
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన శాంతారాం
లేపాక్షి : లేపాక్షి ఆలయాన్ని హైదరాబాద్ ఆర్‌పీఎఫ్ డిప్యూటీ చీఫ్ సెక్యురిటీ కమిషనర్ పీవీఎస్ శాంతారాం శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలోని ఏడుశిరస్సుల నాగేంద్రుడు, ప్రసద్ధి గాంచిన నంది విగ్రహం, శిల్పాలను చూసి తన్మయత్వం చెందారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.