చెట్టుకు వేలాడుతున్న ప్రేమజంట మృతదేహాలు
జయపురం/ఒడిశా: పెళ్లికొడుకు నచ్చకో, ప్రియుడిని వదులుకోలేకో కానీ కొద్ది రోజుల్లో వివాహం జరగనున్న ఓ యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లిదండ్రులతో పాటు గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమితి ముర్తుమా గ్రామంలో సోమవారం జరిగిన ఈ విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సొస్మిత మఝి అనే యువతికి ఉమ్మరకోట్ సమితి సుకిగాం పంచాయతీ డాబిడగుడ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. వారి వివాహం కొద్ది రోజుల్లో జరగనుండడంతో ఉభయుల కుటుంబసభ్యులు ఏర్పాట్లలో మునిగి ఉన్నారు.
అయితే ఉమ్మరకోట్ సమితి బొడొకుముడి గామ పంచాయతీ సనకుముడి గ్రామానికి చెందిన జుధిష్ట గొండ్ అనే యువకుడిని సొస్మిత గాఢంగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఇష్టంలేకనో, కుటుంబసభ్యులకు చెప్పలేకనో మనస్తాపం చెంది ప్రియుడితో కలిసి ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడింది. విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఉమ్మరకోట్ పోలీసులు తెలియజేయగా వచ్చి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. సంఘటన స్థలంలో కొన్ని కేకులు, మూడు పురుగు మందు సీసాలతో పాటు యువతి చెప్పులు, ఒక సైకిల్ పడి ఉన్నాయి. వాటిని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment