కరెంటుషాక్ తో లైన్‌మెన్ దుర్మరణం | lineman killed due to current shock | Sakshi
Sakshi News home page

కరెంటుషాక్ తో లైన్‌మెన్ దుర్మరణం

Published Thu, May 5 2016 1:24 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

lineman killed due to current shock

బద్వేలు: వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపురం గ్రామంలో గురువారం ఉదయం ఓ జూనియర్ లైన్‌మెన్ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. పట్టణంలోని వెంకటాయనగర్‌కు చెందిన తలపాటి మల్లికార్జున (27) నందిపల్లె గ్రామ ఫీడర్‌లో పని చేస్తున్నాడు. గురువారం లక్ష్మీపాలెం గ్రామ ఫీడర్‌కు సంబంధించి రెగ్యులర్ లైన్‌మ్యాన్ రాకపోవడంతో మల్లికార్జునను అక్కడకు పంపించారు. ఓ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రసారం కావడంతో అతడు మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని మల్లికార్జున బంధువులు ఆగ్రహంతో మృతదేహాన్ని తీసుకెళ్లి బద్వేలు లోని 33కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement