Howrah railway station
-
మరో రైలు ప్రమాదం.. గూడ్స్ రైలు పట్టాలు తప్పి..
మహారాష్ట్ర: దేశంలో ఈ మధ్య వరుస రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా బాలాసోర్ ప్రమాద ఘంటికలు ఇంకా మనల్ని వీడకముందే.. పూరీ ఎక్స్‌ప్రెస్‌కు నిన్న రాత్రి మంటలు వచ్చాయి. అయితే.. తాజాగా బిలాస్పూర్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. కానీ హౌరా- ముంబయి మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు ప్రమాద ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. హౌరా-ముంబయి మార్గంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలో రాకపోకలను కూడా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. పలు రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఏ రైళ్లను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: జార్ఖండ్ ధన్బాద్లో ఘోరం.. అక్రమ బొగ్గు గని కూలి.. -
‘చెప్పు’కోలేని చోట పెట్టినా పట్టేశారు!!
హౌరా: బంగారం అక్రమ రవాణాలో స్మగ్లర్లు వినూత్న పోకడలు పోతున్నారు. పుత్తడిని అక్రమంగా తరలించేందుకు కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ లో భారీగా బంగారం పట్టుబడింది. చెప్పుల్లో(పాదరక్షలు) దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 28 కిలోల బంగారంను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 8.3 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంలో 8 మంది నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ బంగారం ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, బుధవారం ఇదే విధంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితులు స్లిప్పర్స్ అడుగు భాగంలో పుత్తడి కడ్డీలు అతికించుకుని తరలించేందుకు ప్రయత్నించి అధికారులకు దొరికిపోయారు. స్వాధీనం చేసుకున్న 938 గ్రాముల బంగారం మార్కెట్ ధర ప్రకారం 26.96 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. -
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు!
-
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు!
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌరా రైల్వేస్టేషన్లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు. రైల్లో ఓ సిలిండర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్లు దాన్ని తనిఖీ చేశారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి, ఆ సిలిండర్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ దాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. స్టేషన్లో ఉన్న సమయంలో రైల్లో పేలుడు సంభవించి ఉంటే, నష్టం తీవ్రత ఎక్కువగానే ఉండేదని నిపుణులు అంటున్నారు. -
రైల్వే స్టేషన్లో మహిళపై గ్యాంగ్‌రేప్
హౌరా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. భర్త ఎదురుగానే ఓ మహిళపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతి పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హౌరా జిల్లా మోరిగాం రైల్వే స్టేషన్లో భర్తతో కలిసి రైలు దిగిన అనంతరం నలుగురు వ్యక్తులు వారిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. గత రాత్రి వెస్ట్ మిడ్నాపూర్‌లో దిగాల్సిన దంపతులు నిద్ర మత్తులో ఉన్న కారణంగా మోరిగాం చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వికలాంగులపై రెచ్చిపోయిన పోలీసులు
-
వికలాంగులపై రెచ్చిపోయిన పోలీసులు
హౌరా రైల్వేస్టేషన్లో పోలీసులు తమ ప్రతాపాన్ని వికలాంగులు, భిక్షగాళ్ల మీద చూపించారు. భిక్షమెత్తుకుంటూ పొట్టపోసుకునే వికలాంగుడిపై కన్నెర్ర జేశారు. పిచ్చికుక్కను ఈడ్చినట్లు ఈడ్చేశారు. కాళ్లు లేని వాడిని కనికరించండి....అని కాళ్లా వేళ్లా పడి బతిమాలుకున్నా కనికరించలేదు. మేమింతే...మా తీరింతే అన్నట్లు రెచ్చిపోయారు. జనం కూడా ఇదేమీ తమకు పట్టదన్నట్లు రొటీన్‌గా సినిమా చూసినట్లు చూశారు. ఇంతకీ ఈ వికలాంగులు, భిక్షగాళ్లు చేసిన నేరమేంటంటే హౌరా రైల్వేస్టేషన్లో ఉండటమే. కోల్‌కతాలో రైల్వేస్టేషన్‌ను ఖాళీ చేయాలంటూ రైల్వే పోలీసులు హుకుం జారీ చేశారు. భిక్షగాళ్లను ఖాళీ చేయమంటే వాళ్లు కాస్త టైం అడిగారు.. కాళ్లుపట్టుకుని కనికరించమన్నారు. అయినా రైల్వే పోలీసులు ఏమాత్రం కనికరించలేదు. దీదీ ఇలాకాలో రెచ్చిపోయిన రైల్వే పోలీసులు ఓ అభాగ్యుడిపై తమ ప్రతాపం చూపారు. వికలాంగుడిని జట్టుపట్టుకుని తీవ్రంగా హింసించారు. ఈ విజువల్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. వికలాంగుడిపై పోలీసుల ప్రతాపానికి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.