
ఒడిశా: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన మరవకముందే అదే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. జాజ్‌పుర్ కియోంజర్ రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు బోగీల కింద నలిగి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంజన్ లేని గూడ్స్ రైలు పట్టాలపై నిలిపి ఉంది. ఈదురుగాలులతో వర్షం ప్రారంభం కాగానే.. ట్రాక్ పనులకు వచ్చిన కార్మికులు గూడ్స్ రైలు బోగీల కింద తలదాచుకున్నారు. ఈ క్రమంలో భారీగా వీస్తున్న గాలులకు రైలు బోగీలు కదిలాయి. దీంతో బోగీల చక్రాల కింద నలిగి నలుగురు కార్మికులు మృతి చెందారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి
Comments
Please login to add a commentAdd a comment