Odisha accident
-
బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ
భువనేశ్వర్: అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపిన బాలాసోర్ రైలు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలుస్తూ బాలాసోర్ రైల్వే ప్రమాదంలో 290 మంది మరణానికి కారణమైంది. సిగ్నల్ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తూ అందుక్కారణమైన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లను జూలైలోనే అరెస్టు చేయగా తాజాగా వారిపై హత్యానేరం తోపాటు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారని చార్జిషీటులో అభియోగాలను మోపింది సీబీఐ. బహనగా స్టేషన్ సమీపంలోని గేటు నెంబర్ 94 లెవెల్ క్రాసింగ్ వద్ద LC గేటు నెంబర్ 79 సర్క్యూట్ దయాగ్రామ్ ఆధారంగా మరమ్మతు పనులను పర్యవేక్షించిన మహంత అన్ని పనులు పూర్తయిన తర్వాత విధి నిర్వహణలో అలసట కనబరుస్తూ టెస్టింగ్ నిర్వహించాలి. అందులో ఏమైనా వైఫల్యాలు ఉంటే మార్పులు చేసి వాటిని సరిచేయాలి. కానీ మహంత నిర్లక్షయంగా వ్యవహరిస్తూ టెస్టింగ్ నిర్వహించలేదని, ఇంటర్‌లాకింగ్ ఇన్స్టాలేషన్ కూడా ప్రణాళికాబ్యాద్మగా లేవని.. ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీకొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. #BREAKING | Central Bureau of Investigation (CBI) files chargesheet in Balasore Train accident case. #CBI #BalasoreTrainAccident #Balasore #BalasoreTrainTragedy WATCH #LIVE here- https://t.co/6CjsNJ9CEq pic.twitter.com/9rSEOROykp — Republic (@republic) September 2, 2023 ఇది కూడా చదవండి: వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
అయ్యో.. ఎంత ఘోరం..! ముగ్గురు ఒకేసారి ఇలా..
ఒడిశా: విద్యుత్ తీగలు వారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. ఇనుప రాడ్ రూపంలో ప్రాణాలను కబళించాయి. ఎప్పటిలా కాకుండా ముందుగా ప్రారంభిద్దామనుకున్న పనే వారి పాలిట శాపమైంది. విద్యుత్ షాక్ రూపంలో ముగ్గురిని బలి తీసుకుంది. కుటుంబీకులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. హృదయ విదారకమైన ఈ ఘటన సంతకవిటి మండలం సోమన్నపేటలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్‌కు గురై గ్రామానికి చెందిన పాండ్రంకి కేసరినాయుడు(24), గండ్రేటి చంద్రశేఖర్(18), దూబ రెయ్యమ్మ(57) మృతి చెందారు. పాండ్రంకి రామినాయుడు ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ పనుల్లో భాగంగా అతని కుమారుడు కేసరినాయుడు, అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు గండ్రేటి చంద్రశేఖర్‌ను పనికి పిలిచి డాబా ఎక్కారు. ఆ సమయంలో డాబా మీద ఉన్న 12 ఎంఎం ఇనుప రాడ్‌ను డాబా వెనుక వైపు నెట్టగా, డాబాకు కొద్ది దూరంలో ఉన్న 230 ఓల్ట్స్ విద్యుత్ సరఫరా తీగలకు రాడ్ తగలడంతో రాడ్‌ను పట్టుకున్న ఇద్దరు యువకులు పెద్దగా కేకలు వేస్తూ మృతి చెందారు. డాబా మీద యువకుల అరుపులను ఎదురుగా ఉన్న అంగన్వాడీ ఆయా దూబ రెయ్యమ్మ విని వెంటనే డాబా పైకి వెళ్లి పొరపాటున ఇనుప చువ్వను ముట్టుకోవడంతో ఈమె కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని గమనిస్తున్న ఒకరిద్దరు ఏదో జరుగుతుందని ఊహించి డాబా ఎక్కకుండా పొలాల్లో ఉన్న కుటుంబీకులకు సమాచారం అందించారు. గ్రామంలోకి వచ్చిన కిరాణా సరుకుల రవాణా వ్యాపారి డోల ప్రసాద్ డాబా వెనుక వైపునకు వెళ్లి ఇనుప రాడ్ స్ట్రీట్ లైన్ విద్యుత్ తీగలకు తగిలి ఉండడాన్ని గమనించి ఎలక్ట్రికల్ ఏఈకి వెంటనే ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించారు. అనంతరం డాబా ఎక్కి ముగ్గురు పడి ఉండడాన్ని గమనించి వారిని కిందకు దించారు. ముగ్గురిలో చంద్రశేఖర్ కొన ఊపిరితో ఉన్నాడనే అనుమానం రావడంతో వెంటనే ప్రైవేట్ వాహనంలో సంతకవిటి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. వీఆర్వో కనకమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజాం రూరల్ సీఐ సీహెచ్ ఉపేంద్ర, సంతకవిటి ఎస్ఐ బి.లోకేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రాజాం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఎంపీ, ఎమ్మెల్యేల సంతాపం.. సోమన్నపేట గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత పొగిరి సత్యంనాయుడుతో పాటు సంతకవిటికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో వైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతో పాటు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్‌లో జరగకుండా చర్యలు చేపట్టాలని ఎలక్ట్రికల్ అధికారులకు ఆదేశించారు. సంఘటనా స్థలానికి విద్యుత్ శాఖ రాజాం డీఈఈ జీవీ రమణ, ఏఈలు కుమార్, సయ్యద్‌లు చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ముగ్గురి జీవితాల విషాద గాధ.. ఈ ఘటనలో మృతి చెందిన పాండ్రంకి కేసరినాయుడు తల్లి చిన్నమ్మడు ఆరు నెలలు క్రితమే మృతి చెందింది. కేసరినాయుడుతో పాటు తండ్రి రామినాయుడు, సోదరుడు కోటిబాబు కలసి ఉంటున్నారు. కేసరినాయుడు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్నాడు. అన్నయ్య విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఊరికి వచ్చిన తన సోదరుడు బుధవారం విశాఖపట్నం వెళ్లిపోయాడు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరు నెలల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన గండ్రేటి చంద్రశేఖర్ కుటుంబానిది మరో విషాద గాధ. గండ్రేటి కేసరి, సూరీడమ్మలకు చంద్రశేఖర్ ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక్క కుమారుడిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు రాజాంలో నాగావళి ఐటీఐలో ఫిట్టర్ కోర్సులో చేర్పించారు. గురువారం కళాశాల ఉన్నప్పటకీ స్నేహితుడు కేసరినాయుడు ఇంటి పనికి వచ్చాడు. మృత్యువులో కూడా స్నేహితునితో కలసి వెళ్లిపోయాడు. తమ కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు మాకెందుకు ఈ జీవితం అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన దూబ రెయ్యమ్మ ఒక్కర్తే ఉంటున్నారు. ఈమెకు భర్త లేరు. గ్రామంలో అంగన్వాడీ ఆయాగా ఉంటూ కాలం నెట్టుకొస్తుంది. ఈమెకు ఒక్క కుమార్తె భవానీ కాగా ఆమెకు పెళ్లి చేసి, తానొక్కర్తే జీవనం సాగిస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు ఏమి జరిగిందో తెలుసుకుని వారిని కాపాడేందుకు డాబా ఎక్కి మృత్యువాత పాడింది. ఈమె మృతిని కుమార్తె జీర్ణించుకోలేక బోరున విలపిస్తుంది. మిగిలిన వారి ప్రాణాలు కాపాడిన ఆ ముగ్గురు.. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరింత మంది మృత్యువాత పడే ప్రమాదం ఘటనా స్థలంలో నెలకొంది. అయితే విద్యుత్ ఎర్త్ అవుతుందని అనుమానం వచ్చిన స్థానికురాలు నగిరి పద్మ మిగిలిన వారిని డాబా ఎక్కనీయకుండా అడ్డుకుంది. లేకుంటే మరో ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. గ్రామంలోకి వచ్చిన కిరాణా రవాణా వ్యాపారి డోల ప్రసాద్ డాబా ఎక్కుతుండగానే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతుందని గమనించి డాబా వెనుక వైపు వెళ్లి స్ట్రీట్ లైన్‌కు ఇనుపరాడ్ డాబా మీద నుంచి ఉన్నట్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించి ప్రాణ నష్టాన్ని నివారించాడు. ఇంకో వైపు విద్యుత్ తీగలు మధ్య ఉన్న రాడ్‌ను గ్రామానికి చెందిన ఆబోతుల అప్పారావు గుర్తించి, వెంటనే అక్కడకు వచ్చి ఎదురు కర్రతో రాడ్‌ను తొలగించి పెద్ద ప్రమాదాన్నే తప్పించారు. లేకుంటే విద్యుత్ సరఫరా డాబా మీదకు వస్తుందని చెబుతున్నప్పటకీ కొంతమంది ఆత్రుతతో డాబా ఎక్కే ప్రయత్నం చేశారు. ఇనుప రాడ్ విద్యుత్ తీగల నుంచి తప్పించకుంటే ప్రమాదం ఇంకా పెద్దదయ్యేది. మరింత ప్రాణ నష్టం జరిగేది. -
Odisha Tragedy: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏడుగురి సస్పెన్షన్..
ఒడిశా: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో రైల్వే భద్రతా కమీషనర్ నేతృత్వంలో జరుగుతున్న విచారణలో ఘోర ప్రమాదానికి కారణమైన ఏడుగురు అద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దక్షిణ తూర్పు రైల్వే శాఖ. వీరిలో ఇదే కేసులో అంతకు ముందు సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్బంగా దక్షిణ తూర్పు రైల్వే డివిజన్ మేనేజర్ అనిల్ కుమార్ మిశ్రా మీడియా సమావేశాన్ని నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన అధికారులు ఏమాత్రం జాగ్రత్త వ్యవహరించి అప్రమత్తంగా ఉన్నా ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని, వారి నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయనన్నారు. మొదట అరెస్టైన ముగ్గురు, 24 గంటల క్రితం అరెస్టైన మరో ఉద్యోగి తోపాటు మరో ముగ్గురుని సస్పెండ్ చేస్తున్నట్లు అనిల్ మిశ్రా తెలిపారు. అంతకు ముందు సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు ఉద్యోగులు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లకు మరో నాలుగు రోజుల రిమాండ్ పొడిగించాలని సీబీఐ కోరిన విషయం తెలిసిందే. జూన్ 2న బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1200 మందికి పైగా గాయపడ్డారు. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ దుర్ఘటనలో ఎందరో దిక్కులేని వారయ్యారు. ఇంకెందరో నిరాశ్రయులయ్యారు. ఇప్పటికింకా 41 మృతదేహాలను గుర్తించడానికి ఎవ్వరూ రాకపోవడం అత్యంత విచారకరం. #OdishaTrainTragedy: Seven Railway staff including the three employees, who were earlier arrested, suspended, informs South-Eastern Railway GM Anil Kumar Mishra #Odisha pic.twitter.com/MbL6jHYNsp — OTV (@otvnews) July 12, 2023 ఇది కూడా చదవండి: కార్మికుడికి రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టమంటూ నోటీసులు..? -
ఒడిశా ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ మగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్‌గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు.. ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఇదీ చదవండి: ఒడిశా దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ -
పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి..
భువనేశ్వర్: ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సును పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వివరాల ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున దిగపహండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 10 మంది మృతిచెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు, సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో గాయపడిని వారిని బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించి వైద్యసాయం అందిస్తున్నారు. Odisha | 10 people died and 8 injured in a bus accident in Ganjam district, on Sunday late night. Injured were immediately rushed to the MKCG Medical College in Berhampur for treatment. "Two buses collided in which 10 people died. The injured were immediately admitted to MKCG… pic.twitter.com/OE3G3BhMFl — ANI (@ANI) June 26, 2023 అయితే, ఓ పెళ్లికి హాజరయ్యేందుకు పెళ్లి బృందం ప్రైవేటు బస్సులో వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు రాయ్‌గఢ్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తోంది. కాగా, మృతుల్లో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నవారే ఉన్నారని పోలీసులు తెలిపారు. #ଦିଗପହଣ୍ଡିରେ_ଭୟଙ୍କର_ଦୁର୍ଘଟଣା ଗଂଜାମ ଦିଗପହଣ୍ଡିରେ ଦୁଇ ବସ୍ ମଧ୍ୟରେ ମୁହାଁମୁହିଁ ଧକ୍କା..ସମସ୍ତ ଆହତ ବ୍ରହ୍ମପୁର ବଡ଼ ମେଡିକାଲରେ ଭର୍ତ୍ତି କରାଯାଇଛି#MKCG #accident #Ganjam #Odisha #OTV pic.twitter.com/t52OfjNgxB — ଓଟିଭି (@otvkhabar) June 26, 2023 ఇక, ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థికసాయం చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది కూడా చదవండి: టిక్కెట్ లేకుండా ‘వందేభారత్’ ఎక్కి.. భయంతో వాష్‌రూమ్‌లో నక్కి.. -
ఇలాంటి పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెట్టకండి రైలు ఘటనకి దానికి సంబంధం ఏంటీ..
-
మహానేరగాడిలో వికసించిన మానవత్వం.. రూ.10 కోట్లు విరాళం
ఒడిశా: రూ. 200 కోట్లు మనీలాండరింగ్ కేసులో అరెస్టై మాండోలి జైలులో ఊచలు లెక్కబెడుతున్న కరుడుగట్టిన ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మంచివాడిగా మారి ఒడిశా రైలు ప్రమాదంలో బాధితులకు రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు జైలు నుంచే ఒక లేఖ కూడా రాశాడు. ఎవరీ సుఖేష్.. కోర్టు ధిక్కారణతోపాటు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మాల్విందర్ సింగ్ లకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి వారి భార్యల నుండి సుమారు రూ.200 కోట్లు దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. అయితే తీహార్ జైలులో ఉంటూనే సుఖేష్ ఈ నేరానికి పాల్పడటం ఆశ్చర్యకరం. కేవలం మాటలతోనే మాయ చేయగల ఈ మహా నేరగాడిలో ఉన్నట్టుండి మానవత్వం పరిమళించి రైలు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 1200 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారికి, అనాథలైన పిల్లలకు రూ. 10 కోట్లు ఆర్ధిక సాయం అందించనున్నట్లు సుఖేష్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. లేఖలో ఏమని రాశాడంటే.. "నేను పంపిస్తున్న మొత్తం నగదు చట్టబద్ధంగా సంపాదించినది. దీనికి టాక్స్ కూడా కట్టాను. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో పాటు రూ.10 కోట్ల డీడీను కూడా పంపిస్తాను. ఒడిశా రైలు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎలాగూ అండగా ఉంటుంది. కానీ బాధ్యతగల మంచి పౌరుడిగా నేను కూడా వారికి నా వంతుగా రూ.10 కోట్లు సాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తం సొమ్ము తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు, పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. దయచేసి నా ఈ అభ్యర్ధనను అంగీకరించి విరాళాలు సేకరించే సంబంధిత శాఖ వివరాలను తెలపగలరు." అని రాశాడు. మహా నేరగాడు, మానవత్వం, రైలు ప్రమాదం, ఒడిశా రైలు ప్రమాదం, సుఖేష్ చంద్రశేఖర్, చట్టబద్ధం, ప్రమాద బాధితులు, ప్రభుత్వం ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
Odisha Tragedy: ఆ స్కూలును కూల్చేస్తున్నారు
బాలాసోర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ఉంచిన బాహాగానా హైస్కూలును కూల్చివేసినట్లు తెలిపారు ఆ పాఠశాల మేనేజింగ్ కమిటీ సభ్యుడు రాజారామ్ మోహాపాత్ర. శవాలను ఉంచిన చోటకు తిరిగి రావడానికి విద్యార్థులు జంకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. పిల్లలు భయపడుతున్నారు.. బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను వారి బంధువులు వచ్చి తీసుకుని వెళ్లేంత వరకు బాహాగానా హైస్కూల్లోనే ఉంచారు. ఇక్కడి నుండి మృతదేహాలను తరలించిన తర్వాత స్కూలు గదులన్నిటినీ శుభ్రం చేసి శానిటైజ్ చేశాము. అయినా కూడా పిల్లల తలిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపించడానికి ఇష్టపడటం లేదు. దీంతో స్కూలుని కూల్చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. కొత్త భవనం నిర్మించి పూజలు నిర్వహించి పవిత్రం చేసిన తర్వాత స్కూలును పునః ప్రారంభిస్తామని అన్నారు రాజారామ్ మోహాపాత్ర. కలెక్టర్ ఆదేశాలు.. అంతకు ముందు బాలాసోర్ జిల్లా కలెక్టర్ భావుసాహెబ్ షిండే పాఠశాలను సందర్శించి స్కూలు మేనేజింగ్ కమిటీ నిర్ణయిస్తే స్కూలును కూల్చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే పాఠశాల కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుని స్కూలు కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సహాయాక చర్యల్లో భాగంగా మృతదేహాలను వెలికితీసిన వెంటనే వాటిని దగ్గర్లో ఉన్న బాహాగానా హైస్కూలుకు తరలించారు. మృతుల బంధువులు వచ్చి మృతదేహాలను గుర్తించేంత వరకు రోజులపాటు మృతదేహాలను అక్కడే ఉంచడంతో నేలంతా రక్తపు మరకలు అంటుకుని ఉంది. ఎంత కడిగినా కూడా పిల్లల మనస్సులో నుంచి భయాన్ని తొలగించలేమన్నది తల్లిదండ్రుల వాదన. Odisha Train Tragedy: Authorities Begin Demolition Of #Bahanaga Bazar High School.#Odisha #BalasoreTrainAccident #odishatraintragedy #balasore #BahanagaHighSchooldemolitionpic.twitter.com/gaOjgpeEnq — Priyathosh Agnihamsa (@priyathosh6447) June 9, 2023 ఇది కూడా చదవండి: శవాలు కుళ్ళిపోతున్నాయి... ఎన్నాళ్లిలా? -
శవాలపై సొమ్ము చేస్కుంటున్నా కఠిన మనుషులు
-
ఈదురుగాలులకు కదిలిన బోగీలు.. నలుగురు కార్మికులు మృతి
ఒడిశా: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన మరవకముందే అదే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. జాజ్‌పుర్ కియోంజర్ రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు బోగీల కింద నలిగి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంజన్ లేని గూడ్స్ రైలు పట్టాలపై నిలిపి ఉంది. ఈదురుగాలులతో వర్షం ప్రారంభం కాగానే.. ట్రాక్ పనులకు వచ్చిన కార్మికులు గూడ్స్ రైలు బోగీల కింద తలదాచుకున్నారు. ఈ క్రమంలో భారీగా వీస్తున్న గాలులకు రైలు బోగీలు కదిలాయి. దీంతో బోగీల చక్రాల కింద నలిగి నలుగురు కార్మికులు మృతి చెందారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి -
రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం.. ఈ వార్తల్లో నిజమెంత?
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 278 మంది పైగా మరణించారు. అయితే రైలు ప్రమాద బాధితులకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రూ.60 కోట్ల సాయం చేస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అయితే ఇందుకు సంబంధించి ధోని ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అవన్నీ రూమర్స్ అనే ధోని సన్నిహిత వర్గాలు కొట్టిపారేశారు. మరోవైపు విరాట్ కోహ్లి కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు కూడా నిజం కాదని తేలింది. అయితే మరో టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చహల్ మాత్రం.. బాధిత కుటంబాలకు తన వంతుగా రూ.లక్ష విరాళం అందించాడు. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన "స్కౌట్" గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చహల్ తన సాయాన్ని అందించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచిత విద్యతో పాటు ఫ్రీ బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తానని ఈ నజఫ్ఘడ్ నవాబ్ ప్రకటించాడు. చదవండి: WTC Final 2023: ప్లీజ్.. ఆస్ట్రేలియాను ఓడించండి! నాకు చూడాలని ఉంది: స్వాన్ -
శవాలు కుళ్ళిపోతున్నాయి... ఎన్నాళ్లిలా?
ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను ఎక్కువరోజులు కుళ్ళిపోకుండా చూడటం కష్టసాధ్యమైనదని అన్నారు ఢిల్లీ ఎయిమ్స్ అనాటమీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ ఎ. షరీఫ్. విషాదంలో విషాదం... భారత దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఒకటిగా నిలిచింది ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది చనిపోయినట్టు చెబుతున్నారు అధికారులు. చాలావరకు మృతదేహాలను వారి బంధువులు గుర్తించి తీసుకుని వెళ్లగా మరికొన్నిటిని భువనేశ్వర్ ఎయిమ్స్ సహా మరికొన్ని ప్రయివేటు ఆసుపత్రులలో భద్రపరిచారు. అవన్నీ అనాధ శవాలుగా మిగిలిపోయాయి. వందకుపైగా గుర్తుతెలియని మృతదేహాలు వీటిలో ఇంకా గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య వందకు పైగా ఉంది. ఇదిలా ఉండగా ఈ మృతదేహాలను భద్రపరచడంలో ఒడిశా ప్రభుత్వం పెను సవాళ్ళను ఎదుర్కుంటోంది. ఎక్కువ రోజులపాటు మృతదేహాలు కుళ్ళిపోకుండా చూడటంలో సిబ్బందికి అనేక ఇబ్బందులెదురవుతూ ఉన్నాయి. ఎక్కువరోజులు కష్టమే... ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ అనాటమీ శాఖాధిపతి డాక్టర్ షరీఫ్ మాట్లాడుతూ ఛిద్రమైన శవాలను ఎక్కువ రోజులు భద్రపరచడం మంచిది కాదు. మొదటి పన్నెండు గంటల్లోనే మృతదేహాన్ని సరైన ప్రమాణాలను పాటించి జాగ్రత్తపరిస్తే తప్ప వాటిని ఎక్కువరోజులు భద్రపరచలేము. ఈ సంఘటన జరిగి ఇప్పటికే 80 గంటలు పైబడడంతో వీటిని కుళ్లిపోకుండా చూడటం కష్టసాధ్యమైన పనేనని అన్నారు. భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రికి ఆదివారం రోజున 139 మృతదేహాలు తీసుకుని వచ్చారు. వారి బంధువులెవరైనా వచ్చి గుర్తిస్తారని వాటిని ఐదు ఫ్రీజర్ల సాయంతో భద్రపరచి ఉంచారు. 30 గంటలు దాటిన తర్వాత నుంచి వాటిని డీకంపోజ్ కాకుండా ఉంచటానికి మరి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. -
ఒడిశాలో రైలు నుండి పొగలు... పరుగులు తీసిన ప్రయాణికులు
ఒడిశాలో మరో రైలు సంఘటన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ ప్రెస్ లో ఉన్నట్టుండి ఏసీ నుండి పొగలు వస్తుండటంతో ప్రయాణికులంతా కంగారు పడిపోయారు. పరిస్థితిని గమనించిన రైల్వే సిబ్బంది రైలును ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. తర్వాత కొద్దిసేపటికి పొగ అదుపులోకి వచ్చినప్పటికీ ప్రయాణికులు ఎలక్ట్రిక్ బ్రేక్ డౌన్ అనుకుని ఆ కోచ్ లో ప్రయాణం చేయమంటే చేయమని పట్టుబట్టారు. ఏం జరిగిందంటే... ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ... సికింద్రాబాద్ - అగర్తలా ఎక్స్ ప్రెస్ రైలు బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా బి-5 బోగీలో చిన్న ఎలక్ట్రికల్ సమస్య తలెత్తింది. దీంతో పెట్టె నిండా పొగలు వ్యాప్తి చెందాయి. ప్రయాణికులు అలారం సిగ్నల్ ఇవ్వడంతో రైలులో ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యి పొగను నియంత్రించారు. ఒడిశా రైలు ప్రమాద సంఘటన తర్వాత ప్రయాణికులంతా బిక్కు బిక్కుమంటూనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. రైళ్లు పరిగెత్తడం మాట దేవుడెరుగు. ప్రయాణమంటే చాలు ప్రయాణికులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
Odisha Train Accident: ఆ తండ్రి నమ్మకమే కొడుకుని బతికించింది!
ఒడిస్సా బాలాసోర్‌లో వందలాది ప్రాణాలు బలిగొన్న ఆ రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. ఎందరికో తీరని విషాదాన్ని మిగిల్చింది. కొందరూ మాత్రం ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని మృత్యుంజయులై ప్రాణలతో బయటపడిన వారు కూడా ఉన్నారు. అంతటి భయానక విషాదంలోని తన వాళ్లు బతికే ఉండాలన్న ఆరాటం, ఆశతో గాలించిన కొందరి ఆశలు, ప్రయత్నాలు సఫలమయ్యాయి. వారి ప్రేమ, తపనే ఆయా వ్యక్తులకు ఊపిరి పోసి మృత్యుజయులుగా తిరిగొచ్చేలా చేసిందా!.. అన్నట్లుగా జరిగిందో ఓ ఉదంతం. ఆ తండ్రి నమ్మకమే విధే చిన్నబోయేలా గెలచింది. కొడుకు ప్రాణాలను కాపాడుకోగలిగే చేసింది ఆ తండ్రి ఆశ. అసలేం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్‌లోన హౌరాకు చెందిన హేలరామ్ అనే దుకాణదారుడు తన 24 ఏళ్ల కొడుకు బిస్వజిత్ మాలిక్‌ని కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించేందుకు శుక్రవారం షాలిమార్ స్టేష్‌న్‌కు వచ్చాడు. కొడుకుని కోరమండల్ రైలు ఎక్కించి వీడ్కోలు పలికి వెనుదిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రైలు ప్రమాదం గురించి విని షాక్ అయ్యాడు. వెంటనే కొడుకుకి ఫోన్ చేస్తే తాను చాలా గాయాలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హేలరామ్ ఓ అంబులెన్స్ డ్రైవర్ పలాష్ పండిట్‌ను ఏర్పాటు చేసుకుని.. తన బావ దీపక్ దాస్‌తో కలిసి ఒడిశాకు బయలుదేరాడు. సుమారు 230 కిలోమీటర్లు ప్రయాణించి.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాత్రికల్లా చేరుకున్నారు. ఆ రాత్రే ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందిస్తున్న ప్రతి ఆస్పత్రిని సందర్శించిన ఏం ప్రయోజనం లేకపోయింది ఆ తండ్రికి . కొడుకు ఎక్కడ ఉన్నాడన్నది కానరాలేదు. అయితే అధికారులు హేలారామ్‌ని మృతదేహాలను ఉంచిన తాత్కాలిక మార్చరీ(బహనాగా హైస్కూల్) వద్దకు వెళ్లమని సూచించారు. నిజానికి సాధారణ పౌరులు ఎవర్నీ అక్కడకు వెళ్లనివ్వడం లేదు. బాధితుల బంధువులకు మాత్రమే అనుమతి. సరిగ్గా అక్కడకు హేలారామ్ చేరుకునేసరికి..ఇంతలో ఆ శవాల మధ్యలోంచి ఓ చేయి కదలడం ప్రారంభించింది. దీంతో అక్కడి వాతావరణం కాస్త గందరగోళంగా మారిపోయింది. అదృష్టవశాత్తు ఆ చేయి కదిలిన వ్యక్తే హేలరామ్ కొడుకు బిస్వజిత్‌గా తేలింది. ప్రమాదం జరిగిన రెండో రోజుకి తన కొడుకు ఆచూకిని కనిపెట్టగలిగాడు హేలారామ్. దీంతో ఆ తండ్రి తాను తీసుకొచ్చిన అంబులెన్స్‌లో బాలాసోర్ ఆస్పత్రికి కొడుకుని తీసుకుకెళ్లగా.. వారు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి.. కటక్ మెడికల్ కాలేజికి తీసుకెళ్లమని రిఫర్ చేశారు. హుటాహుటినా అతడిని ఆ అంబులెన్స్‌లోనే కోల్‌కతాలోని సదరు ఆస్పత్రికి తరలించారు. అతని కాలికి అయ్యిన గాయాలకు శస్త్ర చికిత్సలు చేశారు. ప్రస్తుతం ఇంకా కొన్ని గాయాలతో బాధపడుతున్నట్లు అతడి తండ్రి చెప్పుకొచ్చాడు. నాన్ మెడికల్ సహయక బృందం అతను అపాస్మారక స్థితిలో ఉండటంతో.. చనిపోయాడని తప్పుగా భావించి శవాలు ఉండే చోటే పెట్టినట్లు అధికారులు చెప్పినట్లు వెల్లడించాడు హేలరామ్. ఎలాగైతే తన కొడుకు ప్రాణాలతో ఉంటాడన్న ఆ తండ్రి ఏకంగా అంబులెన్స్ మాట్లుడుకుని తీసుకెళ్లాడు. రెండు రోజులు శవాల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడి కొడుకుని.. ఆ తండ్రి నమ్మకమే ఊపిరి పోసి మృత్యుంజయుడై తిరిగొచ్చేలా చేసింది. (చదవండి: లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు చుక్కెదురు) -
Odisha Train Accident: ఆ దుర్ఘటనలో కీలకంగా ఆ లోకోపైలట్ చివరి మాటలు
ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో వందలాదిమంది ప్రాణాలు బలిగొన్న మూడు రైళ్ల ప్రమాదంలో ఆ లోకో పైలట్ చివరి మాటలే కీలకంగా మారనున్నాయి. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతోనే గూడ్స్ రైలుని ఢీ కొట్టినట్లు రైల్వేశాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ నిజానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాతే లూప్లైన్లోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ చేయలేదని లోకోపైలట్ గుణనిధి మొహంతి చెప్పారు. మొదటగా మెయిన్‌లైన్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అప్పుడే లూప్‌లైన్‌కి వెళ్లేలా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వెల్లడించారు. అక్కడ గూడ్స్ రైలు ఆగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఇక ఆ లోకోపైలట్ మొహంతి కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో డ్రైవర్ అతివేగం కాదని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ సభ్యురాలు జయవర్శ సిన్హా కూడా ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ..సాక్ష్యాలు తారుమారు కాకుండా, ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. ఆ డ్రైవర్ గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాత ముందుకు సాగినట్లు తెలిపారు. అతను సిగ్నల్ జంప్ చేయలేదని, అలాగే అతి వేగంతో కూడా వెళ్లలేదని తేల్చి చెప్పారు సిన్హా. అతనకి నిర్దేశించిన గరిష్ట వేగంతోనే రైలుని ముందకు తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని సిన్హా వెల్లడించారు. ఇదిలా ఉండగా, రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్విస్టెగేషన్(సీబీఐ) విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ లోకో పైలట్ మొహంతి మాటలే దర్యాప్తులో కీలకం కానుండటం గమనార్హం. #WATCH | Safety is the top priority for Railways. We are making sure that the evidence does not get tampered & that any witness does not get affected. The driver of the train who sustained serious injuries said that the train moved forward only after it received a 'Green' signal.… pic.twitter.com/6zER9dRAUl — ANI (@ANI) June 4, 2023 (చదవండి: -
స్పష్టతలేని వ్యాఖ్యలు.. నవ్వులపాలైన మమతా బెనర్జీ
ఒడిశా రైలు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మృతుల సంఖ్యపై స్పష్టమైన అవగాహన లేకుండా నోరుజారడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. మమతా బెనర్జీ రాజకీయ జీవితమంతా శవరాజకీయాలతోనే సాగిందని విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి సమక్షంలోనే నోటికొచ్చిన లెక్కలు... ఒడిశా రైలు ప్రమాద సంఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న మమతా బెనర్జీ వెళ్లేముందు మీడియాతో మాట్లాడుతూ మృతుల సంఖ్య 500 వరకు పెరిగే అవకాశముంది, ఎందుకంటే ఇంకా మూడు భోగీల వరకు సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ఆ సమయంలో అక్కడే నిల్చుని ఉన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెంటనే స్పందించి "సహాయక చర్యలు అయిపోయాయి మేడమ్ , మృతుల సంఖ్య 238 మాత్రమే..." అని ఆమెను సవరించే ప్రయత్నం చేశారు. దీంతో మమతా మళ్ళీ అందుకుని అది అంతకుముందు లెక్క అంటూ గొంతు పెంచారు. ఇంతలో పక్కనే ఉన్న మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కల్పించుకుని.. "తర్వాత మాట్లాడదాం.." అని కట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో నెటిజన్లు బెంగాల్ సీఎంపై కామెంట్లు చేస్తున్నారు. సింగూర్ హింసాకాండతో మొదలు, శవ రాజకీయాలు చేసే ఈ స్థాయికి వచ్చారు. చావులు, అరాచకాలతోనే నీచమైన రాజకీయాలకు అలవాటు పడిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. Mamata Banerjee’s rise in politics has been over dead bodies… From Singur to post poll violence of 2021, all she has done is - indulged in dirty politics of death and destruction. She is clearly frustrated after the Railways Minister thwarted her attempts to inflate casualty… pic.twitter.com/cUkgw5OsGP — Amit Malviya (@amitmalviya) June 4, 2023 ఇది కూడా చదవండి: ఒడిశా ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సానుభూతి -
ఒడిశా ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సానుభూతి
ఒడిశా రైలు ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విచారాన్ని వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆదివారం జరిగిన ప్రార్థనల్లో చనిపోయిన 275 మంది మృతికి సంతాపాన్ని తెలిపారు. "ఒడిశా బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం అత్యంత విషాదకరం. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను. గాయాల బారిన పడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అండగా మా ప్రార్ధనలు ఉంటాయి." -ఆంటోనియో గుటెర్రెస్ వాటికన్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం జరిగిన ప్రార్థనల్లో ప్రత్యేకంగా ఒడిశా ప్రమాదం గురించి ప్రస్తావించి మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. " ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందినవారి ఆత్మలను పరలోకంలో ప్రభువు అంగీకరించును గాక. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనలోని బాధితులకు నా ప్రార్ధనలు తోడుగా ఉంటాయి. గాయపడినవారికి, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను." - పోప్ ఫ్రాన్సిస్ బాలాసోర్ ఘటనలో 275 మంది మరణించగా వెయ్యికి పైగా గాయపడ్డారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ఈ ట్రైన్ యాక్సిడెంట్ మిగిలిపోతుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపి, మరెందరినో దిక్కులేని వారిగా మిగిల్చిన ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. -
ఒడిశా పోలీస్ సీరియస్ వార్నింగ్..
ఒడిశా రైలు ప్రమాదానికి బాలాసోర్ కు చెందిన ఒక వర్గం వారు పన్నిన కుట్రే కారణమంటూ సోషల్ మీడియాలో వదంతులు పుట్టించే ప్రయత్నం చేస్తున్న వారినుద్దేశించి ఒడిశా పోలీసులు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన పోలీసులు మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. పథకం ప్రకారమే... బాలాసోర్ రైలు ప్రమాదం అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు ఎప్పటికి తేరుకుంటాయో అర్ధం కానీ స్థితిలో దేశ ప్రజానీకం ఉంటే, ఒక ఆకతాయి మూక మాత్రం రైలు ప్రమాదానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేసి అనవసర వివాదానికి తెరతీసింది. బాలాసోర్ కు సమీపంలో ఒక వర్గం వారు కుట్ర పన్ని రైలు ప్రమాదానికి కారణమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. క్షణాల్లో వైరల్ గా మారిన ఈ పుకార్లపై ఖాకీలు తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆకతాయిలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాట తీస్తామన్న పోలీసులు... ఒడిశా పోలీసులు ఏమన్నారంటే... సోషల్ మీడియాలో కొంతమంది ఒడిశా పెను విషాద సంఘటనకు మతం రంగు పులుముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇది అత్యంత దురదృష్టకరం. గవర్నమెంట్ రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. దయచేసి చెడు ప్రేరణ కలిగించే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దు. ఈ విధమైన పుకార్లను ప్రచారం చేసి మతసామరస్యాన్ని దెబ్బతీస్తే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. It has come to notice that some social media handles are mischievously giving communal colour to the tragic train accident at Balasore. This is highly unfortunate. Investigation by the GRP, Odisha into the cause and all other aspects of the accident is going on. — Odisha Police (@odisha_police) June 4, 2023 ఇది కూడా చదవండి: గుట్టలు గుట్టలుగా మృతదేహాలు.. ఎక్కడా ఖాళీ లేదు -
Odisha Rail Crash: ఎలా బయటపడ్డానంటే?..కన్నీళ్లు పెట్టిస్తున్న బాధితుల మాటలు
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగి ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కర్ని కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించాయి. ప్రాణలతో బయటపడ్డ కొందరూ చెబుతున్న మాటలు వింటుంటూ అంత తేలిగ్గా ఆ విషాదాన్ని మర్చిపోలేరేమో అన్నంతగా భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఘోర ప్రమాదం నుంచి బయటడ్డ బాధితులు తాము ఎలా సజీవంగా బయటపడ్డానో చెబుతుంటే ఆ దృశ్యం కళ్లముంగిట కదలాడినట్లుగా ఉంది. ఆ బాధితుడు అస్సాంకు చెందిన దీపక్ దాస్. తాను ప్రయాణిస్తున్న రైలు గూడ్సు రైలుని ఢీ కొట్టిందని చెప్పుకొచ్చాడు. దీంతో కోచ్‌లు బోల్తాపడ్డాయి. తాను విండో సీటు వద్ద ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగానని. తాను ఆ సమయంలో కిటికీని గట్టిగా పట్టుకుని ఉన్నానని లేదంటే తాను కూడా చనిపోయే వాడినని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఇదే ప్రమాదం నుంచి బయటపడ్డ బీహార్‌కు చెందిన మరో వ్యక్తి మాట్లాడుతూ..రైలు అకస్మాత్తుగా ఢీ కొన్న తర్వాత భారీ కుదుపు విన్నానని, అయితే ఆ తర్వాత ఏం జరిగిందో పెద్దగా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన గురించి తన కుటుంబసభ్యులకు సమాచారం అందిందని, తనను ఇంటికి తీసుకెళ్లడానికి వస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా, ఆ ఘోర ప్రమాదానికి కారణాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణాన్ని గుర్తించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం నాటికి పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యం అని, తద్వారా రైళ్లను ఈ ట్రాక్‌పై యథావిధిగా నడిచేలా చేయొచ్చని అన్నారు. (చదవండి: నిబద్ధతతో వ్యవహరించి.. రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రులు వీరే..) -
ఉమ్మడి ప్రకాశం నుంచి యశ్వంతపూర్ రైలు ఎక్కిన 30 మంది..
‘చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు.. రక్తపు మడుగులా తయారై భయానకంగా మారిన ప్రమాద స్థలిని చూస్తే గుండె బరువెక్కుతోంది. ఈ ఘోర ప్రమాదం సంభవించిన రైల్లో తామూ ప్రయాణించామన్న విషయం తలుచుకుంటేనే భయమేస్తోంది. అప్పటి వరకూ తమతో కలిసి ప్రయాణం చేసిన వారు మృత్యువాత పడటం తీవ్రంగా కలచివేస్తోంది.’ అంటూ యశ్వంతపూర్– హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఈ రైలులో సుమారు 30 మంది ప్రయాణికులు ఎక్కగా.. అందులో ఆరుగురు మాత్రమే ప్రమాదం సంభవించినప్పుడు రైలులో ఉన్నారు. వారు కూడా క్షేమంగా ఉన్నారని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలు రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేశారు. ఒంగోలు టౌన్: ఒడిషాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్‌బజార్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం వార్త విన్న ఒంగోలు వాసులు ఉలిక్కిపడ్డారు. గురువారం ఒంగోలు మీదుగా హౌరా వెళ్లిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సుమారు 30 మంది ప్రయాణికులు ఎక్కారు. ఒంగోలులో 12 మంది, చీరాలలో మరో 18 మంది ఎక్కారు. జనరల్ బోగిలో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారన్నది తెలియదు. వీరిలో ఏడుగురు ప్రయాణికులు వైజాగ్‌లో, 12 మంది విజయనగరంలో, ముగ్గురు పలాసలో దిగిపోయారు. అలాగే ఒకరు విజయవాడ, మరొకరు మచిలీపట్నంలో దిగినట్లు సమాచారం. వీరు కాకుండా చీరాల పట్టణానికి చెందిన ఆరుగురు వస్త్ర వ్యాపారులు రైలులోనే ప్రయాణించారు. ఈ రైలులో ప్రయాణించిన వారితో సాక్షి మాట్లాడింది. యశ్వంత్‌పూర్ రైలు ప్రమాదానికి గురైనట్లు తెలిసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తమ్ముడు గంటా చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఈ రైలులో ప్రయాణం చేసిన వారిలో ఉన్నారు. ఆయన జరుగుమల్లి మండలం కామేపల్లిలో వ్యవసాయం చేస్తుంటారు. కూతురు వినితకు ఏపీఎస్సీ మెయిన్ పరీక్షలు జరుగుతుండడంతో భార్య విజయలక్షి్మతో కలిసి వైజాగ్ వెళ్లారు. తాను ప్రయాణం చేసిన యశ్వంత్‌పూర్ రైలు ప్రమాదానికి గురి కావడం కలిచివేసిందని ఆయన అన్నారు. కామేపల్లికి చెందిన తక్కెళ్లపాటి పద్మ అనే మహిళ వైజాగ్‌లో నివాసముంటున్న కూతురు, అల్లుడు వద్ద ఉంటున్నారు. ఇటీవల ఆమె జరుగుమల్లి మండలం కాÐమేపల్లి వచ్చారు. నాలుగు రోజులు ఉండి ఆమె కూతురు వద్దకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఒంగోలు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆమెకు రైలు రావడం ఆలస్యమవుతుందని తెలిసింది. సాయంత్రం 7.46 గంటలకు రావాల్సిన రైలు 4 గంటలు ఆలస్యంగా రాత్రి 11.30కి వచ్చింది. దీంతో అలసిపోయిన ఆమె రైలు ఎక్కగానే నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం యశ్వంత్‌పూర్ రైలు పట్టాలు తప్పిందని, వందల మంది అశువులుబాశారని తెలిసి గుండెల్లో రాయి పడ్డట్టయిందన్నారు పద్మ. టీవీలో యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతోందని వాపోయారు. అప్పటి వరకు తమతో కలసి ప్రయాణించిన వారిలో చాలా మంది మృత్యువాత పడడం జీరి్ణంచుకోలేకపోతున్నామన్నారు. నాగులప్పలపాడు మండలం టి.అగ్రహారానికి చెందిన జాగర్లమూడి వెంకటేశ్వర్లు వైజాగ్‌లో ఓ వివాహానికి హాజరయ్యేందుకు భార్య అమ్మనితో కలిసి యశ్వంతపూర్ రైలులో బయలుదేరి వెళ్లారు. ఒడిషాలో రైలు ప్రమాదం జరిగినట్లు తెలిసి ఖిన్నుడయ్యారు. స్వగ్రామం నుంచి బంధువులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నారని, అయితే తాము సురక్షితంగా ఉన్నామని తెలియజేశామని చెప్పారు. నిర్మానుష్యంగా ఒంగోలు రైల్వేస్టేషన్... ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఒంగోలు మీద నుంచి హౌరా వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. ప్రయాణికులు వారి ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు ఒంగోలు నుంచి సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఢిల్లీ, ఒడిషా, పశి్చమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, జమ్ము కశీ్మర్‌తో పాటుగా మొత్తం పది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రైలు సౌకర్యం ఉంది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడు చూసినా ప్రయాణికులతో రద్దీగా కనిపించే ఒంగోలు రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా కనిపించింది. ఇదిలా ఉండగా షాలీమార్ నుంచి చెన్నై బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలుకు చెందిన ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటి దాకా రైల్వే పోలీసులకుగానీ, రైల్వే అధికారులకుగానీ ఎలాంటి సమాచారం లేదు. ఒంగోలులో కోరమాండల్ రైలుకు స్టాపింగ్ లేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒంగోలు రైల్వేస్టేషన్‌తో పాటు గిద్దలూరు, యర్రగొండపాలెం, ఇంకా పలు రైల్వేస్టేషన్లలో అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. -
‘కవచ్’ పరిశోధనలకే పదేళ్లు.. అలా జరిగితే ప్రమాదం తప్పేదా?
సాక్షి, హైదరాబాద్: అత్యంత వేగంగా వందే భారత్ రైళ్లను తయారు చేసి, సర్వీసులను పట్టాలెక్కిస్తున్న భారతీయ రైల్వే, ప్రయాణికుల భద్రతలో అత్యంత తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తోంది. పరస్పరం రైళ్లు ఢీకొనకుండా కాపాడే వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యంతో అమాయక ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రైళ్లపై భరోసాతో వాటిలో ప్రయాణిస్తున్నవారు ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు వదులుతున్నారు. పదేళ్ల జాప్యం.. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా వ్యవస్థను రూపొందించడానికి ప్రయోగాల పేరుతో ఏకంగా పదేళ్ల విలువైన కాలాన్ని రైల్వే అధికారులు హరించారు. కానీ ఇప్పటివరకు ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేలేకపోయారు. ప్రయోగాలకు వేదికైన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంత ఏర్పాటు చేసి మిగతా చోట్ల చేతులెత్తేశారు. శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన హౌరా–చెన్నై మార్గం దేశంలోనే కీలక రైల్వే లైన్. ఆ మార్గంలో కూడా రైల్వే కవచ్ ఏర్పాటు చేయలేకపోయింది. ఎందుకీ దుస్థితి.. రైల్వే నెట్వర్క్ తక్కువగా ఉండి, ఎక్కువ సంఖ్యలో రైళ్లు తిప్పే మన దేశంలో.. ఎదురెదురుగా వచ్చి రైళ్లు ఢీకొనే పరిస్థితి తరచూ ఉండేది. సిగ్నలింగ్ వైఫల్యమో, మానవ తప్పిదమో.. తరచూ ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా రైళ్లు వచ్చేవి. ప్రమాదాలు నివారించేందుకు విదేశాల నుంచి పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాలనుకున్నా, ఖరీదు ఎక్కువ కావటంతో సొంతంగానే రూపొదించాలని రైల్వే నిర్ణయించింది. అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)కు బాధ్యతను అప్పగించింది. అది కొంతకాలం ప్రయోగాలు చేసి 2013లో తొలుత రైల్ కొలీజన్ అవాయ్‌డెన్స్ సిస్టం(టీకాస్)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్–వాడీ–సనత్‌నగర్ సెక్షన్లను ఎంపిక చేశారు. 260 కి.మీటర్లలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించారు. కవచ్‌గా మార్చి.. ఐదేళ్ల క్రితం దానిని ‘కవచ్’గా మార్చి పరిజ్ఞానాన్ని మరింత అప్‌గ్రేడ్ చేశారు. 2022 ఫిబ్రవరి నాటికి జోన్ పరిధిలో 615 కి.మీ. మేర ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయోగాలు విజయవంతమయ్యాయని, వ్యవస్థను అంబాటులోకి తెస్తామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే బోర్డు అనుమతించినా.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. గతేడాది చివరలో ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా రైలు లోకో ఇంజిన్‌లో కూర్చుని ప్రయోగాలను పరిశీలించారు. ప్రతి సంవత్సరం 5 వేల కి.మీ. మేర దాన్ని ఏర్పాటు చేసి, దేశమంతటా విస్తరిస్తామని పేర్కొన్నారు. గత సంవత్సరమే ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–హౌరా మార్గాల్లోని 2 వేల కి.మీ.నిడివిలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కిలోమీటర్‌కు రూ.50 లక్షలు.. కవచ్ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలంటే కిలోమీటరుకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. ఇది రైల్వేకు పెద్ద భారంగా మారింది. పనులు వేగంగా పూర్తి చేయాలంటే బడ్జెట్ నిధుల్లో సింహభాగం దానికే ఖర్చు చేయాలి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1450 కి.మీ.మేర ఏర్పాటు చేయటం మినహా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఏమిటీ కవచ్? కవచ్ పరిజ్ఞానం రైలు ఇంజిన్లతోపాటు ట్రాక్ వెంట కొనసాగుతుంది. మధ్యమధ్య ఫ్రీక్వెన్సీ టవర్లు ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రత్యేక కవచ్ యంత్రాలను అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేజెస్లతో అనుసంధానిస్తారు. ఎలా పనిచేస్తుంది? - రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. - దేశంలో రైలు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న సిగ్నల్ జంప్‌ను ఇది అప్రమత్తం చేస్తుంది. నిర్ణీత పరిధిలోపు అదే లైన్లో ఇంకొక రైలు ఉందని గుర్తిస్తే ఆటోమేటిక్‌గా రైలును ఆపేస్తుంది. - సిగ్నల్ దాటేసి వెళ్లడం, వేగంగా ప్రయాణించడం వంటి సందర్భాల్లోనేకాదు దట్టంగా మంచు కమ్ముకున్న అననుకూల వాతావరణంలోనూ పలుమార్లు లైన్–సైడ్ సిగ్నల్స్‌ను ఇస్తూ పైలట్‌కు సాయపడుతుంది. - లెవల్–క్రాసింగ్ వద్ద తనంతట తానుగా విజిల్స్ వేస్తుంది. రైలు నియంత్రణ కోల్పోయిన సందర్భాల్లో ప్రమాదం ఉందంటూ సంబంధిత వ్యవస్థకు తక్షణం హెచ్చరికల ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంది. - రైలు బ్రేకు ఫెయిలైనప్పుడు కూడా ఈ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసి రైలును నిలిపివేయగలదు. హారన్ కొట్టాల్సిన చోట కొట్టకున్నా.. ఈ వ్యవస్థ తనంతట తానుగా ఆ పని చేస్తుంది. కొసమెరుపు: దేశీయంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేక చేతులెత్తేస్తున్న రైల్వే శాఖ, ఆ పరిజ్ఞానాన్ని విదేశాలకు విక్రయించేందుకు మాత్రం సిద్ధమని ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్.. -
రెండు రైల్వే లైన్లు !
కోదాడ: ఇప్పటి వరకు ప్యాసింజర్ రైలు ముఖం చూడని జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జిల్లా మీదుగా రెండు రైల్వే లైన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొద్ది సంవత్సరాల్లోనే జిల్లా వాసులకు ఒక సాధారణ, మరో హైస్పీడ్ రైల్వేలైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డోర్నకల్–మిర్యాలగూడ మార్గానికి సంబంధించి సర్వే దాదాపు పూర్తికావొచ్చింది. తాజాగా శుక్రవారం కేంద్ర రైల్వే, పర్యాటకశాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డిలు తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వరకు హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని సర్వే కోసం కాంట్రాక్టర్‌ను కూడా నియమించడంతో ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కే అవకాశముంది. కేంద్ర మంత్రుల తాజా ప్రకటనతో జిల్లావాసులకు ఆనందాన్ని కలిగిస్తుంది. తీరనున్న జిల్లా వాసుల చిరకాల వాంఛ తమ పట్టణంలో రైలు ఎక్కాలనుకుంటున్న జిల్లావాసుల చిరకాలకోరిక తీరే సమయం దగ్గరపడింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డి ప్రకటించిన ఈ కొత్త రైల్వేలైన్ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే జిల్లాలోని సూర్యాపేట, కోదాడ వాసులు హైస్పీడ్ రైలు ఎక్కడానికి ఎక్కువ సమయం పట్టదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా రెండు రాష్ట్రాలను కలుపుతూ శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వేకు రైల్వేబోర్డు అనుమతులు మంజూరు చేసింది. దీనికి కాంట్రక్టర్‌ను కూడా నియమించింది. ఆరు నెలల్లో సదరు కాంట్రాక్టర్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 220 కి.మీ. గరిష్ట వేగంతో (సెమీ హైస్పీడ్) రైళ్లను నడిపే విధంగా ఈ లైన్ వేయాలని నిర్ణయించారు. రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రాథమికంగా శంషాబాద్ నుంచి అంబర్‌పేట ఓఆర్ఆర్ మీదుగా 65వ నంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ పట్టణాల సమీపంలోనుంచి ఈ లైన్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పూర్తికావొచ్చిన డోర్నకల్ – మిర్యాలగూడ లైన్ సర్వే డోర్నకల్ నుంచి మిర్యాలగూడ వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ సర్వే పనులు గడిచిన ఆరు నెలలుగా జరుగుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం నల్లగొండ జిల్లా పరిధిలో సర్వే జరుగుతోంది. ఈ లైన్ డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ల మీదుగా మిర్యాలగూడకు చేరుకోనుంది. మరో ప్రతిపాదనలో డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ మీదుగా ఇప్పటికే ఉన్న జాన్‌పహాడ్ వద్ద లైన్‌కు కలిసే విధంగా తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో మొదటి ప్రతిపాదనకే అధికారులు మొగ్గుచూపుతున్నారని.., వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ లైన్‌కు నిధులు మంజూరు చేయించడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడకు చెందిన ఐఆర్టీఎస్ అధికారి బర్మావత్ నాగ్యానాయక్ తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీ కాగానే పార్లమెంట్లో ప్రతిపాదించా.. హైదరాబాద్ – విజయవాడల మధ్య హైస్పీడ్ రైల్వేలైన్ ఆవశ్యకతను నేను ఎంపీగా ఎన్నిక కాగానే తొలిసారి పార్లమెంట్లో ప్రతిపాదించాను. రెండు రాష్ట్రాల మధ్య ఈ లైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను. ప్రభుత్వం దీనిపై ఇన్నాళ్లకు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. దీనికి వెంటనే నిధులు మంజూరు చేయించడానికి నావంతు ప్రయత్నం చేస్తాను. – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ నల్లగొండ -
రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న సంఘటనలో జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలకు రాజకీయం చేయడానికిది సరైన సమయం కాదంటూ సున్నితంగా హెచ్చరించారు కేంద్ర మంత్రి. రైల్వే శాఖ వైఫల్యం... ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ సమీపంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం వెనుక సాంకేతిక లోపమే ప్రధాన కారణమని, ఈ ప్రమాదం జరిగిన కొద్దీ సేపటికి డౌన్ లేన్ లో వస్తున్న మరో రైలు బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడంలోనూ రైల్వే శాఖ విఫలమైందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ కారణాలను ఎత్తిచూపుతూ కేంద్ర రైల్వే మంత్రి జరిగిన తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతగా రాజీనామా చెయ్... దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... గతంలోనూ ఒకేసారి ఇదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ప్రమాదం జరిగితే అందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రికి ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమయం సందర్భం లేదా... రైల్వే మంత్రి స్పందిస్తూ... రైలు ప్రమాదంలో ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఇది వారి జీవితాలను పునరుద్ధరించాల్సిన సమయం. మేము పూర్తి పారదర్శకతతో ఆ పనుల్లో ఉన్నాము. రాజకీయం చేయడానికిది తగిన సమయం కాదని అన్నారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ -
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్
ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశాడు రియల్ హీరో సోనూ సూద్. ఈ ప్రమాదం చాలా దారుణమని ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా సందేశాన్ని కూడా పంపించాడు. రియల్ హీరో... ఎప్పుడూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుండే సోనూ సూద్ ఇప్పుడు రైలు ప్రమాద బాధితుల పక్షాన నిలిచి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. బాధిత కుటుంబాలకు కంటితుడుపు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోకుండా శాశ్వత పరిహారం చెల్లించే విధంగా సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బాలాసోర్ రైలు ప్రమాదంపై తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు. ఒడిశాలో జరిగిన విషాదం గురించి తెలియగానే నా గుండె చెక్కలైంది. ప్రమాద బాధితులకు నా ప్రగాఢ సానుభూతులు తెలుపుతున్నాను. మనమందరం వారి కుటుంబాలకు అండగా ఉండాలని రాస్తూనే... వీడియో ద్వారా సందేశాన్ని పంపించాడు. వీడియోలో సోనూ ఏమన్నాడంటే... మనం ఈరోజు ప్రమాదం గురించి ట్వీట్ చేస్తాం, సంఘటనలో నష్టపోయిన నిర్భాగ్యుల పట్ల సానుభూతి తెలుపుతాం. కానీ వెంటనే మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. కానీ వీరిలో జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాలలో పనులు చేసుకుంటున్న వారి పరిస్థితి ఏమిటి? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? రాత్రికి రాత్రి చాలా కుటుంబాలు చెదిరిపోయాయి. ఆ కుటుంబాలు మళ్ళీ నిలబడే అవకాశముందా? ఇప్పుడు ప్రకటించిన నష్టపరిహారం రెండు మూడు నెలల్లో ఖర్చయిపోతుంది. ఈ ఘటనలో తమ కుటుంబాలను పోషించుకునే అనేకమంది కాళ్ళు, చేతులు విరిగిపోయాయి. ఈ పరిహారంతో వారికి న్యాయం జరుగుతుందా? ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమే కానీ ఇటువంటి విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఎదో నష్టపరిహారం ప్రకటించి ఊరుకోకుండా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పెన్షన్లు ఇవ్వడంగానీ స్థిరాదాయం కల్పించడం గానీ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునరాలోచన చేసి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు భరోసా కల్పించాలి. అలాగే ప్రతి ఒక్కరూ బాధితులను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. Heartbroken by the news of the train tragedy in Odisha. Heartfelt deepest condolences 💔🙏 Time to show our support and solidarity for the unfortunates. 💔#OdishaTrainAccident 🇮🇳 pic.twitter.com/ZfuYYp8HK9 — sonu sood (@SonuSood) June 3, 2023 ఇది కూడా చదవండి: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటాడిన విధి.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత.. -
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటాడిన విధి.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత..
సరిగ్గా 14 ఏళ్ల తర్వాత... కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి కాదు. 14 ఏళ్ల క్రితం కూడా ఇదే ఓడిశాలోని జాజ్ పూర్ వద్ద ఈ రైలు మొదటిసారి పట్టాలు తప్పింది. ఆసక్తికరమైన మరో సంగతేంటంటే ఆరోజు కూడా శుక్రవారమే. సరిగ్గా పద్నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోనే, శుక్రవారం రోజునే ప్రమాదానికి గురికావడం యాదృచ్చికం. 2009, ఫిబ్రవరి 13, శుక్రవారం రోజున... ఒడిశాలోని జాజ్ పూర్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా అత్యంత వేగంగా వెళ్తోన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆరోజు ఆ ప్రమాదంలో స్లీపర్ క్లాస్ కు చెందిన 13 భోగీలు పట్టాలు తప్పగా అందులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు, 161 మంది గాయపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత అదే శుక్రవారం రోజున కోరమండల్ ఎక్స్ ప్రెస్ మళ్ళీ ప్రమాదానికి గురికావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. కానీ ఇప్పుడు బాలాసోర్‌లో జరిగిన ఈ ప్రమాదం అంతకంటే తీవ్రమైనది. రైలు ప్రమాదం తదనంతర పరిణామాలు మరింత విషాదకరంగా ఉన్నాయి.సంఘటనా స్థలంలో ఎటు చూసినా మృతదేహాల వద్ద రోదిస్తున్న బాధితులతో హృదయవిదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదాల్లో బాలాసోర్ సంఘటన కూడా ఒకటిగా మిగిలిపోతుంది. మృతుల సంఖ్య ఇప్పటికింకా ఒక కొలిక్కి రాలేదు. గాయపడినవారి సంఖ్య తగ్గుతుంటే.. మృతుల సంఖ్య మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: సహాయక చర్యల్లో అందరూ పాల్గొనండి