
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హస్తకళలు జీ20 విశ్వవేదికపై ఆహూతులను అలరిస్తున్నాయి. జీ20 సదస్సులో భాగంగా భారత మండపం ఇండియన్ క్రాఫ్ట్ బజార్‌లో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హస్తకళ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తూ లేపాక్షి స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో భాగంగా హస్తకళలు, చేనేత వ్రస్తాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీకాళహస్తి కలంకారి చీరలు, ఉప్పాడ జమ్దానీ చీరలు, బొబ్బిలి వీణ, తిరుపతి చెక్క»ొమ్మలు సహా పలు ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు.
విదేశాల నుంచి ఆహూతులకు లేపాక్షి ఈడీ విశ్వ ఆయా ఉత్పత్తుల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. ఉత్పత్తుల నేపథ్యాన్ని, వాటికున్న వారసత్వం, సంస్కృతిని చెబుతున్నారు. ఈ సందర్భంగా విశ్వ మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన హస్తకళలు, చేనేత వ్రస్తాలకు విదేశీ ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మరోవైపు, గిరిజన ఉత్పత్తుల స్టాల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు కాఫీని ప్రదర్శనకు ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment