nabarangapur
-
ట్వీట్ రచ్చ.. రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదు
కొరాపుట్(భువనేశ్వర్): వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై నబరంగ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా బీజేపీ మహిళా విభాగం సభ్యులు సోమవారం ఫిర్యాదు చేశారు. భారత రాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటిమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముపై రామ్‌గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తక్షణమే వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత పదవికి పోటీ చేస్తున్న ఒడియా గిరిజన మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు అత్యంత నేర పూరితమైనవిగా అభివర్ణించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదురుగా వర్మకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నాయకురాలు, కౌన్సిలర్ షర్మిష్టా దేవ్, సునీతా పాఢీ, మినతి పట్నాయక్, గౌరీ శంకర్ మజ్జి, దేవదాస్ మహంకుడో, నిల్లు మిశ్ర, మానస్ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Pooja Hegde: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఎలాంటి ఆఫర్స్ రాలేదు -
లక్కీ బాయ్.. మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చాడు!
కొరాపుట్(భువనేశ్వర్): ప్రమాదావశాత్తు లోయలోకి జారిపడిన బాలుడిని గ్రామస్తులు సురక్షితంగా బయటకు చేర్చారు. నవరంగ్‌పూర్ జిల్లా తెంతులుకుంటి సమితి కొంటా పంచాయతీ బరిపొదర్ గ్రామానికి చెందిన డొమ్ము జానీ సమీపంలోని కొండ మీదకు శుక్రవారం ఉదయం పశువులను తీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదావశాత్తు కాలుజారడంతో రెండు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. తల భాగం కిందికి ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన మిగతా కాపర్లు బాలుడు జారిపోకుండా కాలికి తాడు కట్టి, నిలువరించారు. విషయాన్ని తెంతులకుంటి బీడీఓ దుర్జన బొయికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో అక్కడికి చేరుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సహకారంతో 8 గంటలు కష్టపడి శుక్రవారం రాత్రికి జానీని వెలుపలికి తీశారు. చిన్నపాటి గాయాలవడంతో తెంతుల కుంటి ఆస్పత్రికి తరలించారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం -
ధైర్యం చెప్పి.. థింసా స్టెప్పులేసి.. పిల్లలతో సరదాగా గడిపిన ఎస్పీ
భువనేశ్వర్: ఆమె ఓ జిల్లాకు పోలీస్ బాస్. నిత్యం నేర సమీక్షలు, శాంతి, భద్రతల పరిరక్షణ, సిబ్బంది విధులపై పర్యవేక్షణ, ఫిర్యాదుదారులతో నిత్యం క్షణం తీరికలేకుండా ఉంటారు. ఐపీఎస్‌గా ఉన్నా.. ఆశ్రమ చిన్నారులతో కలిసి ఆడిపాడారు. నేనున్నానంటూ వారిలో మానసిక ధైర్యం నింపారు. ఆమె.. నవరంగ్‌పూర్ జిల్లా ఎస్పీ ఎస్.సుశ్రీ. నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపం లోని ప్రభుత్వ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న దీనదయాల్ ఆశ్రమాన్ని ఎస్పీ గురువారం సందర్శించారు. ఆమెతో పాటు కలెక్టర్ కమలోచన్ మిశ్రా ఉన్నారు. వీరిద్దరూ బాలికలకు మిఠాయిలు, మామిడి పళ్లు పంచిపెట్టారు. ఎస్పీ చొరవ కల్పించుకొని బాలికలలో ఒకరిగా కలసిపోయి కులాశాగా కబుర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్నారులంతా కొరాపుటియా థింసా నృత్యం చేయగా.. సుశ్రీ కూడా వారితో జత కలిసి, స్టెప్పులేశారు. స్వయానా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తమతో డ్యాన్స్ చేస్తుండటంతో బాలికలు మరింత ఉత్సాహంగా ఆమెకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసిన వారంతా ఎస్పీ చొరవను అభినందిస్తున్నారు. చదవండి: వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ.. -
వైరల్: భల్లుకాల బంతాట.. భలే ఆట అంటున్న నెటిజన్స్
భువనేశ్వర్: ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశిస్తే.. ప్రజలు భయంతో పరుగులు తీయడం పరిపాటి. అంతేకాకుండా అవి మనుషులపై దాడులు చేస్తూ ప్రాణాలను తీస్తున్న ఘటనలు కూడా అనేకం. అయితే రెండు భల్లూకాలు క్రీడా మైదానానికి వచ్చి, క్రీడాకారులు ఆడుతున్న ఫుట్‌బాల్ బంతిని తీసుకుపోవడంతో పాటు దానితో ఆడుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమితి మృత్తిమా పంచాయతీ శుఖిగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం శుఖిగాం గ్రామానికి చెందిన చిన్నారులు స్థానిక క్రీడా మైదానంలో ఎప్పటిలాగే ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లారు. వారంతా ఆటలో నిమగ్నమై ఉండగా.. సమపంలోని అడవిలో నుంచి అకస్మాత్తుగా రెండు ఎలుగుబంట్లు మైదానంలోకి ప్రవేశించాయి. వాటిని చూసిన చిన్నారులు భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. అయితే రెండు భల్లూకాలు మాత్రం బంతితో ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించాయి. ఇదంతా గమనించిన స్థానికులు.. ఈ దృష్టాలను సెల్ఫోన్లలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటి ఆటను చూసిన వారంతా ఫుట్‌బాల్ ఆటకు ఎవరైనా అభిమానులు కావాల్సిందే అనుకొంటూ మజా చేస్తున్నారు. చదవండి: వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం -
దూరం నుంచి చూస్తే రైలు..తీరా దగ్గరకు వచ్చి చూస్తే..
సాక్షి, నవరంగపూర్( భువనేశ్వర్): కొంతమంది కళాకారులు తమ చేతి నైపుణ్యం, పనితనంతో చిత్రాలకు ప్రాణం పోస్తారంటారు. ఇలాంటి అనుభూతి కొన్ని సందర్భాల్లోనే మనకి కలుగుతుంది. ప్రస్తుతం ఓ గోడ మీద వేసిన బొమ్మను చూసి ఇలాంటి అనుభూతి కలిగిందని అంటున్నారు ఓ ప్రాంత ప్రజలు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లా కలెక్టరేట్ ప్రహరీగోడపై వేసిన రైలు బొమ్మ నగరవాసులను ఇట్టే ఆకట్టుకుంది. అచ్ఛం రైలుబండి లాగానే వేసిన పెయింటింగ్ అద్భుతంగా ఉంది. ఆ బొమ్మ ఎలా ఉందంటే.. దూరం నుంచి చూసిన వారికి... నవరంగపూర్‌కు రైలు ఎప్పుడు వచ్చిందోనని ఆశ్చర్యం కలగక మానదు. తీరా దగ్గరకు వచ్చి చూడగా, అది రైలుకాదని కేవలం చిత్రమని తెలిసి చాలమంది అచ్చెరువొందారు. శుక్రవారం నగరవాసులు రైలుబొమ్మతో సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. -
Covid-19: ఇలా చేయకండని ఎన్ని సార్లు చెప్పినా.. వీళ్లు మారరా?
సాక్షి, జయపురం( భువనేశ్వర్): కోవిడ్ మహమ్మారి ప్రజలను కబళిస్తుండగా, దాని కట్టడికి ప్రభుత్వం ఆంక్షలు విధించినా కొన్ని గ్రామాల ప్రజలు వాటిని పట్టించుకోకుండా యథాతథంగా జాతరలు, సంప్రదాయ పండగలు జరుపుకుంటున్నారు. ఆయా పండగల్లో భౌతికదూరం పాటించకుండా వేలాదిమంది మూకుమ్మడిగా పాల్గొంటున్నారు. ఇటువంటి సంఘటన నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితి కర్చమాల గ్రామంలో సంభవించింది. ఆదివాసీ ప్రజలు అనాదిగా జరుపుకొనే వ్యవసాయ పండగ బలిజాతర. ఈ నేపథ్యంలో కర్చమాల గ్రామ ప్రజలు శనివారం నిర్వహించిన బలిజాతరలో కోవిడ్ నియమాలు విస్మరించి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. జాతర సందర్భంగా సంప్రదాయ నృత్య నాట్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. భౌతికదూరం పాటించక పోవడమే కాకుండా బలిజాతరలో పాల్గొన్న ఏ ఒక్కరూ మాస్క్ ధరించలేదు. వేలాదిమంది పాల్గొన్న విషయం తెలుసుకున్న కొశాగుమడ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ సందర్భంగా కరోనా నియమాలు ఉల్లంఘించి బలిజాతర నిర్వహించిన కమిటీ సభ్యుల నుంచి పోలీసులు రూ.10 వేల జరిమానా వసూలు చేశారు. అలగే నియమాలు ఉల్లంఘించిన కమిటీపై కేసు నమోదు చేశారు. చదవండి: అత్యంత చవకగా కార్బేవ్యాక్స్ -
వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా?
భువనేశ్వర్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నందున కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఆలయాలను మూసివేసింది. ఉత్సవాలు పండగలపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భౌతిక దూరం పాటించాలని ,ప్రజలు ఒక చోట గుమికూడదని హితవు పలుకుతోంది. అయినా ప్రజలు మాత్రం అవేవీ పట్టకుండా కోవిడ్ నియమాలను తుంగలో తొక్కుతున్నారు. అటువంటి సంఘటన నవరంగపూర్ జిల్లా పపడహండి సమితి మైదల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి నువాపుట్ గ్రామ పంచాయతీ దహనమాల గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన అలెఖ్ ధర్మపూజ యజ్ఞానికి వేలాదిమంది భక్తలు హాజరై కోవిడ్ నియమాలను ఉల్లంఘించారు. కరోనా నియమాలు పట్టించుకోకుండా అలేఖ్ ధర్మ భక్తులు నిర్వహించిన యజ్ఞానికి వేలాదిమంది వచ్చారు. అలెఖ్ ధర్మం నమ్మేవారు నిర్వహించిన యజ్ఞానికి హాజరైన మహిళలు రాత్రి కలశాలలపై దీపాలు వెలింగించి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో వందలాదిమంది అలేఖ్ ధర్మ ప్రచారకులు పాల్గొన్నారు. ఆడంబరంగా జరుగుతున్న అలేఖ్ ధర్మ యాత్ర విషయం తెలిసిన మైదల్‌పూర్ పోలీసులు రాత్రి ఒంటిగంట సమయంలో గ్రామానికి చేరుకుని ప్రజలను చెదరగొట్టారు. ధర్మయజ్ఞం నిర్వహిస్తున్న నిర్వాహకులను విచారణ చేస్తున్నారు. పూజలు గారీ యజ్ఞాలు గానీ నిర్వహించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని, అయితే అలెఖ్ ధర్మ పూజలు నిర్వహించే వారు ఎటువంటి అనుమతి తీసుకోలేదని మైదల్‌పూర్ పోలీస్ అధికారి అనాము దియాన్ వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యలో ఇలా ఎలా పూజలు నిర్వహిస్తారని ప్రజలు ప్రశ్నించారు. నియమాలు పాటించక పోతే కోవిడ్ రక్కసి విస్తరించే ప్రమాదం ఎక్కువ ఉందని అందుచేత నియమాలు పాటించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. చదవండి: కాళ్లూచేతులు లేని వింత శిశువు జననం -
బిర్యానీ తిన్న బాలిక కాసేపటికే..
సాక్షి, భువనేశ్వర్ (జయపురం) : నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ పట్టణంలో పాచిపోయిన బిర్యానీ తిన్న ఒక బాలిక మరణించగా మరో ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఉమ్మరకోట్ మునిసిపాలిటీ 6వ వార్డులో మంగళవారం జరిగిన ఈ సంఘటనతో బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వివరాలిలా ఉన్నాయి ఉమ్మరకోట్‌లోని 8 వ వార్డుకు చెందిన సంజు హరిజన ఇంట ఆదివారం రాత్రి బిర్యానీ వండారు. వారు తిన్నంత తిని మిగిలిన దాన్ని దాచి ఉంచారు. సోమవారం మధ్యాహ్నం అదే వార్డుకు చెందిన లచ్చమన హరిజన్ ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, మరో చిన్నారి సంజు హరిజన్ ఇంటికి వెళ్లడంతో దాచి ఉంచిన బిర్యానీని వారికి పెట్టారు. అది తిన్న లచ్చమన హరిజన్ కుమార్తెలు జయ హరిజన్, ఘాసిని హరిజన్, కుమారుడు దావూద్ హరిజన్‌లతో పాటు మరో చిన్నారి రొయిత్ హరిజన్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని వెంటనే ఉమ్మరకోట్ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించగా ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపారు. మార్గమధ్యంలో మృతి అయితే అదే రాత్రి 7 గంటలకు ఆ చిన్నారులకు మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌కు తీసుకు వెళ్తుండగా లచ్చమన హరిజన్ కుమార్తె జయ హరిజన్ (5) మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఘాసిని హరిజన్ (8), దావూద్ హరిజన్ (3), రొయిత్ హరిజన్ (2)లు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న ముగ్గురి ఆరోగ్యం స్థిమితంగా ఉందని, పాచిపోయిన బిర్యానీ తినడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని శిశు వైద్య నిపుణుడు డాక్టర్ సంతోష్ కుమార్ పండా అభిప్రాయపడ్డారు. చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. ఎన్ని కేసులో -
కొద్దిరోజుల్లో పెళ్లి.. అంతలోనే ప్రియుడితో కలిసి..
జయపురం/ఒడిశా: పెళ్లికొడుకు నచ్చకో, ప్రియుడిని వదులుకోలేకో కానీ కొద్ది రోజుల్లో వివాహం జరగనున్న ఓ యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లిదండ్రులతో పాటు గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమితి ముర్తుమా గ్రామంలో సోమవారం జరిగిన ఈ విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సొస్మిత మఝి అనే యువతికి ఉమ్మరకోట్ సమితి సుకిగాం పంచాయతీ డాబిడగుడ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. వారి వివాహం కొద్ది రోజుల్లో జరగనుండడంతో ఉభయుల కుటుంబసభ్యులు ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. అయితే ఉమ్మరకోట్ సమితి బొడొకుముడి గామ పంచాయతీ సనకుముడి గ్రామానికి చెందిన జుధిష్ట గొండ్ అనే యువకుడిని సొస్మిత గాఢంగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఇష్టంలేకనో, కుటుంబసభ్యులకు చెప్పలేకనో మనస్తాపం చెంది ప్రియుడితో కలిసి ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడింది. విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఉమ్మరకోట్ పోలీసులు తెలియజేయగా వచ్చి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. సంఘటన స్థలంలో కొన్ని కేకులు, మూడు పురుగు మందు సీసాలతో పాటు యువతి చెప్పులు, ఒక సైకిల్ పడి ఉన్నాయి. వాటిని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు. చదవండి: కనిపించకుండా పోయి అడవిలో శవమై కనిపించింది.. -
ఒడిశాలో ఘోర ప్రమాదం, 11మంది మృతి
భువనేశ్వర్ : ఒడిశాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవరంగ్ పూర్ జిల్లా జరిగావ్ వద్ద ఓ మినీ ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొని... లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 11మంది కళాకారులు దుర్మరణం చెందగా, మరో 40మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సుమారు 50మందిపైనే ఉన్నట్లు పోలీసు అధికారి మణిపాత్రో తెలిపారు. వీరంతా ఓ ప్రదర్శన నిమిత్తం వెళుతున్నట్లు చెప్పారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.