
లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి దేవాలయంలో శనివారం పర్యాటకులు, భక్తుల సందడి నెలకొంది. హిందూపురం, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలోని శిల్పాలను, చిత్రలేఖనాలు, ఆద్బుతమైన కట్టడాలను, తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు.