![VC Sajjanar Visits Veerabhadra Swamy Temple In Anantapur - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/15/001.jpg.webp?itok=iT7RqiUt)
సాక్షి, లేపాక్షి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనతో వార్తల్లోకెక్కిన తెలంగాణలోని సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మ స్వాగతం పలికారు. వీరభద్రస్వామిని తమ ఇలవేల్పుగా భావించే సజ్జనార్ ఇక్కడికి వచ్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ఆయన బయటకు రాగానే ఏపీ, కర్ణాటక యువతీ యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment