
అమరావతి, సాక్షి: శాసనమండలిలో ఇవాళ మరోసారి మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ(Botsa Satyanaraya) మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి లోకేష్ ఆరోపించగా.. బొత్స ఆ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
‘‘ఏపీలో 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారనడం(Drop Outs) సరికాదు. మంత్రి నారాలోకేష్(Nara Lokesh)కు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భమూ లేదు.
.. సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదు. కావాలంటే మండలి సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టండి. 2014-19 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి...2019-24 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దాం. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం(English Medium) కూడా ప్రోత్సహించాలన్నదే మా విధానం.
.. ప్రాధమిక విద్యనుంచి టోఫెల్ విద్యను నేర్పించడం. ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం. సెంట్రల్ సిలబస్ (సిబిఎస్) ను ప్రవేశపెట్టడం లాంటివి చేశాం. మొన్న 80% మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారు. కిందిస్థాయి నుంచి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను అందుబాటులోకి తెచ్చాం. రేపు ఈ సబ్జెక్ట్ మీద చర్చించాలని మేం కోరాం. ఈ రోజు ఉద్యోగుల సమస్యల పై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. నేను తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి నా మాటలను తొలగించండి. మేం క్షమాపణ చెప్పాలనడమేంటి... ఎందుకు మేము క్షమాపణ చెప్పాలి అని లోకేష్ వ్యాఖ్యలను ఉద్దేశించి బొత్స తీవ్రంగా ధ్వజమెత్తారు.

అంతకుముందు.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు , ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ,ఐఆర్ ,డీఏ ,ఉద్యోగుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అనంతరం.. ప్రశ్నోత్తరాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment