lepakshi
-
లేపాక్షిలో థీమాటిక్ ఎగ్జిబిషన్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–69లోని నందగిరిహిల్స్‌లోని లేపాక్షి హస్తకళా షోరూంలో థీమాటిక్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రదర్శనలో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, లెదర్ పప్పెట్స్, పెన్ కలంకారీ చీరలు, ఏలూరు కార్పెట్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఈ చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన కళాకారులు తమ చేతులకు పనిచెబుతూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. -
చిత్రం చెక్కిలిపై చెదరని సంతకం!
1968 మే నెలలో, ఇటువంటి రాళ్ళు పగిలే ఎండల్లోనే ఒక ప్రభుత్వ బృందం అనంతపురం జిల్లా బయలుదేరింది. అక్కడి లేపాక్షి, తాడిపత్రి తదితర ప్రాంతాలను సందర్శించి అప్పటి ప్రభుత్వ పత్రిక ‘ఆంధ్రప్రదేశ్’ లో వ్యాసాలు రాయడానికి, ఒక రిపోర్ట్ తయారు చేయడానికని. అందుకోసం ఆ జట్టులో రాసేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్లు, బొమ్మలు వేయడానికి కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. తెలుగు చిత్రకళ చెదరని సంతకాలలో ఒకరైన శీలా వీర్రాజు (శీలావీ) ఆ బృంద సభ్యుల్లో ఒకరు. ఆయన లేపాక్షి సందర్శన ఒక చిత్రకారుడి హోదాలో కాదు, సమాచారశాఖలో ఒక ఉద్యోగిగా మాత్రమే. అయినా చిత్రకళ మీద ఉన్న అభిరుచి కారణంగా తన స్కెచ్ బుక్ పట్టుకుని కదిలారు ఆ పురాతన శిథిలాలయ క్షేత్రానికి.లేపాక్షి చేరి దేవాలయ చరిత్ర గురించి, శిల్పాల గురించి పూజారి చెబుతున్న వివరాలను ఒక చెవిన వింటూ, తన చేతనున్న స్కెచ్ బుక్‌ని బొమ్మలతో నింపేశారు శీలావీ. ఆయనకు ఆ దేవతలు, వారి కథలు – గాథలు, భక్తి, కైవల్యం, కైంకర్యం, ఏమీ పట్టలేదు. ఆయన అక్కడ చూసిందల్లా ఆ శిల్పాలనూ, కఠినమైన నల్లరాయికి ఉలి అంచు పరుసవేది తాకించి ఆ రాయీ రప్పా, బండలను వెన్న చేసి శిల్ప మూర్తులుగ మలచిన సంతకం తెలియని కళాకారుడి దప్పి మాత్రమే. పెద్ద శిలను లేపాక్షినందిగా మలచి, దాని మెడను చుట్టిన మంజీర శబ్దాలు మాత్రమే ఆయనకు వినపడ్డాయి.మోచేయి వంపులో స్కెచ్ పుస్తకాన్ని ఇరికించుకుని గంటల తరబడి బొమ్మను గీస్తే ఏం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎక్కగలిగే కాలి కింది మెట్టుగా పనికి వచ్చేనా? నలుగురు మనుషుల కళ్ల గుమ్మం గుండా వెళ్ళి గుండెను పలకరించేనా ఆర్ట్? కర్ట్ వానెగట్ అనే అమెరికన్ రచయిత బడి పిల్లలకోసం ఒక అద్భుతమైన లేఖను రాశారు. గుండెపొరలలో దాచుకుని పదేపదే తడుముకోవాల్సిన లేఖ అది. ఆ ఉత్తరంలో ఆయన పిల్లలను ఉద్దేశించి అన్నా, మనమందరం నేర్చుకోవలసిన పాఠం ఉంది.‘నాయనలారా మీరు ఏదైనా కళను అభ్యసించండి. అది పాడటం కావచ్చు. రాయడం కావచ్చు, బొమ్మలు గీయడం కావచ్చు, ఏదయినా కావచ్చు, కానీ కళలను అభ్యసించండి. డబ్బుకోసం, కీర్తికోసం, పెద్దపేరు కోసం కాదు. అనుభూతి చెందడం, మీలో ఏముందో తెలుసుకోవడం, టు మేక్ యువర్ సోల్ గ్రో వంటివాటి కోసం కళను తెలుసుకోండి’. జీవితాంతం శీలావీ అదే పని చేశారు. ఆయన కళ ద్వారా తన హృదయంలో దీపం వెలిగించుకున్నారు. దీపం దీపాన్ని వెలిగిస్తుంది అని నమ్మారు.రాయి ప్రకృతిది, రాయిని చెక్కిన ఉలి లోహం ప్రకృతిది. బొమ్మను గీసుకున్న కాగితం ప్రకృతిది; పెన్సిల్ ముక్క తాలుకు బొగ్గు, దానిని ఇముడ్చుకున్న కలప ప్రకృతిలో భాగాలే. కాగితం మీద బొమ్మ వేయడం అంటే ప్రకృతి ప్రకృతిని కౌగిలించుకోవడమే. శీలా వీర్రాజు లేపాక్షిలో రెండు రోజులు ఉన్నారు. ఆ రెండు రోజుల్లో దాదాపు యాభై స్కెచ్‌లు గీసుకున్నారు. మండే సూర్యుడి కింద నిలబడి, కాలే రాళ్ళ మీద కూచుని బొమ్మలు గీశారు. ఈ బొమ్మలన్నీ దాదాపుగా 30 సెంటీ మీటర్ల వెడల్పు, 42 సెంటీ మీటర్ల కొలతల్లో వేసిన పెద్ద బొమ్మలు. ఫౌంటైన్ పెన్ గీతల బొమ్మలివి. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని బొమ్మ వేస్తున్నప్పుడు చిత్రకారుడి చూపు వస్తువు వైపే ఉంటుంది. చేతి వేళ్ళు, ఇంకు పెన్ను ముక్కు మాత్రమే కాగితాన్ని చూస్తుంటాయి.మంచి చిత్రకారుడి దృష్టి ఏమాత్రం కాగితాన్ని చూడదు. అంత పెద్ద కాగితంపై తొట్రుపడకుండా పరుగెత్తిన వీర్రాజు గీత తీవ్రత మనల్ని విస్మయుల్ని చేస్తుంది. తోటి చిత్రకారులను కొంచెం భయపెడుతుంది కూడా. కేవలం రెండు రోజుల్లో అంత పెద్ద బొమ్మలను, అంత నైపుణ్యంగా వేయడం మాట కాదు అనుకుంటామా, శీలావీ ఇంకోలా అంటారు: ‘నేను అక్కడి శిల్పాలకు మాత్రమే స్కెచ్‌లు గీసుకున్నాను. గోడల మీద, పైకప్పు మీద రంగుల్లో చిత్రించిన పురాతన చిత్రాలు కూడా ఉన్నాయి. అచ్చమైన దేశీయ శైలి చిత్రాలవి. నేను వాటి జోలికి పోలేదు. సమయం చాలకపోవటం ఒక కారణమైతే, తీసుకెళ్లిన స్కెచ్ బుక్ పూర్తయిపోయి ఆ పల్లెటూళ్ళో డ్రాయింగ్ పేపర్లు దొరక్కపోవడం మరో కారణం’. ఈ రోజుల్లోలా విరివిగా దొరికే కాలమై ఉంటే ఈ బొమ్మలు చెప్పే కథ ఇంకోలా ఉండేది.కాలం గడిచి కథలు కంచికి చేరుతాయి. గాలిపటాన్ని దారం వదిలేస్తుంది. రెండు సంవత్సరాల క్రితం శీలా వీర్రాజు కాలం చేశారు. ఆయన ఎగురవేసిన గాలిపటాన్ని తెగిపడనీయకుండా ఆయన సహచరి శీలా సుభద్రాదేవి ఎత్తిపట్టుకున్నారు. ఆయన చిత్రించిన ప్రతి బొమ్మల గాలిపటాన్నీ అకాశం ఎత్తుకు తీసుకు వెళ్ళి ప్రపంచానికి చూపించే పని ఆరంభించారు. శీలావీ లేపాక్షి స్కెచ్‌లతో పాటు రామప్ప, అజంతా–ఎల్లోరా, కోణార్క్ స్కెచ్‌లన్నీ కలిపి ఒక పెద్ద గాలిపటమంత పుస్తకం ప్రచురించారు. జూన్ ఒకటవ తేదీ శనివారం హైదరాబాదు రవీంద్రభారతిలో ఆ పుస్తక ఆవిష్కరణ, వీర్రాజు గారి సంస్మరణ.– అన్వర్, ఆర్టిస్ట్(హైదరాబాదులో రేపు శీలా వీర్రాజు సంస్మరణ సభ) -
Lepakshi: రాతిలో పోత పోసిన లేపాక్షి అందాలు
ఆమధ్య “హంపీ వైభవం" పేరిట వరుసగా వ్యాసాలు రాశాను. అప్పుడు మా లేపాక్షి మనసు చిన్నబుచ్చుకుంది. హంపీ గురించి అన్నన్ని పుస్తకాలు ప్రస్తావిస్తూ వ్యాసాలు రాశావే! నిన్ను పెంచిన లేపాక్షి గురించి పరిశోధించి వ్యాసాలు రాయకపోతే ఎలా? అని లేపాక్షి జనం నన్ను నిలదీశారు. వారి నిలదీతలో అర్థముంది. లేపాక్షిమీద తపన ఉంది. నామీద లేపాక్షికి ఉన్న ఆ హక్కును గౌరవిస్తూ... లేపాక్షి మీద పరిశోధించి రాసిన సాధికారికమయిన పుస్తకాలను, వ్యాసాలను సంవత్సరం పాటు సేకరించాను. రెండు, మూడు కావ్యాలు కాలగర్భంలో కలిసిపోవడం వల్ల దొరకలేదు. నాకు దొరికిన ప్రచురితమైన నలభై తెలుగు, కన్నడ, ఇంగ్లీషు లేపాక్షి పుస్తకాల నుంచి ప్రధానంగా మూడింటి ఆధారంగా ఈ వ్యాసాలను రాస్తున్నాను. అవి:- 1. లేపాక్షి: రచయిత- ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు ఆమంచర్ల గోపాలరావు. ఇంగ్లీషులో దీన్ని మోనో గ్రాఫ్ పరిచయ వ్యాసంగా పేర్కొన్నా పరిశోధన స్థాయి గ్రంథం ఇది. 1969లో ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ ప్రచురణ. 2. లేపాక్షి ఆలయం: రచయిత- హిస్టరీ ప్రొఫెసర్ వి కామేశ్వర రావు, ఎస్ వీ యూనివర్సిటీ, తిరుపతి. పరిశోధన గ్రంథం. 1987 ప్రచురణ. 3. త్యాగశిల్పం..పద్య, గద్య కావ్యం: కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో కీలకమైన పదవిలో పనిచేస్తుండిన తెలుగు పద్యప్రేమికుడైన లంకా కృష్ణమూర్తి పద్యాలు; లేపాక్షి ఓరియంటల్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడు, అష్టావధాని పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ(మా నాన్న) గద్యం. ఇద్దరూ కలిసి రాసినది. 1975 ప్రచురణ. ఈ పుస్తకాలేవీ ఇప్పుడు మార్కెట్లో లేవు. ఇలాంటివి పునర్ముద్రణ కావు. లేపాక్షిలో మిత్రుడు లేపాక్షి రామ్ ప్రసాద్ దగ్గర భద్రంగా ఉంటే కొరియర్లో తెప్పించుకుని...జిరాక్స్ చేసుకుని వారి పుస్తకాలు వారికి మళ్లీ కొరియర్లో వెనక్కు పంపాను. రామ్ ప్రసాద్ తాత వెంకటనారాయణప్ప లేపాక్షికి తొలి సర్పంచ్. ఐదు దశాబ్దాలపాటు లేపాక్షి గుడిని వెలికి తీసుకురావడానికి కల్లూరు సుబ్బారావుతో కలిసి పనిచేశారు. నాకు తెలిసిన ఆవగింజంత భాషా సాహిత్యాలకు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలకు లేపాక్షి బీజం. అక్కడ తాకిన ప్రతిదీ శిల్పమే. చూసిన ప్రతిదీ అందమే. రాతిలో పోతపోసిన ఆ అందాలను, ఆనందాలను చెప్పకపోతే... నాకొచ్చిన నాలుగు మాటలకు విలువ ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం. వీరభద్రాలయం లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనదని మొదట అనుకునేవారు. భారత పురావస్తుతత్వ శాఖ తవ్వకాల్లో బయటపడ్డ శాసనాల ప్రకారం క్రీస్తు శకం 1400 నాటికే లేపాక్షిలో పాపనాశేశ్వర ఆలయం ప్రసిద్ధిలో ఉందని తేలింది. ఇక్కడ వీరభద్రుడు, పాపనాశేశ్వరుడు, దుర్గాదేవి, రఘునాథ స్వామి ప్రధానమైన దేవుళ్లు. "లేపాక్ష్యామ్ పాపనాశనః" అని స్కాంధపురాణంలో ఉన్నది ఈ లేపాక్షి పాపనాశేశ్వర స్వామి ప్రస్తావనే అన్నది ఎక్కువమంది పండితుల అభిప్రాయం. 16వ శతాబ్దిలో విజయనగర రాజులు అచ్యుతదేవరాయలు, అళియరాయల దగ్గర పెనుగొండ మండల కోశాధికారిగా ఉండిన విరుపణ్ణ ఇలవేల్పు వీరభద్రస్వామి. విరుపణ్ణ కలల పంట మనముందున్న ఈ లేపాక్షి కళల పంట. లేపాక్షికి ఆ పేరెలా వచ్చింది? త్రేతాయుగం రామాయణ కథతో లేపాక్షి కథ కూడా మొదలవుతుంది. సీతమ్మను రావణుడు అపహరించుకుని ఆకాశమార్గాన తీసుకువెళుతుంటే జటాయువు అడ్డగించి... యుద్ధం చేస్తుంది. కోపగించిన రావణుడు పక్షికి రెక్కలే బలం కాబట్టి... ఆ రెక్కలను నరికేస్తే చచ్చి పడి ఉంటుందని...రెక్కలను కత్తిరిస్తాడు. జటాయువు రెక్కలు తెగి... రక్తమోడుతూ... నేల కూలుతుంది. సీతాన్వేషణలో భాగంగా చెట్టూ పుట్టా; కొండా కోనా; వాగూ వంకా వెతుకుతూ రామలక్ష్మణులు జటాయువు దగ్గరికి వస్తారు. సీతమ్మ జాడ చెప్పి...రాముడి ఒడిలో జటాయువు కన్ను మూస్తుంది. తమకు మహోపకారం చేసిన జటాయువు అంత్యక్రియలను రామలక్ష్మణులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో జటాయువును చూసిన వెను వెంటనే రాముడన్న మాట- “లే! పక్షి!” అదే "లేపాక్షి" అయ్యింది. పమిడికాల్వ మధుసూధన్ -
జీ20లో లేపాక్షి స్టాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హస్తకళలు జీ20 విశ్వవేదికపై ఆహూతులను అలరిస్తున్నాయి. జీ20 సదస్సులో భాగంగా భారత మండపం ఇండియన్ క్రాఫ్ట్ బజార్లో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హస్తకళ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తూ లేపాక్షి స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో భాగంగా హస్తకళలు, చేనేత వ్రస్తాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీకాళహస్తి కలంకారి చీరలు, ఉప్పాడ జమ్దానీ చీరలు, బొబ్బిలి వీణ, తిరుపతి చెక్క»ొమ్మలు సహా పలు ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. విదేశాల నుంచి ఆహూతులకు లేపాక్షి ఈడీ విశ్వ ఆయా ఉత్పత్తుల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. ఉత్పత్తుల నేపథ్యాన్ని, వాటికున్న వారసత్వం, సంస్కృతిని చెబుతున్నారు. ఈ సందర్భంగా విశ్వ మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన హస్తకళలు, చేనేత వ్రస్తాలకు విదేశీ ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మరోవైపు, గిరిజన ఉత్పత్తుల స్టాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు కాఫీని ప్రదర్శనకు ఉంచారు. -
లేపాక్షి : కళకాలం నిలిచేలా కళాఖండాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): హస్తకళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవం పోస్తున్నాయి. వాటిపై ఆధారపడిన కళాకారులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. గతంలో హస్తకళాకారులకు చేతినిండా పని ఉండేది. వారు తయారుచేసిన వస్తువులకు ఎంతో డిమాండ్ ఏర్పడేది. రానురాను వాటి స్థానాన్ని చైనా మార్కెట్ ఆక్రమించింది. చైనా వస్తువులు తక్కువ ధరకు దొరకడంతో జనం మెల్లగా వాటికి అలవాటు పడిపోయారు. మన కళాకారులు చేతితో చేసిన వాటికి సమయం ఎక్కువ పట్టడం, శ్రమ కూడా అధికంగా ఉండటంతో వాటి ధర కుంచెం ఎక్కువగా ఉండేవి. కానీ చైనా నుంచి వచ్చేవి మెషీన్‌తో తయారు చేసిన కావడం, కొత్త మోడళ్లలో లభించడంతో జనాలు వాటికి ఆకర్షితులయ్యారు. దీనితో హస్తకళాకారులు ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వాల ప్రోత్సాహం దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన కళాకారులను ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్ర ఇండస్ట్రీ, కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ బి.విజయలక్ష్మి, ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ ఎం. బాలసుబ్రమణ్యం రెడ్డి, ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.విశ్వ అనేక చర్యలు చేపడుతున్నారు. అంతర్జాతీయ సమ్మిట్లు నిర్వహించినప్పడు లేపాక్షి ద్వారా వివిధ రకాల హస్తకళలను ప్రదర్శించి అంతర్జాతీయ మార్కెట్‌ను పెంచుతున్నారు. విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, జీ 20 సదస్సు తదితర వాటిలో లేపాక్షిని ప్రమోట్ చేశారు. అలాగే వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ పేరుతో ఆయా జిల్లాలో ప్రసిద్ధి చెందిన వస్తువులను అంతర్జాతీయ మార్కెట్‌కు చేరువ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తిరుపతిలో తయారు చేసిన వుడ్ కార్వింగ్లను ప్రధానమంత్రి మోదీ, ఇతర నాయకులకు బహుమతులు అందజేస్తున్నా రు. తద్వారా వాటికి ప్రాచూర్యం కల్పిస్తున్నారు. 1982లో ప్రారంభం ఆంధ్రపదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో 14 లేపాక్షి షోరూమ్‌లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద 1982లో లేపాక్షి ఎంపోరియం నెలకొల్పారు. ఇక్కడకు జిల్లా వాసులతో పాటు ఎన్ఆర్ఐలు తరచూ వస్తారు. హస్తకళావస్తువులను కొనుగోలు చేసి, తమ స్నేహితులకు, బంధువులకు బహుమతిగా అందజేస్తారు. వన్ ప్రొడక్ట్, వన్ డిస్ట్రిక్ట్‌లో భాగంగా తూర్పుగోదావరిలో వైట్ వుడ్ బర్డ్స్, రత్నం పెన్నులు, కాకినాడ జిల్లాలో కలంకారి బ్లాక్ ప్రింటింగ్ ఎంతో ప్రాచుర్యం పొందాయి. రాజమహేంద్రవరం పేరు తలచుకోగానే రత్నం పెన్నులు గుర్తుకు వస్తాయి. 1930లో మొదలు పెట్టిన ప్రస్తానం నేటికి నిరంతరంగా కొనసాగుతోంది. మహాత్మా గాంధీజీ సైతం ఈ పెన్నులను ప్రశంసించారు. మెషీన్లు అందుబాటులోకి వచ్చినా నేటీకీ చేతితోనే ఈ పెన్నులను తయారు చేస్తారు. ● 50 ఏళ్లుగా.. మా నాన్న ఎం.చిన్న సత్యం వైట్ వుడ్ బర్డ్స్ తయారు చేసేవారు. ఆయన నుంచి నేను ఈ కళను నేర్చుకున్నాను. తూర్పుగోదావరి జిల్లాకి నా కళను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. గత 50 ఏళ్లుగా ఈ వృత్తిలోనే కొనసాగిస్తున్నాను. ఏపీ, తెలంగాణలో అన్ని లేపాక్షి షోరూమ్‌లో నా వైట్వుడ్ బర్డ్స్‌ని తీసుకుంటున్నారు. – ఎం.నాగరాజు, వైట్ వుడ్ బర్డ్స్ తయారీ దారుడు -
విషం కక్కిన ‘ఈనాడు’.. వక్రీకరణే వజ్రాయుధమా?..
వార్త ఏదైనా వక్రీకరణే ప్రధానం. ఇదీ... రామోజీరావు తాజా సూత్రం. ప్రత్యేక కథనం కావచ్చు... న్యాయస్థానం వ్యాఖ్యలు కావచ్చు... న్యాయ ప్రక్రియ కావచ్చు... ఆఖరికి ఎవరిదైనా ఇంటర్వ్యూ కావచ్చు. దానికి సొంత వ్యాఖ్యానాలు జోడిస్తూ... టార్గెట్ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అంటూ విషం కక్కడమే ఆయన ధ్యేయం. తన పత్రికలో కాలమిస్టుగా వ్యాసాలు రాసే బ్యాంకింగ్ రంగ నిపుణుడు కె.నరసింహమూర్తి ఇంటర్వ్యూను ఆదివారం నాడు పనిగట్టుకుని పతాక శీర్షికల్లో వేయటం కూడా అలాంటి రాజకీయ ఎజెండాలో భాగమే. ఆయన చెప్పిన విషయాలకు... తన సొంత వ్యాఖ్యానం జోడిస్తూ ‘ఇందూ సంస్థ తాకట్టుపెట్టిన ఆస్తులన్నింటినీ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మేనమామ కుమారుడు నరేన్ రామానుజుల రెడ్డి డైరెక్టరుగా ఉన్న ఎర్తిన్ ప్రాజెక్ట్స్ ఇటీవల రూ.500 కోట్లకే పొందేందుకు ప్రయత్నించటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది’’ అని పేర్కొనటం... ఆ కుట్రలో ఓ ప్రధానాంకం. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయటానికి హద్దులే లేనట్లుగా నానాటికీ దిగజారిపోతున్న రామోజీ రావుకు తనలానే తన కుట్రలకూ వయసు మళ్లిందనే విషయం అర్థంకావటం లేదనే అనుకోవాలి. ‘ఇందూకు విందు’ అంటూ గతనెల్లో పేజీలకు పేజీలు వండేసిన ‘ఈనాడు’... ఆ ఆస్తులన్నీ ఎన్సీఎల్టీ బిడ్డింగ్‌లో ఎర్తిన్ ప్రాజెక్ట్స్ సంస్థ చౌకగా కొట్టేసిందని, అందులో వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి మేనమామ కుమారుడు డైరెక్టరని, ఇదంతా పథకం ప్రకారం జరిగిందని రాసి పారేసింది. దానిపై పయ్యావుల కేశవ్ వంటి తెలుగుదేశం నేతలనూ మాట్లాడించేసి... మొత్తంగా అదో కుంభకోణమనే రీతిలో బురద జల్లటానికి ప్రయత్నించింది. కానీ ఏం జరిగింది? ఎర్తిన్ ప్రాజెక్ట్స్ సంస్థ ఇప్పటికీ డబ్బులు పూర్తిగా చెల్లించలేకపోయింది. గడువు ముగిసినా చెల్లింపులు పూర్తి చేయలేదు కాబట్టి బిడ్డింగ్‌ను మళ్లీ నిర్వహిస్తామని ఎన్సీఎల్టీ పేర్కొంటోంది. అంటే దీనర్థమేంటి రామోజీరావు గారూ? మీరు చెబుతున్నదే నిజమైతే వేల కోట్ల విలువైన ఆస్తులను రూ.500 కోట్లకే దక్కించుకున్న ఎర్తిన్ సంస్థ డబ్బులు ఎందుకు చెల్లించలేకపోయింది? వేల కోట్ల విలువైన ఆస్తులు అంత చౌకగా వస్తున్నపుడు ఆ ఎర్తిన్ సంస్థ పిలిచినా ఇన్వెస్టర్లెవరూ ముందుకు రాలేదెందుకు? అసలు మీరెందుకు బిడ్లు వేయలేదు? మీరో మీ తెలుగుదేశం స్నేహితులో బిడ్లు వేయొచ్చుగా? అంతే చౌకగా కొట్టేయొచ్చుగా? ఎవరు ఆపారు మిమ్మల్ని? పోనీ ఇప్పుడు మీరు రాస్తున్నట్లుగానే మళ్లీ ఎన్సీఎల్టీ బిడ్లు పిలిస్తే మీరు ఒంటరిగానో లేక మీ దోచుకో–పంచుకో – తినుకో(డీపీటీ) భాగస్వాములతో కలిసో టెండర్లు వేస్తారా? వీటికి మీ దగ్గర సమాధానాలున్నాయా రామోజీరావు గారూ!!? దగుల్బాజీ, దౌర్భాగ్యపు రాతలు కాక వీటినేమనాలి? టెండర్లలో ఎవరూ పాల్గొనకుంటే అప్పుడో రకం రాతలు. ఎవరో ఒకరు దక్కించుకుంటే మరో రకం రాతలు. ఎందుకిదంతా? అసలు లేపాక్షి సంస్థకు ఆ భూముల్ని తనఖా పెట్టుకోవచ్చని ఏపీఐఐసీ నిరభ్యంతరపత్రం (ఎన్ఓసీ) ఇచ్చింది ఎప్పుడు? నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తరవాత కాదా? ఆ విషయాన్ని ఎందుకు రాయరు? లేపాక్షికిచ్చిన భూముల్లో దాదాపు సగం భూముల్ని ఇచ్చింది కూడా వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించాకేనన్నది నిజం కాదా? మరణించాక జరిగిన పరిణామాలను కూడా దివంగత నేత వైఎస్సార్కో, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికో అంటగడుతూ కథనాలు రాయటం ఏ స్థాయి పాత్రికేయం? ‘అసైన్డ్’కు అంత ధర ఎప్పుడైనా ఇచ్చారా? ఏ ప్రభుత్వమైనా కంపెనీలకు భూములిచ్చేది ఆ ప్రాంత అభివృద్ధి కోసమే. అందుకే అక్కడున్న మార్కెట్ ధరకు కేటాయించటం రివాజు. లేపాక్షి వ్యవహారంలోనూ అంతే. అప్పట్లో అక్కడున్న మండలాల్లో ఎకరా రూ.20–30 వేలకన్నా ఎక్కువ పలకటం లేదని స్థానిక అధికారులు నివేదిక సైతం ఇచ్చారు. అయినా ప్రభుత్వం తన భూములకు ఎకరాకు రూ.50వేలు, రైతుల నుంచి తీసుకునే అసైన్డ్ భూములకు మాత్రం అంతకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా... ఎకరా రూ.1.75 లక్షల చొప్పున నిర్ణయించింది. రైతుల కోసం మీ చంద్రబాబు ఇలా ఒక్కరోజైనా ఆలోచించారా? అసలు చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములు లాక్కున్నపుడు రైతులకు చెల్లించిన ధర ఎంత? దీన్ని ఏనాడైనా మీరు ప్రశ్నించారా? మరి మీది పాత్రికేయమంటారా? వైఎస్సార్ గనక మరణించకుండా ఉంటే అక్కడి ప్రాజెక్టు సాకారమై కొన్ని వేల మందికి ఉపాధి దొరికి ఉండేది కాదా? దురదృష్టవశాత్తూ ఆయన మరణించాక జరిగిన సంఘటనలతో ఆయనకు ఏం సంబంధం? ఆయనే ఏదో తప్పు చేశారనే భ్రమ కలిగించేలా ఇంకెన్నాళ్లీ నీచపు రాతలు? ఎన్సీఎల్టీ మీ పెరట్లోని చిట్‌ఫండ్ సంస్థా? జాతీయ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఓ చట్టబద్ధ సంస్థ. అది చేపట్టే ప్రక్రియలోనూ రంధ్రాలు వెదికి... అదేదో కావాలని చౌకగా కట్టబెట్టేసినట్లు అపోహలకు తావిచ్చే కథనాలు వండటం ఎంత వరకూ సమంజసం రామోజీరావు గారూ? అదేమీ మీ పెరట్లోని చిట్‌ఫండ్ సంస్థ కాదు కదా? ఫలానా కంపెనీ పరిష్కార ప్రక్రియ కోసం బిడ్లు పిలుస్తున్నామని అది పత్రికల్లో ప్రకటనలిచ్చి బహిరంగంగా బిడ్లు పిలిచినపుడు మీరెందుకు పాల్గొనలేదు? పాల్గొని దక్కించుకున్నవారిపై ఇలా దిగజారుడు కథనాలు రాయటం ఎంతవరకూ సమంజసం? అసలు ఎన్సీఎల్టీ బిడ్లలో తామూ పాల్గొంటామని వై.ఎస్.జగన్ ప్రభుత్వమే ఎన్సీఎల్టీ పరిష్కార నిపుణుడికి లేఖ రాసింది. కానీ గడువు ముగిసిందంటూ ఎన్సీఎల్టీ తిరస్కరించింది. దీన్నిబట్టి ఆ భూములు కాపాడటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న విషయం అర్థంకావటం లేదా? ఈ భూముల కేటాయింపును రద్దుచేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు పక్కనబెట్టకుండా పెండింగ్‌లో ఉంచింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ చంద్రబాబు నాయుడు దీనికి కౌంటర్ వేయకుండా నానుస్తూనే వచ్చారు. మీరు కూడా ఒక్కటంటే ఒక్క అక్షరాన్ని కూడా వృథా చేయలేదు. ఎందుకంటే బాబు ఏం చేసినా మీ మేలు కోసమే గదా మరి!!. ప్రస్తుత ప్రభుత్వమే దీనికి కౌంటర్ దాఖలు చేస్తోంది. అంతేకాకుండా హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది కనక అది తేలేదాకా బిడ్డింగ్ ప్రక్రియ నుంచి ఈ భూముల్ని మినహాయించాలని తాజాగా ఎన్సీఎల్టీని కూడా కోరింది. చంద్రబాబు హయాంలో ఇలాంటి ప్రయత్నమే జరగలేదు. మీరు మాత్రం ఇప్పుడే ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లుగా శివాలెత్తటం చిత్రాతిచిత్రం. 2008లో చిలమత్తూరు మండలంలోని భూముల మార్కెట్ విలువ ఎకరా రూ.20వేల నుంచి రూ.74,500 మాత్రమే పలుకుతున్నట్లు చిలమత్తూరు సబ్‌రిజిష్ట్రార్ అధికారికంగా పేర్కొన్న అప్పటి పత్రాలివి. కోడూరులో ఎకరా రూ.24వేల నుంచి రూ.53వేల వరకూ ఉన్నట్లు అధికారులే పేర్కొనటాన్ని చూడొచ్చు. ఆ డీపీటీ ఇప్పుడు లేదనేగా? ‘మంచిని చెప్పకు... వక్రీకరణ వదలకు’ అనే రీతిలో ప్రతిరోజూ రాజకీయ ఎజెండాతో చెలరేగిపోతున్న రామోజీ అండ్ కో లక్ష్యం ఒక్కటే. అర్జెంటుగా చంద్రబాబు నాయుడిని తెచ్చి అధికార పీఠంపై కూర్చోబెట్టేయడం. ఎందుకంటే మూడేళ్లుగా వీరి దోపిడీకి... డీపీటీకి అడ్డుకట్ట పడింది. బాబు హయాంలో... నైపుణ్యాభివృద్ధిలో యువతకు శిక్షణ ఇస్తామంటూ ‘ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్టీసీ) కేంద్రంగా భారీ కుంభకోణం చేసి డొల్ల కంపెనీల ద్వారా కొట్టేసింది రూ.241 కోట్లపైనే. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన కంపెనీలకు రాజమార్గంలో పంపించింది 321 కోట్లపైనే. ఇక ఇసుక ఉచితమంటూ మొత్తం నదులనే కబ్జా పెట్టారు. వేలకోట్లు కొల్లగొట్టేశారు. సాక్షాత్తూ చంద్రబాబు ఇంటివెనకే రాత్రింబవళ్లూ లారీలకొద్దీ ఇసుక రవాణా అయ్యేదంటే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. అక్రమాలకు అడ్డొచ్చారని మహిళా తహసీల్దారును టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టుకుని ఈడ్చేసినా ఒక్క వార్త ప్రసారం కాలేదు. మద్యం డిస్టిలరీలకు తన వారికే అనుమతులిచ్చి కోట్లు కొల్లగొట్టారు. పర్మిట్ రూమ్‌లకు అనుమతులిచ్చి, బెల్టు షాపులు పెంచి... టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు పెంచారు. పెంచినందుకు ప్రోత్సాహకాలిచ్చారు. ఇక అమరావతి కుంభకోణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క అసైన్డ్ భూముల వ్యవహారంలోనే పథకం ప్రకారం చంద్రబాబు, అతని అనుయాయులు 1,100 ఎకరాలు కొట్టేశారు. కాకపోతే వీటన్నిటిపై రామోజీరావుగానీ, ఆయన బృందంలోని ఏబీఎన్, టీవీ5 వంటివేవీ ఒక్క కథనాన్నీ వండి వార్చలేదు. ఎందుకంటే వారి వాటాలు వారికొచ్చాయి. ఇప్పుడు ఇసుక విషయంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు.. అంటే ఐదేళ్లలో దాదాపు 4వేల కోట్లు వస్తున్నా... దుష్టచతుష్టయం దృష్టిలో అదో ఘోరమైన తప్పిదమే. కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి సబ్కాంట్రాక్టుకిచ్చేశారంటూ అదో ఘోరమైన నేరంలా బురద జల్లే కథనాలు దాదాపు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. మద్యం విక్రయాలు తగ్గించడానికి పర్మిట్ రూమ్‌లు రద్దు చేసి, బెల్టుషాపులు తీసేసినా తప్పే. బాబు అనుమతిచ్చిన డిస్టిలరీలే ఇప్పుడూ మద్యం సరఫరా చేస్తున్నా... నాసిరకమంటూ, పేరులేని బ్రాండ్లంటూ ప్రతిరోజూ తప్పుడు ప్రచారమే. అయినా... బాబు హయాంలో జరిగిన ఐఎంజీ లాంటి కుంభకోణాల్ని కూడా అందమైన చందమామ కథల్లా పాఠకులకు చెప్పిన చరిత్ర ‘ఈనాడు’ది. అలాంటి పత్రిక నుంచి ఇంతకన్నా మెరుగైన కథనాలెలా ఆశించగలం?? -
మరో ఆరు లేపాక్షి షోరూమ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హస్తకళలకు పెద్దఎత్తున ప్రచారం కల్పించడంతోపాటు వాటికి బ్రాండ్ ఇమేజ్ కల్పించడంలో లేపాక్షి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వీటి తయారీలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా కళాకారులు 23 రకాల హస్తకళలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ మరింత ఉపాధి చూపడంతోపాటు ఆ కళలను బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రస్తుతమున్న 17 లేపాక్షి ఎంపోరియంలకు అదనంగా ఇప్పుడు మరో ఆరు కొత్త షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విశాఖపట్నం, విశాఖ విమానాశ్రయం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుమల, తిరుపతి, తిరుపతి శ్రీనివాసమ్, విష్ణు నిలయం, తిరుపతి విమానాశ్రయంతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, న్యూఢిల్లీలో లేపాక్షి షోరూమ్‌లు ఉన్నాయి, కొత్తగా విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గండికోట, కడప, తిరుపతిలో కూడా మరిన్ని షోరూమ్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో షోరూమ్ ఏర్పాటుకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. హస్తకళల ప్రోత్సాహానికి బహుముఖ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ’ ద్వారా హస్తకళలను ప్రోత్సహించేలా బహుముఖ చర్యలు చేపట్టింది. ప్రధానంగా క్రాఫ్ట్‌మేళా, ఎగ్జిబిషన్, ప్రచారం, మార్కెటింగ్ వంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే.. మరికొంత మందికి ఉపా«ధి కల్పించేందుకు పెద్దఎత్తున శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ‘కామన్ ఫెసిలిటి సర్వీస్ సెంటర్ (సీఎఫ్‌ఎస్‌సీ)లను ఏర్పాటుచేస్తోంది. వాటికి అవసరమైన మౌలిక వసతులు, యంత్రాలు, పరికరాలను ఏర్పాటుచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతోంది. ఒకే గొడుగు కిందకు నైపుణ్యాన్ని, తయారీని, విక్రయాలను తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు ఇక రాష్ట్రంలో పేరెన్నికగన్న హస్తకళా ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతోపాటు తోలు బొమ్మలకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మంచి డిమాండ్ ఉంది. ఈ–కామర్స్ పాŠల్ట్ఫామ్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో కూడా ఆన్లైన్ విక్రయాలు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.35 లక్షలు విలువైన హస్తకళా ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మాలని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏపీ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘లేపాక్షి’ ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: లేపాక్షికి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు చేస్తామని చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన బుధవారం చేనేత, జౌళి శాఖపై మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యుత్తమ హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఫొటోలు, అత్తుత్యుమంగా ఉండడానికి గల కారణాలపై తర్వాతి సమావేశానికి సమగ్ర వివరాలు అందించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. పవర్ లూమ్ యూనిట్లకు అందించే పవర్ టారిఫ్ వివరాలు, ముద్ర రుణాలను మంత్రి గౌతమ్‌రెడ్డి ఆరా తీశారు. ఆన్లైన్ మార్కెటింగ్‌తో విక్రయాలను మరింత పెంచాలని సూచించారు. ఈ-కామర్స్ ద్వారా వచ్చే ఆర్డర్లను మూడు రోజుల్లో డెలివరీ చేసే స్థాయికి చేరాలని స్పష్టం చేశారు. ఖాదీ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎమ్ఈజీపీ), ఎంటర్‌ప్యూనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఈడీపీ)లపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 షోరూంలు (ఏపీయేతరవి 3) కోవిడ్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినా స్వయంగా నడపగలిగినవే అన్నీ అని వివరించారు. తోలుబొమ్మలు, ఆదివాసీ పెయింటింగ్స్, ఏటికొప్పాక, కొండపల్లి, బంజారా ఎంబ్రయిడరీ వస్తువుల తయారీలో మరింత శిక్షణనందిస్తే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు. ఎక్కువ నాణ్యత, రకరకాల డిజైన్ల తయారీతో ఎక్కువ మందిని ఆకర్షించేలా ఉండాలని పేర్కొన్నారు. ఒక జిల్లా ఒక వస్తువు విషయంలో మరింత చొరవ పెరగాలని తెలిపారు. తిరుపతి బాలాజీ, పుట్టపర్తి సాయిబాబా వంటి దేవుడి విగ్రహాల తయారీలో నైపుణ్యం పెంచి.. ఎక్కువ ప్రతిమల తయారీపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించేలా బ్రాండింగ్, బ్రాండ్ అంబాసిడర్ ఉంటుందని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్డీసీఎల్) ఛైర్మన్ బండిగింజల విజయలక్ష్మి, చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
లేపాక్షి బసవన్న
స్కాందపురాణం ప్రకారం మనదేశంలోని 108 శైవక్షేత్రాలలో అనంతపురం జిల్లా లేపాక్షిలో కొలువై ఉన్న శివుడికి పాపనాశేశ్వరుడని పేరు. ఈ క్షేత్రం శిల్పక కు పెట్టింది పేరు. ఆలయ స్తంభాలమీద విజయనగర రాజుల కాలంనాటిఅద్భుత శిల్ప కళానైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. లేపాక్షిలో యాత్రికులను కట్టిపడేసే మరొక అద్భుతం లేపాక్షి బసవన్న. దాదాపు 16 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో మెడలో చిరుమువ్వలు, కాళ్లకు గజ్జెల పట్టెడలతో, మూపున అలంకరించిన దుస్తులతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన నందీశ్వరుడి సజీవ శిల్పం చూస్తుంటే లేచివస్తాడేమో అనిపిస్తుంది. మెడచుట్టూ మూడురకాల పట్టెడలు, అన్నింటికంటె కింఇభాగాన 29 గంటలున్న పట్టెడ, దానిపైన 18 మువ్వలున్న పట్టెడ, ఆ పైన 27 రుద్రాక్షలున్న మాలతో అలంకరించి ఉన్న ఈ శిల్పం కాళ్లు, తోక పొట్టకిందుగా లోపలికి మడిచిపెట్టుకుని ప్రశాంత గంభీరంగా కనిపిస్తుంది. లేపాక్షి చుట్టుపక్కల ఎవరి పశువుకైనా జబ్బు చేస్తే వారు ఈ నంది విగ్రహం వద్దకు వచ్చి నూనెతో దీపాన్ని వెలిగించి మొక్కుకుని వెళతారు. వాళ్లు మొక్కుకున్న మరుసటిరోజే ఆ జబ్బు నయమవుతుందట. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లేపాక్షి నంది రంకె వేస్తే ప్రళయం వస్తుందని స్థలపురాణం చెబుతోంది. – శ్రీలేఖ -
ఉగ్రరూపంలో వీరభద్రస్వామి
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన చారిత్రక పట్టణం లేపాక్షి. మధ్యయుగం నాటి శిల్పకళా నిర్మాణంలో ఒక పురాతన శివాలయం ఇక్కడ కొలువు తీరి ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి సుమారు 30 అడుగుల ఎత్తువరకు పాము చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు కనువిందు చేస్తుంది. పై కప్పు కూడా లేకుండా ఈ విగ్రహం ఆరుబయట దర్శనమిస్తుంది. ఇక్కడ స్తంభాలు, మండపాలతో పాటు అనేక శివలింగాలతో కూడిన ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతున్నాయి. విశాలమైన ఆవరణ మధ్యభాగంలో కొలువుతీరి ఉండటం ఈ ఆలయ విశిష్టత. ఇక్కడి మూలవిరాట్టు వీరభద్రస్వామి. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహం ఉంటుంది. సాధారణంగా దేవుడు మనకు గుడి బయట నుంచి కనపడతాడు. వీరభద్రస్వామిది ఉగ్రరూపం, ఆయన కోపపు చూపులు సూటిగా గ్రామం మీద పడకూడదు. అందువల్ల ఈ ఆలయ ముఖద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. ఇది ఈ ఆలయ విశేషం. ఇక్కడి వేలాడే స్తంభం ఈ గుడికి ముఖ్య ఆకర్షణ. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక పల్చటి వస్త్రాన్ని అతి సులువుగా తీయగలుగుతాం. ఇది అప్పటి శిల్పకారుల నైపుణ్యానికి తార్కాణం. ఇక్కడి వీరభద్రస్వామిని మహిమలు గల దేవునిగా కొలుస్తారు. –డా. వైజయంతి -
లేపాక్షిలో భారీ వర్షం..
సాక్షి, లేపాక్షి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హిందూపూర్ ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న లేపాక్షి ఉత్సవాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇంతలోనే లేపాక్షిలో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. ఆకాశం నిండా మేఘాలు కమ్ముకొని భీకరంగా మారిపోయింది. దీంతో భారీ ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. అయితే వర్షం తగ్గుముఖం పడితే ఆలస్యంగానైనా ఉత్సవాలను ప్రారంభించే అవకాశం ఉంది. -
పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి
అనంతపురం: లేపాక్షి మండలం నాయనపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కల్పన అనే మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను ఉరేసి చంపింది. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి కల్పన, పిల్లలు మేఘన(6) యశస్విణి(3) మృతిచెందారు. భర్త వీరభద్రప్ప వేధింపులే కారణమని బంధువుల ఆరోపిస్తున్నారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, అదనపు కట్నం కావాలని కొంతకాలంగా భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితుల బంధువులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
లేపాక్షి: గొంగటిపల్లి గ్రామానికి చెందిన రవి (30) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన బాలక్రిష్ణ సోమవారం మధ్యాహ్నం తన ఇంటిలోని సంప్‌కు కొళాయి నుంచి నీరు రాకపోవడంతో మరమ్మతు నిమిత్తం రవిని పిలిచాడు. సంప్ దగ్గర మోటారు రిపేరీ చేస్తున్న సమయంలో విద్యుత్‌షాక్‌కు గురైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుబ్బరామనాయక్ తెలిపారు. -
లేపాక్షి ఆలయంలో ‘జై భవాని’ బృందం
లేపాక్షి: పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయాన్ని మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా కానాపూర్‌కు చెందిన జై భవాని నవరాత్రి మండలి బృందం ఆదివారం సాయంత్రం సందర్శించింది. ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ కానాపూర్‌లో భవానిమాత దేవాలయం ప్రసిద్ధి చెందినదని, ప్రతి నవరాత్రి ఉత్సవాలనూ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటామని తెలిపారు. అయితే సుప్రసిద్ధమైన అమ్మవారి ఆలయంలో కాగడా జ్యోతిని వెలిగించి భవానిమాతకు సమర్పించిన తర్వాతే ఈ ఉత్సవాలు చేసుకుంటామన్నారు. అందులో భాగంగానే తిరుపతి వద్ద అలివేలి మంగాపురంలో వెలసిన పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం మధ్యాహ్నం కాగడా జ్యోతిని వెలిగించిన అనంతరం పాదయాత్ర ద్వారా లేపాక్షి ఆలయ సందర్శనకు వచ్చామన్నారు. ఈనెల 21వ తేదీ కానాపూర్ చేరుకుని భవానిమాతకు జ్యోతిని సమర్పించి ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు. -
సజీవం.. నాటి కళానైపుణ్యం
లేపాక్షి : అచ్చెరువొందే కళానైపుణ్యాలు.. వందల ఏళ్లు గడిచినా చెక్కు చెదరని రీతి.. అలనాటి వందలాది ఆకృతులను ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారులు.. వెరసి లేపాక్షి ఆలయ నిర్మాణం. ప్రపంచానికి పరియయం అక్కర్లేని చారిత్రిక నిర్మాణం. విజయనగర రాజులు 1538లో ఈ ఆలయాన్ని పూర్తి చేశారని చరిత్ర చెబుతుంది. ఆలయంలోని నాట్య మంటపం పైకప్పులో సజీవత ఉట్టిపడే కలంకారీ అద్దకం ద్వారా వివిధ రకాల నీతి, పురాణ కథలను చిత్రీకరించారు. అర్ధంతరంగా ఆగిపోయిన కల్యాణం మంటపానికి పడమటి భాగంలో లతా మంటపం ఉంది. ఇందులో 36 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంలో నాలుగు వైపులా నాలుగు రకాల ఆకృతుల్ని చెక్కడం విశేషం. మొత్తం 36 స్తంభాల్లో 144 డిజైన్లును చెక్కారు. ఇవే ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల వస్త్రాలు, ఇంటి సామగ్రిపై నేటికీ ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. -
‘నవోదయ’లో చదవడం అదృష్టం
లేపాక్షి : లేపాక్షి నవోదయ విద్యాలయంలో చదివి ఉన్నత స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు, సివిల్స్‌కు ఎంపికైన ఉద్యోగులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం లేపాక్షి నవోదయ విద్యాలయంలో అల్యూమినీ అసోసియేషిన్ అధ్యక్షుడు, పూర్వ విద్యార్థులు డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ స్థాయికి ఎదిగామన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా అలనాటి తీపిగుర్తులతో అనందంతో గడిపారు. ఈ సందర్భంగా బెంగుళూర్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న లాబూరాం, సోలాపూర్‌లో ఐఆర్పీఎస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చంద్రమోహీయార్, అలహాబాద్‌లో కంట్రోల్‌మెంట్ బోర్డు నిర్వహణ అధికారిగా దినేష్ కుమార్ రెడ్డి, ఇటీవల సివిల్స్‌కు ఎంపికైన జగదీశ్వర్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
కస్తూర్బాలో కన్నీటి కష్టాలు
- విద్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులు - 20 రోజులుగా దుస్తులు ఉతుక్కోని వైనం లేపాక్షి : అనంతపురం జిల్లా లేపాక్షిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో నీటికష్టాలు తారస్థాయికి చేరాయి. పాఠశాలలో గత జూన్ 12న తరగతులు పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి నీటి కోసం విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు హాజరైనప్పటి నుంచి దుస్తులు ఉతుక్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం విద్యార్థినులు ఏకమై పాఠశాల మెయిన్ గేట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయినులు, సిబ్బందిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. సుమారు గంటకు పైగా ఆందోళన నిర్వహించారు. ఉన్నతాధికారులు వచ్చి తాగునీటి సమస్య పరిష్కరించే వరకు తాళాలు తీయబోమని భీష్మించారు. చివరకు విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ సుధారాణి ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఫోన్ ద్వారా సమస్యను తెలియజేశారు. ఎంఈఓ నాగరాజు, ఎంపీడీఓ నటరాజ్, తహసీల్దార్ ఆనందకుమార్ విద్యాలయం వద్దకు చేరుకుని తాళాలను తీయించి సమస్యలు వివరించాలని కోరారు. ఈ సందర్భంగా 9వ తరగతి చదువుతున్న పుష్ప, 7వ తరగతి విద్యార్థిని శ్రవంతి, 10వ తరగతి విద్యార్థినులు అనూష, జ్యోతి తదితరులు కస్తూర్బాలోని సమస్యలను వివరించారు. అధికారులు మాట్లాడుతూ సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇదే సమయంలో పరిస్థితిని జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఏ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇవీ సమస్యలు - 20 రోజులుగా నీటి సమస్య. - ఉన్న ఒక్క బోరు కూడా ఎండిపోయింది. - రోజుకు ఒక ట్యాంకరు నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. - సంపులోకి నీరు సరఫరా చేస్తుండటంతో తోడుకునేందుకు అవస్థలు. - నీటి సమస్య కారణంగా అధ్వానంగా బాత్రూం, లెట్రీన్లు. - ఒంటిపై గుల్లలు, దరద. - మెనూ ప్రకారం భోజనం వడ్డించరు. - అరకొరగా కోడిగుడ్లు, చికెన్. -
లాఠీ దెబ్బలతో యువకుడి మృతి
పేకాట ఆడుతున్నారని చావబాదిన లేపాక్షి ఎస్ఐ అస్వస్థతతో మృతి చెందిన రమేష్ ఆగ్రహించిన మృతుని బంధువులు లాకప్‌డెత్ చేశారంటూ ఆరోపణ హిందూపురం అర్బన్ / హిందూపురం రూరల్/ లేపాక్షి : పేకాటరాయుళ్లపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. వారి దెబ్బలకు తాళలేక ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పేకాట ఆడితే ప్రాణాలు తీసేస్తారా అంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. బాధితుల కథనం మేరకు.. లేపాక్షి మండలం పులమతి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వెనుక సోమవారం సాయంత్రం పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీధర్ తన సిబ్బందితో వెళ్లి పాలిష్‌బండలు అమర్చే కార్మికుడైన రమేష్(25)తో సహా తొమ్మిదిమందిని లాఠీలతో చితకబాది పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మరోమారు లాఠీలకు పని చెప్పారు. లాఠీ దెబ్బలతో తీవ్ర అస్వస్థతకు గురైన రమేష్ (25)ను ఇద్దరు కానిస్టేబుళ్లు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటితే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రమేష్‌ను తీసుకొచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఎస్ఐ శ్రీధర్ కూడా తన సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసుకుని వెళ్లిపోయారు. సీఐలు రాజగోపాల్‌నాయుడు, ఈదుర్‌బాషా, మధుభూçషణ్ ఆస్పత్రికి చేరుకుని విషయం బయకు పొక్కకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఏమైనా రాసుకోండి జరిగిన సంఘటనపై రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడును వివరణ కోరగా... ఆయన స్పందించడానికి నిరాకరించారు. ‘మీ ఇష్టం ఏమైనా రాసుకోండి’ అంటూ వెళ్లిపోయారు. ‘ముమ్మాటికీ లాకప్డెత్తే’ పేకాట ఆడుతున్నారని పట్టుకెళ్లి లాకప్‌లో వేసి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం వల్లే రమేష్ చనిపోయాడని బంధువులు, పులమతి గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం రాత్రి హిందూపురం ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి ఇందిరమ్మ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు వచ్చి ఆందోళనకారులను సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కొట్టి చంపింది కాక మళ్లీ సర్దిచెప్పేందుకు వస్తారా అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మామను పొట్టనపెట్టుకున్నారు : మృతుడి భార్య పుష్ప పేకాట ఆడితే ఏదో చేయరాని నేరం చేసినట్లు చితకబది కొట్టి చంపేస్తారా ? మా మామను పోలీసులు పొట్టన పెట్టుకున్నారంటూ రమేష్ భార్య పుష్ప కన్నీరు మున్నీరైంది. ఆమెను సముదాయించడం ఎవరి తరమూ కాలేదు. విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు. -
నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
లేపాక్షి : లేపాక్షి జవహార్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలైనట్లు ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్బన్ ఓపెన్ కేటగిరీ కింద 13 మంది, ఎస్సీ కేటగిరీలో మూడు, పీహెచ్‌సీకి 3, ఎస్టీకి ఒకటి మొత్తం 20 మంది, రూరల్ ఓపెన్ కేటగిరీ కింద 46 మందికి, ఎస్సీ 9 మంది, ఎస్టీ ఐదుగురు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. -
‘నవోదయ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ఈనెల 15వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యాలయంలో బాలరకు మూడు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయన్నారు. -
అద్భుతాల ‘లేపాక్షి’
శిల్ప కళలకు కాణాచిగా మారిన జిల్లాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం లేపాక్షిలో అడుగడుగునా అద్భుతాలే కనిపిస్తుంటాయి. ఇందులో తైలవర్ణ చిత్రాలు ప్రముఖమైనవి. ఆలయంలోని నాట్య మంటపానికి తూర్పున పైకప్పులో ఒక రావి ఆకుపై చిన్నికృష్ణుడు పడుకున్నట్లున్న చిత్రపటం దేశవిదేశీ పర్యాకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో విశేషమేమంటే మనం ఎటు వైపు నుంచి చూసినా.. చిన్నికృష్ణుడు మనలే్న చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇంకా నాట్య మంటపంలో అంతరిక్ష స్తంభం, రంభ నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న శిల్పం, సంగీత కళాకారులు, పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి అలంకరణలు, విరుపణ్ణ అన్నదమ్ముల చిత్రాలు.. అబ్బుర పరుస్తుంటాయి. - లేపాక్షి (హిందూపురం) -
నవోదయ ఫలితాల విడుదల
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి సీబీఎస్సీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యాలయంలో 81 మంది పరీక్షలు రాయగా.. 81 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ తెలిపారు. వందశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అందులో 75 శాతానికి పైగా 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా అందులో టాప్–10లో 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. -
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్బన్ పరిధిలో ఒక బాలుడికి, ఇద్దరు బాలికల చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు ఈనెల 15 నుంచి 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జూన్ 24న లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో జరుగుతుందన్నారు. -
లేపాక్షి వాసి బెంగళూరులో మృతి
లేపాక్షి : మండలంలోని సి.వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకటరమణాచారి (75) అనే వ్యక్తి గురువారం ఉదయం బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమారుడు అరవిందాచారి తెలిపిన మేరకు.. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బుధవారం ఉదయం అతడిని కుమారుడు బెంగళూరు నిమాన్స్ ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడిని గురువారం డిశార్జి చేశారు. ఆస్పత్రి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండుకు నడిచి వస్తుండగా వాహనం ఢీకొని వెంకటరమణాచారి అక్కడిక్కడే మృతి చెందాడు. తాను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అతడికి భార్య, ఆరుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
ఆదర్శ విద్యార్థులుగా ఎదగాలి
లేపాక్షి : జవహర్ నవోదయ విద్యార్థులు ఆదర్శవంతులుగా ఎదగాలని నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ ఏవై రెడ్డి సూచించారు. శనివారం ఉదయం నిర్వహించిన నవోదయ విద్యాలయం వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, విద్యాలయానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. లేపాక్షి నవోదయ విద్యార్థులు దేశ, రాష్ట్రస్థాయిలో విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించడం హర్షనీయమన్నారు. అనంతరం నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. విద్యాలయంలోని ఎంపీ హాల్, డైనింగ్ హాల్లో చల్లదనం కోసం పాల్ షీట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బిట్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ చంద్రమోహన్ వివేకానందుడి జీవిత చరిత్రపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన 25 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ మాట్లాడుతూ 2016–17 విద్యా సంవత్సరానికి అన్ని రంగాల్లోనూ శివాలిక్ హౌస్ విద్యార్థులు మొదటి స్థానంలో రాణించారన్నారు. వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థినీవిద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చూసొద్దాం..
అరుదైన చిత్ర, శిల్ప కళలతో.. ఆధ్యాత్మిక చింతనతో పాటు నేటికీ అంతు చిక్కని సాంకేతిక నైపుణ్యానికి పట్టుకొమ్మగా విరాజిల్లుతోంది లేపాక్షి. సజీవశిల్ప సౌందర్యానికి ప్రతీకగా దేశవిదేశీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి ఆలయంలోని శిల్పాలు, తైలవర్ణ చిత్రాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, జటాయు మోక్షఘాట్, నంది విగ్రహం, ఏడుశిరసుల నాగేంద్రుడు, అంతరిక్ష స్తంభం, సీతమ్మ పాదం, విరుపణ్ణ కళ్లు పెకలించి గోడకు తాపడం చేసిన చోట అంటిన రక్తపు మరకలు, నాట్య మంటపం, లతా మంటపం, కల్యాణమంటపం తదితర విశేషాలు ఎన్నో అబ్బురపరుస్తున్నాయి. ఇక్కడి ఆలయం పైకప్పును రామాయణ, మహాభారత, మనునీతి, భూకైలాస్, కిరాతార్జునీయం తదితర ఘట్టాలను తైలవర్ణాలతో అద్భుతంగా చిత్రీకరించారు. ఆలయం వద్ద ఇటీవల శుద్ధి చేసిన కోనేరు, పార్కులు చూడముచ్చటగా ఉన్నాయి. ఆలయంలోని నాట్యమంటపం ఈశాన్య మూలలో నేలను తాకకుండా సుమారు ఎనిమిది అడుగుల స్తంభం పైకప్పు నుంచి నేలను తాకకుండా వేలాడబడి ఉంది. అంతరిక్ష స్తంభం అని పిలువబడుతున్న ఈ వేలాడే స్తంభం గుట్టు తెలుసుకునేందుకు అప్పట్లో దేశాన్ని పాలించిన తెల్లదొరలు నానా అగచాట్లు పడ్డారు. ఇందులోని రహస్యం నేటికీ అంతు చిక్కడం లేదు. ఈ ఆలయాన్ని చూడాలనుకుంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూపురం చేరుకుని అక్కడి నుంచి తూర్పు దిశగా 14 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడకు నిరంతర బస్సు సౌకర్యం ఉంది. - లేపాక్షి (హిందూపురం) -
లేపాక్షి ఆలయంలో గుండు సుదర్శన్
లేపాక్షి : లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని హాస్యనటుడు గుండు సుదర్శన్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్యనటుడిగా తనను ఆదరించిన అభిమానులకు ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పట్లోనే గ్రీవెన్స్ సెల్
లేపాక్షి (హిందూపురం) : ప్రజలు తమ సమస్యలు, విన్నపాలు తెలియజేసుకునేందుకు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రం స్థాయిలో ప్రతి సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం జరుగుతున్నట్టే విజయనగర రాజుల పాలనలో కూడా ఇటువంటిదే నిర్వహించేవారట. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో సీతమ్మ పాదానికి దక్షిణ భాగంలో ‘సోమవారం మండపం’ ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆనాటికే ఒక వేదికను ఏర్పాటు చేశారట. ప్రతి సోమవారం రాజు, మంత్రులు, భటులు సమావేశమయ్యేవారట. ఈ సమావేశంలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే వారట. రాజు దృష్టికి వెళ్లిన సమస్య మరుసటి వారంలోగా పరిష్కరించే వారని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. -
వానరాల కేరింత..
లేపాక్షి (హిందూపురం) : నిప్పుల కుంపటిని తలపించే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే శరీరం చల్లబడాలి. అందుకు ఏకైక మార్గం ఈత. మనుషులే కాదు వానరాలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్టు నీటిలో ఈత కొడుతూ సేదదీరుతున్నాయి. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ముందుభాగంలోని పార్కులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన నీటి కొలనులో దాదాపు 15 వానరాలు మనుషుల మాదిరే ఈతలో రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. వానరాల కేరింతలు చూసి ఆశ్చర్యపోవడం జనం వంతైంది. -
లేపాక్షి ఆలయానికి మహర్దశ
లేపాక్షి : అనంతపురం జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో ఒకటైన లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని అఖిల భారత పంచాయతీ పరషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజినేయులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అతి త్వరలో లేపాక్షికి మహర్దశ రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి శాస్త్ర, సాంకేతిక, విద్య, సాంస్కృతిక సంస్థ (యునెస్కో, ఫారిస్) తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు దక్కనున్నట్టు కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ), ప్రపంచ హెరిటేజ్ డైరెక్టర్ లూర్దుసామి హైదరాబాద్, పురావస్తు శాఖ సూపరింటెండెంట్ లూహీర్కు ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. లేపాక్షికి సంబంధించిన గొప్ప ఫొటోలు, యూనివర్సల్ వాల్యూస్, స్థలం, డ్రాయింగ్స్‌ను యునెస్కో ఫార్మాట్లో పంపాలని ఆదేశించిందని తెలిపారు. అవి పంపిన వెంటనే తుది జాబితాలో లేపాక్షి చేరుతుందని పేర్కొన్నారు. అయితే ఈనెల 3న ఢిల్లీలోని ప్రధాని కార్యాలయ కార్యదర్శి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రాకేష్తివారీకి వినతిపత్రాలు సమర్పించినట్టు ఆయన వివరించారు. -
నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు రాక
అనంతపురం సెంట్రల్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సోమవారం జిల్లాకు రానున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిలమత్తూరు మండలంలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల పరిశీలనకు ఆయన వెళ్లనున్నారని పేర్కొన్నారు. చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు ప్రాంతంలో 2008లో రైతుల నుంచి బలవంతంగా సేకరించిన 8,844 ఎకరాలు నాలెడ్జ్ హబ్‌కు ప్రభుత్వం అప్పగించిందనీ, అయితే సదరు సంస్థ ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పైగా ఆ సంస్థ ఈ భూములను తాకట్టు రూ.700 కోట్లు వరకూ రుణం పొందినట్లు తెలిపారు. ఇప్పటికీ అనేక మంది రైతులకు పరిహారం అందలేదనీ, ఈ సందర్భంగా ఈ భూనిర్వాసితులను పరామర్శించేందుకు మధు జిల్లా వస్తున్నట్లు రాంభూపాల్ తెలిపారు. -
నేత్రపర్వం..రథోత్సవం
మార్మోగిన శివనామస్మరణ లేపాక్షి : లేపాక్షి మహాశివరాత్రి ఉత్సవాల్లో శనివారం రథోత్సవం అశేష భక్తజనసందోహం మధ్య నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆగమీకులు సునీల్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు సూర్యప్రకాష్, నరసింహశర్మ అభిషేకార్చన, రథసంప్రోక్షణ, దవనోత్సవం నిర్వహించారు. అనంతరం శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను వేదబ్రాహ్మణులచే పల్లకీలో మోసుకుని వచ్చి రథంలో కొలువుదీర్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బస్టాండ్ వద్ద రథాన్ని లాగారు. 1.30 గంటలకు ఎగువపేటలోని నందివిగ్రహం వద్దకు చేరుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ హనోక్, గ్రామ సర్పంచ్ జయప్ప, వైఎస్సార్సీపీ నాయకులు నారాయణస్వామి, ఆదినారాయణ, టైలర్ మూర్తి, నారాయణ, టీడీపీ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు చలపతి, చిన్న ఓబన్న పాల్గొన్నారు. -
అద్భుత శిల్పాలకు ఆలవాలం
లేపాక్షి : సుందర పర్యాటక క్షేత్రమైన లేపాక్షి.. హిందూపురం పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన దేశంలో మహిమాన్వితమైన దివ్యశైవ క్ష్రేతాలు 108 ఉన్నాయి. వాటిలో ఒకటి లేపాక్షి. పాపనాశేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం, స్తంభం మలిచిన తీరు మహాద్భుతం. త్రేతాయుగంలో రావణునికి, జటాయువుకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. సీతమ్మను వెతుక్కుంటూ వచ్చిన శ్రీరాముడు ఆ పక్షి నిచూసి ‘లే పక్షీ’ అని పిలిచి దానికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రాంతమే లేపాక్షిగా మారిందట. దేశంలోనే అతి పెద్ద నంది విగ్రహం ఇక్కడే ఉంది. ఇటువంటి పుణ్య క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మాఘ బహుళ ద్వాదశి నుంచి పాల్గుణ శుద్ధ పాఢ్యమి వరకు జరుగుతాయి. ఈ నెల 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 27వ తేదీన ముగుస్తాయి. ఒకే రాతిపై ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం: ఒక పెద్ద బండపై ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం చెక్కడం చూస్తే చూసిన ప్రతి పర్యాటకులు, భక్తులు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఈ సర్పము మూడు చుట్టలతో ఏడు పడగలతో, చుట్టలపై మధ్యన శివలింగంతో యాత్రికులను ఆకర్షిస్తోంది. శిల్పి ఇంటికి భోజనానికి వచ్చారని, అయితే తన తల్లి వంట చేయలేదని, కాసేపు ఉంటే భోజనం చేస్తామని ఆమె చెప్పి వంట చేయడం ప్రారంభించింది. అంతవరకు ఏమి చేయాలని వంటశాలకు ఎదురుగా ఉన్న పెద్దబండపై ఏడుశిరస్సుల నాగేంద్రుని విగ్రహం చెక్కినట్టు, భోజనానికి రమ్మని పిలవడానికి బయటకు తల్లిరాగా పెద్ద నాగేంద్రుని విగ్రహం చూసి ఆశ్చర్యం చెందిందని స్థానికులు చెబుతున్నారు. తల్లి దిష్టి శిల్పంపై పడడం వల్ల ఈ విగ్రహానికి చీలిక వచ్చిందని పేర్కొంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నంది విగ్రహం ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహానికి ఎదురుగా పర్లాంగు దూరంలో ఒకే రాతిపై మలచిన నంది విగ్రహం వుంది. ఇంతటి అందమైన విగ్రహం భారత దేశంలో ఎక్కడా లేదని చెబుతుంటారు. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడువుతో పైకి లేచి వస్తున్నట్టు కనబడతుంది. ఈ నంది శరీర భాగమంతా అలంకరించిన గుడ్డలతో, గజ్జెలు, గంటలు, మువ్వలతో, వచ్చే యాత్రికులను చాలా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని చూసిన అడవిబాపిరాజు ‘ లేపాక్షి బసవయ్యా లేచి రావయ్యా’ అన్నాడు. విరుపణ్ణ కులదైవం వీరభద్రస్వామి లేపాక్షి ఆలయాన్ని నిర్మించినది విరుపణ్ణ, వీరుణ్ణలు. వీరభద్రస్వామి వీరికి కులదైవం. గర్భగుడి పైకప్పులో సుమారు 24 అడగుల పొడువు, 14 అడగుల వెడల్పుతో వీరభద్రస్వామి వర్ణచిత్రం చిత్రీకరించారు. ఈ వర్ణ చిత్రం భారతదేశంలోనే పెద్ద చిత్రముగా పేరుగాంచినది. ఒక పక్క విరుపణ్ణ మరో పక్క విరుపణ్ణ భార్య పుత్రులతో స్వామిని పూజించినట్టుగా చూపించినారు. స్తంభంలో వెలసిన దుర్గాదేవి దుర్గాదేవి విగ్రహం ఒక స్తంభంలో చెక్కబడినది. శిల్పులు ఈ శిల్పాన్ని మలిచే సమయంలో దుర్గాదేవి భక్తులపై ఆవాహమై నేను ఈ స్తంభంలో ఉందునని, నాకే నిత్య పూజలు, ఆరాధనలు జరిపించవలెనని కోరిందని భక్తుల నమ్మకం. స్తంభంలో ఉన్న దుర్గాదేవి విగ్రహానికి అలంకరణలు, పూజలు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని దుర్గాదేవి ఆలయంగా కూడా స్థానికులు పిలుస్తున్నారు. అసంపూర్తిగా కల్యాణ మంటపం పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మంటపం అంసపూర్తిగానే ఉంది. ఆలయ నిర్మాణ కర్త విరుపణ్ణ ఖజానా పైకం అనవసరంగా ఖర్చు పెట్టాడని, ఆలయ నిర్మాణానికి ప్రభువుల అనుమతి తీసుకోలేదని, విరుపణ్ణ మీద గిట్టని వారు కొందరు రాజుతో లేనిపోని నిందలు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ మాటలను రాయలువారు నిజమని నమ్మి ఆగ్రహించి విరుపణ్ణ కళ్లు తొలగించాలని ఉత్తర్వులు చేసినారని, ఆ ఉత్తర్వులు విన్న విరుపణ్ణ నా కన్నులను నేనే తీసి నా స్వామికి అర్పించెదనని రెండు కళ్లు ఊడబెరికి గోడకు విసిరినట్టు, దీనివల్ల కల్యాణ మంటపం అంసపూర్తిగా మిగిలిపోయిందని చెబుతున్నారు. -
గజాగుండం పరిశీలన
లేపాక్షి : లేపాక్షి ఆలయానికి పడమటి భాగంలో ఉన్న గజాగుండం (కోనేరు)ను గురువారం సాయంత్రం దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ రఘురామయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పుల్లయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సతీష్‌కుమార్ పరిశీలించారు. గజాగుండం (కోనేరు)ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి గతేడాది దేవాదాయ శాఖ సీజీఎఫ్ కింద రూ.30 లక్షల నిధులు మంజూరు అయ్యాయన్నారు. అయితే నంది ఉత్సవాల సందర్భంగా రూ.10.02 లక్షల నిధులు ఖర్చు చేశారని చెప్పారు. మిగిలిన రూ. 20 లక్షలతో కోనేరు అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వారి వెంట ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఆలయ గుమాస్తా నరసింహమూర్తి ఉన్నారు. -
లేపాక్షి ఆలయంలో పశుగణాభివృద్ధి అధికారులు
లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయాన్ని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ దొరబాబు, జిల్లా చైర్మన్ రాధాకృష్ణయ్య శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేష పూజలు చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన లేపాక్షి ఆలయంలో చిత్రీకరించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, కట్టడాలు అద్భుతంగా నేటికీ ఉట్టిపడేలా ఉన్నాయన్నారు. ఆలయంలోని నాట్య మండపం, లతామండపం, కల్యాణమండపం, సోమవార మండపాలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆలయాధికారులు వారిని సన్మానించారు. -
బతుకు చూపిన ‘పాడి’
వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాతలు మానసికంగా నలిగిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్ట లేకపోయింది. పంట సాగు తప్ప మరో పని చేతకాని రైతన్నలు ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సారించారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పాడిపోషణ వైపు ఆసక్తి పెంచుకున్న అన్నదాత... ఆర్థికంగా బలపడుతూ వచ్చాడు. తనతో పాటు మరికొన్ని కుటుంబాలకు బతుకు చూపుతున్నాడు. - లేపాక్షి (హిందూపురం) లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ పరిధిలోని కె.బసవనపల్లి రైతులు పాడిపరిశ్రమలో రాణిస్తున్నారు. 76 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ప్రతి కుటుంబానికి మూడు, నాలుగు పాడి ఆవులు ఉన్నాయి. ఈ ఒక్క గ్రామం నుంచే ప్రతి రోజూ ఉదయం 400 లీటర్లు, సాయంత్రం మరో 450 లీటర్ల పాలు డెయిరీలకు చేరుతోంది. ప్రభుత్వ ప్రోత్సహం లేకున్నా.. కె.బసవనపల్లిలోని 90 శాతం మంది పాడి పరిశ్రమనే జీవనాధారంగా చేసుకున్నారు. ప్రత్యేక శ్రద్ధతో మేలుజాతి పాడి ఆవులను కొనుగోలు చేసి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లో ఉంచుతున్నారు. తరచూ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయిస్తుంటారు. పోషకాహారమైన దాణాతో పాటు పచ్చిగడ్డిని అందజేస్తున్నారు. పాడి ఆవుల పెంపకం చేపట్టిన తర్వాతనే గ్రామంలోని రైతులు ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏ మాత్రం ఆశించకుండా స్వయం కృషితో అనూహ్యమైని విజయాలను ఇక్కడి రైతులు సొంతం చేసుకుంటున్నారు. పితికిన పాలను అలాగే డెయిరీలకు తరలిస్తుంటారు. అంతేకాక ఆ పాలలో ఎల్ఆర్, ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను పరిశీలించేందుకు రైతులు సొంతంగా ఓ ఎనలైజర్నే ఏర్పాటు చేసుకున్నారు. పాడి ఆవులే ఉపాధి మా ఇంటిలో ఉన్న ఐదుగురుమూ పాడి పోషణపై ఆధారపడి ఉన్నాం. తొమ్మిది ఆవులు, మూడు లేగదూడలు ఉన్నాయి. వాటి బాగోగులు చూడడం, స్నానాలు చేయించడం రోజూ వారి పనిగా పెట్టుకున్నాం. తరచూ వైద్య పరీక్షలు చేయిస్తుంటాం. తొమ్మిది ఆవుల నుంచి రోజూ 140 లీటర్ల పాలు సేకరిస్తున్నాం. దీని ద్వారా రోజూ రూ. 3వేలు ఆదాయం వస్తే అందులో నుంచి పశుగ్రాసం, దాణా కోసం రూ. 1,500 పోతోంది. – అశ్వత్థప్ప, బసవనపల్లి పశుగ్రాసం కొరతగా ఉంది నా వద్ద రెండు పాడి ఆవులు, రెండు లేగదూడలు ఉన్నాయి. ప్రతి రోజూ పది లీటర్ల పాలను డెయిరీకి అందజేస్తున్నాను. పితికిన పాలను అలాగే తీసుకెళుతుంటాను. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్య లేకుంటే ఇంకా మంచి ఆదాయం ఉంటుంది. – శ్రీనివాసులు, బసవనపల్లి -
విద్యార్థులకు ‘పరీక్ష’
– లేపాక్షిలో కళాశాల..చిలమత్తూరులో పరీక్షలు – అన్ని వసతులు ఉన్నా...పరీక్ష కేంద్రానికి నోచుకోని వైనం అనంతపురం ఎడ్యుకేషన్ : లేపాక్షి జూనియర్ కళాశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు వచ్చాయంటే.. వారికి ‘పరీక్షే. లేపాక్షిలో కళాశాల ఉంది. కళాశాల సెంటర్‌కు నోచుకోకపోవడంతో 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిలమత్తూరుకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షలొచ్చాయంటే వారికి నిజమైన అవస్థలే. ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 1 నుంచి 16 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలకు 66 కేంద్రాలు, థియరీ పరీక్షలకు 99 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వసతులు ఉన్న ప్రతి ప్రభుత్వ కళాశాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్నది నిబంధన. ‘అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది లేపాక్షి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పరిస్థితి. కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 90 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 121 మంది చదువుతున్నారు. తరగతి గదులు, ల్యాబ్ గదులతో పాటు పరీక్షలు నిర్వహించేందుకు అన్ని వసతులూ ఉన్నా...ఇక్కడ పరీక్ష కేంద్రానికి అనుమతి రాలేదు. 15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే.. : విద్యార్థులు సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిలమత్తూరుకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ కళాశాల 2001లో ప్రారంభమైంది. అయితే శాశ్వత భవనాలు లేక విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ పరిస్థితుల్లో ఆర్డీటీ సహకారం అందించి రూ.కోటి నిధులు మంజూరు చేసింది. 2013–14లో ఒక బ్లాక్‌లో నాలుగు తరగతి గదులు, మరోబ్లాక్‌లో రెండు తరగతి గదులతో పాటుతో పాటు స్టాఫ్, ప్రిన్సిపల్, లైబ్రెరీలకు ఒక్కో గది చొప్పున.. ల్యాబ్‌కు రెండు గదులు నిర్మించారు. మరిన్ని గదులు నిర్మాణంలో ఉండడంతో ఆ విద్యా సంవత్సరం ఇక్కడ పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం అన్ని వసతులూ ఉన్నా ఏటా ఇక్కడ కేంద్రాన్ని రద్దు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా సెంటర్‌కు నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చిలమత్తూరుకు వెళ్లి పరీక్షలు రాయాలంటే ఇబ్బందేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.విశేషమేమంటే కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణ ప్రస్తుతం కళాశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ (కడప)గా ఎఫ్ఏసీగా పని చేస్తున్నారు. కానీ సెంటర్ మంజూరుకు నోచుకోలేదు. ఆర్ఐఓ వెంకటేశులు ఏమంటున్నారంటే... వసతులు లేమి కారణంగా నాలుగేళ్లుగా లేపాక్షిలో సెంటర్‌కు అమనుతి లేదు. ఆర్డీటీ సహకారంతో నూతనంగా గదులు నిర్మాణాలు జరిగినా...గతేడాది మధ్యలో మాకు అప్పగించారు. ఈసారి పరీక్ష కేంద్రంగా ఇవ్వలేకపోయాం. వచ్చే ఏడాది నుంచి పరీ„ýక్ష కేంద్రంగా అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. -
లేపాక్షిలో సందడే సందడి
లేపాక్షి : లేపాక్షికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయా ఆలయాల్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఏ మండపం చూసినా వందలాది మంది భక్తులు, యువకులు, విద్యార్థులతో నిండిపోయింది. ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం, కల్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరులు, నాట్య మండపం, లతా మండపం, నంది విగ్రహం వద్ద పర్యాటకులు, భక్తులు ఫొటోలు తీయించుకోడానికి పోటీ పడ్డారు. -
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కసరత్తు
లేపాక్షి : లేపాక్షిని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఏపీ టూరిజం శాఖ రీజినల్ డైరెక్టర్ గోపాల్ వెల్లడించారు. ఆయన లేపాక్షిని మంగళవారం సందర్శించారు. పర్యాటక రంగంగా తీర్చిదిద్దడానికి ఆలయం వెనుక భాగంలోని గజాగుండం కోనేరును పరిశీలించారు. అక్కడి మురుగునీరు తొలగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అవకాశంపై ఆరా తీశారు. అనంతరం విరుపణ్ణ, వీరణ్ణ పార్కులు, ఆలయానికి కిలో మీటరు దూరంలోని జఠాయువు మోక్షఘాట్ సందర్శించారు. అక్కడ ఎలాంటి వసతులు కల్పిస్తే పర్యాటకులను ఆకర్షిస్తారనే కోణంపై ఆరా తీశారు. డివిజినల్ మేనేజర్ బాపూజీ, జిల్లా ఇన్చార్జ్ బాలభాస్కర్, ఈఈ ఈశ్వరయ్య, డీఈఈ కుమార్, ఏఈఈ నారాయణరావు, స్థానిక మేనేజర్ లక్ష్మణ్‌రావు, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంపీపీ హనోక్, గ్రామసర్పంచ్ జయప్ప, ఎంపీటీసీ సభ్యులు చలపతి, చిన్న ఓబన్న ఆయన వెంట ఉన్నారు. -
అ‘పూర్వ’సమ్మేళనం
- నవోదయ పూర్వ విద్యార్థుల కలయిక - గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వైనం లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆదివారం ఉదయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా డిసెంబరు 4న అన్ని నవోదయ విద్యాలయాల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. అందులో భాగంగా లేపాక్షి నవోదయ విద్యాలయంలో విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దేశ, విదేశాల్లో వివిధ ఉద్యోగాల్లో పని చేస్తున్న పూర్వ విద్యార్థులు హాజరై వారి నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. సుమారు 28 ఏళ్ల నాటి స్నేహితులు కలిసి వారు విద్యార్థి దశలో చేసిన చేష్టలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ లేపాక్షి జవహర నవోదయ విద్యాలయం అభివృద్ధికి తమ వంతు సాయం అందజేస్తామన్నారు. అనంతరం ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ మాట్లాడుతూ లేపాక్షి విద్యాలయంలో చదవుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎలా బతకవచ్చో నేర్చుకున్నాం – వనజ, శాస్త్రవేత్త, లండన్ ఈ విద్యాలయంలో చదువుతో పాటు ఎలా బతకాలో నేర్చుకున్నాను. ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా బతకవచ్చనే విషయాన్ని గ్రహించాను. 1989 నుంచి 1996 వరకు ఈ విద్యాలయంలో చదివాను. ప్రస్తుతం లండన్‌లో రీసెర్చిగా పని చేస్తున్నా. క్రమశిక్షణకు నిలయం – బాలాజీ, ఎస్డీఈ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఈ విద్యాలయం క్రమశిక్షణకు నిలయం. ఏ సమయానికి ఏం చేయాలనే విషయాలు నేర్చుకున్నాం. విద్యాలయంలో 1990 నుంచి 97 వరకు చదువుకున్నాను. అయితే చిన్న వయస్సులోనే క్రమశిక్షణ నేర్చుకోవడంతో ఉన్నత స్థానంలో స్థిరపడ్డాను. ఉన్నత విలువలు నేర్చుకున్నా – కేకే రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, హైదరాబాద్ నవోదయ విద్యాలయంలో చదువుకుని ఉన్నత విలువలు నేర్చుకున్నాను. ఫలితంగా క్రీడల్లో బాగా రాణించాను. 1991 నుంచి 98 వరకు ఈ విద్యాలయంలో చదివాను. -
ప్రజాస్వామ్యంలో పత్రికారంగం ఎంతో కీలకం
లేపాక్షి : ‘ప్రజాస్వామ్యంలో పత్రికలు, టీవీ ప్రసారాలు లేకుంటే అవినీతి, అక్రమాలు, దోపిడీలు పెచ్చుమీరేవి. పత్రికలు ఉండటంతోనే అవినీతి నిర్మూలనలో పత్రికా రంగం ఎంతో కీలకం’ అని తహశీల్దార్ ఆనందకుమార్ అన్నారు. గురువారం ఉదయం లేపాక్షిలో మండల జర్నలిస్టుల అసోషియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జర్నలిస్టుల దినోత్సవం నిర్వహించారు. వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి ప్రజలకు వారధిలా ఉంటారన్నారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలు మూడు స్తంభాలుగా ఉంటే కనిపించని నాలుగో స్తంభమే మీడియా వ్యవస్థ అని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ నాగరాజు, ఎంపీపీ హనోక్ మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి సీనియర్ పాత్రికేయులను అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఎస్ఐ శ్రీధర్, హిందూపురం నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, కార్యదర్శి గోవర్దన్‌బాబు, స్థానిక అధ్యక్షుడు నాగభూషణ, నాయకులు అశోక్, నాగభూషణ, సందీప్, అల్లీపీరా, ప్రదీప్, శశాంక్ ఆయా పార్టీల కన్వీనర్లు నారాయణస్వామి, ప్రభాకర్‌రెడ్డి, శివప్ప, నరసింహప్ప, ఎంపీటీసీ సభ్యులు చిన్న ఓబన్న, చలపతి, నాగభూషణ పాల్గొన్నారు. -
శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహించాలి
లేపాక్షి : ప్రసిద్ధి చెందిన లేపాక్షి దేవాలయంలో అక్టోబర్ 1 నుంచి 12వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రుల ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బాలకష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తెలిపారు. గురువారం సాయంత్రం దేవాలయంలో అధికారులు, పాలకులు, అర్చకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు ఒక్కో పంచాయతీ వారు పూజలు నిర్వహించడానికి ముందుకు రావాలన్నారు. పూజలు నిర్వహించడానికి మండల వ్యాప్తంగా నాలుగు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణకు ఎమ్మెల్యే సొంత నిధులు రూ.30 వేలు ఇస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంపీపీ హనోక్, జెyీ ్పటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ కిష్టప్ప, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంపియన్ లేపాక్షి
లేపాక్షి : అనంతపురం జిల్లా లేపాక్షి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అకడమిక్ 2016 పోటీలు గురువారం ముగిశాయి. కార్యక్రమానికి ప్రిన్సిపల్ వాదిరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎంపీపీ హనోక్ హాజరయ్యారు. రంగనాయకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న మేధాశక్తిని వెలికి తీయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 29 పాఠశాలలు పాల్గొనగా 19 స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు విజేతలై 33 33 బహుమతులను దక్కించుకున్నారు. ఇందులో లేపాక్షి గురుకుల పాఠశాల విద్యార్థులు ఆరు బహుమతులను సాధించి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. బహుమతులు అందుకున్న పాఠశాలల వివరాలు టెక్కలి (ఒకటి), అంపోలు (3), నెలమర్ల (2), సింహాచలం (2), కాకినాడ (1), నరసాపురం (1), మార్కాపురం (1), దొరవారిసత్రం (1), సత్యవేడు (1), సదుం (1), ఉదయమాణిక్యం (2), కలికిరి (1), పీలేరు (1), టేకులోడు (2), లేపాక్షి (6), పేరూరు (1), నందలూరు (2), అరేకల్ (1), నెరవాడ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను సత్కరించారు. -
జర్నలిస్టుల వల్లే ప్రజా సమస్యల పరిష్కారం
లేపాక్షి : సమాజంలో ప్రజా సమస్యలపై జర్నలిస్టుల పని తనం ప్రజా సమస్యల పరిష్కారానికి నిదర్శనమని, అహర్నిషలు ప్రజా శ్రేయస్సు కోసం శ్రమించే జర్నలిస్టుల సేవలు అభినందనీయమని తహశీల్దార్ ఆనందకుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లేపాక్షి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన జర్నలిస్టుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో శాసనం, కార్యనిర్వహణ, న్యాయశాఖలకు అనుసంధానంగా మీడియా రంగం పనిచేస్తుందన్నారు. మీడియా రంగానికి ఫోర్త్ స్టేట్‌గా గుర్తింపు ఉందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా పనిచేస్తుందని చెప్పారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలపై సమాజాభివద్ధి కోసం పని చేయడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి తమ పరిధిలో శక్తివంచన లేకుండా సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, డాక్టర్ శ్రీదేవి, ఎంఈఓ నాగరాజునాయక్ , సీనియర్ జర్నలిస్టులు మల్లికార్జున, ఆనందప్ప, సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్లు ఇంటి స్థలం, ప్రెస్‌క్లబ్ ఏర్పాటుకు లేపాక్షిలో 5 సెంట్లు స్థలం కేటాయించాలని కోరారు. అనంతరం జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి సురేంద్రనాయక్, ఏపీఓ లక్ష్మిభాయి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మురళీ, జర్నలిస్టులు గోవర్దన్‌బాబు, సురేంద్రరెడ్డి, అశోక్, సందీప్, శశాంక్, హనుమంతరెడ్డి పాల్గొన్నారు. -
బడి ఎన్నికల్లో పచ్చ రుబాబు
ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యం 85 స్కూళ్లలో మళ్లీ వాయిదా అనంతపురం ఎడ్యుకేషన్ : స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు బరి తెగించారు. విద్యా శాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులను సైతం బెదిరిస్తున్నారు. తమ వాళ్లనే గెలిపించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మా వాళ్లనే ఎస్ఎంసీ చైర్మన్లుగా నియమించాలి. మా వారు గెలిచేందుకు అవకాశం లేకపోతే ఏదో సాకు చూపి వాయిదా వేయండి..’ అంటూ మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశిస్తున్నారు. ఫలితంగా గతంలో పలు స్కూళ్లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాంటి చోట్ల సోమవారం మళ్లీ నిర్వహించారు. ఇప్పుడూ అదే సీన్ పునరావృతమైంది. జిల్లాలో మొత్తం 3,866 పాఠశాలలు ఉన్నాయి. ఈ నెల ఒకటిన 3,670 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు 196 చోట్ల వాయిదా పడ్డాయి. వీటిలో సోమవారం 111 చోట్ల తిరిగి నిర్వహించారు. వీటిలో ఎక్కువగా తమ ప్రత్యర్థులు చైర్మన్లుగా గెలుస్తారనే ఉద్దేశంతో 85 చోట్ల ఎన్నికలు జరగకుండా అధికార పార్టీ నేతలు వాయిదా వేయించారు. లేపాక్షి మండలం మైదుగోళం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఆదేశాలతో కిందిస్థాయి కార్యకర్తలు దౌర్జన్యానికి దిగి ఎన్నిక వాయిదా వేయించారు. చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లిలోనూ ఇదే పరిస్థితి. ఆత్మకూరు మండలం బి.యాలేరులో కోరం లేక వాయిదా పడింది. -
ఆలయంలో భక్తుల సందడి
లేపాక్షి : పర్యాటక కేంద్రం లేపాక్షి దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి ఎక్కువైంది. శ్రావణ మాసం కావడంతో అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని గైడ్లు ఆలయ విశిష్టతను గురించి తెలియజేయడంలో నిమగ్నం కావడం విశేషం. -
నిలువునా మోసపోయాం
– ‘గడపగడపకూ వైఎస్సార్’లో మహిళల ఆవేదన లేపాక్షి : మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి నిలువునా మోసపోయామని హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయారు. శనివారం లేపాక్షి మండలం గోపిందేవరపల్లి, శిరివరం, తిరుమలదేవరపల్లి గ్రామాల్లో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారని ప్రజలను అడిగారు. ఈప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారో మీరే (ప్రజలు) నిర్ణయించాలని ఆయన కోరారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యల గురించి నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయారు. కంచిసముద్రం సిండికే ట్ బ్యాంకులో తనకు తెలియకుండానే ఓ వ్యక్తి రూ.23 వేలు అప్పు చేశాడని గోపిందేవరపల్లికి చెందిన గంగమ్మ వాపోయింది. తనకు ఆ బ్యాంకులో రూ.30 వేలు మాత్రమే అప్పు ఉందని చెప్పింది. కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నారాయణస్వామి, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమాన్, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజిని, పట్టణ మíß ళ అధ్యక్షురాలు నాగమణి, మండల నాయకులు ప్రభాకర్, బాలు, సిరాజ్, శంకర్‌రెడ్డి, గోపికృష్ణ, కూతుల శీన, నరసింహప్ప, స్థానిక నాయకులు కిష్టప్ప, తిప్పన్న, హనుమప్ప, సుమాన్, గోపాల్‌రెడ్డి, మూర్తి, జయరామిరెడ్డి, మారుతీ, ఇంతియాజ్, బషీర్, శ్రీరామిరెడ్డి, వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు. రూ.5 వేలు ఆర్థికసాయం లేపాక్షి మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన సాలమ్మ అనే నిరుపేద మహిళకు హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. సాలమ్మ నివాసం ఉండడానికి ఇల్లు లేదని, సిమెంటు రేకులు వేసుకుని జీవనం గడపాలన్నా స్థోమత లేదని ఈనెల 3న శిరివరం గ్రామంలో చేపట్టిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయింది. ఆమె పరిస్థితి చూసి చలించిన నవీన్‌నిశ్చల్ శనివారం తనవంతు సాయంగా రూ.5 వేలు నగదు అందజేశారు. అదేవిధంగా శిరివరం గ్రామానికి చెందిన వృద్ధురాలు రామక్కకు స్టీల్ ఊతకర్రలను అందజేశారు. -
లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి దేవాలయంలో శనివారం పర్యాటకులు, భక్తుల సందడి నెలకొంది. హిందూపురం, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలోని శిల్పాలను, చిత్రలేఖనాలు, ఆద్బుతమైన కట్టడాలను, తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
లేపాక్షి ఆలయ హుండీ లెక్కింపు
లేపాక్షి : లేపాక్షి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 2016 ఫిబ్రవరి 29 నుంచి జూలై 27వ తేదీ వరకు హుండీని లెక్కించగా రూ.62,802 ఆదాయం వచ్చిందన్నారు. హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రామతులసి, మేనేజర్ నరసింహమూర్తి, గ్రామపెద్దలు రామాంజినేయులు, రవీంద్ర, అంజినరెడ్డి, అర్చకులు నరసింహశర్మ, సూర్యప్రకాష్‌రావు, పురావస్తు శాఖ సిబ్బంది రాము తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
లేపాక్షి : స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు బుధవారం సాయంత్రం బైకును కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కల్లూరు గ్రామానికి చెందిన దస్తగిరి (35), అతని కుమారుడు ఇర్ఫాన్ (17) బైకుపై లేపాక్షి నుంచి కల్లూరుకు వెళ్తున్నారు. అయితే (ఏపీ 02 1619) కారు అతి వేగంగా వెనుక వైపు నుంచి వచ్చి Éీ కొంది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరికీ తల, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. -
లేపాక్షి షోరూమ్‌లో వెడ్డింగ్ ఫర్నీచర్
-
'కేంద్రం నిధులతో లేపాక్షి అభివృద్ధి'
కేంద్ర ప్రభుత్వం నిధులతో లేపాక్షి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆదివారం అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... మతమనేది వ్యక్తిగతమని, దుర్గాదేవిని అవమానించడం వంటి ఘటనలు యూనివర్సిటీల్లో చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. దేశవ్యాప్తంగా 760 యూనివర్సిటీలు ఉంటే కేవలం రెండు యూనివర్సిటీల్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. -
లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా!
