
లేపాక్షి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి
లేపాక్షి : పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి వెంకటశేషసాయి శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని ఏడుశిరస్సుల నాగేంద్రుడు, అర్ధంతరంగా ఆగిపోయిన కల్యాణమండపం, సీతమ్మ పాదం, నాట్య మండపంలోని అంతరిక్ష స్తంభం తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం గర్భగుడిలో వాస్తుపురుషుడు, పద్మినీ జాతి స్త్రీల గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తిని హిందూదేవాదాయ ఆచారం ప్రకారం దేవాదాయ శాఖ వారు సన్మానించారు. జిల్లా న్యాయమూర్తి హరిహరనాథశర్మ, హిందూపురం జూనియర్ జడ్జి జానీబాషా, పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, హిందూపురం టూటౌన్ సీఐ మధుభూషన్, ఎస్‌ఐలు శ్రీధర్, జమాల్‌బాషా, రవిచంద్ర, తహశీల్దార్ ఆనందకుమార్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు ఆయన వెంట ఉన్నారు.