సాక్షి, హైదరాబాద్: నాలుగో రైల్వే టెర్మినల్‌గా చర్లపల్లి స్టేషన్ సేవలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లపై పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే రూ.221 కోట్లతో చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్‌ను విస్తరించారు. సరుకు రవాణాకు పార్శిల్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను నియంత్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే చర్లపల్లి స్టేషన్ విస్తరణ పూర్తి కావడంతో మార్చి నుంచి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
ప్రధాని మోదీతో ప్రారంభం!
ప్రధాని మోదీతోనే త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. అదే రోజు రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే...
► షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045/18046) త్వరలో సికింద్రాబాద్‌కు బదులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది.
► చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడిచే చార్మి నార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604)
చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది.
► గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి నడుపనున్నారు.
మరో 6 రైళ్లకు హాల్టింగ్...
► హైదరాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (12757/12758), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్‌ప్రెస్ రైళ్లను మార్చి నుంచి చర్లపల్లి స్టేషన్‌లో నిలుపనున్నారు.ఈ మేరకు రైల్వేబోర్డు అనుమతులను ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment