devotees flow
-
నృసింహాలయంలో పోటెత్తిన భక్తులు
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. శ్రావణమాసం.. వరుస సెలవులు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో భక్తులు కిక్కిరిసిపోయారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. జిల్లా వాసులే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
భక్తజనంతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్: శ్రావణ మాస రెండో శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం భక్తజనంతో పోటెత్తింది. ఆంజనేయ నామస్మరణతో ఆలయ పురవీధులు ప్రతిధ్వనించాయి. నెట్టికంటి ఆంజనేయస్వామి గరుడవాహనంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈవో ముత్యాలరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యల ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాకారోత్సవాన్ని ప్రారంభించారు. ఏఈవో మధు, సూపరింటెండెంట్లు వెంకట్వేర్లు, సీనియర్ అసిస్టెంట్ వేమన్నలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నెట్టికంటుడికి అరకిలో వెండి బహూకరణ : నెట్టికంటి ఆంజనేయస్వామి వెండి రథం నిర్మాణానికి రాయచూరుకు చెందిన శ్రీనివాసులు అనే భక్తుడు తనవంతుగా అరకిలో వెండిని బహూకరించారు. -
భక్తులతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్: శ్రావణమాసం మొదటి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో పోటెత్తింది. సాయంత్రం స్వామివారు ఒంటె వాహనం పై కొలువదీరి ఆలయ పురవీధుల్లో ఊరేగారు. మంగళవారం వేకువజామునుంచే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలను నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తిని ఒంటెవాహనం పై కొలువు దీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యులు నారికేళను సమర్పించి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తుల మధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
అశ్వత్థంలో పోటెత్తిన భక్తులు
మాఘ మాసం మూడు ఆదివారాన్ని పురస్కరించుకుని పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థ క్షేత్రం భక్తులతో పోటెత్తింది. దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరావడంతో క్షేత్రం కిటకిటలాడింది. శనివారం రాత్రి నుంచే జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తుల రాక మొదలైంది. ఎడ్లబండిపై వచ్చిన గ్రామీణ ప్రజలు పెన్నానదిలో విడిది చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకే భక్తులు స్నానమాచరించి అశ్వత్థనారాయణస్వామి, భీమలింగేశ్వరస్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. మొక్కుబడి ఉన్న భక్తులు తలనీలాలు సమర్పించారు. పాలుపోంగలి చేసి స్వామివార్లకు నైవేద్యం సమర్పించారు. తిరునాలలో తినుబండరాలు, ఆటవస్తువులు, గాజుల దుకాణాలు వెలిశాయి. ఈ సందర్భంగా చెక్కభజన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. భఎలాంటి ఆవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాడిపత్రి డీఎస్సీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు సురేంద్రనాథ్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, ఎస్ఐలు శ్రీహర్ష, నారాయణరెడ్డి, ప్రదీప్ పర్యవేక్షించారు. వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. - తాడిపత్రి రూరల్ -
కొండమీదరాయుడా.. కోటి దండాలయ్యా
బుక్కరాయసముద్రం సమీపంలోని దేవరకొండపై వెలసిన కొండమీదరాయుడి రథోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వేకువజామునే శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తూ తీసుకొచ్చి రథంపై అధిష్టింపజేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పురవీధుల్లో అశేష భక్తుల గోవింద నామస్మరణ నడుమ రథాన్ని ముందుకు లాగారు. ఉత్సవానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. - బుక్కరాయసముద్రం -
లేపాక్షిలో సందడే సందడి
లేపాక్షి : లేపాక్షికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయా ఆలయాల్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఏ మండపం చూసినా వందలాది మంది భక్తులు, యువకులు, విద్యార్థులతో నిండిపోయింది. ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం, కల్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరులు, నాట్య మండపం, లతా మండపం, నంది విగ్రహం వద్ద పర్యాటకులు, భక్తులు ఫొటోలు తీయించుకోడానికి పోటీ పడ్డారు. -
లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయం ఆదివారం పర్యాటకులు, భక్తుల సందడితో కిటకిటలాడింది. అనేక మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను సందర్శించి ఆనందంగా గడిపారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రలతో పాటు విదేశీయులు కూడా ఆలయాన్ని సందర్శించి పార్కుల్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా నంది విగ్రహం చూసి ఆనందం వ్యక్తం చేశారు. -
భక్తులతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్ : శ్రావణమాసం నాల్గవ శనివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పోటెత్తింది. రాత్రి 8 గంటలకు ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ ఈఓ ముత్యాలరావు ,ఆలయ అణువంశిక ధర్మకర్త సగుణమ్మల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాకారోత్సవం నిర్వహించారు. బళ్లారి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి సౌజన్యంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు చెక్కెర పొంగళి ,పులిహోర ప్రసాదాలు పంపిణీ చేశారు. నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ ఏఈఓ మధు , సూపరింటెండెంట్ వెంకటేశులు ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఆలయంలో భక్తుల సందడి
లేపాక్షి : పర్యాటక కేంద్రం లేపాక్షి దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి ఎక్కువైంది. శ్రావణ మాసం కావడంతో అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని గైడ్లు ఆలయ విశిష్టతను గురించి తెలియజేయడంలో నిమగ్నం కావడం విశేషం. -
లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి దేవాలయంలో శనివారం పర్యాటకులు, భక్తుల సందడి నెలకొంది. హిందూపురం, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలోని శిల్పాలను, చిత్రలేఖనాలు, ఆద్బుతమైన కట్టడాలను, తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శుక్రవారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు వేచి ఉండే కంపార్టుమెంట్లు అన్నీ నిండటంతో వారు క్యూలైన్లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. -
ఖైరతాబాద్‌లో బారులు తీరిన భక్తులు
-
ఖైరతాబాద్‌లో బారులు తీరిన భక్తులు
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణేశుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. మహానగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జనాలు తరలి వస్తున్నారు. ఇప్పటికే సుమారుగా వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. భక్తులకు దర్శనార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు. అదే విధంగా రక్షణ చర్యలు కూడా చేపట్టినట్టు చెప్పారు. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 60 వేల మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 15 గంటలు, 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం లభించే అవకాశం ఉందని ఆలయాధికారులు తెలిపారు. గదుల కోసం భక్తులు రిసెప్షన్ కార్యాలయాల వద్ద వేచి ఉన్నారు. కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించుకునేందుకు నిరీక్షించారు. హుండీ కానుకలు రూ. 2.07 కోట్లు లభించాయి. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్టుమెంటుల్లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతుంది. కాలినడకన భక్తులకు 5 గంటల్లో దర్శనం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని ఆలయాధికారులు తెలిపారు.