rocks
-
2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉన్న బండరాళ్లివి!
రాక్ సొసైటీ గుర్తింపు పొందిన ఉర్దూ విశ్వవిద్యాలయంలోని పత్తర్ కే దిల్, ఏక్తా మే తాకత్ హై పేర్లు కలిగిన రెండు బండరాళ్లకు మాత్రం 2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉందని, దక్కన్ పీఠభూముల్లో భాగం అని చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు బండరాళ్లలో రెండు రాళ్లు పక్కపక్కనే ఉండడాన్ని గుర్తించి ఈ రాళ్లకు ‘పత్తర్కే దిల్’ అని నామకరణం చేశారు. రాళ్లన్నీ ఒకేచోట ఉండడంతో ఏక్తా మే తాకత్ హై (యునైటెడ్ వి స్టాండ్) అని నామకరణం చేశారు. అలాగే మరోచోట ఉన్న రాళ్లకు కూడా అనేక్ తా మే ఏక్తా (యూనిటీ ఇన్ డైవర్సిటీ) అని కూడా పిలుస్తున్నారు. రాక్స్ పేరిట వీకెండ్స్ వాక్ ∙విభిన్న రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలకు చెందిన వారితో మినీ భారత్‌గా మారిన హెచ్‌సీయూలో విద్యార్థులలో ఐక్యత బలపడేలా చేసేందుకు హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్ పేరిట వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు ద్వారా వీకెండ్స్‌లో వాక్‌లను నిర్వహిస్తున్నారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో మష్రూమ్ రాక్, వైట్ రాక్, టెంపుల్ రాక్, వర్జిన్ రాక్, వైట్ రాక్స్, హైరాక్స్, సాసర్ రాక్, కోన్ రాక్ కాంప్లెక్స్ ఇలా రకరకాల పేర్లతో ఈ బండరాళ్లను విద్యార్థులు పిలుస్తుంటారు. హెచ్‌సీయూ, మనూ యూనివర్సిటీల్లో హెరిటేజ్ రాక్స్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ‘ఏక్తా మే తాకత్ హై’పేరుతో పిలిచే రాళ్లు ‘పత్తర్ కే దిల్.. ఏక్ తా మే తాకత్ హై.. అనేక్ తా మే ఏక్తా.. ‘మష్రూమ్ రాక్,.. వైట్ రాక్స్.. టెంపుల్ రాక్’లు హెరిటేజ్ రాక్స్గా గుర్తింపు పొందాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన భారీ బండరాళ్లకు పెట్టిన పేర్లు ఇవి. నగరంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న రాతి సంపద హెచ్‌సీయూ, మనూ ఉర్దూ యూనివర్సిటీల్లో ఉండడం విశేషం. నగరంలో గుర్తించిన హెరిటేజ్ రాళ్లలో హెచ్‌సీయూ ‘మష్రూమ్రాక్’ ఉంది. వీటికి శతాబ్దాల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. వీటి గురించి భావితరాలకు తెలిసేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌సీయూలో 2,300 ఎకరాలు, ‘మనూ’లో 200 ఎకరాలు కలిపి 2,500 ఎకరాలలో విభిన్న తరహాలో ఏర్పడిన భారీ బండరాళ్ల (రాక్స్)ను రక్షిస్తూ వస్తున్నారు. – రాయదుర్గం -
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యేక డాక్యుమెంటరీ, అక్టోబర్ 20న
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ బృందం హైదరాబాద్ హెరిటేజ్ గురించి సరికొత్త డాక్యుమెంటరీని ఆవిష్కరించనుంది. అక్టోబర్ 20న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగే గ్రాండ్ ఈవెంట్లో అధికారికంగా దీన్ని లాంచ్ చేయనుంది. హైదరాబాద్ పట్టణ విస్తరణతో కనుమరుగవుతున్న రాళ్లకు (అదర్ కోహినూర్స్) నివాళిగా దీన్ని రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.ఉమా మగల్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ 48 నిమిషాల డాక్యుమెంటరీ, హైదరాబాద్‌లోని ప్రత్యేకమైన ప్రకృతిలో అద్భుతమైన రాళ్లను, వాటి వైభవాన్ని పరిచయం చేయనుంది. నగర గొప్ప సాంస్కృతిక, చారిత్రాత్మక సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది. అక్టోబరు 20న సాయంత్రం 6 గంటలకు ప్రసిద్ధ "సాంగ్ ఆఫ్ ది కోహినూర్స్"ని ర్యాప్ సాంగ్ ఈ కార్యక్రమం మొదలు కానుంది. డీజే ముర్థోవిక్ స్వరపరిచిన అనుజ్ గుర్వారా అందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోనేంది. ఈ పాటను హైదరాబాద్ ప్రేమ గీతం అని పిలుస్తారు. ఈ చిత్రం కేవలం హైదరాబాద్ రాళ్ల డాక్యుమెంటేషన్ కాదు; ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం. నగర ప్రత్యేకమైన సహజ వారసత్వాన్ని జరుపుకోవడానికి ,రక్షించడానికి విభిన్న నేపథ్యాల నుండి ప్రజలను ఒకచోట చేర్చడం. నగర ప్రకృతి దృశ్యాన్ని గౌరవించే స్థిరమైన పట్టణ అభివృద్ధిపై చర్చ జరగాలని టీం భావిస్తోంది.మరిన్ని వివరాల కోసం, సందర్శించండి: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.అదర్స్కొహినూర్.కామ్ -
5 డోర్ల థార్ ‘రాక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా అయిదు డోర్ల థార్ రాక్స్ భారత్‌లో ఎంట్రీ ఇచి్చంది. ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.12.99 లక్షలు. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్ కోసం రాక్స్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం. దసరా నుంచి డెలివరీలు ఉంటాయి. 2 లీటర్ ఎం–స్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ ఎం–హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఆరు వేరియంట్లలో రేర్ వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ డ్రైవ్ట్రెయిన్తో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంచుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, 644 లీటర్స్ బూట్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. -
తమిళియన్ హెయిర్ స్టైలో ఇషా స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
ప్రపంచంలోని టాప్ 10 అరుదైన శిలలు
-
ప్రకృతి చెక్కిన రాళ్లు..లావా చెక్కిన శిలలు!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం.. దట్టమైన అడవుల్లో.. గుట్టల దిగువన పొడవాటి శిలలు.. ఏదో పని కోసం మనుషులు చెక్కి అలా వదిలేసినట్టు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.. కానీ అవి ప్రకృతి చెక్కిన రాళ్లు.. అందులోనూ మామూలు రాళ్లు కాదు.. భూమి అడుగునుంచి పొంగుకొచ్చిన లావా గట్టిపడి నిలువునా పోతపోసి నట్టు ఏర్పడిన బసాల్ట్ శిలలు అవి. ఎంతో చరిత్ర దాగి ఉన్న ఆ నిలువు రాళ్లను ఔత్సాహిక యువత గుర్తించినా.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఇప్పటివరకు నమోదు చేయలేదు. పరిరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనితో ఆ అరుదైన బసాల్ట్ శిలలు ధ్వంసమైపోయే అవకాశం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఏమిటీ శిలలు.. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బజార్ హత్నూర్, బోరెల్గూడ, ఆసిఫాబాద్ సమీపంలోని వర్తమనూర్తోపాటు పలుచోట్ల అరుదైన బసాల్ట్ శిలలు ఉన్నాయి. వీటిని కాలమ్నార్ బసాల్ట్ (లావా శిలలు)గా పిలుస్తారు. సుమారు ఆరు కోట్ల ఏళ్ల కింద ఇవి ఏర్పడినట్టు అంచనా. సాధారణంగా భూగర్భం నుంచి ఉబికి వచ్చిన లావా ప్రవహిస్తూ నీటి ప్రవాహాల వద్ద వేగంగా ఘనీభవించినపుడు.. నీళ్లు ఇంకినప్పుడు నేల నెర్రలువాసినట్టుగా లావాలో అష్టభుజి, షట్భుజి, చతురస్రం.. ఇలా రకరకాల ఆకృతుల్లో లోతుగా పగుళ్లు ఏర్పడతాయి. కొన్నేళ్ల పరిణామక్రమంలో అవి విడివడి స్తంభాలుగా రూపొందుతాయి. చాలా ప్రాంతాల్లో లావా ప్రవహించినా ఈ కాలమ్నార్ బసాల్ట్‌లు మాత్రం కొన్ని చోట్లనే ఏర్పడడం విశేషం. ఇలాంటివి చాలా అరుదు కూడా. 5 లక్షల కిలోమీటర్ల పరిధిలో.. ►భూగర్భం నుంచి ఉబికి వచ్చిన లావా ప్రవహించిన ప్రాంతం మన దేశంలో ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. దీన్ని డెక్కన్ వల్కానిక్ ప్రావిన్స్ (డీవీపీ)గా పేర్కొంటారు. ఇందులో మహారాష్ట్ర పూర్తి ప్రాంతం ఉండగా తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, గుజరాత్‌లలో కొంత భాగం ఉంది. డీవీపీ తూర్పు చివరిభాగం తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో విస్తరించి ఉంది. ఈ డీవీపీలోనే పలు ప్రాంతాల్లో కాలమ్నార్ బసాల్ట్ శిలలు ఏర్పడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో రక్షిస్తున్నా.. మహారాష్ట్ర, కర్ణాటకలలో ఇలాంటి లావా శిలలున్న ప్రాంతాలను జీఎస్ఐ అధికారికంగా గుర్తించింది. ఇప్పుడు అవి రక్షిత ప్రాంతాలుగా ఉన్నాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లా పరిధిలోకి వచ్చే సెయింట్ మేరీస్ దీవిలో పొడవాటి లావా శిలలతో ఏర్పడిన గుట్ట ఉంది. ఆ శిలలను జీఎస్ఐ గుర్తించి ప్రాచుర్యంలోకి తేవటంతో అది పర్యాటక ప్రాంతంగా మారింది. విదేశాల్లోనూ ఇలాంటి శిలలున్న ప్రాంతాలను జియో పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదారు ప్రాంతాల్లో ఈ లావా శిల లను గుర్తించినా పట్టించుకునేవారే లేకుండా పోయారు. వ్యవసా యం, ఆవాసాల విస్తరణ, రోడ్ల నిర్మాణంతో అవి చెదిరిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగారకుడిపైనా కాలమ్నార్ శిలలు ► కొన్నేళ్ల కింద నాసా ఉపగ్రహాలతో అంగారకుడిని చిత్రించినప్పుడు కనిపించిన దృశ్యాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరి చాయి. అంగారక గ్రహం మీద గుట్ట ల్లాగా ఉన్న ప్రాంతాల్లో నిలువు చారలను విశ్లేషించగా.. కాలమ్నార్ బసాల్ట్ (లావా శిలలు)గా తేల్చారు. అంగారక గ్రహం మీద అగ్నిపర్వతాలు ఉండేవన్న దానికి ఇవి ఆధారంగా నిలిచాయి. భవిష్యత్తులో మానవులు అంగారకుడిపైకి వెళ్లేందుకు ఎంత అనువుగా ఉంటుందన్న దిశలో సాగుతున్న పరిశోధనల్లో ఇదీ ఓ కీలక అంశంగా మారింది. బొమ్మలు గీసినట్టే ఇది ఆసిఫాబాద్ ప్రాంతంలోని వర్తమనూర్ వద్ద అడవిలో కనిపించిన అందమైన రాతి అమరిక. ఎవరో చెక్కినట్టుగా, రాళ్లపై ఆదిమానవులు రూపొందించిన పెట్రోగ్లివ్స్ను తలపిస్తున్న ఈ అమరిక లావా ప్రభావంతో ఏర్పడినదే. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచోట్ల మాత్రమే ఇలాంటి శిలలు ఉన్నాయి. అలాంటి వాటిని పట్టించుకునే వారే లేరన్న విమర్శలున్నాయి. రక్షిత ప్రాంతాలుగా గుర్తించాలి.. ప్రపంచంలో అరుదుగానే ఈ కాలమ్నార్ బసాల్ట్ శిలలు ఉన్నాయి. పలు దేశాల్లో వీటిపై అధ్యయనాలు జరుగుతున్నాయి కూడా. తెలంగాణలో ఈ శిలలు కనిపించిన ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా గుర్తించి భవిష్యత్తు ప్రయోగాలకు రక్షించుకోవాలి. – చకిలం వేణుగోపాల్, జీఎస్ఐ విశ్రాంత అధికారి ఔత్సాహికులే గుర్తించారు.. ఆదిలాబాద్ ప్రాంతంలో ఇప్పటివరకు వెలుగు చూసిన లావా శిలలను మన్నె ఆలియా, కటకం మురళి, వేణుగోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితర ఔత్సాహికులు గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యు ల వల్లనే ఆ శిలలు బయటి ప్రపంచానికి తెలిసి వాటిపై స్థానికంగా కొంత అవగాహనకు వీలు కలిగింది. వాటి పుట్టుపూర్వోత్తరాలపై అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. – శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు రాజమండ్రి సమీపంలో ఓ చిన్న భాగం.. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోని డీవీపీతో లింకు లేకుండా.. రాజమండ్రి సమీపంలో 25 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో లావా ఘనీభవించిన ప్రాంతముంది. కోస్తా ప్రాంతంలో ఈ చిన్న ముక్క తప్ప మరెక్కడా ఇలాంటిది లేదని నిపుణులు చెప్తున్నారు -
సజీవ శిలలు.. ఎక్కడైనా అరుగుతాయి; ఇక్కడ పెరుగుతాయి
శిల్పాలలో జీవం ఉట్టిపడితే వాటిని సజీవ శిల్పాలు అంటారు. సజీవ శిలలేమిటి అనే కదూ మీ అనుమానం? అంతేకాదు, కాలం గడిచేకొద్ది ఈ శిలలు పెరుగుతాయి. రాళ్లు ఎక్కడైనా అరిగితే అరుగుతాయేమో గాని, పెరుగుతాయా? ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా? నోరెళ్లబెట్టేలా చేసే ఈ చోద్యాన్ని చూడాలంటే, రుమేనియాకు వెళ్లాల్సిందే! రుమేనియా రాజధాని బుచారెస్ట్కు యాభైమైళ్ల దూరంలోని కోస్టెస్టీ గ్రామంలోను, ఆ గ్రామ పరిసరాల్లోని ఇసుక నేలల్లోను కనిపించే ఈ సజీవ శిలలను ‘ట్రోవంట్స్’ అంటారు. ప్రతి వెయ్యేళ్లకు వీటి పరిమాణం రెండు అంగుళాల మేరకు పెరుగుతుంది. పెరిగే కొద్ది ఇవి జంతువులు, వృక్షాల ఆకారాలను సంతరించుకుంటాయి. వీటి పెరుగుదల క్రమాన్ని గమనిస్తే, వృక్షకణం పెరుగుదల మాదిరిగానే ఉంటుంది. అంతేకాదు, ఈ శిలలు మరికొన్ని శిలలకు జన్మనిస్తాయి కూడా! వీటిలో కొన్ని చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉంటే, మరికొన్ని కొన్ని అడుగుల వ్యాసంతో భారీ పరిమాణంలో ఉంటాయి. ఈ శిలలపై చాలా ఏళ్లుగా భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. రుమేనియా వచ్చే విదేశీ పర్యాటకులు వీటిని తిలకించేందుకు పనిగట్టుకుని మరీ కోస్టెస్టీ గ్రామానికి వస్తుంటారు. చదవండి: గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు.. 'టైగర్ వుడ్స్' పేరు ఎలా వచ్చింది 'బోపన్న.. మీ భార్య చాలా అందంగా ఉంది' -
వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే!
వాషింగ్టన్: దాదాపుగా భూమి మాదిరిగానే ఉన్న ఒక గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. పైగా అది సరిగ్గా భూమి పరిమాణంలోనే ఉందట. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని ఎల్హెచ్ఎస్ 475గా పిలుస్తున్నారు. ఇలా మన సౌరవ్యవస్థకు ఆవల ఓ గ్రహాన్ని ఇంతటి స్పష్టతతో, కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారంటూ నాసా సైంటిస్టులు సంబరపడుతున్నారు! పైగా అది కూడా భూమి మాదిరిగానే రాళ్లు, పర్వతాలమయంగా ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని వారు చెబుతున్నారు. ఈ సోదర గ్రహంపై వాతావరణం ఉందో, లేదో, ఉంటే ఎలా ఉందో తేల్చే పనిలో పడ్డారు. అన్నట్టూ, ఇది తన సూర్యుని చుట్టూ కేవలం రెండు రోజులకు ఒక రౌండ్ చొప్పున వేసేస్తోందట! పైగా దానికి అతి సమీపంలో ఉందట. ‘‘కాకపోతే సదరు నక్షత్రపు ఉష్ణోగ్రత సూర్యునితో పోలిస్తే సగమే. కాబట్టి ఎల్హెచ్ఎస్ 475పై వాతావరణం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం’’ అని నాసా అంటోంది. -
రాజుకు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ
కామారెడ్డి టౌన్: గుట్టపైకెళ్లి ప్రమాదవశాత్తు బండరాళ్ల కింద ఇరుక్కుపోయి సురక్షితంగా బయటపడిన రాజు పూర్తిగా కోలుకున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి శుక్రవారం కౌన్సెలింగ్‌తోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీని మానసిక వైద్య నిపుణులు, జిల్లా మెంటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి.రమణ అందించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు వన్యప్రాణుల వేటకు వెళ్లి మాచారెడ్డి మండలం సింగరాయిపల్లి అడవిలోని ఓ గుట్టపైనున్న బండరాళ్ల కింద మంగళవారం ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. రెండ్రోజులు నరకయాతన అనుభవించాడు. సహాయక బృందం బండరాళ్లను పగులగొట్టి రాజును సురక్షితంగా బయటకు తీసి గురువారం కామారెడ్డి జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించింది. ఈ సందర్భంగా రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ కొన్నిగంటలపాటు తలకిందులుగా ఉండటం, రాళ్లు బరుసుగా ఉండటంతో కాళ్లు, చేతులు రాపిడికి గురై గాయాలయ్యాయని చెప్పాడు. తొడభాగంలో కాస్త పెద్ద గాయమైందని, ఒళ్లునొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు. రాజును శనివారం డిస్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. జీవితంలో తీవ్రమైన బాధ కలిగించిన ఘటనలు, ప్రతికూల పరిస్థితుల(రేప్, పెద్ద ప్రమాదం, అగ్నిప్రమాదం)ను ఎదుర్కొన్నవారు మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని, ఆ భయంకరమైన జ్ఞాపకాల నుంచి బయటకురాలేక చాలామంది మానసికంగా కుంగిపోతుంటారని వైద్యులు తెలిపారు. సాధారణ వైద్యంతోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఇలాంటివారిని సాధారణస్థితికి తీసుకురావచ్చన్నారు. రాజుతోపాటు కుటుంబసభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రాం సామాజిక కార్యకర్త డాక్టర్ విరాహుల్ కుమార్, డ్యూటీ డాక్టర్ కాళిదాసు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి..
సాక్షి, కామారెడ్డి: అడవిలో షికారుకెళ్లి గుట్టల మధ్య ఇరుక్కుపోయిన రెడ్డిపేటకు చెందిన చాడ రాజు సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు 43 గంటలుగా గుహలోనే తలకిందులుగా ఉన్న రాజును.. పోలీసులు, గ్రామస్తులు 18 గంటల పాటు శ్రమించి గుహ నుంచి బయటకు తెచ్చి, ప్రాణాలు కాపాడారు. డ్రిల్లింగ్ మిషన్స్, జిలిటెన్ స్టిక్స్‌తో బండలను పేల్చుతూ, నాలుగు జేసీబీలతో మట్టిని బండరాళ్లను తొలగించుకుంటూ పక్కా ప్లాన్ ప్రకారం రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌ను విజయవంతం చేసింది. రాజును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కాగా, రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్‌లు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి షికారు కెళ్లారు. ఈ క్రమంలో గుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చాడు. కానీ చాడ రాజు అందులోనే చిక్కుకుపోవడంతో మహేశ్ కూడా రాత్రంతా అక్కడే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు రాజుకు మహేశ్ నీళ్లు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. అప్పటికీ అతను బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు.. రెడ్డిపేట, సింగరాయపల్లి గ్రామస్తులతో కలిసి రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చదవండి: (షికారుకెళ్లాడు.. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడు..) -
షికారుకెళ్లాడు.. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడు..
రామారెడ్డి (ఎల్లారెడ్డి): అడవిలో షికారుకెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు గుట్టల మధ్య ఇరుక్కుపోయిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్‌లు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి షికారుకెళ్లారు. ఈ క్రమంలో గుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చాడు. కానీ చాడ రాజు అందులోనే చిక్కుకుపోవడంతో మహేశ్ కూడా రాత్రంతా అక్కడే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు రాజుకు మహేశ్ నీళ్లు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. అప్పటికీ అతను బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించగా వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు, రెడ్డిపేట, సింగరాయపల్లి గ్రామస్తులు చేరుకొని రాత్రి పొద్దు పోయే వరకు జేసీబీ సహాయంతో రాజును బయటకు తీసేందుకు శ్రమించారు. జేసీబీతో గుట్టలను పక్కకు తీసేందుకు వీలు కాకపోవడంతో లైటింగ్ ఏర్పాటు చేసి కామారెడ్డి నుంచి 210 ఈటాచీ తెప్పించారు. రాజు ఉన్న చోట చార్జింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేయడంతో పాటు వైద్యుల సలహాల మేరకు పండ్ల రసాలను అందజేస్తున్నారు. ఈ గుట్టల మధ్య ఉడుములు, కుందేళ్లు ఉంటాయని వీటిని పట్టుకునే క్రమంలోనే గుట్టల మధ్య రాజు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. జంతువుల కోసం వచ్చినట్లు విచారణలో తేలితే కేసు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: Hyderabad: బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్‌కు జరిమానా -
లక్కీ బాయ్.. మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చాడు!
కొరాపుట్(భువనేశ్వర్): ప్రమాదావశాత్తు లోయలోకి జారిపడిన బాలుడిని గ్రామస్తులు సురక్షితంగా బయటకు చేర్చారు. నవరంగ్‌పూర్ జిల్లా తెంతులుకుంటి సమితి కొంటా పంచాయతీ బరిపొదర్ గ్రామానికి చెందిన డొమ్ము జానీ సమీపంలోని కొండ మీదకు శుక్రవారం ఉదయం పశువులను తీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదావశాత్తు కాలుజారడంతో రెండు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. తల భాగం కిందికి ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన మిగతా కాపర్లు బాలుడు జారిపోకుండా కాలికి తాడు కట్టి, నిలువరించారు. విషయాన్ని తెంతులకుంటి బీడీఓ దుర్జన బొయికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో అక్కడికి చేరుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సహకారంతో 8 గంటలు కష్టపడి శుక్రవారం రాత్రికి జానీని వెలుపలికి తీశారు. చిన్నపాటి గాయాలవడంతో తెంతుల కుంటి ఆస్పత్రికి తరలించారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం -
మోటర్బోట్లపై విరిగిపడ్డ కొండచరియలు.. చూస్తుండగానే ఏడుగురి ప్రాణాలు..
Cliff Breaks Off, Falls On Boat In Brazil Lake: బ్రెజిల్‌లోని సరస్సులో ప్రయాణికులతో ఉన్న టూరిస్ట్ పడవలపై భారీ కొండ చరియ విరిగిపడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దాదాపు 32 మంది గాయపడినట్లు వెల్లడించారు. అయితే కాపిటోలియో ప్రాంతంలోని పర్యాటక ప్రాంతమైన ఫర్నాస్ సరస్సుకి వారాంతపు పర్యటనలో భాగంగా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక పెద్ద రాతిపలక రెండు పడవలపై విరిగిపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (చదవండి: మా ఆయన బంగారం! విడాకులిస్తాడనుకుంటే.. రూ. 5 కోట్ల విలువైన కోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు!) నిజానికి బ్రెజిల్‌లోని ఈ సరస్సు సమీపంలో రాతి కొండలు, పచ్చని జలపాతలు, జలవిద్యుత్ వంటివి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. దీంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వీటిని చూసేందుకు తరలివస్తారు. అయితే ఇటీవల ఆగ్నేయ బ్రెజిల్లో కురిసిన వర్షాల కారణంగా ఈ కొండ కూలి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: ఈ బుడ్డోడు కరోనా వ్యాప్తిని ఎలా విశ్లేషించాడో చూడండి!) Terrible video out of Lake Furnas, #Brazil, captures the moment a canyon cliff collapses on boats full of tourists. Latest reports say at least 5 dead 20 missing.pic.twitter.com/03LrGX0kIL — Albert Solé (@asolepascual) January 8, 2022 -
వారి కన్నీటి కథ.. కండలు కరిగినా కడుపునిండదాయె
సాక్షి, హైదరాబాద్: ఎండనక, వాననక రాళ్లను తీసుకువచ్చి రోళ్లను తయారు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు వడ్డెరలు. బతుకుదెరువు కోసం వివిధ జిల్లాల నుంచి వలస వచ్చి మేడ్చల్ జిల్లాలో జీవనం గడుపుతున్నారు. చదువంటే తెలియని వయస్సు పొట్టకూటి కోసం సమ్మెట ఆయుధంగా చేసుకున్న వారి జీవితాల్లో వెలుగులు కానరావడంలేదు. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో దాదాపు వెయ్యి కుటుంబాలకు పైగా రాళ్లను కొడుతూ జీవనం సాగిస్తున్నాయి. రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు. పేదరికానికి మారుపేరు వారు. బతుకు గమనంలో చితికిపోయిన జీవితాలు. భవిçష్యత్‌పై ఆశలు లేని గమనాలు. కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి రాళ్లను రోళ్లుగా తయారు చేస్తున్న వారి విషయంలో సరిపోతుంది. పొట్ట కూటి కోసం గ్రామాలు తిరుగుతూ బతుకు బండిని లాగుతున్నారు. రోళ్లను తయారు చేసే వారిని కదిలిస్తే కన్నీటి కథలే కనిపిస్తాయి. రాళ్లను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం వడ్డెరులకే సాధ్యం. బతుకు గమనంలో తమకు చేయూతనందించాలని వేడుకుంటున్న వడ్డెరుల జీవిత గమనంపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ పథకాల గురించి అసలే తెలీదు.. పిల్లలను చదివించే స్తోమత లేదని అందరం కష్టపడి పని చేస్తామని చెబుతున్నారు. తమకు నగర శివారుల్లోని కొంత అటవి ప్రాంతాన్ని అప్పగిస్తే అందులో లభించే బండలను కొట్టుకుని జీవనం సాగిస్తామని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల గురించి అసలు తమకు తెలియదని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని వడ్డెర కులస్తులు విన్నవిస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను సుత్తితో పగలగొట్టి ఉపయోగంలోకి తీసుకువస్తారు. ప్రతిరోజు ఉదయం కుటుంబ సభ్యులందరూ కలిసి బండలు పగలగొట్టె పనికి వెళ్తారు. ఎంత కష్టపడుతున్నా శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని వడ్డెరలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో రాళ్లను కంకరగా తయారు చేయడానికి కొత్త రకాల క్రషర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వారికి పని దొరకని పరిస్థితి. రెండు రోజులు రాళ్లు కొడితేనే.. రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు. పని దొరకదు.. కడుపు నిండదు వంశపారంపర్యంగా ఈ వృత్తిని నమ్ముకునే జీవిస్తున్నాం. సంచార జీవితాన్ని గడపడంతో ఎదగలేకపోతున్నాం. పూట గడవడమే తప్ప ఒక్క పైసా వెనుకేసుకోలేదు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలం మేము. ప్రతి రోజు పని చేస్తేనే నాలుగు పైసలు కండ్ల చూస్తాం. లేకుంటే పస్తులుంటాం. ఒక్కోసారి పని దొరకదు. కడుపు నిండదు. ప్రభుత్వమే వడ్డెరులపై శ్రద్ధ వహించాలి. – నర్ర మహేష్, జవహర్‌నగర్ రాళ్లు కొట్టడానికి అనుమతి ఇవ్వాలి.. బండరాళ్లను అందమైన రోళ్లుగా తయారు చేయడమే తప్ప చదవడం అంటే తెలియదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పనికి వెళ్లి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకున్నాం. కాయకష్టం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. గుట్టల్లో రాళ్లను కొట్టడానికి అనుమతులు ఇవ్వాలి. – రేపన్ లక్ష్మణ్, జవహర్‌నగర్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి వడ్డెర కులస్తులకు కొంత అడవిని అప్పగించాలి. నగర శివారు ప్రాంతాలలో జీవిస్తున్న వడ్డెర కులస్తుల జీవితాలలో ఎలాంటి మార్పు రావడం లేదు. వడ్డెరలను ఎస్టీ జాబితోకి చేర్చి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి. చాలా మంది వడ్డెరల పిల్లలు చదువులకు దూరంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. తాతల కాలం నుంచి రాయిని కొట్టుకుని జీవిస్తున్న మాకు వడ్డెరలకు చేయుతనివ్వాలి. – పల్లపు రవి, కార్పొరేటర్, జవహర్‌నగర్ సీఎం దృష్టికి తీసుకెళ్లాం రాష్ట్రంలో వడ్డెర కులస్తుల జీవన విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవంగా వారి జీవితాల్లో ఎంతో విప్లవాత్మక మార్పులు తీసుకురాల్సిన అవసరం ఉంది. చాలా మంది కుటుంబాలకు దూరంగా బండలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వడ్డెరల స్థితిగతులపై ప్రత్యేక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేశాం. అదే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాం. – మర్రి రాజశేఖరరెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ -
Balancing Stones: కోట్ల ఏళ్లుగా.. కొండ కొసన..
