train tragedy
-
బాలాసోర్ దుర్ఘటన కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గతేడాది జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ విషాద ఘటనలో 290 మందికి పైగా మృతిచెందారు. ఈ ప్రమాద ఘటన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు ఒరిస్సా హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.నిందితులు మొహమ్మద్ అమీర్ ఖాన్, అరుణ్ కుమార్ మహంత , పప్పు యాదవ్‌లను జులై 7, 2023న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ).. ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యం వహించిన కారణంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్ర నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్.. ఒక్కొక్కరికి రూ.50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది.షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు 2 జూన్, 2023న బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘనటలో 290 మందికి పైగా మరణించగా.. సుమారు 1,200 మందికి పైగా గాయపడ్డారు.అయితే.. ఉన్నత స్థాయి రైల్వే విచారణలో ప్రమాదానికి ప్రధాన కారణం.. తప్పు సిగ్నలింగ్ అని తేలింది. -
బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ
భువనేశ్వర్: అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపిన బాలాసోర్ రైలు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలుస్తూ బాలాసోర్ రైల్వే ప్రమాదంలో 290 మంది మరణానికి కారణమైంది. సిగ్నల్ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తూ అందుక్కారణమైన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లను జూలైలోనే అరెస్టు చేయగా తాజాగా వారిపై హత్యానేరం తోపాటు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారని చార్జిషీటులో అభియోగాలను మోపింది సీబీఐ. బహనగా స్టేషన్ సమీపంలోని గేటు నెంబర్ 94 లెవెల్ క్రాసింగ్ వద్ద LC గేటు నెంబర్ 79 సర్క్యూట్ దయాగ్రామ్ ఆధారంగా మరమ్మతు పనులను పర్యవేక్షించిన మహంత అన్ని పనులు పూర్తయిన తర్వాత విధి నిర్వహణలో అలసట కనబరుస్తూ టెస్టింగ్ నిర్వహించాలి. అందులో ఏమైనా వైఫల్యాలు ఉంటే మార్పులు చేసి వాటిని సరిచేయాలి. కానీ మహంత నిర్లక్షయంగా వ్యవహరిస్తూ టెస్టింగ్ నిర్వహించలేదని, ఇంటర్‌లాకింగ్ ఇన్స్టాలేషన్ కూడా ప్రణాళికాబ్యాద్మగా లేవని.. ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీకొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. #BREAKING | Central Bureau of Investigation (CBI) files chargesheet in Balasore Train accident case. #CBI #BalasoreTrainAccident #Balasore #BalasoreTrainTragedy WATCH #LIVE here- https://t.co/6CjsNJ9CEq pic.twitter.com/9rSEOROykp — Republic (@republic) September 2, 2023 ఇది కూడా చదవండి: వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
పచ్చి అబద్ధం.. అలా జరగలేదు!
అమృత్సర్: దసరా పండుగ రోజున పెను విషాదం మిగిల్చిన రైలు ప్రమాదంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. రావణ దహనాన్ని చూసేందుకు రైలు పట్టాలపై గుమిగూడిన ప్రజలను చూసి అత్యవసర బ్రేకు వేశానని డీఈఎంయూ రైలు డ్రైవర్ అరవింద కుమార్ తెలిపారు. అయితే అక్కడున్నవారు రాళ్లు రువ్వడంతో రైలును ఆపకుండా అమృత్సర్ స్టేషన్‌కు చేర్చినట్టు వెల్లడించారు. అయితే ఈ వాదనను ప్రత్యక్ష సాక్షులు తోసిపుచ్చారు. (పెను ప్రమాదం.. అంతులేని శోకం) ‘డ్రైవర్ అరవింద కుమార్ అబద్దాలు చెబుతున్నారు. అసలు రైలును ఆపలేదు. కనీసం స్పీడు కూడా తగ్గించలేదు. క్షణాల వ్యవధిలోనే రైలు మమ్మల్ని దాటుకుని వెళ్లిపోయింది. రైలు కింద పడి ఎంతో మంది చనిపోయారు. క్షతగాత్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా రాళ్లు విసురుతారా? అత్యంత వేగంగా వెళుతున్న రైలుపై రాళ్లు రువ్వడం సాధ్యమా?’ అని ప్రత్యక్ష సాక్షి మున్సిపల్ కౌన్సిలర్ శైలెందర్ సింగ్ షాలె ప్రశ్నించారు. ఆస్కారమే లేదు పెద్ద సంఖ్యలో గూమిగూడిన ప్రజలను చూసిన తర్వాత కూడా రైలు వేగం తగ్గించలేదని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ‘వేగంగా రైలు నడపడం వల్లే క్షణాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైలును నెమ్మదిగా నడిపివుంటే ప్రమాద తీవ్రత తగ్గేది. రైలు ఎంత వేగంగా వెళుతుంతో తెలిపే వందలాది వీడియోలున్నాయి. మేమంతా స్పందించి, రాళ్లు విసరడానికి ఆస్కారమే లేదు. బాధితుల హాహాకారాలతో ఘటనా స్థలం దద్దరిల్లింద’ని పరమ్‌జీత్ సింగ్ అనే వ్యక్తి తెలిపారు. విసిరేలోపు వెళ్లిపోయింది ఎవరూ రాళ్లు విసరలేదని, రైలు డ్రైవర్ ఎందుకు అబద్ధం చెబుతున్నాడో అర్థం కావడం లేదని అజయ్ గోయంకా పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఒకవేళ రాళ్లు రువ్వాలనుకున్నా ఆలోపు రైలు వెళ్లిపోతుందన్నారు. అంత వేగంగా రైలు వెళ్లిపోయిందన్నారు. స్థానిక పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షుల వాదనతో ఏకీభవిస్తున్నారు. రైలు వెళుతుండగా అక్కడున్న వారెవరూ రాళ్లు విసరలేదని పోలీసు అధికారి సుఖ్మిందర్ సింగ్ తెలిపారు. దీనిపై స్పందించేందుకు రైల్వే అధికారులు అందుబాటులోకి రాలేదు. రైలు స్పీడు ఎంత? ప్రమాదానికి కారణమైన డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్(డీఈఎయూ) రైలు గరిష్ట వేగం గంటకు 96 కిలోమీటర్లు. రైలు ఖాళీగా ఉన్నప్పుడు బ్రేకులు వేస్తే 300 మీటర్లలోపు ఆగుతుంది. ప్రయాణికులతో ఉంటే బ్రేకు వేసినప్పుడు 600 మీటర్లలోపు ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. చివరిసారిగా నమోదైన ఈ రైలు వేగం 68 కేఎంపీహెచ్ అని ఫిరోజ్‌పూర్ డివిజినల్ రైల్వే మేనేజర్ వివేక్ కుమార్ తెలిపారు. సంబంధిత వార్తలు ‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’ ‘మరో జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఇది’ అమృత్సర్ ప్రమాదం : పాపం దల్బీర్ సింగ్ ప్రమాదంలో మా తప్పు లేదు : రైల్వే శాఖ -
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. 37మంది దుర్మణం
ఖగారియా: బీహార్‌లో ఘోరం జరిగిపోయింది. రైల్వే ట్రాక్ దాటుతున్నవారిపైకి ఎదురుగా వస్తున్న మరో రైలు దూసుకుపోవడంతో 37 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 13 మంది మహిళలు, నలుగురు పిల్లలున్నారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పాట్నాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖగారియా జిల్లాలోని ధమారాఘాట్ స్టేషన్లో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది. కళ్లముందే తమ వారంతా పట్టాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోవడంతో వారి బంధువులు ఆగ్రహోదగ్రులయ్యారు. రైల్వేస్టేషన్‌లోకి చొరబడి విధ్వంసానికి దిగారు. ఏసీ కోచ్ సహా ఆరు బోగీలు, ఇంజిన్‌కు నిప్పంటించారు. కొందరు రైల్వే ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నారు. ప్రమాదంపై ప్రధాని మన్మోహన్సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. స్థానికులు ఆవేశానికి లోను కావొద్దని, సంయమనం పాటించాలని ప్రధాని కోరారు. ఈ ఘటనపై రైల్వేశాఖ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష పరిహారం ప్రకటించింది. ప్రమాదం ఎలా జరిగిందంటే: సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ధమారాఘాట్ స్టేషన్‌కు వచ్చి ఆగింది. ఈ రైలు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దిగారు. పవిత్ర శ్రావణ మాసం.. అందులోనూ సోమవారం కావడంతో వీరంతా సమీపంలోని కాత్యాయనిస్థాన్ ఆలయంలో శివలింగానికి జలాభిషేకం చేయడానికి వెళ్తున్నారు. అవతలి వైపు వెళ్లడానికి ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరోవైపు నుంచి సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ 80 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చింది. వాస్తవానికి ఈ ఎక్స్‌ప్రెస్ ధమారాఘాట్ స్టేషన్లో ఆగదు. దీంతో డ్రైవరు అదే వేగంతో రైలును పోనివ్వడం, పట్టాలపై నడుస్తున్నవారంతా చక్రాల కింద పడిపోయి చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. మృతులంతా ఖగారియా, సహర్సా, ముంగర్, నౌగాచియా ప్రాంతాలకు చెందినవారు. ‘‘సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌కు ధమారాఘాట్లో హాల్ట్ లేదు. దీంతో అధికారులు రైలు ముందుకు వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. రైలు ఆగుతుందేమో అన్న ఉద్దేశంతో యాత్రికులు ట్రాక్ దాటారు. వారి దగ్గరికి రాగానే డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులను నొక్కారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది’’ అని రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్ర కుమార్ చెప్పారు. ప్రమాదం తర్వాత మృతుల బంధువులు, స్థానికులు సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు బోగీలు, ఇంజిన్ తోపాటు సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఏసీ కోచ్‌కు నిప్పు పెట్టారు. ఘటన జరిగిన అనంతరం ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్లు రాజారాం పాశ్వాన్, సుశీల్ కుమార్ సుమన్ అక్కడ్నుంచి పారిపోయారు. తర్వాత తాము క్షేమంగానే ఉన్నట్టు రైల్వే అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. రాష్ట్ర నిర్లక్ష్యం లేదు: సీఎం నితీశ్ ప్రమాదం వెనుక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. మృతుల కుటుంబీకులకు రూ.2 లక్షల పరిహారం ఇస్తామని, క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స చేయిస్తామని ప్రకటించారు. ప్రమాదం విషయం తెలియగానే ఖగారియా, సహర్సా జిల్లాల నుంచి రాష్ట్ర అధికారులను పంపామని, అయితే సరైన రోడ్డు మార్గం లేకపోవడం, మధ్యలో ఓ బ్రిడ్జి పాడవడంతో రెండు జిల్లాల నుంచి ఎక్కడ్నుంచి వెళ్లినా మూడు గంటలపాటు కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. రైల్వేశాఖ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఇందుకు సమాధానం చెప్పాల్సింది ఆ శాఖ వారే అని బదులిచ్చారు. ఇది అత్యంత అరుదుగా జరిగే ప్రమాదాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. పూర్తి దర్యాప్తు తర్వాతే అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్లాట్‌ఫాం లేకున్నా కిందకు దిగారు: రైల్వేమంత్రి ఖర్గే ప్రమాదంపై రైల్వేమంత్రి మల్లిఖార్జున ఖర్గే సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. ‘‘ధమారాఘాట్ స్టేషన్ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఆగాయి. ఇందులోంచి కొందరు ప్రయాణికులు ప్లాట్‌ఫాం లేని వైపు దిగారు. అదే సమయంలో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ వచ్చింది. మలుపుగా ఉండడంతో డ్రైవర్‌కు పట్టాలపై ఉన్నవారు సరిగ్గా కనిపించలేదు. అయినా కొంతదూరం రాగానే అత్యవసర బ్రేకులు వేసినా అప్పటికే ప్రమాదం జరిగిపోయింది’’ అని ఆయన వివరించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. సహాయక సిబ్బందితో కూడిన రైలు ఘటనా ప్రాంతానికి 11 గంటల సమయంలో చేరుకుందని చెప్పారు.