మృతుల కుటుంబాలకు చెక్కులు అందిస్తున్న మోపిదేవి, కలెక్టర్ వివేక్‌యాదవ్ తదితరులు
సాక్షి, అమరావతి/రేపల్లి: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ అగ్ని ప్రమాదంలో ఒడిశా వలస కూలీలు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందగా.. ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఆ మొత్తాలను చెక్కుల రూపంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, కలెక్టర్ వివేక్ యాదవ్ మృతుల కుటుంబాలకు అందజేశారు. ఆక్వా చెరువుల యాజమాన్యం తరఫున రూ.5 లక్షల చొప్పున అందించారు. మరోవైపు ఒడిశా ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఒడిశాలోని గోన్పూర్ ఎమ్మెల్యే రఘునా«థ్ గుమెంగో, ఒడిశా విద్యార్థి నాయకుడు బి.విష్ణుప్రసాద్ పండా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment