lepakshi temple
-
లేపాక్షి అద్భుతం..మోదీ ప్రశంసలు
-
లేపాక్షి శిల్పకళ అద్భుతం
లేపాక్షి (శ్రీసత్యసాయి జిల్లా): చారిత్రక లేపాక్షి ఆలయంలో శిల్పకళా సంపద అద్భుతమని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. భారతీయ చరిత్ర, పురాతన వైభవం, విజయనగర సామ్రాజ్య సంస్కృతిని లేపాక్షి ఆలయ శిల్పకళా సంపద ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రధాని మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తి నుంచి హెలికాప్టర్లో లేపాక్షి చేరుకుని స్థానిక పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించారు. ప్రధానికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో వీరభద్రస్వామి, పాపనాశేశ్వరస్వామి, దుర్గాదేవి అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. వీరభద్రస్వామికి స్వయంగా మహామంగళ హారతి ఇచ్చారు. గర్భగుడిలో పాపనాశేశ్వర లింగానికి అభిముఖంగా ప్రత్యేక పీఠంపై కూర్చుని ప్రధాని ధ్యానం చేశారు. టీటీడీ వేద విజ్ఞాన పాఠశాల ఆధ్వర్యంలో రంగనాథ రామాయణ పారాయణం నిర్వహించగా మహిళా కళాకారులు త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. నిమ్మలకుంట కళాకారులు రామాయణంలో సీతాపహరణ ఘట్టాన్ని తోలుబొమ్మల రూపంలో ప్రదర్శించారు. వీటన్నింటినీ ఆస్వాదించిన ప్రధాని మోదీ తన్మయత్వం చెందారు. వేలాడే స్తంభం.. గర్భగుడి ప్రదక్షిణ అనంతరం మహా మంటపం పైకప్పు మీద చిత్రీకరించిన 25 గీ14 అడుగుల వీరభద్రస్వామి ఉగ్రరూపాన్ని ప్రధాని తదేకంగా తిలకించారు. పది చేతుల్లో వివిధ ఆయుధాలు, పొడవాటి కత్తి, దక్షయజ్ఞం సందర్భంగా దక్షుడి తలను దునుమాడటం లాంటి ఘట్టాలను చరిత్రకారుడు మైనాస్వామి వివరించారు. నాట్యమంటపంలోని శిల్పాలు, తైలవర్ణ చిత్రాలను చూసిన ప్రధాని ముగ్దులయ్యారు. వేలాడే స్తంభాన్ని ఆసక్తిగా తిలకించారు. వేలాడే స్తంభం ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. స్తంభం దిగువన మైనాస్వామి ఒక పలుచటి వ్రస్తాన్ని ఉంచగా ప్రధాని దాన్ని స్వయంగా స్తంభం నుంచి వెలుపలకు తీశారు. కిరాతార్జునీయ ఘట్టం, గిరిజా కల్యాణం, వీరభద్ర అనుగ్రహం పొందిన ఆలయ నిర్మాత విరుపణ్ణ, ఆయన పరివారం తైలవర్ణ చిత్రాలను తదేకంగా పరిశీలించారు. వటపత్రసాయి వర్ణచిత్రం గురించి చరిత్రకారుడు వివరించినప్పుడు బాలకృష్ణుడి కన్నులను చిత్రీకరించిన విధానాన్ని మూడు వైపుల నుంచి తిలకించారు. నాట్య మంటపంలోని భిక్షాటనమూర్తి సుందర రూపాన్ని తనివి తీరా చూశారు. భిక్షాటనమూర్తి విగ్రహాలలో భేదాల గురించి ఆసక్తిగా ఆలకించారు. ప్రధాని మోదీని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అర్చకులు, కళాకారులను ప్రధాని సన్మానించారు. ప్రధానిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
యునెస్కోలో ‘లేపాక్షి’
సాక్షి, అమరావతి: విజయనగర సామ్రాజ్యాధీశుల కళాతృష్ణకు నిదర్శనంగా నిలిచే అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల జాబితాలో చోటు సాధించడం ద్వారా అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు, పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. అత్యద్భుత శిల్ప కళా సౌందర్యం.. ప్రపంచంలోనే పెద్దదైన ఏక శిలా నందీశ్వరుడు.. గాలిలో వేలాడే స్థంభం.. ఏడు పడగల భారీ నాగేంద్రుడు.. అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతి బింబించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం. యునెస్కో కార్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి చోటు దక్కించుకుంది. మన దేశం నుంచి మూడు ప్రాంతాలను ప్రతిపాదించగా అందులో లేపాక్షి ఉండటం విశేషం. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో క్రీస్తు పూర్వం నాటి రాతి బొమ్మ లు (జియోగ్లిఫ్స్), మేఘాలయలోని సహజసిద్ధ రబ్బరు చెట్ల మూలాలతో నిర్మించిన వంతెనలు (లివింగ్ రూట్ బ్రిడ్జి) ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో.. విభజన అనంతరం నిర్లక్ష్యానికి గురైన వారసత్వ సంపదను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ ఆధ్వర్యంలో ఇటీవల లేపాక్షి విశిష్టతపై ప్రత్యేక సంచికను రూపొందించి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర పురావస్తు శాఖకు పంపారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనల్లో తొలి ప్రయత్నంలోనే లేపాక్షికి స్థానం దక్కింది. మరో ఆరు నెలల్లో తుది జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో లేపాక్షిని యునెస్కో వారసత్వ గుర్తింపు ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 32 సాంస్కృతిక, చారిత్రక కట్టడాలు, ఏడు సహజ సిద్ధ ప్రదేశాలు, ఒకటి మిశ్రమ జాబితాలో వారసత్వ హోదాను పొందాయి. కళా కౌశలానికి ప్రతీక.. 16వ శతాబ్దంలో 70 స్తంభాలతో నిర్మించిన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం విజయ నగర ప్రభువుల కళాతృష్ణ, నాటి సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయంలోని 69 స్థంభాలు పైకప్పు భారాన్ని మోస్తుండగా ఒక స్థంభాన్ని మాత్రం గాలిలో వేలాడేలా ఏర్పాటు చేయడం విశేషం. నాట్య మండపం, మధ్యయుగం నాటి నిర్మాణ చాతుర్యంతో పురాతన శివాలయం, చక్కని ఎరుపు, నీలి, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు వర్ణాల్లోని కలంకారీ చిత్రాలు శ్రీకృష్ణదేవరాయల చిత్రలేఖన అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. ముఖమండçపం పైకప్పులో చిత్రీకరించిన రామాయణ, మహాభారత పౌరాణిక గాథలు ఆకట్టుకుంటున్నాయి. జయహో లేపాక్షి లేపాక్షి: యునెస్కో విడుదల చేసిన జాబితాలో లేపాక్షి ఆలయానికి చోటు దక్కడంతో స్థానికంగా సంబరాలు మిన్నంటాయి. నందీశ్వరుడి విగ్రహం వద్ద గ్రామస్తులు కేక్ కట్ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. జయహో లేపాక్షి అంటూ నినాదాలు చేశారు. జాబితాలో లేపాక్షికి శాశ్వత గుర్తింపు దక్కేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చరిత్ర పరిశోధకుడు మైనాస్వామి కోరారు. -
లేపాక్షి ఆలయానికి కేంద్ర గుర్తింపు
-
ఆలయాలకు కరోనా ఎఫెక్ట్
ఒంటిమిట్ట/లేపాక్షి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది. కరోనా ఉధృతి నేపథ్యంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని అన్ని చారిత్రక, పురాతన ఆలయాలు, కట్టడాలు, సందర్శన ప్రదేశాలు, మ్యూజియంలను వెంటనే మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శుక్రవారం నుంచి మూసివేశారు. మే 15 వరకు ఆలయంలోకి భక్తులను ఎవర్నీ అనుమతించబోమని ఆలయ ఏఈవో మురళీధర్ తెలిపారు. అయితే, స్వామివారికి నిత్యం జరిగే పూజా కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణపై కూడా టీటీడీ అధికారులు పురావస్తు శాఖ అధికారులతో సమీక్షిస్తున్నారని, సమీక్ష అనంతరం బ్రహ్మోత్సవాలపై అధికారిక ప్రకటన వెలువరిస్తామని చెప్పారు. ఇక, అనంతపురం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో మే 15 వరకు భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహమూర్తి తెలిపారు. లేపాక్షి నంది విగ్రహం వద్ద కూడా పర్యాటకులకు ప్రవేశం లేదని, నంది విగ్రహం పార్కింగ్‌ను కూడా మూసివేశామని పేర్కొన్నారు. -
లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించుకున్న సీపీ సజ్జనార్
-
లేపాక్షిలో సైబరాబాద్ సీపీ సజ్జనార్
సాక్షి, లేపాక్షి: దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనతో వార్తల్లోకెక్కిన తెలంగాణలోని సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మ స్వాగతం పలికారు. వీరభద్రస్వామిని తమ ఇలవేల్పుగా భావించే సజ్జనార్ ఇక్కడికి వచ్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ఆయన బయటకు రాగానే ఏపీ, కర్ణాటక యువతీ యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. -
విశిష్ట దైవం... విశ్వకర్మ
సృష్టిలో ఏదైనా ఒక విశేషమైన శిల్పం చూసినా, ఒక నిర్మాణం కనిపించినా విశ్వకర్మ సృష్టి అంటుంటాం. వేదవిదులు ఆయనను సకల జగత్ సృష్టికర్త అంటారు. పౌరాణికులు మాత్రం సకల లోకాలనూ నిర్మించే దేవశిల్పి అంటారు. ఋగ్వేదంలో సృష్టి సూక్తాలు పేరిట కనిపించే నాలుగు సూక్తాలలో విశ్వకర్మ సూక్తం ఒకటి. ఈ సూక్తమే ఆయనను సకలలోక అధిష్ఠాత అని పిలిచింది. వేదదేవతలలో ఒకడిగా పరిగణించబడిన ఈ స్వామి పురాణాలలో పంచముఖుడిగా దర్శనమిస్తాడు. ఆయన ఐదుముఖాల నుండి ఐదుగురు మహర్షులు ఆవిర్భవించారు. వారే మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞలు. ఈ ఐదుగురికి ఐదు రకాలైన శిల్పకార్యాలను ఉపదేశించి సృష్టిని వృద్ధి చేయమని ఆదేశించాడు. విశ్వకర్మ శిల్పాలు, ఆలయాలు దేశమంతా ఉన్నా అక్కడక్కడా అరుదైన విగ్రహాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వెలసిన లేపాక్షి ఆలయంలో నిలుచున్న భంగిమలో ఉన్న విశ్వకర్మ శిల్పం స్తంభంపై చెక్కి ఉంది. ఐదు ముఖాలతో, పది చేతులతో దర్శనమిస్తాడు విశ్వకర్మ. నిజహస్తాలలో అభయ–వరదముద్రలతో, పరహస్తాలలో శంఖం, చక్రం, విల్లు, బాణం, త్రిశూలం, డమరుకం, టంకం (సుత్తి), నాగం దర్శన మిస్తాడు. కాగా కేరళ రాష్ట్రంలోని కాన్యంగాడులో పరశివ విశ్వకర్మ ఆలయం అతి పురాతనమైనది. విశ్వకర్మ దర్శనంతో సకల బంధనాలనుండీ విడివడతారనీ, ఈయన వా(క్ప)చస్పతి కనుక విద్య చక్కటి విద్య, సకలైశ్వర్యాలు కలుగుతాయని, ఇహంలో సుఖం, పరంలో మోక్షం లభిస్తాయని పురాణ వచనం. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయాన్ని మంగళవారం మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ సిబ్బంది సందర్శించారు. హిందూపురం పట్టణంలోని పురవీధుల గుండా వారు కవాతు నిర్వహించారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని ఏడు శిరస్సుల నాగేంద్రుడు, నంది విగ్రహం, అంతరిక్ష స్తంభం, నాట్యమండపం, కల్యాణ మండపం, చిత్రాలు, అపురూపమైన విగ్రహాలను తిలకించి ఆనందించారు. లేపాక్షి ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. లేపాక్షి ఎస్ఐ శ్రీధర్‌తో పాటు వారి సిబ్బంది వారి వెంట ఉన్నారు. -
లేపాక్షి ఆలయంలో ఏపీబీజీ చైర్మన్
లేపాక్షి : లేపాక్షి ఆలయాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చైర్మన్ సంపత్‌కుమార్‌చారి, బెంగళూరు డిప్యూటీ జనరల్ మేనేజర్ దేశాయ్, నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ మిశ్రా, ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సరోజిని, ఏపీజీబీ జనరల్ మేనేజర్ ఆనంద్, రీజినల్ మేనేజర్ శ్రీరంగన్న, బ్రాంచ్ మేనేజర్లు శుక్రవారం సందర్శించారు. స్థానిక ఏపీ టూరిజం హోటల్ ఆవరణలో నిర్వహించిన మహిళా సదస్సుకు వారు హాజరయ్యారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారు. -
లేపాక్షి ఆలయంలో సిసోడియా
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయాన్ని బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సిసోడియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేపాక్షి ఆలయం అద్భుతంగా ఉందన్నారు. చిత్రాలు, శిల్పలేఖనాలు చూసిన వారు జీవితంలో ఎవరూ మరిచిపోలేరన్నారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ ఆనందకుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయం ఆదివారం పర్యాటకులు, భక్తుల సందడితో కిటకిటలాడింది. అనేక మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను సందర్శించి ఆనందంగా గడిపారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రలతో పాటు విదేశీయులు కూడా ఆలయాన్ని సందర్శించి పార్కుల్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా నంది విగ్రహం చూసి ఆనందం వ్యక్తం చేశారు. -
లేపాక్షి ఆలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ
లేపాక్షి : లేపాక్షి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం అనంతపురం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మల్లికార్జున, ఆయన కుటుంబ సభ్యులు సందర్శించారు. ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని అపురూపమైన శిల్పాలు, చిత్రలేఖనాలు, కల్యాణమండపాలు తదితరాలను తిలకించారు. చిలమత్తూరు ఎస్ఐ జమాల్‌బాషా, పోలీసులు ఆయన వెంట ఉన్నారు. -
లేపాక్షి ఆలయానికి తగ్గిన పర్యాటకులు
లేపాక్షి : కేంద్రప్రభుత్వం ఇటీవల రూ. 500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేయడంతో లేపాక్షిని సందర్శించే పర్యాటకుల రద్దీ తగ్గింది. ప్రతి రెండో శనివారం, ఆదివారాల్లో ఆంధ్రతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేవారు. అయితే పెద్ద నోట్లు చెలామణిలో లేకపోవడంతో పర్యాటకులు రాలేకపోతున్నారు. సామాన్య ప్రజలు ఆలయానికి రావాలన్నా కనీసం రూ.500 అవసరం అవుతుంది. దీంతో ఆలయానికి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది. -
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన శాంతారాం
లేపాక్షి : లేపాక్షి ఆలయాన్ని హైదరాబాద్ ఆర్పీఎఫ్ డిప్యూటీ చీఫ్ సెక్యురిటీ కమిషనర్ పీవీఎస్ శాంతారాం శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలోని ఏడుశిరస్సుల నాగేంద్రుడు, ప్రసద్ధి గాంచిన నంది విగ్రహం, శిల్పాలను చూసి తన్మయత్వం చెందారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. -
లేపాక్షి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి
లేపాక్షి : పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి వెంకటశేషసాయి శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని ఏడుశిరస్సుల నాగేంద్రుడు, అర్ధంతరంగా ఆగిపోయిన కల్యాణమండపం, సీతమ్మ పాదం, నాట్య మండపంలోని అంతరిక్ష స్తంభం తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గర్భగుడిలో వాస్తుపురుషుడు, పద్మినీ జాతి స్త్రీల గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తిని హిందూదేవాదాయ ఆచారం ప్రకారం దేవాదాయ శాఖ వారు సన్మానించారు. జిల్లా న్యాయమూర్తి హరిహరనాథశర్మ, హిందూపురం జూనియర్ జడ్జి జానీబాషా, పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, హిందూపురం టూటౌన్ సీఐ మధుభూషన్, ఎస్ఐలు శ్రీధర్, జమాల్‌బాషా, రవిచంద్ర, తహశీల్దార్ ఆనందకుమార్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
లేపాక్షి ఆలయంలో కోలార్ జిల్లా జడ్జి
లేపాక్షి : పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని కర్ణాటకలోని కోలార్ జిల్లా జడ్జి బాదామికర్ మంగళవారం ఉదయం సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. -
లేపాక్షిలో సీపీఎఫ్ అదనపు కమిషనర్
లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల కేంద్ర ప్రావిడెండ్ ఫండ్ (సీపీఎఫ్) అదనపు కమిషనర్ పీడీ సిన్హా దంపతులు, అనంతపురం ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వెంకటరమణ గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి పూర్ణ కుంభంతో ఆలయ అర్చకుడు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మ స్వాగతం పలికారు. -
లేపాక్షి సందర్శించిన గవర్నర్