వామ్మో... ఎంత పెద్ద పీత!
Published Thu, Mar 9 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
ఉప్పాడ సాగర తీరంలో బుధవారం పెద్ద సైజ్ పీత మత్స్యకారుల వలకు చిక్కింది. సాధారణంగా పీత బాగా పెద్దది అయితే పావు కేజీ నుంచి అర కేజీ బరువు ఉంటుంది. కానీ ఈ పసుపు రంగు పీత సుమారు 2 కేజీలు బరువు ఉండడంతో మత్స్యకారులే అవాక్కయ్యారు. ఈ పీతను ఒక వ్యాపారి రూ..1500కు కొనుగోలు చేసి కాకినాడలో వ్యాపారులకు అమ్మగా రూ.1800కు అమ్మడైంది. ఇటువంటి పెద్ద పీతలు అరుదుగా వలలకు చిక్కుతాయని మత్స్యకారులు చెబుతున్నారు.
– కొత్తపల్లి
Advertisement
Advertisement