సజీవం.. నాటి కళానైపుణ్యం
లేపాక్షి :
అచ్చెరువొందే కళానైపుణ్యాలు.. వందల ఏళ్లు గడిచినా చెక్కు చెదరని రీతి.. అలనాటి వందలాది ఆకృతులను ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారులు.. వెరసి లేపాక్షి ఆలయ నిర్మాణం. ప్రపంచానికి పరియయం అక్కర్లేని చారిత్రిక నిర్మాణం. విజయనగర రాజులు 1538లో ఈ ఆలయాన్ని పూర్తి చేశారని చరిత్ర చెబుతుంది. ఆలయంలోని నాట్య మంటపం పైకప్పులో సజీవత ఉట్టిపడే కలంకారీ అద్దకం ద్వారా వివిధ రకాల నీతి, పురాణ కథలను చిత్రీకరించారు. అర్ధంతరంగా ఆగిపోయిన కల్యాణం మంటపానికి పడమటి భాగంలో లతా మంటపం ఉంది. ఇందులో 36 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంలో నాలుగు వైపులా నాలుగు రకాల ఆకృతుల్ని చెక్కడం విశేషం. మొత్తం 36 స్తంభాల్లో 144 డిజైన్లును చెక్కారు. ఇవే ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల వస్త్రాలు, ఇంటి సామగ్రిపై నేటికీ ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది.