బాలుడి కాళ్లకు తాడు కట్టిన గ్రామస్తులు
కొరాపుట్(భువనేశ్వర్): ప్రమాదావశాత్తు లోయలోకి జారిపడిన బాలుడిని గ్రామస్తులు సురక్షితంగా బయటకు చేర్చారు. నవరంగ్‌పూర్ జిల్లా తెంతులుకుంటి సమితి కొంటా పంచాయతీ బరిపొదర్ గ్రామానికి చెందిన డొమ్ము జానీ సమీపంలోని కొండ మీదకు శుక్రవారం ఉదయం పశువులను తీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదావశాత్తు కాలుజారడంతో రెండు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు.
తల భాగం కిందికి ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన మిగతా కాపర్లు బాలుడు జారిపోకుండా కాలికి తాడు కట్టి, నిలువరించారు. విషయాన్ని తెంతులకుంటి బీడీఓ దుర్జన బొయికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో అక్కడికి చేరుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సహకారంతో 8 గంటలు కష్టపడి శుక్రవారం రాత్రికి జానీని వెలుపలికి తీశారు. చిన్నపాటి గాయాలవడంతో తెంతుల కుంటి ఆస్పత్రికి తరలించారు.
చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం
Comments
Please login to add a commentAdd a comment