goods train derailed
-
పెద్దపల్లి గూడ్స్ ప్రమాదం: వందేభారత్ సహా రద్దైన రైళ్ల వివరాలివే..
పెద్దపెల్లి, సాక్షి: గూడ్స్ రైలు ప్రమాదంతో కాజీపేట-బలార్ష రూట్(ఢిల్లీ–చెన్నై) రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. వందేభారత్ సహా పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. పునరుద్ధరణకు ఒక్కరోజు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్లియరెన్స్‌కు మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రాఘవాపూర్ స్టేషన్ వద్దకు ఈ ఉదయం దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేరుకుని పునరుద్ధరణ పనులను ముమ్మరం చేయించారు.ట్రాక్స్ పునరుద్ధరణకు ప్రత్యేక మిషనరీ తెప్పించారు. బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్ నుంచి సుమారు 500 మంది సిబ్బందిని తీసుకొచ్చి రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ పనుల్లో స్పీడ్ పెంచారు. ట్రాక్స్ పై అదుపు తప్పి కిలోమీటర్ మేర చెల్లాచెదురుగా పడిన బోగీలను భారీ క్రేన్స్ సాయంతో తొలగిస్తున్నారు.రద్దు.. డైవర్షన్.. రీషెడ్యూల్ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. ప్రయాణికులంతా ఇది గమనించాలని.. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్ రైళ్లను రద్దు చేశారు.అలాగే.. రామగిరి ఎక్స్ ప్రెస్, సింగరేణి ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్ ప్రెస్, బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌లను రద్దు చేశారు.దారి మళ్లించిన రైల్వే వివరాలు జీటీ, కేరళ, ఏపీ, గోరఖ్ పూర్, సంఘమిత్ర, దక్షిణ్, పూణే, దర్భంగా ఎక్స్ ప్రెస్ SCR PR No.610 dt.13.11.2024 on "Railway Helpline Numbers provided in View of Accident Of Goods Train" @drmsecunderabad pic.twitter.com/M7pjbq4GXP— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 Bulletin No.2 SCR PR No.611 dt.13.11.2024 on "Cancellation/Diversion of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/cMrk7XTS9d— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 "Cancellation/PartialCancellation/Diversion/Reschedule of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/vfOqjCyLvR— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024ఏం జరిగిందంటే..మంగళవారం నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్–కన్నాల గేట్ మధ్యలో 282/35 పోల్ వద్ద పట్టాలు తప్పాయి. రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. దీంతో.. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. దీంతో మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటికప్పుడు.. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
విజయవాడ మార్గంలో నిలిచిన రైళ్లు
సాక్షి, ఖమ్మం: వరంగల్-విజయవాడ రైలు మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద శనివారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో లోకోపైలట్ రైలును నిలిపివేశారు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగినట్లు గుర్తించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారాయన. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ముంబయి: మహారాష్ట్రలోని కసర రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని సెంట్రల్ రైల్వే తెలిపింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. మరో నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. Two coaches of a goods train derailed near Kasara. Kalyan Station Road ART and Igatpuri Station Rail ART were ordered and moved to the accident site: Central Railway CPRO pic.twitter.com/WxUWH2HvFF — ANI (@ANI) December 10, 2023 రైలు పట్టాలు తప్పినప్పటికీ ముంబయి సబర్బన్ రైలు సేవలు ప్రభావితం కాలేదని సెంట్రల్ రైల్వే తెలిపింది. కళ్యాణ్- ఇగత్పురి నుండి అధికారులు రెండు సహాయ రైళ్లను సంఘటనా స్థలానికి పంపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కూతుర్ని చంపి రీసార్ట్‌లో దంపతులు ఆత్మహత్య -
పట్టాలు తప్పిన రైలు.. 3 గంటలు ఆలస్యంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి-తాడి మార్గంలో బుధవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన అయిదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో విశాఖ- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దు కాగా.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుంది. రద్దైన రైళ్ల వివరాలు ►నేడు ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ►విశాఖ- లింగంపల్లి జన్మభూమి, విశాఖ-గుంటూరు ప్యాసింజర్ రైళ్లు రద్దు. ►రేపు లింగంపల్లి-విశాఖ జన్మభూమి, గుంటూరు-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు. ►నేడు విశాఖ- విజయవాడ, విజయవాడ-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు. చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ సోదాలు -
మరో రైలు ప్రమాదం.. గూడ్స్ రైలు పట్టాలు తప్పి..
మహారాష్ట్ర: దేశంలో ఈ మధ్య వరుస రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా బాలాసోర్ ప్రమాద ఘంటికలు ఇంకా మనల్ని వీడకముందే.. పూరీ ఎక్స్‌ప్రెస్‌కు నిన్న రాత్రి మంటలు వచ్చాయి. అయితే.. తాజాగా బిలాస్పూర్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. కానీ హౌరా- ముంబయి మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు ప్రమాద ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. హౌరా-ముంబయి మార్గంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలో రాకపోకలను కూడా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. పలు రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఏ రైళ్లను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: జార్ఖండ్ ధన్బాద్లో ఘోరం.. అక్రమ బొగ్గు గని కూలి.. -
ఈదురుగాలులకు కదిలిన బోగీలు.. నలుగురు కార్మికులు మృతి
ఒడిశా: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన మరవకముందే అదే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. జాజ్‌పుర్ కియోంజర్ రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు బోగీల కింద నలిగి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంజన్ లేని గూడ్స్ రైలు పట్టాలపై నిలిపి ఉంది. ఈదురుగాలులతో వర్షం ప్రారంభం కాగానే.. ట్రాక్ పనులకు వచ్చిన కార్మికులు గూడ్స్ రైలు బోగీల కింద తలదాచుకున్నారు. ఈ క్రమంలో భారీగా వీస్తున్న గాలులకు రైలు బోగీలు కదిలాయి. దీంతో బోగీల చక్రాల కింద నలిగి నలుగురు కార్మికులు మృతి చెందారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి -
పట్టాలు తప్పిన ట్రైన్.. వికారాబాద్ స్టేషన్లో నిలిచిపోయిన రైళ్లు
బెంగళూరు: కర్ణాటకలోని చిత్తాపూర్ సులేహళ్లిలో గుడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వికారాబాద్ మీదుగా వెళ్లే రైళ్లను రాయచూర్ వైపు దారి మళ్లిస్తున్నారు. కేఎస్ఆర్ బెంగళూరు, యశ్వంత్‌పూర్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను తాండూరు మీదుగా నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పండగ సమయం కావడం, గంటలపాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను అధికారులు తాండూర్ తరలిస్తున్నారు. చదవండి: శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణానికి ముందస్తు పనులు: ఎన్వీఎస్ రెడ్డి -
పట్టాలు తప్పిన రైలు.. విశాఖ వైపు వెళ్లే పలు ట్రైన్స్ ఆలస్యం!
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భోగిని పట్టలాపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా విశాఖ వైపునకు వెళ్లు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. -
పట్టాలు తప్పినా వేగంగా దూసుకొచ్చిన రైలు.. జనం పరుగులు!
పాట్నా: బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ రైలు బిహార్‌లో పట్టాలు తప్పింది. గుర్పా రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు 53 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ధన్‌బాద్ డివిజన్ పరిధిలోని కొడెర్మా-మన్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున 6.24 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ‘బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు బోగీలు పట్టాలు తప్పేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు రైల్వే బృందాలు కృషి చేస్తున్నాయి.’ అని ఈసీఆర్ జోన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో అధికారులు అప్రమత్తమవటంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదన్నారు. 10 రైళ్లను దారి మళ్లించామని, నాలుగు రైళ్లు రద్దు చేశామని చెప్పారు. A goods train derails between Koderma and Manpur railway stations under #Dhanbad railway division. pic.twitter.com/Age2J3wcRa — TOI Patna (@TOIPatna) October 26, 2022 ఇదీ చదవండి: హనీట్రాప్: ఆమె ఎవరో తెలియదు.. కానీ, అంతా ఆమె వల్లే జరిగింది! -
పట్టాలు తప్పిన గూడ్స్
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు సమీపంలోని పడమటి గుంతకల్లు సేష్టన్ యార్డులో మంగళవారం గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వేకు సూమారు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండవచ్చని రైల్వే వర్గాలు తెలిపాయి. ఘటనకు వివరాల్లోకెళితే... నార్త్ సెంట్రల్ రైల్వేలోని బేలాయ్ ఉక్కు కర్మాగారం నుండి హుబ్లీ జోనల్ కేంద్రమైన హుబ్లీకి ఇనుప కంబీలు (రైల్స్)ను రైల్వే డిపార్టుమెంట్‌కు చెందిన ప్రత్యేక గూడ్స్‌రైలు (20 ఆర్పీ బీటీ) ద్వారా తరలిస్తున్నారు. ఈ రైలు మార్గ మధ్యలో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెస్ట్ గుంతకల్లు రైల్వేసేష్టన్ యార్డులో 254/2–3 కి.మీ వద్ద మెయిన్‌లైన్ నుంచి లూప్‌లైన్ లోకి ప్రవేశిస్తుండగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 5 వ్యాగిన్లు పట్టాలు తప్పాయి. 24 వ్యాగిన్లతో వెళ్తున్న ఈ రైలు ఇంజన్ 7వ వ్యాగిన్ నుంచి వరుసగా 12వ వ్యాగిన్ వరకు పట్టాల నుంచి పక్కకు ఒరిగాయి. ఇందులో ఎన్సీఆర్ 135601, 35162 వ్యాగిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంతకల్లు–బళ్లారి రైలు మార్గం డబుల్‌లైన్ కావడంతో మరో లైన్లో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ ఘటనతో దాదాపు 300 మీటర్ల మేర రైలు మార్గం ధ్వంసం కావడంతో పాటు సమాచార వ్యవస్థ దెబ్బతినింది. వ్యాగిన్లు, రైలు మార్గం, స్లీపర్లు, రోలింగ్ స్టాక్, సమాచార వ్యవస్థ ధ్వంసం కావడంతో సుమారు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. డీఆర్ఎం విజయ్ప్రతాప్సింగ్తో పాటు సీనియర్ డీఎంఈ (సీఅండ్‌డబ్ల్యూ) వెంకటరావు, సీనియర్ డీఈఎన్ (కోఆర్డినేషన్) సిద్ధేశ్వరరావు, సీనియర్ డీసీఎం రాకేష్, సీనియర్ డీఈఈలు రాజేంద్రకుమార్, అంజయ్య, డీసీఎం నాగేంద్రప్రసాద్, డీఈఎన్ (వర్క్) నవ్యశ్రీతో పాటు ఆయా విభాగాల అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 500 మందికి పైగా రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న సమాచార వ్యవస్థను పునరుద్ధరించారు. ప్రమాద కారణంగా హుబ్లీ–విజయవాడ, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్లు, హైదరాబాద్–కోల్హాపూర్, విశాఖపట్నం–హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు డౌన్‌లైన్ రైలు మార్గం గుండా అలస్యంగా నడిచాయి. నిర్లక్షమే కారణమా? పడమటి గుంతకల్లు రైల్వే సేష్టన్ యార్డులో గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం రైలు మార్గ నిర్వహణ లోపమే అయి ఉండొచ్చని రైల్వే వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలు ప్రకారం అధిక టన్ను బరువుతో (రైల్స్) ప్రయాణిస్తున్న ఈ గూడ్స్ రైలు ప్రధాన మార్గం గుండా వెళ్లాలి. సిబ్బంది అజాగ్రత్త కారణంగా మొయిన్ లైన్ నుంచి లూప్‌లైన్ మళ్లించడంతో ప్రమాదనికి గురై ఉండొచ్చునని త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విచారణ చేస్తున్నాం ప్రమాద సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాం. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. బాధ్యులెవరైనా సరే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – విజయ్‌ప్రతాప్ సింగ్, డీఆర్ఎం -
పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. 8 రైళ్ళు రద్దు..
కాన్పూర్‌ః గూడ్స్ రైల్లోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణించే అనేక రైళ్ళకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘజియాబాద్-తుండ్లా విభాగానికి చెందిన బర్హాన్-మిత్వాలి స్టేషన్ల మధ్య నడిచే 8 రైళ్ళు రద్దవ్వడంతోపాటు, రాజధాని సహా 14 రైళ్ళను దారి మళ్ళించాల్సి వచ్చినట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వారు పేర్కొన్నారు. ఉదయం ఆరున్నర ప్రాంతంలో గూడ్స్ ట్రైన్ లోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ సమయంలో ఆ మార్గంగుండా వచ్చే సీతాపూర్ సిటీ-కాన్పూర్ పాసింజర్ రైలు హార్డియో జిల్లాలోని బలామావ్ వద్ద నిలిపివేయగా... మరో ఎనిమిది పాసింజర్ రైళ్ళను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారి అమిత్ మాల్వియా తెలిపారు. ఈ మార్గంలోని అప్ లైన్ లో వెళ్ళే గౌహతి-ఢిల్లీ రాజధాని, హౌరా-ఢిల్లీ రాజధాని, భువనేశ్వర్-ఢిల్లీ రాజధాని, సీల్దా-ఢిల్లీ రాజధాని, కాన్పూర్-ఢిల్లీ శతాబ్ది రైళ్ళను తుండ్లా-ఆగ్రా-పాల్వాల్ జంక్షన్ల మీదుగా మళ్ళించినట్లు మాల్వియా వెల్లడించారు. అలాగే డౌన్ లైన్‌లోని మరో ఏడు రైళ్ళను కూడా మార్గం మళ్ళించినట్లు తెలిపిన ఆయన.. ట్రాక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
కొల్లమ్ః ఫెట్రిలైజర్స్ తో వెడుతున్న గూడ్స్ రైలు కొల్లం ప్రాంతంలో పట్టాలు తప్పడంతో ఆ దారిలో ప్రయాణించే రైళ్ళకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడ్స్ ప్రమాదంతో తిరువనంతపురం, ఎర్నాకుళం మధ్య భారీగా రైల్వే ట్రాఫిక్ నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. సస్థంకొట్టా దగ్గరలోని కరునగపల్లి ప్రాంతంలో పట్టాలు విరిగి, ఎలక్ట్రిక్ లైన్స్ దెబ్బతినడంతో సోమవారం అర్థరాత్రి గూడ్స్ ట్రైన్ లోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. మధురై నుంచి కొట్టాయం వెడుతున్న గూడ్స్ రైలు ప్రమాదంతో.. కొల్లం, కయాంకులమ్ స్టేషన్ల మధ్య తొమ్మిది పాసింజర్ రైళ్ళతోపాటు నాలుగు ఇతర రైళ్ళను రద్దు చేసి, సింగిల్ లైన్ లో ట్రాఫిక్ ను మళ్ళించినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాక్ లను పునరుద్ధరించి, ట్రాఫిక్ సమస్యను సాయంత్రానికి పరిష్కరించడంతోపాటు రద్దు చేసిన రైళ్ళను యధాతథంగా నడుపుతామని తెలిపారు. ఆగస్టు 28 న కొచ్చికి దగ్గరలోని కారుకుట్టి సమీపంలో మంగుళూరు ఎక్స్ ప్రెస్ రైలు 12 బోగీలు పట్టాలు తప్పిన విషయం విదితమే.