సిద్దిపేట సమీపంలోని హస్తాల్పూర్ శివారు గుట్టమీద అంచుపై ఉన్న గుండు రాయి ఇది. కాస్త పట్టుకుని ఉన్నట్టుండే ఈ రాయి కూడా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. ..పైన చెప్పినవన్నీ ఒకే రకంగా ఏర్పడిన రాళ్లే. తెలంగాణలో పలుచోట్ల ఇలాంటివి ఉన్నాయి. కానీ వాటి ప్రత్యేకతలపై అవగాహన లేక ధ్వంసమైపోతున్నాయి. ఒక్కదాన్ని కూడా పురావస్తు శాఖ (ప్రస్తుతం వారసత్వ శాఖ) రక్షిత ప్రాంతంగా గుర్తించలేదు. ప్రకృతి చెక్కిన ఈ రాళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. విదేశాల్లో ఇలాంటి వాటిని రక్షిత ప్రాంతంగా గుర్తించి, కాపాడుకుంటున్నారని పేర్కొంటున్నారు. రెండేళ్ల కింద ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురంలో ద్వైపాక్షిక చర్చలు జరిపిన వేళ.. పెద్ద పరుపు బండపై నిలిచిన గుండ్రటి రాయి వద్ద ఫొటో దిగారు. కృష్ణుడి చేతిలోని వెన్నెముద్దగా పిలిచే ఆ రాయి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముట్టుకుంటే జారిపోతుందేమో అన్నట్టున్న ఆ రాయి.. అలా ఎలా నిలిచి ఉందన్న ప్రశ్న అందరినీ తొలిచేసింది. ఇది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉన్న ఓ చిత్రమైన రాయి. అడ్డంగా ఉన్న అంత పెద్ద రాయి.. మధ్యలో చిన్న భాగం మాత్రమే కింద తాకుతుంది. మిగతా భాగమంతా గాలిలో తేలుతూ ఉంటుంది. అయినా బలంగా నిలిచి ఉంది. దీన్ని ‘మష్రూమ్ (పుట్టగొడుగు) రాక్’గా పిలుచుకుంటారు. హిమాయత్‌సాగర్ జలాశయం పక్కనే.. చిన్నగుట్టపై ఒకదానిమీద మరొకటి పేర్చినట్టుగా ఉన్న రాళ్లు ఇవి. ఏ క్షణాన్నయినా జలాశయంలోకి దొర్లిపోయేట్టుగా కనిపిస్తాయి. ఆ రాళ్ల పక్కన గుట్ట భాగాన్ని గతంలోనే తొలిచేశారు. ఎప్పుడో అప్పుడు ఇవీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఎలా ఏర్పడతాయి? భూమ్యాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉన్నట్టు భ్రమింపజేసే ఈ రాళ్లను బ్యాలెన్సింగ్ స్టోన్స్‌గా పిలుస్తారు. భూమిపై 350–250 కోట్ల ఏళ్ల క్రితం గ్రానైట్, ఇతర రాళ్ల పొరలు ఏర్పడ్డాయని.. వాటిలో క్రమంగా పగుళ్లు ఏర్పడి, దిగువకు కూరుకుపోవడమో, పడిపోవడమో జరిగిందని నిపుణులు చెప్తున్నారు. అలాంటి సమయంలో కొన్ని రాళ్లు అలాగే నిలిచిపోతాయని.. అవే ఈ బ్యాలెన్సింగ్ రాళ్లు అని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఆరు కోట్ల ఏళ్ల నాటివి ‘‘కోట్ల ఏళ్ల క్రమంలో భూమిలో వచ్చే మార్పుల వల్ల బ్యాలెన్సింగ్ రాళ్లు ఏర్పడతాయి. తెలంగాణలో కనిపిస్తున్న ఈ బ్యాలెన్సింగ్ రాళ్లు దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం నాటివిగా అంచనా. పురాతన ప్రాధాన్యమున్న ఈ రాళ్లను పర్యాటకులకు చేరువ చేయాలి’’ – చకిలం వేణుగోపాల్, విశ్రాంత డిప్యూటీ డీజీ, జీఎస్ఐ మనవద్ద గుర్తింపు రాలేదు ‘‘బ్యాలెన్సింగ్ రాళ్లకు విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రంలో కొన్ని గుట్టల్లో ఇలాంటి రాళ్లున్నా వాటికి గుర్తింపు లేదు. స్థానికంగా ఏ అవగాహనా లేదు. క్రషర్లలో, ఇళ్ల నిర్మాణాల్లో వాడే రాళ్లుగా వినియోగిస్తున్నారు. వాటిని పరిరక్షించాలి’’ – శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ -
భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్
డెహ్రాడూన్: ఉత్తర ఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే నైనిటాల్, తపోవన్, చంద్రబాగా నదులు నిండుకుండను తలపిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. కాగా, బద్రీనాథ్ జాతీయ రహదారిపై లంబగడ్నల్లా వద్ద కొండచరియలు విరిగిపడటంతో.. ఒక కారు రోడ్డుపై చిక్కుకుంది. వెంటనే స్పందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు క్రెన్ సహయంతో కారును సురక్షితంగా బయటకు తీసుకోచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే వరదలపై ప్రధాని మోదీ.. ఉత్తర ఖండ్ సీఎం పుష్కర్ ధామితో ఫోన్లో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రంనుంచి పూర్తిస్థాయి సహాయం అందిస్తామని తెలిపారు. వరదలలో ఇప్పటికే నేపాల్‌కు చెందిన ముగ్గురు కూలీలతోపాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా చంపావ్ జిల్లా,సెల్ఖోలా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరో ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం.. ఉత్తర ఖండ్‌లో 1 నుంచి 12 తరగతివరకు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. వాతావరణం మెరుగుపడే ఎలాంటి పర్యాటకులకు అనుమతిలేదని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా.. చంపావత్‌లోని చల్తి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. #WATCH | Uttarakhand: Occupants of a car that was stuck at the swollen Lambagad nallah near Badrinath National Highway, due to incessant rainfall in the region, was rescued by BRO (Border Roads Organisation) yesterday. pic.twitter.com/ACek12nzwF — ANI (@ANI) October 19, 2021 చదవండి: వైరల్: భర్త మరో మహిళతో జిమ్‌లో.. చెప్పులతో చితకబాదిన భార్య -
రాయచోటి రాక్ గార్డెన్స్.. శిలల సొగసు చూడతరమా!
వైఎస్సార్ జిల్లా: రాయచోటి ప్రాంతంలోని కొండల్లో వివిధ ఆకృతులతో ఏర్పడిన శిలలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్ద రాతి గుండుపై మరో గుండు, దానిపై ఇంకొకటి...ఇలా ఎవరో పేర్చినట్లు ఉంటాయి. కొన్ని శిలలు అడుగు భాగాన కొద్దిపాటి ఆధారంతో నిలుచుని ఎప్పుడూ పడిపోతాయో అన్నట్లు ఉంటాయి. లక్కిరెడ్డిపల్లె మండలం గంధం వాండ్లపల్లె సమీపాన ఉన్న కొండపై అచ్చం ఓ మనిషి మద్దెల వాయిస్తున్నట్లుగా ఉన్న ఓ రాయి విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక ప్రజలు దీన్ని బొమ్మ కొండ లేదా మద్దెల కొండ అని పిలుస్తారు. ఇక్కడికి సమీపంలోనే మరో కొండలోని ఓ రాయి వెలిగించిన కొవ్వొత్తి రూపంలో ఉంది. కడప నుంచి రాయచోటికి వెళ్లే మార్గంలో గువ్వల చెరువు దాటాక వచ్చే మేదరపల్లె వద్దనున్న చెరువులో ఉన్న రాయి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. పాలకడలిలో శేష తల్పాన్ని పోలినట్లు ఈ రాయి కనబడుతుంది. శిలలు వివిధ ఆకృతుల్లో ఏర్పడటానికి గల శాస్త్రీయ కారణాలు తెలియని ప్రజలు ఒక్కొ రాయి చుట్టూ ఒక్కొ కథను అల్లారు. అవే నేటికీ ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి గుట్టకు, ప్రతి రాయికి ఏదో ఒక కథ ప్రచారంలో ఉంది. రాయచోటి రాక్ గార్డెన్స్ వెనుక ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. జియాలజిస్టులు చెబుతున్న ప్రకారం లావా చల్లబడుతూ వచ్చిన క్రమంలో ఇలాంటి కొండలు, గుట్టలు ఏర్పడ్డాయి. టెంపరేచర్, ప్రెషర్‌ను బట్టి రకరకాల రూపాలు ఏర్పడ్డాయి. రాయచోటి ప్రాంతంలోని శిలలు ఇగ్నస్ రాక్స్ లేదా మాగ్నాటిక్ రాక్స్ అంటారు. ఆర్కియన్ యుగంలో ఇవి ఏర్పడ్డాయి. కొన్ని లక్షల సంవత్సరాలు గాలి, వాన, నీరు రాపిడి వల్ల శిలలు వివిధ ఆకృతులను సంతరించుకున్నాయి. అడుగు భాగాన చిన్నపాటి ఆధారంతో ఎప్పుడు మీద పడుతాయో అన్నట్లుగా ఉండే శిలలను టార్స్ అని పిలుస్తారు. గ్రానైట్‌లో ఉండే సిలికా కంటెంట్ సాలిడ్ అయ్యి గువ్వల చెరువు ప్రాంతంలో క్వార్ట్జైట్స్ ఏర్పడ్డాయి. రాయచోటి ›ప్రాంతంలోని రాక్ గార్డెన్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల స్టోన్ క్రషింగ్ యజమానులు ఇష్టమొచ్చిన రీతిలో కొండలను ధ్వంసం చేస్తున్నారు. చాలాచోట్ల అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇందువల్ల అందమైన శిలలు క్రమేపీ ధ్వంసం కావడం ప్రకృతి ప్రేమికులను ఆందోళన పరుస్తోంది. అరుదైన శిలలను కాపాడి భావి తరాలకు అందించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!
లక్నో: ఎవరైన ఏడిస్తే కళ్లలోంచి నీళ్లు వస్తాయి. కానీ ఈ పాపకు కన్నీళ్లతోపాటు రాళ్లు కూడా వస్తాయి. అయితే రెండు కళ్ల నుంచి కాదు.. కేవలం ఎడమ కంటిలో నుంచి రాళ్లు వస్తుంటాయి. వినడానికి కొంత వింతగా అనిపిస్తున్నా.. ఇలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓ బాలిక కంట్లో నుంచి రాళ్లు వస్తున్నాయి. గుర్సాహైగంజ్ అనే ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక ఈ వింత సమస్యతో బాధపడుతోంది. కూతురు సమస్యకు పరిష్కారం కోసం తల్లిదండ్రులు చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఏ డాక్టర్ కూడా ఇది ఏ సమస్యో చెప్పలేకపోయారు. చదవండి: కూతురు ఇష్టం లేని పెళ్లి.. మనవడిని కిరాతకంగా చంపిన బామ్మ ఆమెకు ఈ సమస్య ఎప్పటి నుంచో లేదు. గత జూలై 27 నుంచి ఆమె ఎడమ కంటిలో నుంచి కన్నీళ్లతో పాటు చిన్న సైజు రాళ్లు బయటకొస్తున్నాయి. దాదాపు రెండు నెలలుగా బాలిక ఎడమ కంటి నుంచి ఏడుస్తున్నప్పుడు చిన్న చిన్న రాళ్లు వస్తున్నాయని, రోజూ దాదాపు 10-15 రాళ్లు బయటకొచ్చాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలోనే కాదు ఆ కన్ను నలిపినా, ఒత్తిడికి లోనైనా రాళ్లు వస్తుండటంతో ఆ బాలిక భాదపడుతోంది. అలా రాళ్లు కళ్లలో నుంచి వస్తుండటంతో ఆమె ఎడమ కన్ను ఎర్రగా, నొప్పిగా ఉంటుందని బాలిక వాపోతుంది. చదవండి: కమలా హ్యారిస్‌కు ప్రధాని మోదీ బహుమతులు.. వాటి ప్రత్యేకత ఇదే! -
లావా చెక్కిన ‘స్తంభాలు’
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి గండరాతి శిలలు.. కానీ సాధారణ రాయితో ఏర్పడ్డవి కాదు. భూపొరల నుంచి ఉప్పొంగిన లావా ఘనీభవించి ఇలా రాతిగా మారాయి. లావాతో ఏర్పడ్డ రాతి పొరలు సహజంగానే కనిపిస్తుంటాయి. కానీ ఉలితో శిల్పి చెక్కినట్టుగా ఇలా ఒకేరకం కడ్డీలుగా ఏర్పడటం మాత్రం కొంత అరుదే. వాటిని కాలమ్నార్ బసాల్ట్‌గా పిలుస్తారు. ఇలాంటి అరుదైన లావా రాతిస్తంభాలు ఆసిఫాబాద్ అడవుల్లో వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గతంలో విస్తారంగా కనిపించిన ఈ లావా స్తంభాలు తెలంగాణ లో తొలిసారి కనిపించడం విశేషం. ఇలాం టి రాతిస్తంభాలు కొన్ని ప్రాంతాల్లో చాలా పొడవుగా ఉంటాయి. అలాంటి స్తంభాలతో ఏర్పడ్డ గుట్టలు కూడా ఉన్నాయి. ఆసిఫాబాద్ అభయారణ్యంలో వెలుగుచూసిన లా వా ‘రాతికడ్డీలు’ భూ ఉపరితలంలో చిన్న విగానే కనిపిస్తున్నా భూగర్భంలో మరింత పొడవుగా ఉండి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలో జీఎస్ఐ విభాగం పరిశోధన జరిపితే మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం.. దక్కన్ పీఠభూమి చాలా వరకు లావా ప్రవహించిన ప్రాంతమే. దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలోని పొరల్లో చోటుచేసుకున్న చర్య ఫలితంగా లోపలి నుంచి లావా ఉప్పొంగి మహారాష్ట్ర పూర్తి భాగం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కొంతభాగం చొప్పున ఆవరించిందని, వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలు అలా ఉప్పొంగిన లావా ఘనీభవించి ఏర్పడ్డవేనని ఔత్సాహిక పరిశోధకులు చెబుతున్నారు. చేవెళ్ల మీదుగా వికారాబాద్, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర వైపు ఇలా లావాతో రాతి పొరలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల చదరపు కి.మీ. మేర ఇవి ఏర్పడటం గమనార్హం. ఈ సాధారణ రాతి పొరలే కాకుండా కొన్ని ప్రత్యేక ఒత్తిళ్ల వల్ల అవి నిర్దిష్ట ఆకృతిలో స్తంభాలుగా ఏర్పడ్డాయి. వాటినే కాలమ్నార్ బసాల్ట్‌గా పేర్కొంటారు. – సాక్షి, హైదరాబాద్ జీఎస్ఐ పరిశోధన చేపట్టాలి... కొందరు ఔత్సాహికులు కొంతకాలం క్రితం ఆసిఫాబాద్ అభయారణ్యంలో పరిశోధించి ఈ రాళ్లను గుర్తించారు. ఆ చిత్రాలను నేను జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ చకిలం వేణుగోపాల్‌కు పంపగా అవి కాలమ్నార్ బసాల్ట్‌గా ఆయన నిర్ధారించారు. ఈ అరుదైన రాళ్లకు సంబంధించి ఆ ప్రాంతంలో జీఎస్ఐ వెంటనే పరిశోధన చేపట్టాలి. – శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ తెలంగాణలో తొలిసారే... మహారాష్ట్రలోని యావత్మాల్లో ఇటీవల రోడ్డు నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో భారీ కాలమ్నార్ బసాల్డ్ పొర వెలుగుచూసింది. ఆసిఫాబాద్ అడవిలో కనిపించిన శిలాస్తంభాల చిత్రాలు చూస్తే అవి కాలమ్నార్ బసాల్ట్గానే అనిపిస్తోంది. జీఎస్ఐ పరిశోధించి వాటిని అధికారికంగా తేలిస్తే తెలంగాణలో మొదటిసారి అలాంటి శిలారూపాలు రికార్డయినట్టవుతుంది. – చకిలం వేణుగోపాల్,జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ -
సిద్దిపేటలో వీరుడి గుడి.. ఎలా ఉందో చూడండి
సాక్షి, సిద్దిపేట: వీరునికి గుడి కట్టడం అరుదుగా కనిపిస్తుంది. అది సిద్దిపేటలో కనిపించడం విశేషం. రాజుల చరిత్రకు సమాంతరంగా ఉంటుంది యుద్ధవీరుల చరిత్ర. పూర్వం ఊరిని కాపాడటానికి సొంత వీరులుండేవారు. వారు ఆ ఊళ్లలోని మహిళలు, పిల్లలు, పశువులు, సంపదను కాపాడటానికి దొంగలు, ఇతర రాజ్యాల సైనికులు, క్రూర జంతువులతోనైనా ప్రాణాలకు తెగించి పోరాడేవారు. ఈ పోరులో అమరులైన ఆ వీరుల పేరిట గ్రామస్తులు, పాలకులు నిలిపిన స్మారక శిలలే వీరగల్లులు. పట్టణంలోని భోగేశ్వరాలయం సమీప పొలాల్లో ఈ శిలలు కన్పించాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు అహోబిలం కర్ణాకర్, సామలేటి మహేశ్ వాటిని పరిశీలించారు. వీటిలో ఆత్మాహుతి శిలలెక్కువగా ఉన్నట్లు తేల్చారు. యుద్ధం చేసి మరణించిన వీరుల శిలలూ ఉన్నట్లు తెలిపారు. ఇటీవల గుడి పక్కన పొలాల్లో పశువులను కట్టేసే చోట నాలుగు రాతిస్తంభాల నడుమ భూమిలోపలికి నడుము వరకు మునిగివున్న వీరుని శిల్పం కనిపించింది. ఆ నాలుగు స్తంభాలు వీరుని గుడి కోసం పాతినవే కావడం గమనార్హం. ఇక్కడ గుర్తించిన రాచవీరునికి తలపై సిగ కుడివైపుకు కట్టి వుంది. చెవులకు పెద్దకుండలాలున్నాయి. వీరుని మెడలో రత్నాలు పొదిగిన హారాలున్నాయి. తలమీద రాచహోదాను తెలిపే ఛత్రం (గొడుగు) వుంది. పెద్దకళ్లు, తిప్పిన మీసాలు, దీర్ఘచతురస్రాకారపు ముఖంతో కనిపిస్తున్నాడు. దండరెట్టలమీద కడియాలున్నాయి. ఎదరొమ్ముమీద గుచ్చుకుంటున్న బాకును వీరుడు ఎడమచేత పట్టుకుని ఉన్నాడు. వీరుడు ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు తెలుస్తోందని కొత్త తెలంగాణ చరిత్ర సభ్యులు వివరించారు. ఈ వీరులలో మతం కోసం శరీరంలోని అంగాలను అర్పించేవారు. ముఖ్యంగా ఈ రకం వారు వీరశైవులలో ఎక్కువగా కనిపిస్తారు. 10, 11 శతాబ్దాలనాటి ఆహార్యంతో వీరుడు కనిపిస్తున్నాడని చెప్పారు. -
సియర్ బాబా జలపాతంల వద్ద విషాదం
-
జలపాతంలో స్నానం చేస్తుండగా విషాదం
జమ్మూ : జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందగా దాదాపు 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలోని సియర్ బాబా జలపాతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రియాసి జిల్లాలోని సియర్ బాబా ఓ ఆధ్యాత్మిక ప్రదేశం కావటం వల్ల బాబా భక్తులు ఎక్కువగా అక్కడికి వస్తుంటారు. అక్కడ ఉన్న జలపాతంలో చిన్నాపెద్ద స్నానం చేస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగి జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై పడ్డాయి. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా 25 మంది గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, పోలీసులు గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. -
మార్స్‌పై రంగురాళ్లు.. అసలు రంగు ఇదే..
వాషింగ్టన్ : అరుణ గ్రహం ‘మార్స్’పై ఇటీవల విచిత్ర రాళ్ల ఆచూకీని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తాజాగా నాసా శాస్త్రవేత్తలు మార్స్‌పై అతిపెద్ద నీలి రంగు రాయిని గుర్తించారు. నాసా స్పేస్‌క్రాఫ్ట్‌లో పంపిన అత్యంత సామర్థ్యం కలిగిన హిరైస్ కెమెరాలు నీలి రంగు రాళ్లను ఫొటోలు తీసి పంపించాయి. అయితే వాస్తవానికి ఆ రాయి నీలిరంగులో లేదని, బూడిద రంగులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణ కెమెరాల్లో అయితే కనీసం ఆ రాయి రంగు కూడా కనిపించేది కాదని, అయితే హిరైస్ పవర్ఫుల్ కెమెరా కావడంతో రాయిని ఫొటో తీసింది. కొన్ని గంటలపాటు శ్రమించి పరిశీలించిన అనంతరం మార్స్ మీద ఉన్న రాళ్ల అసలు రంగు గుర్తించగలుగుతున్నామని.. అందుకు అక్కడి వాతావరణం కారణమని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో గ్రహాలు ఫొటోలశాఖ డైరెక్టర్ అల్ఫ్రెడ్ మెక్ఎవెన్ చెబుతున్నారు. ఆకుపచ్చ, ఎరుపు, నీలరం రంగుల్లో కనిపించిన రాళ్లను ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో అడ్జస్ట్ చేయగా బూడిద రంగు పదార్థాలున్నట్లు వెల్లడించారు. నీలం రంగు రాళ్లు, వస్తువులను మాత్రమే కెమెరా ఎందుకు బంధిస్తుందో, ఆ దిశగా పరిశోధన చేయనున్నట్లు మెక్ఎవెన్ వివరించారు. -
మార్స్‌పై ‘మిస్టీరియస్’ రాళ్లకు కారణమేంటో తెలుసా.?
వాషింగ్టన్: మార్స్ మీద ఉన్న విచిత్ర రాళ్ల ఆచూకీ తెలిసిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మార్స్‌పై ఉన్న మెడ్యుసే ఫాసే రాళ్లు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడినట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు చిన్నచిన్న రేణువుల్లాంటి బూడిద, రాళ్లు, వివిధ రకాల వాయువులు విడుదలవుతాయి. వీటి నుంచే ఈ రాళ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటిని 1960ల్లోనే నాసా మారినర్ స్పేస్‌క్రాఫ్ట్ గుర్తించినప్పటికీ అవి ఎలా ఏర్పడ్డాయో తెలియలేదు. తాజాగా ఇవి అగ్నిపర్వతాలు పేలడంతో ఏర్పడ్డాయని తేల్చారు. మార్స్ మధ్యరేఖ వద్ద వీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని జియోఫిజికల్ రీసెర్చ్ జర్నల్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఇవి 3 బిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వీటి విస్తీర్ణం అమెరికా విస్తీర్ణంలో 20 శాతం ఉంటుందని, భూమిమీద ఏర్పడిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల కంటే కూడా వంద రెట్లు పెద్దవని , సోలార్ వ్యవస్థలోనే ఇవి భారీ నిల్వలని జాన్స్ హప్కిన్స్ యూనివర్సిటీశాస్త్రవేత్త లుజాండ్రా ఓజా తెలిపారు. -
గండ శిలలకు గట్టి రక్షణ
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ముడుమాల్‌లో ఉన్న గండ శిలలకు రక్షణ కవచం ఏర్పాటవుతోంది. రాతియుగంలో నిర్మించినట్లు భావిస్తున్న ఈ పురాతన ఖగోళ పరిశోధన ప్రాం తాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గండ శిలలున్న ప్రాంతంలోని పట్టా భూములను ఇప్పటికే సేకరించిన సర్కారు.. ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఐదున్నర ఎకరాల్లో.. కృష్ణానది తీరంలోని ఈ గండ శిలలను క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటే క్రమపద్ధతిలో అమర్చినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శిలల్లో 14 అడుగుల కంటే ఎత్తున్న రాళ్లు 80 వరకు ఉండగా.. చిన్న రాళ్లు మూడు వేల వరకు ఉన్నాయి. మొత్తం శిలల ప్రాంతం 80 ఎకరాల్లో విస్తరించి ఉంది. పొడవాటి రాళ్లు మాత్రం ఐదున్నర ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ పట్టా భూములు కావడం, రైతులు వ్యవసాయం చేస్తుండటం, వాటి ప్రాముఖ్యం తెలియకపోవడంతో చాలా రాళ్లు కనుమరుగైనట్లు నిపుణులు గుర్తించారు. దీంతో మిగిలిన రాళ్లున్న ప్రాంతాన్ని కాపాడాలని నిర్ణయించిన హెరిటేజ్ తెలంగాణ.. ఈ విషయమై ప్రభుత్వానికి వివరించింది. దీంతో ముడుమాల్ నిలువు రాళ్లున్న ప్రాంతంలో ఐదున్నర ఎకరాల భూమిని రైతుల నుంచి ఇటీవల సర్కారు సేకరించింది. మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్తో హెరిటేజ్ తెలంగాణ సంచాలకురాలు విశాలాచ్చి చర్చించి భూ సేకరణ వేగంగా జరిగేలా చూశారు. ఇటీవలే దాదాపు రూ.25 లక్షల పరిహారాన్ని రైతులకు అందించారు. ప్రస్తుతం ఆ ఐదున్నర ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కందకాలు తీశారు. మరో వారం, పదిరోజుల్లో ఫెన్సింగ్ పని పూర్తి కానుంది. సందర్శకులు పరిశీలించేంలా ఫెన్సింగ్ వెంట నడకదారి కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు రాతియుగం నాటి మనుషులు సమాధులకు గుర్తుగా నిలువు రాళ్లు పాతడం ఆనవాయితీ. ఈ శిలలు కూడా అలాంటి సాధారణ నిలువు రాళ్లేనని మూడేళ్ల క్రితం వరకు భావించారు. అయితే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చారిత్రక విభాగం ప్రొఫెసర్ పుల్లారావు, వర్సిటీ విద్యార్థుల బృందం మూడేళ్ల క్రితం ఆ ప్రాంతంపై కొన్ని నెలలు పరిశోధనలు చేసి అవి సాధారణ రాళ్లు కావని గుర్తించారు. వాటికి చేరువలో ఓ వెడల్పాటి రాతిపై ఉన్న గుర్తులను నక్షత్ర çసమూహంలోని సప్తర్షి నక్షత్ర మండలం (ఉర్సామెజర్)గా గుర్తించారు. నిలువు రాళ్ల నీడల గమనం ఆధారంగా వాతావరణంలో మార్పులను నాటి మనుషులు గుణించేవారని బృందం నిర్ధారించింది. ప్రపంచంలో రెండు, మూడు ప్రాంతాల్లోనే ఇలాంటి ఏర్పాట్లు ఉన్నట్లు తేల్చింది. ఈ గండ శిలల విషయాన్ని ప్రొఫెసర్ పుల్లారావు అంతర్జాతీయ వేదికలపై పంచుకోగా విదేశీ శాస్త్రవేత్తలు ముడుమాల్‌కు వచ్చి ఆ శిలల అధ్యయనం ప్రారంభించారు. ప్రస్తుతం వాటి చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసి మరింత ప్రాచుర్యం తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనానికి అవకాశం కలుగుతుందని విశాలాచ్చి అభిప్రాయపడుతున్నారు. జగిత్యాల జిల్లా పెద్దబొంకూరులోని చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతంలో 1970లో భూ సేకరణ జరిపారు. ఆ తర్వాత ఇంతకాలానికి భూ సేకరణ జరిపింది ముడుమాల్‌లోనే కావడం విశేషం.