పిల్లలూ! మీరెప్పుడైనా సరదాగా సముద్రం చూసేందుకు వెళితే ఏం చేస్తారు? అక్కడ ఒడ్డున ఉన్న రాళ్లను ఏరుకుంటారు. వాటిని మీతోపాటు తెచ్చుకొని దాచుకుంటారు. నలుపు, తెలుపు రంగుల్లో నునుపుగా ఉండే ఆ రాళ్లు చూసేందుకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని ఇంట్లో పెట్టుకొని మురిసి΄ోతుంటారు. అయితే ఇకపై ఆ పని చేయొద్దు. ఎందుకో తెలుసా?
సముద్రంలో నిత్యం ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతుంటాయన్న విషయం మీకు తెలుసు కదా! ఆ అల్లు తాకిడికి తీరం కొట్టుకు΄ోకుండా రక్షించేది ఈ రాళ్లే. ఒడ్డున అందరూ ఆనందంగా ఉండాలన్నా, సముద్రం అలలు మన మీద ఉధృతంగా పడిపోకుండా ఉండాలన్నా ఈ రాళ్లు రక్షణ కవచాలుగా నిలబడతాయి. మీరు ఈ రాళ్లను మీతోపాటు తెచ్చుకుంటే ఆ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో అలలు తీరాన్ని కోసుకుంటూ వెళ్లిపోతాయి. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. మేమొక్కరం కొన్ని రాళ్లు తెచ్చుకుంటే నిజంగా ఇంత సమస్య వస్తుందా అని అనుకోవద్దు. మీరొక్కరే కాకుండా నిత్యం ఎంతోమంది సముద్రం చూసేందుకు వస్తారు. వారంతా మీలాగే ఆలోచించి తలా ఒక రాయి తీసుకొని వెళితే నష్టం తప్పక జరుగుతుంది. అందుకే ఉత్తర ఇంగ్లండ్‌లోని కంబర్‌ల్యాండ్ కౌన్సిల్ ప్రాంతంలో కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా సముద్రం ఒడ్డున రాళ్లు ఏరి, తీసుకెళ్తున్నట్టు తెలిస్తే వాళ్లకు 100 పౌండ్లు(సుమారు రూ.10 వేలు) జరిమానా విధిస్తారు. ఇదంతా సముద్రాన్ని, చుట్టూ ఉన్న తీరు ప్రాంతాన్ని కాపాడటం కోసమే!
మన దేశంలో అలా రాళ్లు ఏరినందుకు ఎవరూ జరిమానా వేయరు. కానీ సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతానికి హాని కలగకుండా ఉండాలంటే మనమే సొంతంగా ఆ పని మానేయాలి. సముద్రం ఒడ్డున హాయిగా పరుగులు పెడుతూ, సముద్రం అలల్ని చూస్తూ గడపాలి.. కావాలంటే ఆ రాళ్లతో అక్కడే ఆడుకోవాలి తప్ప వాటిని ఏరుకొని ఇంటికి తీసుకురాకూడదు. తెలిసిందా!
ఇదీ చదవండి: US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం!
US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరు
Comments
Please login to add a commentAdd a comment