ఫిబ్రవరి 27, 28 లేపాక్షి ఉత్సవాలు రాళ్లు కళ్లు విప్పితే లేపాక్షి... రాళ్లు రాగాలు పలికితే లేపాక్షి... రాళ్లు తీగ సాగితే లేపాక్షి... రాళ్లు హొయలు పోతే లేపాక్షి... విజయనగర రాజ్యంలో శిల్పులు ఉలితో రాళ్లకు చక్కిలిగింతలు పెడుతూ ప్రాణం పోస్తారని వర్ణించారు కవులు. ఆలయాలపై అలా ప్రాణం పోసుకున్న శిల్పాలు, చిత్రాలు దాదాపు ఐదు శతాబ్దాలుగా లేపాక్షి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఒక చారిత్రక పట్టణంగా భాసిల్లుతోంది. లేపాక్షి హిందూపురం నుంచి 15 కి.మీ, బెంగళూరు నుంచి 120 కి.మీ దూరంలో ఉంటుంది. పట్టణ ప్రవేశ మార్గంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. దీనినే లేపాక్షి బసవయ్య అంటారు. లేపాక్షి బసవయ్య శిల్పం మెడలో పూసల హారాలు, గంటలు, రిక్కించిన చెవులు, లేవబోతూ కాళ్లను సరిచేసుకుంటున్న భంగిమ, మెడలో గండభేరుండ హారం ఉన్న ఆ నంది చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. అందుకే అడవి బాపిరాజు పరవశించిపోయి ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య’ అంటూ తన మాటల సరాన్ని ఈ నంది మెడలో వేశాడు. ఈ విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం (లేపాక్షి ఆలయం) ఉంది. శివకేశవులు ఒక్కరే! ఆధ్యాత్మికంగా లేపాక్షి ఆలయం ప్రత్యేకతలు అనేకం. కొన్ని శతాబ్దాలుగా వీరశైవం-మహా వైష్ణవం పేరిట రెండుగా చీలిపోయిన సమాజాన్ని విజయనగర రాజులు కలపదలచుకున్నారు. శివుడికి విష్ణువుకు మధ్య విభేదాలు లేవని నిరూపిస్తూ ఈ ఆలయంలో శివకేశవులను ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. మూలవిరాట్టు వీరభద్రస్వామి అయితే, గుడిలోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. ఆలయం బయటి ప్రాకారాల్లో గణపతి, నాగేంద్రుడి పెద్ద రాతి విగ్రహాలు చూడ ముచ్చట గొలుపుతుంటాయి. చెలువములన్నీ చిత్రరచనలే! అంతంత రాతిపలకలు, స్తంభాలు, పైకప్పుల రాతిదూలాలు, పైకప్పుల మధ్య శతపత్ర దళ శిలా చిత్రణలు ఎలా చేశారో ఊహిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. లేపాక్షి ఆలయం పైకప్పుల లోపలివైపు వేసిన వర్ణచిత్రాలను చూడటానికి రెండుకళ్లు చాలవు. తలపెకైత్తి పైకప్పు వైపు చూస్తూ నడుస్తుంటే ఎన్నెన్ని పౌరాణిక గాథలో! స్త్రీల తలకొప్పులు, జడకుచ్చుల నుంచి... పెద్ద పెద్ద రథాల వరకు ఈ చిత్రాల్లో ఎక్కడా ఏ చిన్న అంశం వదలకుండా నాటి ఆచారాలు, వేషాలను చిత్రకారులు ప్రతిబింబించారు. గోడమీద నిల్చుని బొమ్మలు వేయడమే కష్టం. అలాంటిది అంత ఎత్తులో వ్యతిరేక దిశలో కొప్పును వర్ణశోభితం చేయడమంటే మాటలు కాదు. ఈ చిత్రాల్లోని డిజైన్లే నేటికీ కలంకారీ కళలో వాడుకలో ఉన్నాయి. మాట్లాడే శిల్పం - వేలాడే స్తంభం గర్భగుడి గోడలపై పురాణగాథల శిల్పాలు, సభామండపం, నాట్యమండపం, ముఖమండపం, అసంపూర్తిగా ఉండిపోయిన శివపార్వతుల కళ్యాణమండపం... లేపాక్షి ఆలయంలో ఎక్కడ చూసినా శిల్పాలు అణువణువునా మనతో ఊసులాడుతూనే ఉంటాయి. ఇక్కడ కనిపించే తీగలు, ఉయ్యాల కొక్కేలు, అన్నం కలపడానికి పళ్లేలు, రంగులు కలపడానికి గిన్నెలు, వంటశాలలో అల్మరాలు... అన్నీ రాతితో నిర్మించినవే. గర్భగుడి ముందు మండపంలో నేలను తాకీ తాకనట్లుండే వేలాడే స్తంభం ఈ గుడికి ప్రత్యేక ఆకర్షణ. నిజానికి చాలాకాలంగా అది పూర్తిగా వేలాడుతుంటే స్వాతంత్య్రానికి పూర్వం ఒక తుంటరి ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరిపాడని, ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలందని ఒక కథనం. లే... పక్షీ..! సీతను అపహరించుకుపోతున్న రావణుడిని జటాయువు అడ్డుకోవడానికి విఫలయత్నం చేసింది. రెక్కలు తెగిన జటాయువు లేపాక్షికి దగ్గరలోని బింగిపల్లి గ్రామ సమీపాన పడిపోయింది. సీతాన్వేషణలో వచ్చిన రాముడు జటాయువును ‘లే... పక్షీ..!’ అనడంతో ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరొచ్చిందని ప్రతీతి. మరో కథనం ప్రకారం... అచ్యుతరాయలు వద్ద కోశాధికారిగా పనిచేసే విరూపణ్ణ ఈ ఆలయాన్ని రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో నిర్మించాడు. కళ్యాణ మంటపం నిర్మాణ సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేశారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్ష ను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసి కళ్యాణమంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడపై ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు. అలా లోప-అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు. ఆలయ నిర్మాణానికి ముందు ఇక్కడ కూర్మశైలం అనే కొండ ఉండేది. ఈ కొండపై విరూపణ్ణ ఏడుప్రాకారాలతో ఆలయాన్ని కట్టించాడు. అయితే, ఇప్పుడు మూడు ప్రాకారాలు మాత్రమే మిగిలాయి. మిగిలినవి కాలగర్భంలో కలసిపోయాయి. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనాలు చెక్కారు. వీటి ద్వారా ఈ దేవాలయ పోషణకు భూదానం చేసిన దాతల వివరాలు తెలుస్తాయి. పై కప్పుల మీద లేపనంతో వేసిన చిత్రాలన్నింటిలో కళ్లకే ప్రాధాన్యమివ్వడంతో లేపనం - అక్షి, లేపాక్షి అయి ఉంటుందన్న వాదన కూడా ఉంది. అయితే జటాయువు పడ్డ ప్రాంతం ఇక్కడ దర్శనీయ స్థలం కాబట్టి ఎక్కువ మంది జటాయువుతో ముడిపడ్డ లేపాక్షి వాదననే నమ్ముతున్నారు. - పమిడికాల్వ మధుసూదన్ వసతులు పెంచాలి: లేపాక్షిలో సందర్శకులకు సరైన వసతుల్లేవు. టూరిజం శాఖ వారి హరిత రిసార్ట్ ఉంది. కాని ఉన్న గదులు పర్యాటకులకు చాలడం లేదు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులకు ఇంగ్లిషు, హిందీ ఇతర భాషల్లో ఇక్కడి విశేషాలను చెప్పేందుకు గైడ్లు ఎవరూ లేరు. ఆలయం, ఊరి కష్టాలను చూసి చలించిన కొంత మంది స్థానికులు ‘సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్’ పేరిట ఒక సంఘంగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వసతులు పెంచితే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులతో లేపాక్షి కళకళలాడుతుందన్నది వీరి నమ్మకం. ఎలా వెళ్లాలంటే... దగ్గర్లోని హిందూపురంలో రైల్వే స్టేషన్ ఉంది. దగ్గరి ఎయిర్పోర్ట్ బెంగళూరు. లేపాక్షి చుట్టు పక్కల పుట్టపర్తి, కనుమ నరసింహస్వామి, నందిహిల్స్, విదురాశ్వత్థం, ఘాటి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వంటి దర్శనీయ స్థలాలు ఉన్నాయి. -
లేపాక్షిలో పిచ్చికుక్క స్వైరవిహారం
లేపాక్షిలో బుధవారం మధ్యాహ్నాం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనపడ్డవారందరినీ కండలూడేలా కొరికేసింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు పిచ్చికుక్కను కర్రలతో మోది చంపేశారు. -
రెండువేల మంది కార్యకర్తలు : టీడీపీకి షాక్
లేపాక్షి (అనంతపురం) : రెండు వేల మంది టీడీపీ కార్యకర్తలు టీడీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ అధికార పార్టీ నేతలు.. పోలీసు బలగాలను మోహరించి మరీ దిద్దుబాటుకు పూనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లేపాక్షి మండలంలో టీడీపీకి చెందిన మల్లికార్జున్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు మరో 2 వేల మంది మల్లికార్జున్ అనుచరులు ఆయనతో సమావేశమయ్యేందుకు ఆదివారం ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే నీటి సంఘం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదంటూ పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో వారు పోలీసులు, అధికార పార్టీ తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆటో, బైక్ ఢీ: నలుగురికి తీవ్ర గాయాలు
లేపాక్షి: అనంతపురం జిల్లా లేపాక్షి మండల కేంద్రం శివారులో బుధవారం సాయంత్రం ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా వారిలో నలుగురు గాయపడ్డారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం లేపాక్షి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
టిప్పర్, బైక్ ఢీ : ఒకరి మృతి
లేపాక్షి (అనంతపురం జిల్లా) : వేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కంచిసముద్రం గ్రామం సమీపంలోని రోడ్డు క్రాస్ వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని కలిబిపల్లి గ్రామానికి చెందిన రాము(35), కిష్టయ్య అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై లేపాక్షి వెళ్తున్నారు. కాగా మార్గ మధ్యంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను టిప్పర్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాము మృతి చెందాడు. కిష్టయ్య ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య
లేపాక్షి (అనంతపురం): బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా లేపాక్షిలో సోమవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు... హిందూపురం బీసీ బాలుర హాస్టల్లో పనిచేసే చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలసి లేపాక్షిలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు సాయి (18) తనకు బైక్ కొనివ్వలేదని రెండురోజుల నుంచి ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన సాయిని భోజనం చేయలేదేమని తల్లిదండ్రుల అడగ్గా తింటానని చెప్పి తన గదిలోకి వెళ్లాడు. 11 గంటలైనా బయటకు రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించాడు. అతన్ని అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జలగం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని ప్రముఖ వీరభద్రస్వామి దేవాలయాన్ని జలగం వెంకట్రావు సందర్శించుకున్నారు. అనంతరం ఆయన మాజీ మంత్రి గాజుల సోమశేఖర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆదివారం ఆయన లేపాక్షిలో వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. (లేపాక్షి) -
దీపావళి మేళా
లేపాక్షి ఏర్పాటు చేసిన ‘దివాలీ మేళా’ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ షోరూమ్‌లో బుధవారం ప్రారంభమైన ఈ మేళాలో.. మహిళలు మెచ్చే జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్, ఇమిటేషన్ గోల్డ్ వంటి వెరైటీలెన్నో ఉన్నాయి. గద్వాల్, మంగళగిరి, వెంకటగిరి, కలంకారి, ప్రింటెడ్ కాటన్ చీరలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 22 వరకు ప్రదర్శన ఉంటుంది. - ముషీరాబాద్ -
బాపు జ్ఞాపకాలలో...
ఆయన గీత తెలుగువారి జాతి సంపద. కళారంగంలో చేతులు తిరిగిన కళాకారులకు ఆయనే ‘గీత’కారుడు. తెలుగునాట చాలామంది చిత్రకారులు ఆయనకు ఏకలవ్య శిష్యులు. ఆయనతో కొందరిది సన్నిహిత సంబంధం. మరికొందరిది ఆత్మీయానుబంధం. బాపు గీత గోడ మీద అందమైన బొమ్మ అయినట్లే, ఆయనా ఇప్పుడు తెలుగువారి మనసుల్లో అందమైన జ్ఞాపకంగా మిగిలారు. ఆయన సన్నిహితులు, శిష్యులు, అభిమానులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద చేరారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో వారు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. సీనియర్ ఆర్టిస్టులు గోపి, మోహన్, శంకర్, లేపాక్షి, రవికిషోర్, ఆనంద్, రచయితలు శ్రీరమణ, రమణమూర్తి, శివాజీ తదితర ప్రముఖులు బాపుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. యంగ్‌స్టర్స్‌ని ఎంకరేజ్ చేసేవారు... బాపు తర్వాత అంతటి ఆర్టిస్టుగా పేరున్న గోపి మాట్లాడుతూ.. ‘బాపుని చాలాసార్లు కలిశాను. 1977లో అనుకుంటా. సీతాకళ్యాణం సినిమా షూటింగ్ సమయంలో మద్రాస్‌లోని విజయా స్టూడియోలో కలుసుకున్నప్పుడు ‘మీరు ఏది గీస్తే అది బొమ్మ అండీ.. వెనక్కు తిరిగి చూడకండి’ అని చెప్పారు. యంగ్‌స్టర్స్‌ని అంతలా ఎంకరేజ్ చేసేవారాయన. మేమంతా బాపుని గురువుగా భావించి ఎదిగిన వాళ్లమే. చివరకు అదెలా అయిందంటే, ఒకానొక సందర్భంలో ఆయన నన్ను తన గురువుగా చెప్పారు. వాత్సల్యానికి అది ఎక్స్ట్రీమ్ లెవల్’ అంటూ బాపుతో తన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పక్కనే ఉన్న రవికాంత్‌రెడ్డి అందుకుని ‘పదిహేనేళ్ల కిందట విరసం వాళ్లు వేసిన ఓ పుస్తకంలో మోహన్‌గారితో పాటు నేనూ కొన్ని క్యారికేచర్స్ వేశాను. వాటిలో బాపుగారి క్యారికేచర్ కూడా ఉంది. కొన్నాళ్లకు బాపు హైదరాబాద్ వచ్చారు. ఆయన బసచేసే మయూరి గెస్ట్‌హౌస్ ఏరియాలోనే మేం ఉండేవాళ్లం. ఓ రోజు మిట్టమధ్యాహ్నం మా అపార్ట్మెంట్కొచ్చారు. లిఫ్ట్ లేదు. మెట్లమీది నుంచే థర్డ్‌ఫ్లోర్‌లో ఉన్న మా ఫ్లాట్‌కి వచ్చారు. ‘బాబూ.. నువ్వు బొమ్మలు వేసిన పుస్తకం చూశాను. చాలా బాగా వేస్తున్నావు. కీపిటప్’ అని చెప్పి వెళ్లిపోయారు’ అని గుర్తు చేసుకున్నారు. ఆర్టిస్ట్ లేపాక్షి మాట్లాడుతూ, ‘బాపుగారి కార్టూన్స్ ఇమిటేట్ చేయాలని చాలా ట్రై చేశా. నావల్ల కాలేదు. ఆయన కార్టూన్స్‌ని ఇమిటేట్ చేయడానికి ఓ స్థాయి ఉండాలనిపించి వదిలేశా. నాకు ఇన్స్పిరేషన్ మాత్రం ఆయనే’ అని బాపు నైపుణ్యాన్ని కొనియాడారు. బాపు లేని లోటు లోటే... ‘బాపుగారిని ఇష్టపడని వాళ్లుంటారా?’ అంటూ బాపుని తలచుకున్నారు శ్రీరమణ. ‘తమిళ ఆర్టిస్ట్ గోపుల్గారికి బాపు అంటే భలే ఇష్టం. వీళ్లిద్దరూ కలసి ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో పనిచేసేవారు. అప్పట్లో బాపుగారు హయ్యెస్ట్ పెయిడ్ ఆర్ట్ డెరైక్టర్. నెలకు రెండువేల ఐదువందల రూపాయల జీతం. ఫియట్ కారు.. అలాంటి ఉద్యోగం బోర్ కొడుతోందని మానేశారు. ‘మీరూ మానేసి సొంతంగా పెట్టుకోండి’ అని గోపుల్గారికీ సలహా ఇచ్చారట. ఆ సలహాతోనే గోపుల్గారు ‘యాడ్వేవ్’ పెట్టారు. బాపుగారు సినిమా వైపు వచ్చారు. అలాంటి బాపు లేని లోటు లోటే’ అని శ్రీరమణ అంటుండగా, ‘మీకు ఆయన రాసిన ఉత్తరం గురించి చెప్పండి’ అని కార్టూనిస్ట్ శంకర్ అడిగారు. ఉత్తరమేంటి అని అడిగిన ఇతర మిత్రుల కోసం శంకర్ తానే చెప్పడం ప్రారంభించారు. ‘ఈ మధ్య శంకర్ వేసిన బొమ్మలను గమనిస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో చాలా బాగుంటున్నాయి.. ఇంకాస్త శ్రద్ధపెడితే ఇంకా అందంగా వస్తాయి. ఆయన వేసిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి క్యారికేచర్ బాగుంది. కింది లిప్ ఇంకాస్త మెరుగ్గా వేసి ఉండాల్సింది. ఈ విషయం శంకర్‌తో అనకండి నొచ్చుకుంటాడేమో.. నేను పంపే ఈ జిరాక్స్‌లు అతనికివ్వండి’ అని ఉత్తరంతో పాటు ఫారిన్ పుస్తకాలకు సంబంధించిన కొన్ని జిరాక్స్‌లు పంపించారు. ఆ ఉత్తరం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది’ అని చెప్పారు. ‘బాపు’రే పదునాల్గు భువనభాండముల్.. ‘నేను 1967లో ఎస్సెల్సీలో ఉన్నప్పుడు ఒకసారి మద్రాసు వెళ్లాను. అన్నయ్యతో కలసి బాపుగారి ఇంటికి వెళ్లాను. అప్పుడే ఫస్ట్‌టైమ్ బాపుగారి ఒరిజినల్స్ చూడటం. మనిషంత ఎత్తులో ఉన్న ఆ బొమ్మలను చూస్తే పదునాల్గు భువనభాండములను చూసిన అనుభూతి’ అని గుర్తుచేసుకున్నారు రచయిత, చిత్రకారుడు శివాజీ. బాపు దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన గాంధీ మాట్లాడుతూ ‘వీళ్లందరికీ బాపు ప్రశంసలు ఉంటే, నాకు తిట్లెక్కువ. నేను డెరైక్టర్‌గా చేసిన ‘సారీ.. నాకు పెళ్లయింది’ అడల్ట్ సినిమా అని చాలా సమీక్షలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన బాపు ‘డబ్బులే కావాలనుకుంటే ఏ పనైనా చేసుకోవచ్చు. ఇంకోసారి ఇలాంటి సినిమాలు తీయొద్దు’ అన్నారు అని చెప్పారు. బాపు దగ్గర కోడెరైక్టర్‌గా పనిచేసిన ఆర్టిస్ట్ రాంపా మాట్లాడుతూ ‘ఎమినెంట్ కార్టూనిస్ట్స్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీకి నేను కోడెరైక్టర్ని. బాపుగారు డెరైక్టర్. ‘మీరిలా కూర్చోవద్దు.. ఇలా కూర్చోండి’ అని చెబితే ‘అలాగేనండి తప్పకుండా.. మీరు చెప్పినట్టే చేస్తాను’ అనేవారు ఎంతో వినయంగా’ అంటూ బాపుని తలచుకున్నారు. ఆర్టిస్ట్ రవికిషోర్ మాట్లాడుతూ.. ‘ఒకసారి ఆయనకు నా ఫొటోలు పంపిస్తూ, ‘ఇవి డ్రైబ్రష్లో ఒకటి, కలర్లో ఒకటి స్కెచ్‌వేసి పంపగలరు. ధైర్యం చేసి రాస్తున్నాను. ఏమీ అనుకోవద్దు’ అని ఉత్తరం రాశాను. ఆయన నేను కోరినట్టే రెండు స్కెచెస్ పంపించి, ‘కిషోర్‌గారు మీ స్కెచ్‌లు వేసి పంపిస్తున్నాను. నచ్చితే ఉంచుకోండి. నచ్చకపోతే మళ్లీ వేసిస్తా’ అని ఫోన్ చేశారు’ అంటూ బాపుతో తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. రచయిత రమణమూర్తి మాట్లాడుతూ ‘బాపు భాగవతం సీరియల్‌కి పాడిన వారిలో మా అమ్మాయీ ఉంది. పాటను సీరియల్లో లిప్ మూమెంట్‌కు అనుగుణంగా పాడించుకున్నారు. కొంచెం కష్టమైన ప్రక్రియ. అయిపోయాక ‘నిన్ను చాలా కష్టపెట్టానమ్మా’ అన్నారు మా అమ్మాయితో. మా అమ్మాయి ఆయనను ఆటోగ్రాఫ్ అడిగితే, ‘మీరు గాయకులు.. పెద్దవాళ్లు. మేం చిన్నవాళ్లమమ్మా.. అంటూనే ఆటోగ్రాఫ్ ఇచ్చారు’ అని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్టిస్ట్ మోహన్ మాట్లాడుతూ ‘బాపు సినిమాలకు, బొమ్మలకు అమెరికా, ఆస్ట్రేలియాల్లో అభిమానులు ఉన్నారు. అయినా ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు’ అని నిర్వేదం వ్యక్తం చేశారు. -
విద్యార్థినిపై వేధింపులు: టీచర్‌కి దేహశుద్ధి
-
విద్యార్థినిపై లైంగిక వేధింపులు: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారి 9వ తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దాంతో సదరు విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని తల్లిదండ్రులతోపాటు స్థానికులు పెద్ద సంఖ్యలో స్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడిని స్కూల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటన శుక్రవారం అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కేంద్రంలోని వివేకానంద జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది. -
విభజన ప్రక్రియ పూర్తి
అనంతపురం: గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం, జూన్ 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడినట్లు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఏపి రాజధాని ఏర్పాటులో అవరోధాలున్నాయని, వాటిని అధిగమిస్తామని చెప్పారు. లేపాక్షిలో వినాయక విగ్రహం చోరీపై దర్యాప్తు కొనసాగుతోందని గవర్నర్ చెప్పారు. -
లేపాక్షి సందర్శించిన గవర్నర్
-
ఇలాగైతే బతికేదెలా?
లేపాక్షి/తనకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, న్యూస్‌లైన్ : సామాజిక భద్రత పింఛన్‌ను నిలిపివేయడంపై జిల్లాలో నిరసన పెల్లుబికింది. లేపాక్షి, తనకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు మండలాల్లో ఆందోళనకు దిగారు. పింఛన్‌ను పునరుద్ధరించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేపాక్షి మండలంలో పింఛన్ రద్దయిన వారు సోమవారం ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులందరినీ బయటకు పంపి.. కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం కార్యాలయం ఎదుట మండుటెండలోనే ధర్నా చేశారు. వీరికి మాజీ ఎంపీపీలు కొండూరు మల్లికార్జున, ఆనంద్, లేపాక్షి సర్పంచ్ జయప్ప, మాజీ సర్పంచ్ రవీంద్రనాథ్, నాయకులు గంగిరెడ్డి, శ్రీనివాసులు తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతికి ఉన్నా చనిపోయారని, స్మార్టకార్డులు లేవని, వేలిముద్రలు కంప్యూటర్లు తీసుకోలేదని కారణాలు చూపుతూ పింఛన్ రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారిని జాబితా నుంచి తీసేయకుండా.. వారి పేరిట వచ్చే పింఛన్ సొమ్మును సిబ్బంది స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. రెండు నెలలుగా వెయ్యి మందికి పింఛన్లు పంపిణీ చేయడం లేదని తనకల్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ముట్టడించారు. యాక్సిస్ బ్యాంకు సిబ్బంది చేసిన పొరపాట్ల వల్లే తమకు పింఛన్ అందకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల పింఛన్‌ను వచ్చే నెలలో ఒకేసారి మంజూరయ్యేలా చూస్తామని ఈఓపీఆర్డీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. వీరి ఆందోళనకు ఏపీ రైతు సంఘం మండల కన్వీనర్ రమణ మద్దతు తెలిపారు. ‘అయ్యా.. కొన్నేళ్లుగా నెలనెలా ఇన్నూరు..ఐదునూర్లు.ఫించన్ తీసుకునేవాళ్లం. వచ్చిన ఫించన్‌తో నెలపాటు అవసరాలు తీరేవి. రెణ్నెళ్లుగా ఫించన్ ఈలేదు. మా ఫించన్ ఏమైంది?’ అంటూ బోరంపల్లికి చెందిన వికలాంగులు, వితంతువులు, వృద్ధులు కళ్యాణదుర్గం తహశీల్దార్ శ్రీనివాసులు వద్ద ఏకరువు పెట్టారు. దీంతో తహశీల్దార్ సంబంధిత అధికారులతో విషయం కనుగొన్నారు. వేలిముద్రల సమస్యలతో జాప్యం జరిగిందని, వచ్చే నెలలో పెడింగ్ పింఛన్‌తోపాటు మొత్తం అందుతుందని హామీ ఇచ్చారు. అనంతరం బాధితులు అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఈఓఆర్డీ క్రిష్ణమూర్తి వద్ద కూడా గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వచ్చే నెలలో ఫించన్లు అందుతాయని ఈఓఆర్డీ హామీ ఇచ్చారు. ‘సార్... మూడేళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నాం.. రెండు నెలలుగా 40 మందికి పింఛన్ ఇవ్వడం లేదు.. ఎలాగైనా పింఛన్ వచ్చేలా చూడండి’ అని కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన వృద్ధులు ఎంపీడీఓ నాగేశ్వర్రావుతో గోడు వెళ్లబోసుకొన్నారు. బ్రహ్మసముద్రం గ్రామంలో 20 మందికి పింఛన్ రావడం లేదని వైఎస్సార్సీపీ సర్పంచు లోకేష్‌గౌడ్ ఎంపీడీఓ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ వచ్చేలా చూస్తానని ఎంపీడీఓ హామీ ఇచ్చారు.