ఒడిశాలో మరో రైలు సంఘటన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ ప్రెస్ లో ఉన్నట్టుండి ఏసీ నుండి పొగలు వస్తుండటంతో ప్రయాణికులంతా కంగారు పడిపోయారు. పరిస్థితిని గమనించిన రైల్వే సిబ్బంది రైలును ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. తర్వాత కొద్దిసేపటికి పొగ అదుపులోకి వచ్చినప్పటికీ ప్రయాణికులు ఎలక్ట్రిక్ బ్రేక్ డౌన్ అనుకుని ఆ కోచ్ లో ప్రయాణం చేయమంటే చేయమని పట్టుబట్టారు.
ఏం జరిగిందంటే...
ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ... సికింద్రాబాద్ - అగర్తలా ఎక్స్ ప్రెస్ రైలు బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా బి-5 బోగీలో చిన్న ఎలక్ట్రికల్ సమస్య తలెత్తింది. దీంతో పెట్టె నిండా పొగలు వ్యాప్తి చెందాయి. ప్రయాణికులు అలారం సిగ్నల్ ఇవ్వడంతో రైలులో ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యి పొగను నియంత్రించారు.
ఒడిశా రైలు ప్రమాద సంఘటన తర్వాత ప్రయాణికులంతా బిక్కు బిక్కుమంటూనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. రైళ్లు పరిగెత్తడం మాట దేవుడెరుగు. ప్రయాణమంటే చాలు ప్రయాణికులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment