
లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయం ఆదివారం పర్యాటకులు, భక్తుల సందడితో కిటకిటలాడింది. అనేక మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను సందర్శించి ఆనందంగా గడిపారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రలతో పాటు విదేశీయులు కూడా ఆలయాన్ని సందర్శించి పార్కుల్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా నంది విగ్రహం చూసి ఆనందం వ్యక్తం చేశారు.