న్యూఢిల్లీ: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గాయపడినవారికి, మృతుల కుటుంబాలకు చేయూతనివ్వడానికి పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.
బాలాసోర్ రైలు ప్రమాద సంఘటన జరిగిన వెంటనే స్పందించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రమాద బాధితులకు అన్నివిధాలా సహాయపడాలని అన్ని పార్టీలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.
ఖర్గే లేఖలో ఏమని రాశారంటే...
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను. మా పార్టీ శ్రేణులు, ఇతర పార్టీల వారు, అందరూ ముందుకు వచ్చి క్షతగాత్రులకు సహాయపడి, మృతుల కుటుంబాలకు అండగా నిలబడే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రిని, కేంద్ర రైల్వే మంత్రిని చాలా ప్రశ్నలు అడగాలి. ఇటువంటి సంఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయో వారు సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ అధినేత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2013-14 వరకు రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మల్లిఖార్జున్ ఖర్గే బాలాసోర్ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
At this moment of grave national tragedy on account of the terrible train disaster in Odisha, I have instructed the entire Congress party organisation to extend all possible and needed help.
— Mallikarjun Kharge (@kharge) June 3, 2023
1/3 pic.twitter.com/TGK8NavywB
Comments
Please login to add a commentAdd a comment