Goods Train Derails In Bilaspur Howrah Mumbai Rail Route - Sakshi
Sakshi News home page

మరో రైలు ప్రమాదం.. గూడ్స్ రైలు పట్టాలు తప్పి..

Published Fri, Jun 9 2023 8:14 PM | Last Updated on Fri, Jun 9 2023 8:55 PM

Goods Train Derails In Bilaspur Howrah Mumbai Rail Route  - Sakshi

మహారాష్ట్ర: దేశంలో ఈ మధ్య వరుస రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా బాలాసోర్ ప్రమాద ఘంటికలు ఇంకా మనల్ని వీడకముందే.. పూరీ ఎక్స్‌ప్రెస్‌కు నిన్న రాత్రి మంటలు వచ్చాయి. అయితే.. తాజాగా బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. కానీ హౌరా- ముంబయి మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు.

ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు ప్రమాద ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. హౌరా-ముంబయి మార్గంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలో రాకపోకలను కూడా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. పలు రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఏ రైళ్లను రద్దు చేయలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: జార్ఖండ్‌ ధన్‌బాద్‌లో ఘోరం.. అక్రమ బొగ్గు గని కూలి..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement