ఒడిశాలో ఘోర ప్రమాదం, 11మంది మృతి | 11 killed in Odisha road accident | Sakshi
Sakshi News home page

ఒడిశాలో ఘోర ప్రమాదం, 11మంది మృతి

Published Sat, Oct 4 2014 9:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

11 killed in Odisha road accident

భువనేశ్వర్ : ఒడిశాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవరంగ్ పూర్ జిల్లా జరిగావ్ వద్ద ఓ మినీ ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొని... లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 11మంది  కళాకారులు  దుర్మరణం చెందగా, మరో 40మందికిపైగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సుమారు 50మందిపైనే ఉన్నట్లు పోలీసు అధికారి మణిపాత్రో తెలిపారు. వీరంతా ఓ ప్రదర్శన నిమిత్తం వెళుతున్నట్లు చెప్పారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన వెల్లడించారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement