ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 278 మంది పైగా మరణించారు. అయితే రైలు ప్రమాద బాధితులకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రూ.60 కోట్ల సాయం చేస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
అయితే ఇందుకు సంబంధించి ధోని ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అవన్నీ రూమర్స్ అనే ధోని సన్నిహిత వర్గాలు కొట్టిపారేశారు. మరోవైపు విరాట్ కోహ్లి కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు కూడా నిజం కాదని తేలింది.
అయితే మరో టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చహల్ మాత్రం.. బాధిత కుటంబాలకు తన వంతుగా రూ.లక్ష విరాళం అందించాడు. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన "స్కౌట్" గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చహల్ తన సాయాన్ని అందించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉచిత విద్యతో పాటు ఫ్రీ బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తానని ఈ నజఫ్‌ఘడ్ నవాబ్ ప్రకటించాడు.
చదవండి: WTC Final 2023: ప్లీజ్.. ఆస్ట్రేలియాను ఓడించండి! నాకు చూడాలని ఉంది: స్వాన్
Comments
Please login to add a commentAdd a comment