
లేపాక్షిలో సందడే సందడి
లేపాక్షి : లేపాక్షికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయా ఆలయాల్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఏ మండపం చూసినా వందలాది మంది భక్తులు, యువకులు, విద్యార్థులతో నిండిపోయింది. ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం, కల్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరులు, నాట్య మండపం, లతా మండపం, నంది విగ్రహం వద్ద పర్యాటకులు, భక్తులు ఫొటోలు తీయించుకోడానికి పోటీ పడ్డారు.