మల్లికార్జున.. ఏ–ప్లస్
మల్లికార్జున.. ఏ–ప్లస్
Published Sun, Jul 31 2016 10:58 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– జిల్లాలో ఏ కేటగిరి చెందినవి 4
– రెండు ఘాట్లు బీ కేటగిరి
కర్నూలు (అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన ఘాట్లకు అధికారులు గ్రేడ్లు ఇచ్చారు. శ్రీశైలంలోని మల్లికార్జున ఘాట్ ఏ ప్లస్ గ్రేడును సాధించింది. మిగతా ఘాట్లు వివిధ కేటగిరీల్లో చేరాయి. జిల్లాలో మొత్తం 7 ఘాట్లు ఉండగా...శ్రీశైలంలో నాలుగు, సంగమేశ్వరంలో మూడు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్యను జిల్లా యంత్రాంగం అంచనావేసి వాటికి గ్రేడ్‌లు ఇచ్చింది. రోజుకు లక్ష మంది ఆపైన వచ్చే శ్రీశైలంలోని మల్లికార్జున పుష్కర ఘాట్‌ను ఏప్లస్ కేటగిరిగా ప్రకటించారు. శ్రీశైలంలోని భ్రమరాంబిక ఘాట్, లింగాలగట్టు –1 కొత్తఘాట్, లింగాలగట్టు –2 పాతఘాట్‌లను ఏ కేటగిరిగా గుర్తించారు. ఏ కేటగిరి ఘాట్‌లకు రోజుకు 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. అలాగే సంగమేశ్వర ఘాట్‌ను ఏ–కేటగిరిలో చేర్చారు. సంగమేశ్వరంలోని లలితాదేవీ ఘాట్, లో లెవెల్ టెంపుల్ ఘాట్‌లను బీ కేటగిరిగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. బీ కేటగిరి ఘాట్‌లకు రోజుకు 10 వేల నుంచి 50 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ఏడు ఘాట్లు ఏర్పాటు చేస్తుండగా ఒకటి ఏ ప్లస్, ఏ కేటగిరి ఘాట్లు 4, బీ కేటగిరి ఘాట్లు రెండింటిని గుర్తించారు. ఘాట్ కేటగిరిని బట్టి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement