బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్‌లో సీబీఐ | Balasore Train Accident CBI Files Chargesheet Against Railway Officials | Sakshi
Sakshi News home page

బాలాసోర్ రైలు ప్రమాదం కేసులో చార్జిషీటు నమోదుచేసిన సీబీఐ 

Published Sat, Sep 2 2023 6:28 PM | Last Updated on Sat, Sep 2 2023 8:21 PM

Balasore Train Accident CBI Files Chargesheet Against Railway Officials - Sakshi

భువనేశ్వర్: అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపిన బాలాసోర్ రైలు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. 

దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలుస్తూ బాలాసోర్ రైల్వే ప్రమాదంలో 290 మంది మరణానికి కారణమైంది. సిగ్నల్ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తూ అందుక్కారణమైన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లను జూలైలోనే అరెస్టు చేయగా తాజాగా వారిపై హత్యానేరం తోపాటు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారని చార్జిషీటులో అభియోగాలను మోపింది సీబీఐ.       

బహనగా స్టేషన్ సమీపంలోని గేటు నెంబర్ 94 లెవెల్ క్రాసింగ్ వద్ద LC  గేటు నెంబర్ 79 సర్క్యూట్ దయాగ్రామ్ ఆధారంగా మరమ్మతు పనులను పర్యవేక్షించిన మహంత అన్ని పనులు పూర్తయిన తర్వాత విధి నిర్వహణలో అలసట కనబరుస్తూ టెస్టింగ్ నిర్వహించాలి. అందులో ఏమైనా వైఫల్యాలు ఉంటే మార్పులు చేసి వాటిని సరిచేయాలి. కానీ మహంత నిర్లక్షయంగా వ్యవహరిస్తూ టెస్టింగ్ నిర్వహించలేదని, ఇంటర్‌లాకింగ్ ఇన్‌స్టాలేషన్ కూడా ప్రణాళికాబ్యాద్మగా లేవని.. ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీకొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.     

ఇది కూడా చదవండి: వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement