పట్టాలు తప్పిన ట్రైన్‌.. వికారాబాద్‌ స్టేషన్‌లో నిలిచిపోయిన రైళ్లు | Goods Train Derailed At Chittapur Trains Stopped At Vikarabad Station | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్‌.. వికారాబాద్‌ స్టేషన్‌లో నిలిచిపోయిన రైళ్లు

Jan 14 2023 9:19 PM | Updated on Jan 14 2023 9:31 PM

Goods Train Derailed At Chittapur Trains Stopped At Vikarabad Station - Sakshi

బెంగళూరు: కర్ణాటకలోని చిత్తాపూర్‌ సులేహళ్లిలో గుడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వికారాబాద్‌ మీదుగా వెళ్లే రైళ్లను రాయచూర్‌ వైపు దారి మళ్లిస్తున్నారు. కేఎస్‌ఆర్‌ బెంగళూరు, యశ్వంత్‌పూర్‌, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లిస్తున్నారు.

అలాగే ఆర్టీసీ బస్సులను తాండూరు మీదుగా నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పండగ సమయం కావడం, గంటలపాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను అధికారులు తాండూర్‌ తరలిస్తున్నారు.
చదవండి: శరవేగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి ముందస్తు పనులు: ఎన్‌వీఎస్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement