
లేపాక్షి ఆలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ
లేపాక్షి : లేపాక్షి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం అనంతపురం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మల్లికార్జున, ఆయన కుటుంబ సభ్యులు సందర్శించారు. ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని అపురూపమైన శిల్పాలు, చిత్రలేఖనాలు, కల్యాణమండపాలు తదితరాలను తిలకించారు. చిలమత్తూరు ఎస్‌ఐ జమాల్‌బాషా, పోలీసులు ఆయన వెంట ఉన్నారు.