధిపతులతో సమావేశమయ్యాం..’’ ఇది దావోస్ ఎకనామిక్ ఫోరస్ సదస్సు జరుగుతున్న టైంలో చెప్పిన మాట. ఇప్పుడేమో.. దావోస్ వెళ్లింది ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం కాదంటూ అసెంబ్లీ సాక్షిగా ఇంకో మాట చెప్పేసింది.
కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు, నారా లోకేష్ అండ్ కో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లారనేది తెలిసిందే. అయితే ఆ పర్యటనపై మండలి సాక్షి గా ఏపీ ప్రభుత్వం వింత భాష్యం చెప్పింది. దావోస్ పర్యటనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రవీంద్రబాబు, కవురు శ్రీనివాస్‌లు ప్రశ్న సంధించారు. అయితే తమ ప్రభుత్వం అక్కడికి వెళ్లింది ఎంవోయూలు చేసుకోవడానికి కాదని సమాధానం కూటమి ఇచ్చింది. అది కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమే.. మేం అక్కడికి వెళ్లింది ఎలాంటి పెట్టుబడులు చేసుకోవడానికి కాదు’’ అని సమాధానం విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment