Davos trip
-
విమానంలో లీకేజీ.. ప్రయాణానికి తప్పని తిప్పలు
బోయింగ్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే వాటిలో తరచూ వస్తున్న సాంకేతికలోపాలతో ప్రయాణికులు, సంస్థ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బోయింగ్ విమానం గాల్లోనే ఉండగా డోర్ ఊడిపోయిన ఘటనలు, టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్ అద్దాలు పగలడం చూశాం. ఈ తిప్పలు కేవలం సామాన్యులకే కాదు ఏకంగా అగ్రరాజ్యంలో దౌత్యవేత్తకు తప్పలేదు. తాజాగా అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సదస్సు నుంచి తిరిగివెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ప్రయానిస్తున్న బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌లో లోపాన్ని గుర్తించారు. అందులో ఆక్సిజన్ లీకేజీ అవుతున్నట్లు సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే ఆ సమాచారాన్ని ఆంటోనీకి చేరవేశారు. చాలా సమయం వరకు సిబ్బంది సమస్యను పరిష్కరించకపోవడంతో తన అమెరికా ప్రయాణం ఆలస్యమైనట్టు మీడియా కథనాలు తెలిపాయి. అయితే గతంలో ఈ విమానంలో ఇదే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే.. సెప్టెంబరులో జస్టిన్ ట్రూడోకు ఇలాంటి సంఘటన ఎదురైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో మెకానికల్ లోపం కారణంగా జీ20 శిఖరాగ్ర సమావేశం తర్వాత భారతదేశంలోని న్యూదిల్లీలో చిక్కుకున్నారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు గతంలోనే తెలిపింది. -
రూ.37,870 కోట్ల పెట్టుబడితో 6 కంపెనీలు సిద్ధం!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌తో గౌతమ్ అదానీ సమావేశమైన అనంతరం ఏరోస్పేస్, డిఫెన్స్ సీఈవో ఆశిష్‌రాజ్ వంశీ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గౌతం అదానీ ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని అదానీ తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంగల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్ అండ్ డీతోపాటు గిగా సేల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి సమావేశమయ్యారు. తెలంగాణలో రూ.5,200 కోట్లతో డాటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌వర్క్స్ ముందుకొచ్చింది. డాటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్‌వర్స్. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్‌వర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీ సీఎంతో సమావేశమై తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్ రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.1,000 కోట్లతో కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే.. రాష్ట్ర పెట్టుబడి ఒప్పందాలు (రూ.కోట్లలో) అదానీ గ్రూప్ : రూ.12,400 కోట్లు ఆరాజెన్ : రూ.2,000 కోట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ : రూ.9,000 కోట్లు గోడి ఇండియా : రూ.8,000 కోట్లు వెబ్ వర్స్ : రూ.5,200 కోట్లు గోద్రెజ్ : రూ.1,270 కోట్లు -
దావోస్‌కు వెళ్లకపోవటమూ తప్పేనా?
సాక్షి, అమరావతి: దావోస్‌లో ఈ నెల 16న మొదలై... 20వ తేదీ వరకు జరగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023–వార్షిక సదస్సు’లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం పార్టీ, దాని మిత్ర మీడియా చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఎందుకంటే ఈ సమ్మిట్‌లో పాల్గొనాలంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్టే బ్రెండే స్వయంగా పంపిన లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. పైపెచ్చు ఈ లేఖ సీఎం వైఎస్ జగన్ కార్యాలయానికి గత ఏడాది నవంబర్ 25నే అందింది. అయితే 6 నెలల కిందటే దావోస్ సదస్సుకు హాజరై ఉండటం... మరోవైపు నెలన్నర రోజుల్లో (మార్చి మొదటి వారంలో) విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుపై ఫోకస్ పెట్టడం వంటి కారణాల వల్ల ఈసారి దావోస్ సదస్సుకు హాజరు కాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏపీకి దావోస్ సదస్సుకు ఆహ్వానం రాలేదంటూ టీడీపీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం ఈ వాస్తవాలు సామాన్యులకు తెలియవనే ఉద్దేశంతో... గడిచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దావోస్‌కు పిలవకపోవటం ఇదే తొలిసారంటూ తెలుగుదేశం భారీ ఎత్తున దుష్ప్రచారానికి దిగింది. కాకపోతే ఇవేమీ... ‘ఈనాడు’ ఇతర ఎల్లో మీడియా చెప్పకపోతే జనానికి వాస్తవాలు తెలియని రోజులు కావు. అందుకే ఎల్లో ముఠా దుష్ప్రచారం ఆరంభమైన వెంటనే... దానికి ప్రతిస్పందనలు కూడా మొదలయ్యాయి. దావోస్‌లో సదస్సుకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్‌కు వరల్డ్ ఎకానమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్టే బ్రెండే పంపిన లేఖ నిజానికి ఒకవేళ జగన్మోహన్రెడ్డి ఈసారి సదస్సుకు హాజరై ఉంటే... ‘మొన్ననే 6 నెలల కిందటే కదా దావోస్‌కు వెళ్లింది. మళ్లీ ఇంతలోనే ఏం పెట్టుబడులు తెచ్చేస్తారు?’ అనే రీతిలో కూడా తెలుగుదేశం, ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలెట్టేసేవంటూ ప్రజలు నవ్వుకోవటం విశేషం. -
AP: 2022లో పారిశ్రామిక ప్రగతిలో కీలక ఘటనలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికరంగ ప్రగతి 2022 సంవత్సరంలో ఊపందుకుంది. ముఖ్యంగా మే 22 నుంచి 26వ తేదీ వరకు సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటన రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. టాటా, బిర్లా, ఐటీసీ, నాల్కో, ఎన్టీపీసీ, మిథాని, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాయి. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ఏడాది నాలుగుసార్లు సమావేశమై రూ.1,66,919.71 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఇందులో రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ రూ.43,143 కోట్లతో సోలార్ ప్యానల్స్ తయారీ, కాకినాడ సెజ్‌లో రూ.1,900 కోట్లతో లైఫిజ్ ఫార్మా యూనిట్, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో రూ.386.23 కోట్లతో కాసిస్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్, రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ, రూ.560 కోట్లతో నెల్లూరులో క్రిభ్కో బయో ఇథనాల్, రాష్ట్రంలో వివిధ చోట్ల అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ వంటివి ఉన్నాయి. మే నెలలో సీఎం జగన్ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటన సందర్భంగా గ్రీన్ ఎనర్జీలో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. దీంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం ప్రపంచదృష్టిని ఆకర్షించింది. అలాగే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.2,700 కోట్లతో ఏర్పాటు చేసిన క్లోర్ ఆల్కాలిక్ (కాస్టిక్ సోడా) తయారీ యూనిట్‌ను కుమారమంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి ఏప్రిల్ 21న ప్రారంభించారు. జనవరి 12న గుంటూరులో ఐటీసీ వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్, నవంబర్ 11న ఐటీసీకి చెందిన స్పైసెస్ పార్కును సీఎం ప్రారంభించారు. జూన్ 23న తిరుపతిలో టీసీఎల్, ఫాక్స్‌లింక్, సన్నీఆప్టెక్, డిక్సన్ వంటి కంపెనీలను సీఎం ప్రారంభించడం ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించారు. ఆగస్టు 16న జపాన్ టైర్ల దిగ్గజ సంస్థ యకహోమా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.2,200 కోట్లతో ఏర్పాటు చేసిన హాఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన సులభరత వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడో ఏడాది మొదటిస్థానంలో నిలిచింది. విషాద సంఘటన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దుబాయ్ పర్యటనలో రూ.5,100 కోట్ల విలువైన పెట్టుబడులు కుదుర్చుకు వచ్చిన కొద్దిరోజులకే ఫిబ్రవరి 21న హఠాన్మరణం పొందడం రాష్ట్ర పారిశ్రామికరంగాన్ని కుదిపేసింది. అనంతరం మంత్రివర్గ విస్తరణలో పరిశ్రమలశాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. -
దావోస్ పర్యటనలో ఐదో రోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించిన సీఎం జగన్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ కంపెనీల సీఈవోలు, ఫౌండర్లు, ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా విశాఖ, మచిలీపట్నాలకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగారు. ముఖ్యంగా ఐటీ, విద్య, భూరికార్డుల సర్వే, డీకార్బనైజ్డ్ సెక్టార్లో ఇన్వెస్టర్లను ఆకర్షించ గలిగారు. కాగా 2022 మే 26న సీఎం జగన్ దావోస్‌లో ఉన్న షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ట్రైనింగ్ సెంటర్ అంతా కలియదిరుగుతూ అక్కడ శిక్షణ జరుగుతున్న తీరును షిండ్లర్ ప్రతినిధులు సీఎం జగన్‌కు వివరించారు. చదవండి: CM YS Jagan Davos Tour: ‘యూనికార్న్’ విశాఖ -
ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్’ - డబ్ల్యూఈఎఫ్ సదస్సులో వైఎస్ జగన్
CM YS Jagan Davos Tour: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు (సోమవారం) ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై మాట్లాడారు. డబ్ల్యూఈఎఫ్ పబ్లిక్ సెషన్లో పాల్గొన్న ఆయన ఏపీలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలతో పాటు రాష్ట్రంలో వైద్య వ్యవస్థలు ఎలా బలోపేతం చేస్తున్నది వివరించారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం తీరు తెన్నులను వెల్లడించారు. కోవిడ్ నియంత్రణ ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్ నియంత్రణ కార్యాచరణ అమలు చేశాం. 44 ఇళ్లు ఒక యూనిట్‌గా ఇంటింటికి సర్వే చేపట్టాం. ఇందు కోసం ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్ వంతున పని చేశారు. 42 వేల మంది ఆశావర్కర్లు ఇందులో పాలు పంచుకున్నారు. ఇంటింటికి వెళ్లి కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని గుర్తించాం. ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మెడిసిన్స్ అందించాం. రోగులు అవసరమైన పౌష్టిక ఆహారం అందిస్తూ పకడ్బందీ ప్రణాళిక అమలు చేశాం. అందువల్లే కరోనా మరణాల రేటు ఏపీలో జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువగా దేశంలోనే అత్యల్పంగా 0.6 శాతంగా నమోదు అయ్యింది. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత ఏవైనా రోగాలు వస్తే వాటికి సరైన సమయంలో వైద్యం అందివ్వడమనేది మరో కీలకమైన అంశం. ఈ రెండు అంశాలను సెంట్రిక్‌గా చేసుకుని ఏపీలో హెల్త్‌కేర్ సిస్టమ్‌ని రెడీ చేశాం. రాష్ట్రంలో రెండు వేల జనాభా కల్గిన ఒక గ్రామంలో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. వీటిపైన ప్రతీ 13 వేల జనాభా మండలం యూనిట్‌గా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాము. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు డాక్టర్లు ఉంటారు. అంటే ప్రతీ పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఈ పీహెచ్‌సీలకు అనుబంధంగా 104 అంబులెన్సులు ఉంటాయి. పీహెచ్సీలో ఉన్న డాక్టర్లకు కొన్ని గ్రామాల బాధ్యతలను అప్పగించాం. రోజు విడిచి రోజు ఈ డాక్టర్లు అంబులెన్సుల ద్వారా గ్రామాలకు వెళ్తారు. అక్కడి ప్రజలతో మాట్లాడుతారు... వీరంతా ఆ గ్రామంలోని ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా మారుతారు. పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యంతోపాటు ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డాక్టర్లకు తెలుస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏదైనా సమస్యలు వచ్చినా మొగ్గ దశలోనే దానికి చికిత్స అందించే వీలు ఉంటుంది. వైద్య వ్యవస్థ బలోపేతం మండల స్థాయి దాటి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ హాస్పటిల్స్ చికిత్స అందిస్తాయి. ప్రతీ పార్లమెంటు యూనిట్‌గా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాలేజీలకు అనుబంధంగా టీచింగ్ కాలేజీలు వస్తాయి. అక్కడ పీజీ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్లంతా హెల్త్‌కేర్‌లో భాగమవుతారు. దీని ద్వారా హెల్త్‌కేర్ సిస్టమ్ బలోపేతం అవుతుంది. మూడేళ్లలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. మా ప్రభుత్వం రావడానికి ముందు 11 మెడికల్ కాలేజీలు ఉంటే కొత్తగా 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాం. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్‌గా మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల అన్ని చోట్ల హెచ్చుతగ్గులు లేకుండా వైద్యవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇందు కోసం ఇప్పటికే రెండు బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించాం. మూడేళ్లలో ఫలితాలు అందుతాయి. ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్ నియంత్రణ కార్యాచరణ అమలు చేశామని సీఎం జగన్ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఇన్సురెన్స్ కమ్యూనిటీ హెల్త్ ఇన్సురెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పథకం అమలు చేస్తోంది. ఇందులో వెయ్యికి పైగా అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. కానీ అంతకంటే మిన్నంగా ఏపీలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నాం. ఇందులో ఏకంగా 2,446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందిస్తున్నాం. ఐదు లక్షల కంటే తక్కువ వార్షియ ఆదాయం కలిగిన 1.44 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా సేవలు పొందుతున్నారు. గత మూడేళ్లలో 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా ఉచితంగా వైద్య సాయం అందించామని సీఎం జగన్ వెల్లడించారు. -
తొలిరోజు దావోస్‌లో బిజీబిజీగా సీఎం జగన్
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలువురు ప్రముఖులతో వరుస సమావేశాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాలుష్యం లేని ఇంధనాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సీఎం వివరించారు. దీనిలో భాగంగా విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురు ప్రశంసలు కురిపించారు. పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయని ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియాల తయారీపై చర్చలు జరిపారు. 1. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సెంటర్లో ఆయనతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయన్న ప్రొఫెసర్ క్లాజ్.. ధాన్యాగారంగా పేరొందిన ఏపీని ఫుడ్ హబ్‌గా మారేందుకు అన్నిరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహర కొరత ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రొఫెసర్ ష్వాప్ ఆహ్వానించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశంపై చర్చించారు. అందుకు అనువైన సదుపాయాలనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక ప్రగతి వైపుగా అడుగులేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తతరం పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను తయారీ, నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కోవిడ్ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలోపెట్టడం లాంటి అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడమే కాకుండా, పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాలపైనా సీఎం మాట్లాడారు. సోషల్ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్ వేదిక ద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని సీఎం ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాలను సీఎం డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడికి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్యరంగాల్లో పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నామని ఈ సమావేశంలో సీఎం జగన్ వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతీ ఇంటికీ, వారి గడపవద్దకే సేవలను అందిస్తున్నామని తెలిపారు. 2. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆరోగ్యం– వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తోనూ కాంగ్రెస్ సెంటర్లో సీఎం సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపైన ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతీ 2వేల జనాభాకు వైఎస్సార్ క్లినిక్స్, గ్రామ–వార్డు సచివాలయాల ఏర్పాటుద్వారా పాలనా వికేంద్రీకరణ, తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాసుపత్రులు, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యం కావాలని సీఎం విజ్ఞప్తిచేశారు. 3. ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకున్నారు. పెవిలియన్‌లో జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు. 4. డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తో ఏపీ పెవిలియన్‌లో సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్ ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపికచేశారు. ఈనేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యత ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై ఇరువురి మధ్య నిశితంగా చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇంధన రంగంపైనా విస్తృతంగా చర్చ జరిగింది. కాలుష్యంలేని రవాణావ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కిచెప్పారు. లేకపోతే నీటివనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో పంప్డ్‌స్టోరేజీ కాన్సెప్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని సీఎం వివరించారు. విండ్, సోలార్, హైడల్.. ఈమూడింటిని కూడా సమీకృత పరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టామని, భవిష్యత్తు సవాళ్లకు ఇదొక చక్కని పరిష్కారం కాగలదని సీఎం వివరించారు. ఇలా వచ్చే కరెంటును రవాణా వ్యవస్థలకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాన్ని అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది. 5. తదుపరి సీఎం జగన్... బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను సీఎం జగన్ వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్ డెస్క్ విధానంద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ప్రపంచంలో తూర్పుభాగానికి గేట్వేగా రాష్ట్రం మారేందుకు అన్నిరకాల అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. దీనికోసం కొత్తగా 3 పోర్టుల నిర్మాణాన్నికూడా ప్రారంభించామన్నారు. విద్య, వైద్యరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ ప్రశంసించారు. నైపుణ్యమానవవనరులు తయారుచేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 6. మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ పెవిలియన్ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్ ఏర్పాటు చేసింది. 7. తర్వాత సీఎం జగన్.. అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
లండన్‌లో సీఎం జగన్ ల్యాండింగ్‌పై మంత్రి బుగ్గన క్లారిటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారిందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందన్నారు. కనీస విలువలను పాటించాలన్న స్పృహకోల్పోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయని, వయసు మీద పడుతున్న కొద్దీ.. యనమల కనీస సంస్కారం కూడా లేకుండా రోజురోజుకూడా దిగజారిపోతున్నారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు ‘గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం, దీనిమీద పనిగట్టుకుని సీఎం జగన్ మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేయడం యనమల లాంటి వారు, ఎల్లోమీడియా ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం అవుతుంది. దాపరికంతో, దొంగదారుల్లో అధికారం సాధించడం, ప్రజలను వంచించడం అన్నది టీడీపీ ట్రేడ్ మార్క్ తప్ప మాది కాదు. సీఎం వైఎస్ జగన్ పర్యటన రహస్యమేమీ కాదు. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. ఎయిర్‌ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగింది. దీనివల్ల లండన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. చదవండి: దావోస్ చేరుకున్న సీఎం జగన్ లండన్‌లో కూడా ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఈలోగా జురెక్‌లో ల్యాండ్ అవడానికి ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది. మళ్లీ ల్యాండింగ్‌కోసం అధికారులు రిక్వెస్ట్‌పెట్టారు. ఈప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారు. రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాలు ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాల నుంచి నిషేధించిన విషయాన్ని స్విస్ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారు. ఈ విషయాలన్నీకూడా స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు, లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారు. వారు నేరుగా ముఖ్యమంత్రితో కూడిన అధికారులతో చర్చించి.. లండన్‌లోనే వైఎస్ జగన్‌కు బస ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామునే జురెక్ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు నిన్న అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది. నిజాలు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రిమీద అసూయతో, ద్వేషంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా ప్రతిరోజూ ఆయన మీద బురదజల్లడం, ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. దిగజారిపోవడంలో మరో మైలు రాయిని టీడీపీ అందుకుంది’ అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. చదవండి: Anantapur: చంద్రబాబు సభలో ‘పరిటాల’ అనుచరులు రచ్చరచ్చ.. -
CM Jagan Davos Tour: దావోస్‌కు పయనమైన సీఎం వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. నేటి రాత్రికి (శుక్రవారం) దావోస్ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, అధికారులు బృందం పాల్గొనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌లో సీఎం జగన్ పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా.. ఈ సందర్భంగా.. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా నాలుగో పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు. అటు.. బెంగళూరు-హైదరాబాద్, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా సీఎం నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు చేసే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామం కానుంది. కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో సీఎం బృందం వివరించనుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్ కనెక్టివిటీ, రియల్ టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. దావోస్ సదస్సులో వివరించే అంశాలతో ఏపీ పెవిలియన్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పీపుల్-ప్రోగ్రెస్-పాజిబిలిటీస్ నినాదంతో ఈ పెవిలియన్ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ సమ్మిట్ గత డిసెంబర్లో జరగాల్సి ఉంది. కరోనా కేసులు పెరగడంతో సమ్మిట్‌ను వాయిదా వేశారు. చదవండి: ‘స్వతంత్ర’ న్యూస్ చానల్ స్టూడియోలు ప్రారంభం -
దావోస్ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో సీఎం జగన్ పాల్గొననున్నారు. రెండేళ్ల కోవిడ్ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం కానుంది. మే 22నుంచి 26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొనున్నారు. కోవిడ్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా వినిపించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారం కోసం ఈవేదిక ద్వారా ఏపీ భాగస్వామ్యం కానుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం (ఇండస్ట్రియలైజేషన్ 4.0)దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్ వేదికగా సీఎం జగన్ కీలక చర్చలు కూడా జరపనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలనుకూడా ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇది కూడా చదవండి: ఏపీలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం -
DAVOS 2022: దావోస్ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. వారం రోజుల పాటు పర్యటిస్తారు. అంతేకాదు అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు. -
ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సమావేశాలు ముగియడంతో శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, వివిధ దేశాల మంత్రులను కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంగా వారితో చర్చలు జరిపారు. నాలుగు రోజుల్లో 50కి పైగా ముఖాముఖి సమావేశాలతో పాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చా గోష్ఠిల్లో పాల్గొన్నారు. ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోకోకోల సీఈఓ జేమ్స్ క్వేన్సీ, సేల్స్‌ఫోర్స్ చైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కికి వంటి కార్పొరేట్ దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక పాలసీ, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వనరులను పరిచయం చేశారు. సరళీకృత వ్యాపార ర్యాంకుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. గత ఐదేళ్లుగా నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును, ఇక్కడి విశ్వనగర సంస్కృతి, అత్యుత్తమ జీవన ప్రమాణాలను వివరించారు. ఈ సదస్సుల్లో భాగంగా నిర్వహించిన చర్చల సందర్భంగా పిరమల్ గ్రూపు రూ.500 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలోని తమ ఔషధ పరిశ్రమను విస్తరించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు దావోస్‌లో ప్రభుత్వం తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఈ సదస్సులో పాల్గొన్నప్పటికీ, రాష్ట్రానికి మాత్రమే పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
బాబు దావోస్ పర్యటన రద్దు వెనుక అసలు రహస్యం
-
దావోస్‌లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్
-
దావోస్‌లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్
దావోస్ : పెట్టుబడులను పెద్దఎత్తున తెలంగాణకి రప్పించేందుకు దావోస్ వెళ్లిన రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడ బిజిబిజీగా వున్నారు. రెండు రోజుల మంత్రి పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఫెర్నాండెస్‌తో పాటు, ఇండోరామ, మిత్సుబిషి, కేకేఆర్, కల్యాణి గ్రూప్, నోవార్టిస్, డెలాయిట్ వంటి కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో నోవార్టిస్ కార్యకలాపాల విస్తరణకు ఆ కంపెనీ అంగీకారం తెలిపింది. నోవార్టిస్.. ల్యాబోరేటరీ వ్యవస్థను, సిబ్బందిని రెట్టింపు చేయనుంది. కంపెనీ విస్తరణతో జీనోమ్ వ్యాలీ అభివృద్ది చెందుతుందని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో టెక్ సెంటర్ ఏర్పాటుచేసేందుకు, ఇతర పెట్టుబడుల గురించి కేటీఆర్, దుబాయ్ పెట్టుబడుల కార్పొరేషన్ సీఈవో మహమ్మద్ ఏఐ షాబానితో కూడా చర్చించారు. హెచ్‌పీ కంపెనీ మేనేజ్మెంట్ను కూడా హైదరాబాద్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. టీహబ్‌తో సహకారం ఏర్పరుచుకునేందుకు అన్వేషించాలని, హెచ్‌పీ తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించాలని కోరారు. జపనీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్క్ ఏర్పాటు చేయాలని కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
దావోస్‌లో 25 ద్వైపాక్షిక సమావేశాలు
సాక్షి, అమరావతి: ప్రపంచ ఆర్థిక వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన తాత్కాలిక సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దావోస్ పర్యటనలో ఈసారి బాబు 25 ద్వైపాక్షిక సమావేశాలతో పాటు ఐదు సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గాను మూడు ఒప్పందాలపై సంతకాలు చేస్తారన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా ప్రారంభ ప్లీనరీలో పాల్గొంటారని వివరించారు. రెండో రోజు ఏపీ లాంజ్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, అదేరోజు మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ సంస్థల సీఈవోతో సమావేశమవుతారని తెలిపారు. సీఐఐ రౌండ్‌టేబుల్ సమావేశంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారని చెప్పారు. ఈనెల 25 వరకు ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పారు. సీఎం వెంట తనతో పాటు మంత్రులు యనమల, లోకేశ్, వ్యవసాయ సలహాదారుడు విజయకుమార్, ఈడీబీ సీఈవో జె.కృష్ణ్ణకిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్ తదితరులుంటారని తెలిపారు. -
స్టాల్ పెట్టు.. ప్రచారం కొట్టు
♦ చంద్రబాబు దావోస్ పర్యటనల ఆంతర్యమిదే ♦ కీలక ఉపన్యాసకుల్లో సీఏం పేరే లేదు ♦ టికెట్ కొనుక్కొని హాజరై,ప్రత్యేక ఆహ్వానమంటూ అబద్ధాలు ♦ ఈవెంట్ మేనేజ్మెంట్కు రూ.7.52 కోట్లు చెల్లింపు ♦ సదస్సులో లాంజ్ ఏర్పాటుకు మరికొంత ఖర్చు ♦ ప్రత్యేక విమానం, తదితర ఖర్చులు అదనం ♦ చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ ఇదే తంతు ♦ సర్కారు సొమ్ముతో తననో ఆర్థిక మేధావిగా చూపించుకునే యత్నం సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ యాత్రల లోగుట్టు బట్టబయలైంది. ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో పాల్గొనేందుకు తనకు ప్రత్యేక ఆహ్వానం వచ్చిందంటూ ఆయన ఘనంగా చెప్పుకోగా... అలాంటి ఆహ్వానం లేనేలేదని, రూ.కోట్ల ఫీజు చెల్లించి వెళ్లారని వెల్లడైంది. ముఖ్యమంత్రి పలు అంశాలపై ఉపన్యసించారని సీఎం కార్యాలయం రోజుకో పత్రికా ప్రకటన విడుదల చేయగా... కీలక ఉపన్యాసకుల జాబితాలో చంద్రబాబు పేరెక్కడా కానరాలేదు. పలు సంస్థల అధిపతులతో చర్చలు జరిపినట్లు రోజూ పత్రికల్లో ప్రముఖంగా ఫొటోలు కనిపించగా... ఒక్క ఒప్పందమూ కుదిరిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చంద్రబాబు దావోస్ పర్యటనలన్నీ తననో ఆర్థిక మేధావిగా చూపించుకునేందుకు అబద్ధాలు, అభూత కల్పనలతో సాగిన కట్టుకథలేనని స్పష్టమవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ క్రమం తప్పకుండా చేస్తున్న ఈ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ లేకపోగా ఖజానాపై మాత్రం రూ.కోట్ల భారం తప్పడంలేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రత్యేక ఆహ్వానం పెద్ద అబద్ధం స్విట్జర్లాండ్‌లోని పర్యాటక కేంద్రమైన దావోస్‌లో ప్రతీ ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో పలు అంశాలపై చర్చలు, ఉపన్యాసాలు సాగుతాయి. ఇందులో ప్రపంచంలోని 100కు పైగా దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారు. బడా బడా కార్పొరేట్ సంస్థల సీఈఓలు, ప్రతినిధులు, జీ20 తదితర కీలక దేశాల ప్రభుత్వాధినేతలు, ముఖ్యమైన రాజకీయ నాయకులు, సాంకేతిక రంగ ప్రముఖులు, సామాజిక వేత్తలు, సామాజిక సంస్థలు, మీడియా సంస్థల ప్రతినిధులు వీరిలో ఉంటారు. ప్రభుత్వాధినేతలు, మత పెద్దలు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సభ్యులు, వార్తా చానళ్ల ప్రతినిధులు వంటి కొందరు ఆహ్వానితులకు తెల్ల బ్యాడ్జీలు ఇస్తారు. వారికి ప్రవేశం ఉచితం. వాణిజ్యపరంగా హాజరయ్యేవారు మాత్రం రూ.14 లక్షలు పెట్టి ప్రవేశ టికెట్ ‘కొనుగోలు’ చేయాల్సిందే. ఇప్పుడు దావోస్‌లో జరుగుతున్న 47వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రత్యేకంగా తనకు ఆహ్వానం వచ్చిందని చంద్రబాబు చెప్పగా... ఆర్థిక సదస్సు కీలక ఉపన్యాసకుల్లో ఆయన పేరే లేదు. దీంతో ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనని, ఆయన టికెట్ కొనుక్కునే వెళ్లారని స్పష్టమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1995లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం నుంచి ప్రతీ ఏడాది ఇలా టికెట్ కొనుక్కునే వెళ్లారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం 2015, 2016 జనవరిలోనూ చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లారు. 2015 సదస్సులో చంద్రబాబును చూసి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భావోద్వేగానికి గురయ్యారని పచ్చ పత్రికలు వార్తలు ప్రచురించాయి. కానీ ఆ ఏడాది ఉపన్యాసకుల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేరే తప్ప చంద్రబాబు పేరు కానరాలేదు. చంద్రబాబు ఎప్పుడు దావోస్ వెళ్లినా యూరోపియన్ దేశాలనుంచి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నారని ఊదరగొట్టడమే తప్ప వాస్తవరూపం దాల్చలేదు. 2015, 2016 పర్యటనల్లోనూ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు కొత్తగా విశాఖపట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తాయని చెప్పారు. కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితమ య్యాయి. తాజాగా ఈ ఏడాది దావోస్ పర్యటనకు ఈవెంట్ మేనేజ్మెంట్ పేరుతో ఏకంగా రూ.7.52 కోట్లు వ్యయం చేశారు. అంతేకాకుండా ఈ సదస్సులో ఏపీ లాంజ్ ఏర్పాటునకు స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసుకుంది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేవలం ఒక సదస్సులో పాల్గొన్నామని ప్రచారం చేసుకునేందుకు ఇన్ని రూ.కోట్ల వ్యయం చేయడంపై అధికారులే విస్తుపోతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం దావోస్ సదస్సులోఈవెంట్ మేనేజ్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)కు అప్పగించింది. దావోస్ సదస్సు జరిగే ప్రాంతంలో ఇండియా లాంజ్‌కు సమీపంలో ఏపీ లాంజ్‌ను రిజర్వ్ చేయడానికి 6.39 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని సీఐఐ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా సీఐఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ఏడాది మార్చి 31వ తేదీనే కోరింది. సీఐఐ అంచనా నివేదికను పరిశీలించిన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో అడ్వాన్స్‌గా 50 శాతం అంటే 3.20 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా పరిశ్రమల శాఖకు సూచించారు. దీంతో పరిశ్రమల ప్రోత్సాహకం (ప్రకటనలు, సేల్స్, ప్రచారం) కింద 3.20 కోట్ల రూపాయలను సీఐఐకి చెల్లిస్తూ గత ఏడాది మే 25వ తేదీన జీవో–160ను పరిశ్రమల శాఖ కార్యదర్శి అరోఖ్యరాజ్ జారీ చేశారు. ఆర్థిక సదస్సులో వక్తగా పాల్గొనాలంటే ముందరే టికెట్ బుక్ చేసుకోవాలి కాబట్టే అంత ముందుగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. తొలుత అంచనా వేసిన మేరకు మరో 3.19 కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉంది. అయితే దావోస్‌లో వాచ్హస్ హోటల్లో బస చేసినందుకు అదనంగా రూ.1,13,57,500 వ్యయం అయినట్లు సీఐఐ పేర్కొంది. ఈ మొత్తాన్ని కూడా కలిపి చెల్లించాల్సిందిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో పరిశ్రమల శాఖకు సూచించారు. దీంతో మిగతా రూ.4,32,57,500 సీఐఐకి విడుదల చేస్తూ పరిశ్రమల శాఖ అక్టోబర్ 29వ తేదీన మరో జీవోను జారీ చేసింది. దీంతోపాటు ముఖ్యమంత్రి నేతృత్వంలో వెళ్లిన బృందానికి మరో కోటి రూపాయలు ఖర్చయింది. ఆర్థిక సదస్సునుంచి ప్రత్యేక ఆహ్వానం రాకపోయినా వచ్చిందంటూ అబద్ధాలు చెప్పి నాలుగు రోజుల పాటు సదస్సు బయట ఒక హోటల్లో ఉపన్యాసాలు ఇచ్చేందుకు రూ. 7.52 కోట్ల వ్యయం చేయడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది. దావోస్ సదస్సులో పాల్గొనడమే అంతర్జాతీయ కీర్తిలా చెబుతున్న ముఖ్యమంత్రి మాటలకు ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్లు, గత రెండేళ్లుగా వెళ్లుతున్నా ఏదైనా ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్టణంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ఈవెంట్ మేనేజ్మెంట్కు కూడా కోట్ల రూపాయలు వ్యయం చేశారని, తీరా ఆ సదస్సుల వల్ల రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం కనిపించకపోయినప్పటికీ ప్రభుత్వ పెద్దలకు ప్రచారం మాత్రం వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ పర్యటనల పేరుతో పలు ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనలు జారీ చేసిన ప్రభుత్వం ఆ ఒప్పందాల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయో కూడా ప్రకటిస్తే మంచిదని అధికార వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం. ఒక ప్రవేశ టికెట్ ఖర్చు రూ.50 లక్షలు! దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వాణిజ్యపరంగా హాజరయ్యేవారు రూ.14 లక్షలు పెట్టి ప్రవేశ టికెట్ ‘కొనుగోలు’ చేయాల్సిందే. కానీ ఆ టికెట్ కొనాలంటే ముందుగా ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సభ్యత్వం ఉండాలి. ఆ సభ్యత్వం కోసం సుమారు రూ. 36 లక్షలు కట్టాలి. అంటే.. మొత్తం రూ. 50 లక్షలు ఖర్చు పెడితే ఒక వ్యక్తి దావోస్ సదస్సుకు హాజరయ్యే అర్హత సాధిస్తారు. ► సదస్సులో కీలకమైన ప్రయివేటు పారిశ్రామిక సమావేశాలకు హాజరవ్వా లంటే.. ‘ఇండస్ట్రీ అసోసియేట్’ హోదా పొందాలి. అందుకోసం ఏడాదికి రూ.కోటి ఫీజు కట్టాలి. ► సదస్సుకు ఒక వ్యక్తి కాకుండా అదనంగా మరో వ్యక్తి హాజరవ్వాలంటే.. ‘ఇండస్ట్రీ పార్టనర్’ సభ్యత్వం ఉండాలి. అందుకోసం దాదాపు రూ.రెండు కోట్ల వార్షిక ఫీజు చెల్లించాలి. ► ఇద్దరికన్నా ఎక్కువ.. గరిష్టంగా ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరవ్వాలంటే.. ‘వ్యూహాత్మక భాగస్వామి’ సభ్యత్వం పొందాలి. అందుకు దాదాపు రూ. 4 కోట్లు వార్షిక ఫీజు చెల్లించాలి. ఐదుగురు సభ్యుల బృందంలో కనీసం ఒక మహిళా ప్రతినిధి అయినా ఉండాలి. అంటే.. ఐదుగురు సభ్యుల బృందం ఈ సదస్సుకు హాజరవ్వా లంటే దాదాపు రూ.4.50 కోట్లు వ్యయం అవుతుంది. ► ఇక ‘వ్యూహాత్మక భాగస్వామి’ సభ్యత్వం కావాలంటే.. ప్రపంచంలోని 250 అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉండటంతో పాటు.. ఆ కంపెనీ చైనా లేదా ఇండియాలో ఉండాలి. ఈ సదస్సులో ఒక పార్టీ ఇవ్వాలంటే ఒక్కో అతిథి కోసం కనీసం రూ. 15,000 చొప్పున ఖర్చు చేయాలి. ఇక సదస్సుకు హాజరవ్వాలంటే.. దావోస్ ప్రయాణానికి, అక్కడ బస చేయడానికి ఒక్కో ప్రతినిధికి కనీసం రూ. 30 లక్షలు ఖర్చవుతుంది. ఇక చంద్రబాబు బృందం ప్రత్యేక విమానం, తదితర ఖర్చులు మరింత అదనమే. -
రాజకీయాల్లో రాణించాలి
జ్యూరిచ్‌లో తెలుగువారి సమావేశంలో ప్రవాసాంధ్రులకు చంద్రబాబు పిలుపు ముగిసిన దావోస్ పర్యటన సాక్షి, అమరావతి: ప్రవాసాంధ్రులు స్థానిక రాజకీయాల్లో పాలు పంచుకునే స్థాయికి ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మూడు రోజులపాటు దావోస్ సదస్సులో వివిధ సంస్థలతో సమావేశాల్లో పాల్గొన్న బాబు బృందం శనివారం స్విడ్జర్లాండ్లోని జ్యూరిచ్ చేరుకుంది. జ్యూరిచ్‌లో ఏపీ ఎన్ఆర్టీ (ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు) ఆధ్వర్యంలో జరిగిన యూరోపియన్ తెలుగు యూనియన్ సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎక్కడ ఉన్నా రాజకీయ స్పృహ ఉండాలని, ప్రపంచ పరిణామాలు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రవాసాంధ్రులం తా కలసికట్టుగా ఉండాలన్నారు. ఇండియాలో ఏ ముగ్గురు కలిసినా మూడురకాల మనస్తత్వాలతో ఉంటారని, బృంద మనస్తత్వం అలవాటు కావాలన్నారు. భిన్న పార్టీల్లో ఉన్నా అందరినీ ఒకే ప్లాట్‌ఫామ్ మీదికి తీసుకువస్తానన్నారు. కెనడాలో భారతీయ మూలాలున్న ముగ్గురు మంత్రులుగా ఉన్నారని తెలిపారు. ఏపీ ఎన్ఆర్టీ కింద అందరూ ఒకే గొడుగు కిందకు రావాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకోవాల కోరారు. అనంతరం యూరోపియన్ దేశాలకు చెందిన ఏపీ ఎన్ఆర్టీ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత ఢిల్లీ బయలుదేరారు. శనివారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి విజయవాడ రానున్నారు. ఆయన వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో జాస్తి కృష్ణకిశోర్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులున్నారు.