పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. 8 రైళ్ళు రద్దు.. | 4 Coaches Of Goods Train Derail, 8 Trains Cancelled | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. 8 రైళ్ళు రద్దు..

Published Tue, Sep 27 2016 6:39 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

4 Coaches Of Goods Train Derail, 8 Trains Cancelled

కాన్పూర్ః గూడ్స్ రైల్లోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణించే అనేక రైళ్ళకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘజియాబాద్-తుండ్లా విభాగానికి చెందిన బర్హాన్-మిత్వాలి స్టేషన్ల మధ్య నడిచే  8 రైళ్ళు రద్దవ్వడంతోపాటు, రాజధాని సహా 14  రైళ్ళను దారి మళ్ళించాల్సి వచ్చినట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వారు పేర్కొన్నారు.  

ఉదయం ఆరున్నర ప్రాంతంలో గూడ్స్ ట్రైన్ లోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ సమయంలో ఆ మార్గంగుండా వచ్చే సీతాపూర్ సిటీ-కాన్పూర్ పాసింజర్ రైలు హార్డియో జిల్లాలోని బలామావ్ వద్ద నిలిపివేయగా... మరో ఎనిమిది పాసింజర్ రైళ్ళను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారి అమిత్ మాల్వియా తెలిపారు. ఈ మార్గంలోని అప్ లైన్ లో వెళ్ళే గౌహతి-ఢిల్లీ రాజధాని, హౌరా-ఢిల్లీ రాజధాని, భువనేశ్వర్-ఢిల్లీ రాజధాని, సీల్దా-ఢిల్లీ రాజధాని, కాన్పూర్-ఢిల్లీ శతాబ్ది రైళ్ళను తుండ్లా-ఆగ్రా-పాల్వాల్ జంక్షన్ల  మీదుగా మళ్ళించినట్లు మాల్వియా వెల్లడించారు. అలాగే డౌన్ లైన్లోని మరో ఏడు రైళ్ళను కూడా మార్గం మళ్ళించినట్లు తెలిపిన ఆయన.. ట్రాక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement