uppada
-
జీ20లో లేపాక్షి స్టాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హస్తకళలు జీ20 విశ్వవేదికపై ఆహూతులను అలరిస్తున్నాయి. జీ20 సదస్సులో భాగంగా భారత మండపం ఇండియన్ క్రాఫ్ట్ బజార్లో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హస్తకళ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తూ లేపాక్షి స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో భాగంగా హస్తకళలు, చేనేత వ్రస్తాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీకాళహస్తి కలంకారి చీరలు, ఉప్పాడ జమ్దానీ చీరలు, బొబ్బిలి వీణ, తిరుపతి చెక్క»ొమ్మలు సహా పలు ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. విదేశాల నుంచి ఆహూతులకు లేపాక్షి ఈడీ విశ్వ ఆయా ఉత్పత్తుల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. ఉత్పత్తుల నేపథ్యాన్ని, వాటికున్న వారసత్వం, సంస్కృతిని చెబుతున్నారు. ఈ సందర్భంగా విశ్వ మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన హస్తకళలు, చేనేత వ్రస్తాలకు విదేశీ ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మరోవైపు, గిరిజన ఉత్పత్తుల స్టాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు కాఫీని ప్రదర్శనకు ఉంచారు. -
శరవేంగంగా సాగుతున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు
-
Andhra Pradesh: మినీ పోర్టులా ఉప్పాడ!
(ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు): ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.361 కోట్లతో భారీ ఫిషింగ్ హార్బర్‌ను వేగవంతంగా నిర్మిస్తుండటం పట్ల స్థానిక మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మంచి రోజులు కనుల ముందు కనిపిస్తున్నాయి. అన్ని పనులూ పూర్తి చేసుకుని డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుండటంతో మత్స్యకార కుటుంబాల్లో సంతోషం అంతా ఇంతా కాదు. ఇకపై తమ కష్టం వృథా కాదన్న ధీమా ఏర్పడిందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో కాకినాడ వద్ద అత్యంత విలువైన ట్యూనా, సొర వంటి చేపలు ఉన్నా.. సరైన వసతులు లేకపోవడంతో మత్స్యకారులు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. నడి సముద్రంలోకి వెళ్లి పది రోజుల వరకు ఉండి చేపలు పట్టుకునే భారీ స్థాయి బోట్లను నిలుపుకునే చోటు లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తూ రాష్ట్రంలోనే భారీ ఫిషింగ్ హర్బర్‌ను ఉప్పాడ వద్ద నిర్మిస్తోంది. మిగిలిన హార్బర్లలో సముద్రం నుంచి లోతైన కాలువను తవ్వి అక్కడ బోట్లు నిలుపుకోవడానికి జెట్టీలను నిర్మిస్తుంటే.. ఉప్పాడ వద్ద మాత్రం పోర్టు మాదిరిగానే సముద్ర ఒడ్డుకు ఆనుకునే బోట్లను నిలుపుకునే విధంగా హార్బర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తి చేసుకున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ను ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఉత్తర, దక్షిణ బ్రేక్ వాటర్ పనులు పూర్తి స్థాయిలో పూర్తవగా.. డ్రెడ్జింగ్ పనులు, ఒడ్డున బిల్డింగ్‌ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2,500 బోట్లు నిలుపుకునేలా.. ♦ రెండ్రోజుల నుంచి 10 రోజుల వరకు ఏకబిగిన వేట కొనసాగించే విధంగా వివిధ పరిమాణాల బోట్లను నిలుపుకునేందుకు అనువుగా ఈ హార్బర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ♦ సుమారు 2,500 బోట్లను నిలుపుకునేలా జెట్టీని నిర్మిస్తున్నారు. ♦ దాదాపు 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ హార్బర్లో ఫిషింగ్ హ్యాండ్లింగ్, వేలం కేంద్రం, పది టన్నుల ఐస్ ప్లాంట్, 20 టన్నుల శీతల గిడ్డంగి, పరిపాలన కార్యాలయాలతో పాటు ట్యూనా చేపల కోసం ప్రత్యేకంగా ట్యూనా ఫిష్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ♦ ట్యూనా చేపలు పట్టుకునేందుకు వీలుగా తొమ్మిది మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు ఉండే లాంగ్‌లైన్ బోట్లను ఇక్కడ నిలుపుకునే అవకాశముంది. ♦ ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా రూ.859 కోట్ల విలువైన 1,10,600 టన్నుల మత్స్య సంపద వస్తుందని అధికారుల అంచనా. 17,700 మందికి ఉపాధి లభించనుంది. పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం రాష్ట్రంలోని మత్యకారులు వేట కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వలస వెళ్లకుండా స్థానికంగానే చేపలు పట్టుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లయిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సుమారు రూ.3,500 కోట్లకు పైగా నిధులతో 60,858 మత్యకార కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా వీటిని నిర్మిస్తున్నాం. మినీ పోర్టు తరహాలో వీటి నిర్మాణం చేపట్టడమే కాక వీటిపక్కనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – ప్రవీణ్‌కుమార్, సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు త్వరలో మంచి రోజులు ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల నిలుపుకునేందుకు నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలుపుకోవడం దగ్గర నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్ గతంలో ఎంతటి భారీ చేప తీసుకొచ్చినా పొద్దున రూ.1,000 ధర ఉంటే సాయంత్రం రూ.500కు పడిపోయేది. దీంతో బాగా నష్టపోయే వాళ్లం. ఇప్పుడు ఈ హార్బర్ రావడం.. ఇక్కడ శీతల గిడ్డంగులు ఉండటంతో ఆ భయం ఉండదిక. నచ్చిన ధర వచ్చినప్పుడే అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. గతంలో హార్బర్ లేకపోవడం వల్ల పోటు సమయంలో బోటు నిలుపుకోవడానికి కష్టంగా ఉండేది. సరుకు దింపే సమయంలో ప్రమాదాలు జరిగేవి. మనుషులు గల్లంతైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడా భయాలు మాకు ఉండవు. సునామీ వచ్చినా మా పడవలు భద్రంగా నిలుపుకోవచ్చు. – ఉమ్మడి యోహాను, మత్స్యకారుడు, ఉప్పాడ -
తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రతీరాన పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. విశాఖ సరిహద్దు కాకినాడ జిల్లా తొండంగి మండలం మొదలు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకూ గల తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సహజ వనరులకు లోటు లేని తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెట్రో, పెట్రో ఆధారిత పరిశ్రమలు, ఔషధాలు, బొమ్మలు తయారీ, కాకినాడ గేట్‌వే పోర్టు, వంట నూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్లు, హేచరీలు, బల్క్ డ్రగ్ పార్క్...ఇలా పలు పరిశ్రమలు 120 కిలోమీటర్లు సముద్ర తీరంలో ఏర్పాటవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కోవిడ్–19 మహమ్మారితో మొదటి రెండేళ్లూ గడచిపోయాయి. ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తిలేక మందగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే సమయం సరిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడానికి వీలు కాని పరిస్థితి. కోవిడ్ నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరళీకరించిన పారిశ్రామికీకరణ విధానాలు దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షిస్తున్నాయి. సీఎం దూరదృష్టితో తూర్పు తీరంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక పోకస్ పెట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత ఏ జిల్లాకు ఆ జిల్లా పారిశ్రామిక ప్రగతికి ప్రణాళికలతో ముందుకు కదులుతున్నాయి. పారిశ్రామిక కారిడార్‌కు ఊతం తీరంలో గతంలో ప్రతిపాదించిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ప్రభుత్వ విధానాలు ఊతమిస్తున్నాయి. కారిడార్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా స్థానం ఉండటం పారిశ్రామికీకరణకు సానుకూలమవుతోంది. గత పాలకుల హయాంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ఎస్ఈజెడ్ భూ సేకరణను సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో చక్కదిద్దుతున్నారు. మరోపక్క కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బలవంతంగా సేకరించిన భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడమనే ప్రక్రియ దేశంలోనే తొలిసారి కాకినాడ సెజ్‌లో ప్రారంభమైంది. సీఎం సాహసోపేతమైన తాజా నిర్ణయంతో తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కాకినాడ తీరంలో ఒక వెలుగు ఆదిత్యబిర్లా, అరవిందో వంటి పారిశ్రామక దిగ్గజాలు తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొండంగి మండలం కేపీ పురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీపడినప్పటికీ రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదించడం, అదీ కూడా మన కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలోనే ఈ ప్రాజెక్టు లభించడం శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ పార్కులో రూ.46,400 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతూ సుమారు 15వేల మంది యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలోనే ఫార్మా రంగంలో కాకినాడ తీరం ఒక వెలుగు వెలగనుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చురుగ్గా మేజర్ హార్బర్ పనులు కాకినాడ తీరంలో ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. ఆయన హఠాన్మరణం తరువాత పాలకులు ఐదేళ్లపాటు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ మినీ హార్బర్ స్థానే మేజర్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ పనులు తీరంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.422 కోట్లు కేటాయించారు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 25 గ్రామాల్లో 50 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్థి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సముద్ర వేటపై ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మత్స్యకారులు ఇంతవరకు వేటాడాక బోటు నిలపడానికి సరైన హార్బర్ కూడా ఉండేది కాదు. ఈ సమస్యను ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో గుర్తించారు. 2,500 బోట్లు వేటాడాక సరుకును దించేందుకు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుబంధంగా మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం హార్బర్ సమీపాన 980 టన్నులతో గిడ్డంగులు, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్ప్లాంట్లు కూడా సిద్ధవమతున్నాయి. తీరం వెంబడి... ► తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర తీర ప్రాంత మండలాల్లో సుమారు 20 రొయ్యల శుద్ధి కర్మాగారాలు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కర్మాగారాల్లో 10 నుంచి 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ► అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం భలభద్రపురంలో ఆదిత్యబిర్లా తొలి దశలో రూ.841 కోట్ల అంచనా వ్యయంతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉత్పత్తి ఇటీవలనే ప్రారంభించింది. ఈ కర్మాగారం ద్వారా 1203 మందికి జీవనోపాధి లభిస్తోంది. ► గతంలో చంద్రబాబు పాలనలో గ్రాసిమ్ కర్మాగారం ఏర్పాటు వివాదాలతో అటకెక్కగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవతో ఆదిత్య బిర్లా ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించింది. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల మధ్య సుమారు రూ.2000 కోట్లతో గేట్‌వే ఆఫ్ కాకినాడ పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా గ్రూప్ అరవిందో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడున్న రెండు పోర్టులకు అదనంగా కాకినాడ గేట్‌వే పోర్టుకు ఇప్పటికే తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పునాదిరాయి పడింది. ► కాకినాడ ఎస్ఈజడ్లో రూ.90 కోట్లతో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ గత ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. (క్లిక్: సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ) ► పెద్దాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న దేవీ సీఫుడ్స్‌కు చెందిన ఆక్వా సీడ్ కంపెనీ త్వరలో అందుబాటులోకి రానుంది. ళీ తుని నుంచి అంతర్వేది వరకు పలు ఐస్ఫ్యాక్టరీలు, థర్మాకోల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. నమ్మకంతో వస్తున్నారు తీర ప్రాంతంలో ఏర్పాటవుతోన్న పరిశ్రమలతో యువతకు ఉజ్వల భవిష్యత్ లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కుని ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. భూములతో వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించారు. అందుకే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేశారు. ఇందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, అతనిపై నమ్మకం ఉండటంతోనే పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో రెండువేల ఎకరాలను బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయిస్తున్నాం. కోదాడ, పెరుమాళ్లపురం గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్కుకు భూమిని కేటాయిస్తారు. – దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాలు శాఖా మంత్రి మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట ప్రజా సంకల్పయాత్రలో కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. సుమారు 25 ఏళ్లుగా కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. మినీ హార్బర్ నిర్మించాలని మత్స్యకారులు అడిగితే ఏకంగా మేజర్ హార్భర్ నిర్మాణంకు సీఎం చర్యలు తీసుకోవడం ఒక చారిత్రక నిర్ణయం. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాదించడానికి మత్స్యకారుల అభ్యున్నతికి మేజర్ హార్భర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. –పెండెం దొరబాబు, ఎమ్మెల్యే పిఠాపురం -
Uppada: మత్స్యకారుల వలకు ‘బాహుబలి’
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): బంగాళాఖాతం సముద్ర జలాల్లో తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు బాహుబలి చేప చిక్కింది. కంబాల టేకుగా పిలిచే ఈ చేప సుమారు 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల మేర వెడల్పు ఉంది. బరువు సుమారు 300 కేజీలు. దీనిని అతి కష్టంపై బోటు నుంచి క్రేన్‌తో ఆటో పైకి ఎక్కించి, కాకినాడకు తరలించారు. అర డజను మంది మత్స్యకారులు తాళ్ల సాయంతో కిందకు దింపి విక్రయించగా వెంకన్న అనే వ్యాపారి రూ.16,500కు కొనుగోలు చేశాడు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు -
సముద్రతీర ప్రాంతంలో బంగారం కోసం వేట
కొత్తపల్లి: ఉప్పాడ సముద్ర తీరప్రాంతంలో రెండు రోజులుగా పసిడివేట కొనసాగుతోంది. స్థానిక మత్స్యకారులు బుధవారం కూడా తీరంలో బంగారం కోసం జల్లెడపట్టారు. మహిళలు, చిన్నారులు సైతం తీరంలో బంగారం కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే మహిళలకు బంగారు రేణువులు, రూపులు, చెవి దిద్దులు, ఉంగరాలుతో పాటు పలు బంగారు, వెండి వస్తువులు దొరికాయి. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్ సమయాల్లో బయటపడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. -
ఏపీ: అరుదైన ముత్యాల శంఖం.. ధర ఎంతంటే?
కొత్తపల్లి/తూర్పు గోదావరి జిల్లా: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన ముత్యపు శంఖం దొరికింది. తొండంగి మండలం హుకుంపేటకు చెందిన మత్స్యకారుడు గంటా జగన్నాథం సముద్రంలో వేటకు వెళ్లగా ఆయన వలకు ఈ భారీ శంఖం చిక్కింది. కాగా అరుదైన ఈ ముత్యాల శంఖాన్ని అమీనాబాదు హార్బర్లో ఉప్పాడకు చెందిన వ్యాపారులు రూ. 18 వేలు వెచ్చించి ఇటీవల కొనుగోలు చేశారు. ఈ శంఖాన్ని మెలో మెలో పేరుతో పిలుస్తారని మత్స్యశాఖాధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు. -
ఉప్పాడ సముద్ర తీరం లో బోటు బోల్తా
-
భోజనం కోసం ప్రతిరోజూ 25 కిలోమీటర్లు..
పిఠాపురం: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఒకరిపై ఆధార పడకూడదనుకున్న వారు తమ కాళ్లపై తాము నిలబడి బతికున్నంత కాలం తనకు వచ్చిన రీతిలో పొట్ట నింపుకుంటారు. ఆ కోవకే చెందిన వాడే కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన పెంకే రామకృష్ణ (70). ఆయన కుటుంబం పూర్వం చాలా ఉన్నత కుటుంబమైనా కాలగర్భంలో ఆస్తులన్ని కరిగిపోగా కన్నవారు ఉన్న వారు దూరమవ్వడంతో రామకృష్ణ ఒంటరిగా మిగిలి పోయాడు. తోబుట్టువులున్నా ఎవరి దారి వారు చూసుకోగా అవివాహితుడిగా ఉండిపోయిన రామకృష్ణ కాయకష్టం చేసుకుని జీవించేవాడు. స్థానికంగా ఖాళీగా ఉండే అరుగులే ఆయన నివాస స్థావరాలు. కాగా చిన్న చిన్న పనులు చేస్తు వచ్చిన దానితో పొట్ట నింపుకునే ఆయనకు అన్నదాతగా పిఠాపురంలోని గోపాల్‌బాబా ఆశ్రమం ఆసరాగా నిలిచింది. సుమారు పదేళ్ల క్రితం ఇక్కడ ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి ఇక్కడ జరిగే ఉచిత అన్నదానంకు రామకృష్ణ వెళ్లడం ప్రారంభించాడు. ఉప్పాడ నుంచి పన్నెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురంలో గోపాల్‌బాబా ఆశ్రమానికి ఆయన ప్రతిరోజు నడిచి వెళ్లి భోజనం చేసి తిరిగి నడిచి ఉప్పాడ చేరుకుంటుండడం నిత్యకృత్యంగా మారింది. ఉదయం ఆరు గంటలకు ఉప్పాడలో టీ తాగి చిన్న చేతి కర్ర సాయంతో కాలి నడకన బయలు దేరే మధ్యాహా్ననికి పిఠాపురం చేరుకుని ఆశ్రమంలో భోజనం చేసి మళ్లీ కాలి నడకన సాయంత్రానికి ఉప్పాడ చేరుకుని ఒక అరుగుపై రాత్రి బస చేస్తుంటాడు. రోజూ అంత దూరం నడిచే బదులు ఆశ్రమంలోనే తలదాచుకోవచ్చు కదా అని ఎవరైనా అడిగితే సాయంత్రానికి తన పుట్టిన ఊరు చేరుకోపోతే తనకు నిద్ర పట్టదంటూ చెప్పడం విశేషం. ఎంత ఎండ కాసినా వర్షం వచ్చినా అతని కాలినడక మాత్రం ఆగదు. ఇదో రకం జీవన పోరాటం. -
ఉప్పాడ గుండె‘కోత’కు అడ్డుకట్ట!
తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ గ్రామం 342.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. గత వందేళ్లలో దాదాపు 320 ఎకరాల భూమి కోతకు గురై సముద్రంలో కలిసిపోయింది. అలాగే 410 ఎకరాల్లో పంట భూములు, సరుగుడు తోటలు ఉండేవి. ఇందులో 320 ఎకరాలను బంగాళాఖాతం మింగేసింది. ఉప్పాడ సమీపంలోని కోనపాపపేట గ్రామంలో గత పదేళ్లలో దాదాపు 20 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. 150 ఇళ్లు కోతకు గురయ్యాయి. తుపాను వచ్చినప్పుడల్లా ఈ గ్రామం కోతకు గురవుతోంది. 8వ ఏషియన్ అండ్ పసిఫిక్ కోస్ట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లెక్కల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో 1990–2000 మధ్యకాలంలో 57.92 చదరపు కిలోమీటర్లు, 2000–2006 మధ్యకాలంలో 102.88 చదరపు కిలోమీటర్లు, 2006–2012 మధ్యకాలంలో 77.58 చదరపు కిలోమీటర్ల మేర తీరప్రాంతం కోతకు గురైంది. కాకినాడ నుంచి తుని వరకూ తీర ప్రాంతాన్ని కలుపుతూ 1978లో నిర్మించిన బీచ్ రోడ్డు ఇప్పటిదాకా 28 సార్లు సముద్రపు కోతకు గురైంది. నాలుగుసార్లు రోడ్డు మొత్తం కొట్టుకుపోగా, దాని పక్కనే కొత్త రోడ్డు నిర్మిస్తూ వస్తున్నారు. తుపాన్లకు ఛిద్రమవుతున్న బీచ్ రోడ్డు రక్షణ, మరమ్మతులకు ఆర్అండ్బీ శాఖ రూ.1,500 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు అంచనా. సాక్షి, తూర్పుగోదావరి: బంగాళాఖాతంలో తుపానులు వచ్చాయంటే చాలు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సమీపంలోని పల్లెలు వణికిపోతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర కెరటాలు తీరంపై విరుచుకుపడుతుంటాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ కోత వల్ల ఇప్పటివరకూ వందల ఎకరాల భూములు సముద్ర గర్భంలో కరిగిపోయాయి. వేలాది ఇళ్లు, ఆస్తులు కడలి కెరటాల్లో కలిసిపోయాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు ప్రారంభించారు. సముద్రపు కోత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల కేంద్ర బృందం కాకినాడ ప్రాంతాన్ని పరిశీలించింది. ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణానికి రూ.320 కోట్ల విడుదలకు సీఎం ఇప్పటికే ఆమోదం తెలిపారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వెల్లడించారు. అలాగే రూ.3 కోట్లతో జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.350 కోట్లతో తీర రక్షణ చర్యలు చేపట్టడానికి సన్నద్ధమవుతోంది. ఉప్పాడ సమీపంలో మినీ హార్బర్ నిర్మాణానికి నిర్దేశించిన స్థలం హోప్ ఐలాండే కారణం! ఉప్పాడ తీరానికి సముద్రపు కోత వల్ల ముప్పు ఉందని 1950లోనే అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదని ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. కోత తీవ్రతను 1971లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినా తదుపరి చర్యలపై దృష్టి పెట్టలేదు. గోదావరి నది నుంచి భారీగా ఇసుక కొట్టుకురావడంతో కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ కారణంగానే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు చెప్పారు. అలల తాకిడితో హోప్ ఐలాండ్‌లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు మట్టి కోతకు గురవుతోందని తేల్చారు. నివారణకు ప్రతిపాదనలు కోతకు గురవుతున్న ప్రాంతంలో ఇసుక వేయాలని అప్పట్లో బీచ్ ఎరోజన్ బోర్డు సూచించింది. ఏటా 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తెచ్చి తీరంలో నింపాలని సిఫారసు చేసింది. తద్వారా అలల తాకిడికి ఇసుక కోతకు గురవుతూ, తిరిగి అదే ఇసుక మేటలు వేస్తుందని పేర్కొంది. అయితే, ఏటా ఇసుక తరలింపునకు అధికంగా ఖర్చవుతుందని ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. సీ వాల్స్ (రక్షణ గోడ) నిర్మించాలని 1975 ఫిబ్రవరి 12న జరిగిన సమావేశంలో మరో ప్రతిపాదన చేశారు. ఈ మేరకు 1982లో రూ.31.86 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిని రాష్ట్ర వరద నివారణ బోర్డుకు చెందిన సాంకేతిక సంఘం పరిశీలించి 1982 జూలై 22న ఆమోదించింది. తీరప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం సముద్రపు కోతపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (ఎన్‌సీఎస్‌సీఎం) డైరెక్టర్ డాక్టర్ రమేష్ రామచంద్రన్, శాస్త్రవేత్తలు పి.రామచంద్రన్, ఆర్ఎస్ రాబిన్, బి.సుబ్బారెడ్డి, ఎడ్విన్ రాజన్ తదితరులు ఇటీవల కోనపాపపేట, ఉప్పాడ తీర ప్రాంతాలను సందర్శించారు. ఉప్పాడలో సూరాడపేట, సుబ్బంపేట తదితర ప్రాంతాల్లో జియోట్యూబ్ రక్షణ గోడ సైతం కోతకు గురై, శిథిలం కావడాన్ని పరిశీలించారు. సముద్ర కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం (ఫైల్) వైఎస్సార్ హయాంలో రూ.12 కోట్లతో రక్షణ గోడ 1,000 మీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మాణ వ్యయం 1994–95 నాటికి రూ.1.25 కోట్లకు చేరింది. మరో ఏడాదిలోనే రూ.2.25 కోట్లకు పెరిగింది. 2008 నాటికి రూ.12 కోట్లకు చేరుకుంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఉప్పాడలో సముద్రపు కోత నివారణకు రూ.12 కోట్లతో జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ నిర్మించారు. పదేళ్ల క్రితం నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడ నిర్వహణను తరువాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఇది శిథిలమై కోత మళ్లీ ప్రారంభమైంది. ఉప్పాడ వద్ద నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడ సముద్రపు కెరటాల ఉధృతిని అడ్డుకోవడంతో కోత ప్రభావం ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనపాపపేట గ్రామంపై పడింది. నూతన టెక్నాలజీతో కెరటాల ఉధృతికి బ్రేకులు ‘‘సముద్రపు కోతను నివారించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. జియో ట్యూబ్ టెక్నాలజీ అనేది శాశ్వత పరిష్కారం కాదు. కొత్త టెక్నాలజీ ద్వారా సముద్రపు కెరటాలను ఒడ్డుకు చేరేలోపే నిర్వీర్యం చేయొచ్చు. వాటి ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చు. తీరప్రాంతం కోతకు గురి కాకుండా ఉంటుంది. కొత్త టెక్నాలజీని ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు’’ – డాక్టర్ రమేష్ రామచంద్రన్, డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ -
జాంధానీ జరీ..మెరిసింది మళ్లీ
ఉప్పాడ చేనేత కళాకారుల అద్భుతసృష్టి జాంధానీ.. ఏళ్లు గడిచినా తరగని విలువ దీని ప్రత్యేకత. ఎటు నుంచి చూసినా కళాత్మకత ఉట్టిపడే ఈ చీరలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. జాంధానీ డిజైన్లతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయనుండడంతో ఈ చీర సోయగాల గొప్పతనం మరోసారి మార్మోగుతుంది. ఇప్పటికే పేటెంట్ హక్కుతో పాటు ఇండియన్ హ్యాండ్లూమ్స్లో ఉప్పాడ జాంధానీకి స్థానం లభించగా.. తాజాగా దక్కిన గౌరవంతో తమ బతుకుల్లో వెలుగులు వస్తాయని చేనేత కళాకారులు ఆశిస్తున్నారు. వీటి తయారీలో ఉపయోగించే నాణ్యమైన వెండి జరీ, అత్యంత నేర్పుతో ఒక్కొక్క పోగు చేతితో పేర్చే నేతన్న పనితనంతో ప్రపంచపటంలో జాంధానీకి అరుదైన స్థానం లభించింది. పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో తరతరాలుగా ఈ జాంధానీ చీరల తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. ఇవి అంత అందంగా కనిపించడానికి పూర్తిగా చేతితో నేయడమే కారణమని చెబుతారు. పాడై చిరిగిపోయినా.. కొన్న డబ్బులో సుమారు 30 శాతం వరకు తిరిగి వచ్చేస్తుంది. వెండి జరీలో సన్నని పట్టు, ఎర్రటి దారం ఉంటుంది. ఇది తొందరగా కాలదు, బూడిద కాదు. గీటురాయితో వెండి జరీ నాణ్యతను çపరీక్షించుకోవచ్చు. జరీని ఎన్ని పోగులు ఉపయోగిస్తే చీరకు అంత విలువ పెరుగుతుంది. నేతలో ఎక్కడా వదులు లేకుండా కార్మికులు చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడా లోపాన్ని పట్టుకోలేం.ఒక చీరపై ముగ్గురు నుంచి నలుగురు కార్మికులు పనిచేస్తారు. డిజైన్‌ను బట్టి పూర్తికావడానికి 20 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. గతంలో రోజుకు ఒకట్రెండు చీరల కంటే ఎక్కువ తయారయ్యేవి కావు. ప్రస్తుతం 50 నుంచి 100 చీరలు తయారుచేస్తున్నారు. ముందు పేపరుపై డిజైన్ గీసుకుని నేత ప్రారంభిస్తారు. జరీని బట్టి చీర ధర నిర్ణయం చీరలో వాడే జరీని బట్టి విలువ నిర్ధారిస్తారు. చీరలో 240 గ్రాములు జరీ వాడితే దాని విలువ రూ 5 వేల వరకూ ఉంటుంది. డిజైన్ల కనుగుణంగా 500 గ్రాముల వరకూ జరీ వినియోగిస్తారు. చిలుక, హంస, నెమలి వంటి అనేక రకాల డిజైన్లు నేతన్నల కళాత్మకతను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. కొత్తపల్లి మండలంలోనే కొత్తపల్లి, కుతుకుడుమల్లి, వాకతిప్ప, అమీనాబాద్, ఉప్పాడ, మూలపేట తదితర గ్రామాల్లో గతంలో 50 వరకు ఉండే మగ్గాలు నేడు 500కు చేరాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తి తదితర గ్రామాల్లోను వీటి తయారీ ఉంది. అన్ని కులాల వారు చీరలు నేయడం విశేషం. పోస్టల్ కవర్లపై ముద్రించేందుకు డిజైన్ల ఎంపిక రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేసే చీరల్ని ఇక్కడి నేతన్నలు తయారుచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ షాషింగ్ సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇటీవల కాలంలో వ్యాపారం ఊపందుకుంది. జాంధాని పేటెంట్ హక్కు సాధించుకున్నాక అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు కూడా పొందింది. ఇప్పుడు వీటిపై పోస్టల్ కవర్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉప్పాడ చేనేత కళాకారులకు వర్తమానం పంపింది. కవర్లపై ప్రింట్ చేసేందుకు చీరల డిజైన్లను పంపమని సూచించడంతో.. ఎంపిక చేసిన కొన్ని డిజైన్లకు ఢిల్లీకి పంపారు. నేతన్న శ్రమకు దక్కని విలువ మార్కెట్లో ఈ చీరలకు మంచి ధర పలుకుతున్నా.. నేత కార్మికుడికి దక్కే మజూరీ అంతంతమాత్రమే. కొన్ని చేనేత సహకార సంఘాలు మాస్టర్ వీవర్సుతో కుమ్మౖMð్క నేత కార్మికులను నట్టేట ముంచుతున్నాయి. తక్కువ మజూరీలు ఇస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయి. సహకార సంఘాల ద్వారా నేత కార్మికులతో చీరలు నేయించాల్సి ఉండగా ఎక్కడా అమలుకావడం లేదు. ముడిసరుకుల ధరలు చుక్కలనంటడం, చేసిన అప్పులు పెరిగిపోవడంతో నేతన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు తమకిచ్చిన హామీల్ని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం ఉప్పాడ పరిసర ప్రాంతాల చేనేత కార్మికులకు మాత్రమే సొంతమైన పేటెంట్ హక్కును కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ రకం చీరలను ఇతర ప్రాంతాల్లో నేయించడంతో ఇక్కడి చీరలకు గిరాకీ తగ్గుతోంది. పేటెంట్ హక్కును కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. నేతన్న నేరుగా విక్రయించేలా చూడాలి అగ్గిపెట్టెలో పట్టే ఆరు గజాల చీర నేసిన ఘనత మా కార్మికులకుది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయడంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మా కళాకారుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో వీటికి డిమాండ్ పెరుగుతుంది. నేరుగా కార్మికులే ఆన్లైన్లో విక్రయాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి. – ఆర్.నాగేశ్వరరావు, ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు, మూలపేట -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విరిగిన లాఠీ
పిఠాపురం : ఉప్పాడకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఓసిపల్లి కృపారావు, తిక్కాడ యోహానుల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నిరసన తెలిపిన ఆ పార్టీ శ్రేణులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు ఝళిపించారు. పోలీసుల దెబ్బలకు ఓసిపల్లి కోదండ, వంకా కొర్లమ్మ అనే మహిళలు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయారు. నలుగురు యువకులకు పోలీసులు దుస్తులు ఊడదీసి పోలీస్‌స్టేషన్‌లోకి ఈడ్చుకెళ్లారు. అక్కడి నుంచి వారికి మరోచోటుకు తరలించారు. పోలీసుల దౌర్జన్యకాండ తీవ్ర విమర్శలకు దారితీసిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి మండలం ఉప్పాడను దత్తత తీసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తమ గ్రామానికి ఎలాంటి మేలు చేయలేదని ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానికులు టీడీపీ నేతలను పలుచోట్ల అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 11వ తేదీన పోలింగ్ జరుగుతుండగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ హైస్కూలులోని పోలింగ్ బూత్‌లోకి కారుతో సహా ప్రవేశించి, గేటు మూసి ఎన్నికల ప్రచారం చేయడంపై ఓటర్లు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అందరినీ అక్కడి నుంచి పంపించారు. కొత్తపల్లి పోలీసు స్టేషన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయరా? వైఎస్సార్సీపీ నేతలు తన కారుపై రాళ్లతో దాడి చేశారంటూ రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే వర్మ కొత్తపల్లి పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీకి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లతోపాటు కొందరు ఓటర్లు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాలతో ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలపై మరో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అక్రమ అరెస్టులు చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని విస్మరిస్తూ మంగళవారం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు ఓసిపల్లి కృపారావు, తిక్కాడ యోహానులను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతూ ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలకు వంత పాడిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో విరుచుకుపడ్డారు. అందరినీ లాగిపడేశారు. మహిళలను సైతం తోసివేశారు. కారుతో సహా పోలింగ్ బూత్‌లోకి చొరబడ్డ ఎమ్మెల్యే వర్మను వదిలేసిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా, ఎమ్మెల్యే కారుపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామని కాకినాడ డీఎస్పీ రవివర్మ మీడియాకు తెలిపారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ఉద్రిక్తతకు కారణమైన ఘటనలో మరో నలుగురి విచారిస్తున్నామని, వారిపై కేసులు ఇంకా నమోదు చేయలేదన్నారు. -
పది పరీక్ష ముగించి.. జీవిత పరీక్షలో తలవంచి..
సాక్షి, కొత్తపల్లి : పదో పరీక్షలు రాసిన ఆ పాఠశాల విద్యార్థులందరూ వీడ్కోలు సంబరంలో సరదాగా గడిపారు. భవిష్యత్తు దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటూ విద్యార్థులందరూ గురువుల ఆశీస్సులు అందుకున్నారు. పదేళ్లు కలిసి చదువుకున్న వారందరూ ఒకరినొకరిని వీడలేక.. బరువెక్కిన హృదయాలతో పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నారు. వారందరికీ టాటా చెబుతూ ఇంటికి బయలుదేరిన వారిద్దరినీ మృత్యువు కాటేసింది. విషయం తెలిసిన బంధువులతో పాటు సహచర విద్యార్థులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉప్పాడ–పిఠాపురం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన పులపకూర శేఖర్ (16) అమ్మయ్య ఊరు యండపల్లి శివారు జొన్నల గరువులో ఉంటూ కొండెవరం జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివాడు. అదే గ్రామం జోగిరాజు పేటకు చెందిన బోరపాటి అనూష (16) ఈ పాఠశాలలోనే 10వ తరగతి చదివింది. బుధవారం 10వ తరగతి పరీక్షలు ముగియడంతో గురువారం పాఠశాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఫేర్వెల్ నిర్వహించుకున్నారు. అప్పటివరకు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆనందంగా గడిపిన వారి ఇద్దరూ పార్టీ ముగించుకుని మోటర్ సైకిల్‌పై ఇళ్లకు బయలుదేరారు. స్థానిక యాక్సస్ బ్యాంక్ సమీపంలో ఉప్పాడ నుంచి పిఠాపురం వైపు వెళుతున్న ఆటోను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అనూష, మల్లాం గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆటో డ్రైవర్‌ను పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై కృష్ణమాచారి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో రోడ్డుప్రమాదంలో... ఉప్పాడ–పిఠాపురం రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వాకతిప్ప సతీష్ చంద్ర కాలనీకి చెందిన కేశనకుర్తి తాతారావు (56) సైకిల్‌పై ఉప్పాడ వెళుతున్నాడు. అనంతలక్ష్మి కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈమేరకు ఎస్సై కృష్ణమాచారి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వామ్మో... ఎంత పెద్ద పీత!
ఉప్పాడ సాగర తీరంలో బుధవారం పెద్ద సైజ్ పీత మత్స్యకారుల వలకు చిక్కింది. సాధారణంగా పీత బాగా పెద్దది అయితే పావు కేజీ నుంచి అర కేజీ బరువు ఉంటుంది. కానీ ఈ పసుపు రంగు పీత సుమారు 2 కేజీలు బరువు ఉండడంతో మత్స్యకారులే అవాక్కయ్యారు. ఈ పీతను ఒక వ్యాపారి రూ..1500కు కొనుగోలు చేసి కాకినాడలో వ్యాపారులకు అమ్మగా రూ.1800కు అమ్మడైంది. ఇటువంటి పెద్ద పీతలు అరుదుగా వలలకు చిక్కుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. – కొత్తపల్లి -
ఉప్పాడకు పొంచిఉన్న ముప్పు
భయం గుప్పెట్లో తీరప్రాంతం వేట నిలిపి వేసిన మత్స్యకారులు కానరాని ముందస్తు చర్యలు పిఠాపురం : అంతా ప్రశాంతం ... నిండుకుండలా సముద్రం , మామూలుకంటే తక్కువ అలలు ... కానీ ఉప్పెన ముంచుకొస్తుందన్న అధికారిక హెచ్చరికలు స్థానిక తీరప్రాంతవాసులను వణికిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ముప్పు ఉందని హెచ్చరికలు చేస్తున్నంతగా ఉపద్రవం వస్తుందా లేదా అనేదానికంటే బుధవారం ఉదయం నుంచి సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోవడం మాత్రం స్థానికులను కలవరపెడుతోంది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు అంతగా తుఫాన్ముప్పు ఉండదని ముందు అనుకున్నప్పటికీ క్యాంట్ పెను తుఫా¯ŒSగా మారి విశాఖకు సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో భయాందోళన‡లు వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్హెచ్చరికలు చేసినా పట్టించుకోని మత్స్యకారులు తమ పడవలు, వలలు, వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవడంలో తలమునకలయ్యారు. స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.తీరప్రాంతంలో సముద్రం సుమారు 50 మీటర్ల వరకు వెనక్కి వెళ్లిపోవడం కూడా దడ పుట్టిస్తోంది. సాధారణంగా తీవ్ర తుఫాన్ వచ్చే సమయంలో మాత్రమే ఇలా తీరంలో సముద్రం వెనక్కి (ఆటు) వెళ్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఎటువంటి రక్షణ లేకపోవడంతో తీరానికి సమీపంలో ఉన్న సుబ్బంపేట, పల్లెపేట, కొత్తపేట, రంగంపేట తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. బీచ్‌రోడ్డు ఏ మాత్రం తెగిపోయినా పైగ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఇప్పటికే ఉప్పాడకు రక్షణగా వేసిన జియోట్యూబ్ రక్షణ గోడ అండలు జారీ కూలిపోవడంతో ఉప్పాడకు ముప్పు పొంచిఉందని ఆ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇది టైగర్ ఫిష్
‘టైగర్’ రకం రొయ్యల్ని ప్రత్యేకించి చెరువుల్లో పెంచుతుంటారు. అయితే ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రతీరంలో ‘టైగర్ ఫిష్’ కనిపించింది. తెరుచుకున్న నోరు, పులిని పోలిన చర్మం, మచ్చలతో ఉన్న ఈ చేప చనిపోయి తీరానికి కొట్టుకు వచ్చింది. దాదాపు రెండడుగుల పొడవు, 5 కిలోల బరువు ఉన్న ఈ చేప చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా.. తినడానికి పనికిరాదని మత్స్యకారులు చెప్పారు. సముద్రజలాలు కలుషితం కావడం వల్ల ఇటువంటి చేపలు చనిపోయి ఒడ్డుకు చేరుతున్నాయన్నారు. - కొత్తపల్లి -
తీరానికి చేరిన 'టైగర్'
కొత్తపల్లి: తెరుచుకున్న నోరు, పులిని పోలిన చర్మం, మచ్చలతో ఉన్న ఈ టైగర్ 'ఫిష్' తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. ఆదివారం ఆటవిడుపుగా వచ్చిన సందర్శకులు చనిపోయిన ఈ చేపను చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు రెండడుగుల పొడవు, 5 కిలోల బరువు ఉన్న ఈ చేప చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా.. తినడానికి పనికిరాదని మత్స్యకారులు చెప్పారు. సముద్రజలాలు కలుషితం కావడం వల్ల ఇలా చేపలు చనిపోయి ఒడ్డుకు చేరుతున్నాయని తెలిపారు. -
మురికి కాలువలో చిన్నారి మృతదేహం
తూర్పుగోదావరి: అప్పుడే పుట్టిన పసికందును మురికి కాలువలో వదిలేసి వెళ్లారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామంలోని మురికి కాలువలో మగశిశువును గుర్తించిన స్థానికులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలం!
-
'తుపాను నష్టంపై నివేదిక అందజేశాం'
విశాఖ: హుదూద్ తుపాను వల్ల రూ. ఇరవై వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాలుగు జిల్లాల్లో తుపాను నష్టం రూ. 21, 908 కోట్లు జరిగినట్లు అంచనా వేసి ఆ నివేదికను కేంద్ర కమిటీలోని సభ్యులకు అందజేశామన్నారు. ఇప్పటి వరకూ రూ. 7,500 కోట్లను రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కేంద్ర బృందాలు తుపానుతో నష్టపోయిన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్ర బృందాలు గురు, శుక్రవారాల్లో తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించాయి. -
విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన
విశాఖ: జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హుద్‌హుద్ తుపాను నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాలను కలవడానికి వచ్చిన రాజకీయ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర బృందాన్ని కలవాలంటూ వారు విజ్ఞప్తి చేసినా పోలీసులు వినకపోవడంతో రాజకీయ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులను కలిసి తీరుతామని వారు నిరసనకు దిగారు. కేంద్ర బృందాలు తుపానుతో నష్టపోయిన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్ర బృందాలు శుక్రవారం విశాఖ జిల్లాల్లో పర్యటించాయి. గురువారం తూర్పుగోదావరి జిల్లాలో ఆ అధికారులు పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. తమ బాధలను అధికారులు పట్టించుకోకుండా వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
గోడు వినకుండానే వెళ్లిపోయారు..
* కేంద్ర బృందంపై తూర్పుగోదావరి జిల్లా హుద్‌హుద్ బాధితుల పెదవివిరుపు * శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరోజు పర్యటనే సాక్షి ప్రతినిధి, కాకినాడ/శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాలు గురువారం తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించాయి. తమ బాధలు వినకుండానే అధికారులు వెళ్లిపోయారని తూర్పుగోదావరి జిల్లాలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కె.కె.పాఠక్, జాతీయ రహదారులశాఖ కార్యదర్శి ఎస్ఈ ఆర్.పి.సింగ్, కేంద్ర తాగునీరు, శానిటేషన్ శాఖకన్సల్టెంట్ పి.శ్రీవాత్సవ, కేంద్ర విద్యుత్‌శాఖ డెరైక్టర్ వివేక్ గోయల్, రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టర్ ఎస్.ఎం.కొలహత్ కౌర్‌ల బృందం తూర్పు గోదావరి జిల్లా తీరప్రాంతంలోని కొత్తపల్లి, తొండంగి, తుని రూరల్ మండలాల్లో పర్యటించింది. ఉప్పాడ వద్ద కోసుకుపోయిన బీచ్ రోడ్డు, సముద్రపు నీరు వచ్చి దెబ్బతిన్న పంట పొలాలు, దెబ్బతిన్న ధాన్యం, కోనపాపపేటలో సముద్ర కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించింది. తుపాను సమయంలో సుమారు 60 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. తమ గోడు వెళ్లబోసుకుందామని ఆశగా ఎదురుచూసిన బాధితులు తమను పలకరించకుండానే కేంద్ర బృంద సభ్యులు వెళ్లిపోవడంతో నిరాశచెందారు. తొండంగి, తుని మండలాల పరిధిలోని శృంగవృక్షం, తేటగుంట, పొలిమేరు గ్రామాలను, దెబ్బతిన్న అరటి, పామాయిల్ తోటలను పరిశీలించిన అధికారులు తుని తాండవ అతిథిగృహంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ తుపానుతో జిల్లాలో రూ.507.78 కోట్ల నష్టం సంభవించిందని జిల్లా అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కలెక్టర్ నీతూప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తదితరులు ఈ బృందం వెంట ఉన్నారు. విశాఖ జిల్లా ఎస్.రాయవరం, రాంబిల్లి, మునగపాక మండలాల్లో కొబ్బరి, జీడిమామిడి, వరి పంటలతో పాటు పౌల్ట్రీ పరిశ్రమకు వాటిల్లిన నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. ట్రాన్స్‌కోకు జరిగిన నష్టాలను సంస్థ డెరైక్టర్ ఎస్.సుబ్రహ్మణ్యం, సీఈ కె.ప్రవీణ్‌కుమార్ వారికి వివరించారు. అనకాపల్లిమండలం సంపత్పురంలోని ఎస్విఎస్ఎన్ రెడ్డి పౌల్ట్రీ కాంప్లెక్స్‌కు వెళ్లి కోళ్లకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. కేంద్ర బృందం శుక్రవారం విశాఖపట్నం ఉక్కుకర్మాగారానికి జరిగిన నష్టాన్ని పరిశీలించి ఢిల్లీ వెళ్లనుంది. మరోసారి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచన కేజీ బేసిన్ ఎస్ఈ ఎం.రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఫైనాన్స్ కమిషన్ డెరైక్టర్ రాజీవ్‌కుమార్ సేన్, పశుసంవర్థకశాఖ ఉపకార్యదర్శి పి.ఎస్.చక్రవర్తి, సి.రామవర్మ బృందం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, సరుబుజ్జిలి, పైడిభీమవరం ప్రాంతాల్లో పర్యటించింది. ఆంధ్రా ఆర్గానిక్స్ పరిశ్రమను, బెజ్జిపురం, మరువాడ, అక్కయ్యపాలెంలో, కోటపాలేల్లో తోటలు, పంటలు, పౌల్ట్రీ నష్టాలను, అల్లివలసలో దెబ్బతిన్న బోట్లను పరిశీలించారు. ఆస్తి, వాణిజ్య పంటల నష్టానికి సంబంధించి కోష్ఠ, ఎచ్చెర్లలోని తమ్మినాయుడుపేట, సరుబుజ్జిలి మండలంలో వంశధార రైట్ కెనాల్‌ను బృందం సభ్యులు చూశారు. నష్టాల గురించి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితర అధికారుల్ని, సహాయ కార్యక్రమాలు అందిన తీరుతెన్నులపై బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోసారి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. తుపాను నష్టంపై కేంద్రానికి ఈనెల 21న రాష్ట్ర నివేదిక అందిందని చెప్పారు. ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి నష్టాన్ని తెలిపే నివేదికను కేంద్ర బృందానికి ఇచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, మత్స్యకార, చేనేత సంఘ నాయకులు తుపాను నష్టాన్ని వివరించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ తుపాను నష్టం రూ.1,500 కోట్లకు పైనే ఉంటుందని చెప్పారు. గురు, శుక్రవారాల్లో పర్యటించాల్సిన కేంద్ర బృందం పర్యటన ఒక్కరోజుకే పరిమితి కావడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావు కేంద్ర బృందం పర్యటించిన సమయంలో కనిపించలేదు. -
ఉప్పాడలో ఎగసిపడిన అలలు
-
కబళించినకడలి
పిఠాపురం, న్యూస్‌లైన్ : ఊరు సద్దు మణిగిన వేళ కడలి ఉగ్రరూపం దాల్చింది. ఆదమరిచి నిదురిస్తున్న సమయంలో ఆపదై విరుచుకుపడింది. కెరటాల కోరలతో తీరాన్ని కాటేసింది. ఇళ్లను కబళించి నిలువనీడ లేకుండా చేసింది. దారులను ధ్వంసం చేసి రాకపోకలను అడ్డుకుంది. చెట్లను, విద్యుత్ స్తంభాలను పెకలించి తన ప్రతాపాన్ని చాటింది. ‘మాదీ’ తుపాను ప్రభావం అంతగా ఉండదని అధికారిక వర్గాలు చెప్పినా మంగళవారం సాయంత్రం నుంచే యు.కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట, ఉప్పాడల వద్ద అలల తాకిడి అంతకంతకూ పెరిగింది. మంగళవారం రాత్రి పదిగంటలు దాటాక సముద్రం ఒక్కసారిగా విలయతాండవమాడింది. మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడిన కెరటాలు కోనపాపపేటలో కిలోమీటర్ మేర తీరం పైకి 20 మీటర్ల వరకూ చొచ్చుకు రావడంతో తీవ్రంగా కోతకు గురై 34 మత్స్యకార గృహాలు కడలి కడుపులో కలిసిపోయాయి. సుమారు 65 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. గ్రామంలో వేసిన సిమెంటురోడ్డు సైతం సముద్రంలో కలిసిపోయింది. అనేక కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలను అలలు పెకలించి వేశాయి. ఒక్కసారిగా కెరటాల ఉధృతి పెరిగి తమ గృహాల పైకి విరుచుకుపడడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని, విలువైన సామాన్లు తీసుకుని పరుగులు తీశామని బాధితులు తెలిపారు. తుపాను ప్రభావం లేనప్పుడు హడావుడి చేసే అధికారులు.. కెరటాల రూపంలో తమ ఊరిపై విపత్తు విరుచుకుపడి, తీవ్రంగా నష్టపోతే తొంగి చూడలేదని మాజీ సర్పంచ్ కొర్ని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో తప్ప ఒక్క ఉన్నతాధికారి గ్రామానికి రాలేదని చెప్పారు. ఈదురు గాలుల తాకిడికి మిగిలిన గృహాలు కూడా దెబ్బ తింటున్నాయన్నారు. మరోపక్క బుధవారం సాయంత్రానికి అలల తాకిడి మరింత పెరగడంతో తీరానికి సమీపంలో ఉన్న సుబ్బంపేట, పల్లెపేట, కొత్తపేట, రంగంపేట తదితర ప్రాంతాలకు ముప్పు వాటి ల్లే అవకాశం కనిపిస్తోంది. కాలినడక కూడా కష్టమే కాగా కెరటాల ఉధృతికి కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్డు ఉప్పాడ వద్ద గతంలో ఎన్నడూ లేనట్టు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన కూడా వెళ్లలేనంతగా విధ్వంసమైంది. ఉప్పాడ వద్ద తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణగోడ కొంత వరకు ఆ గ్రామానికి రక్షణగా నిలవగా బీచ్‌రోడ్డు వెంబడి వేసిన రాళ్లగోడ మాత్రం కెరటాల తాకిడికి చెల్లా చెదురైంది. కెరటాలతోపాటు రాళ్లు ఎగిరిపడుతుండడంతోపాటు బీచ్‌రోడ్డు అనేక చోట్ల నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. దీంతో బుధవారం ఉద యం నుంచి కాకినాడ-ఉప్పాడల మధ్య రాకపోకలను నిలిపివేశారు. సాయంత్రానికి అలల ఉధృతి పెరగడంతో బీచ్‌రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. 1996 తుపాను సమయంలో కూడా బీచ్ రోడ్డు ఇంత దారుణంగా కోతకు గురి కాలేదని స్థానికులు అంటున్నారు. బీచ్ రోడ్డును ధ్వంసం చేసిన కెరటాలు ఉప్పాడ వద్ద తీరం వెంబడి ఉన్న వరి సాగు చేసే భూములపై విరుచుకుపడ్డాయి. చేలన్నీ ఉప్పు నీటితో నిండిపోవడంతో రబీ సాగుకు పనికి రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.