Charlapally
-
అధిక ప్లాట్పారంలున్న రైల్వే స్టేషన్లివే.. చర్లపల్లి స్థానం ఎక్కడ?
తెలంగాణలోని హైదరాబాద్‌కు చర్లపల్లి రైల్వేస్టేషన్ మరో మణిహారంగా మారింది. అత్యాధునిక సదుపాయాలతో మొత్తం తొమ్మది ప్లాట్ఫారంలతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో దేశంలో అత్యధిక ప్లాట్‌ఫారంలు కలిగిన రైల్వే స్టేషన్ల గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్లాట్ఫారంల సంఖ్య, విస్తీర్ణం పరంగా దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కోల్‌కతాలోని హౌరా జంక్షన్. రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం దేశంలోని రైల్వే లైన్ల మొత్తం పొడవు 1,50,368 కిలోమీటర్లు. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్లు, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.టాప్-6 రైల్వేస్టేషన్లుహౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ప్రారంభమైన సంవత్సరం: 1854స్టేషన్ కోడ్: హెచ్డబ్ల్యుహెచ్స్థానం: హౌరా, పశ్చిమ బెంగాల్ప్లాట్ఫారమ్ల సంఖ్య: 23రోజువారీ ప్రయాణికులు: 10 లక్షలకు పైగా..కనెక్టివిటీ: ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంది.ఆకర్షణలు: హౌరా వంతెన, ప్రిన్సెప్ ఘాట్, బేలూర్ మఠంపశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న హౌరా రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. దేశం మొత్తాన్ని రైలు మార్గం ద్వారా ఈ స్టేషన్ అనుసంధానిస్తుంది. ఈ స్టేషన్ తూర్పు భారతదేశాన్ని మిగిలిన రైల్వే వ్యవస్థతో అనుసంధానించడంలో ప్రధాన భూమిక వహిస్తోంది.సీల్దా రైల్వే స్టేషన్చిరునామా: కోల్‌కతా, పశ్చిమ బెంగాల్స్టేషన్ కోడ్: ఎస్డీఏహెచ్ప్లాట్ఫారంల సంఖ్య: 21రోజువారీ ప్రయాణికులు: 12 లక్షలకు పైగాకనెక్టివిటీ: ఇది కోల్‌కతాలోని ప్రధాన రైల్వే టెర్మినల్. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి అనుసంధానం ఉంది. కోల్‌కతా మెట్రోకు కూడా ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది.ఆకర్షణలు: హౌరా వంతెన, విక్టోరియా మెమోరియల్, ఇండియన్ మ్యూజియం.సీల్దా స్టేషన్.. కోల్‌కతా నగరంలోని మరొక ప్రసిద్ధ రైల్వే స్టేషన్. దీనికి చరిత్రలో ఘనమైన స్థానం ఉంది. ఇక్కడి నుండి నగరాన్ని చుట్టుముట్టి రావడం చాలా సులభం. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మెట్రో లైన్ 2లో ఒక స్టాప్.ఛత్రపతి శివాజీ స్టేషన్ప్రారంభమైన సంవత్సరం: 1887స్టేషన్ కోడ్: సీఎస్ఎంటీఎక్కడుంది: ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఏరియా, ఫోర్ట్, ముంబై, మహారాష్ట్రప్లాట్ఫారంల సంఖ్య: 18రోజువారీ ప్రయాణికులు: ఏడు లక్షలుకనెక్టివిటీ: ఛత్రపతి శివాజీ టెర్మినస్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంది. ముంబై మెట్రోకు కనెక్టివిటీ ఉంది.ఆకర్షణలు: గేట్‌వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, కోలాబా కాజ్వే, ఎలిఫెంటా గుహలుమహారాష్ట్రలోని ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఒక చారిత్రక రైల్వే స్టేషన్. పూర్వం దీనిని విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు. 2004లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ప్రారంభమైన సంవత్సరం: 1873స్టేషన్ కోడ్: ఎంఏఎస్చిరునామా: కన్నప్పర్ తిడల్, పెరియమెట్, చెన్నై, తమిళనాడుప్లాట్ఫారమ్ల సంఖ్య: 22 (మెయిన్ లైన్ రైళ్లకు 17, సబర్బన్ రైళ్లకు 5)రోజువారీ ప్రయాణికులు: 3,50,000కనెక్టివిటీ: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు ద్వారా అనుసంధానమై ఉంది. ఆకర్షణలు: మెరీనా బీచ్, కపాలీశ్వర్ ఆలయం, ప్రభుత్వ మ్యూజియంచెన్నైలోని ఈ స్టేషన్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఈ స్టేషన్ నుంచి దేశమంతటీకీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కోల్‌కతా, ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో నేరుగా కనెక్టివిటీ ఉన్నందున, ఈ స్టేషన్ దక్షిణ భారతదేశానికి ప్రధాన ద్వారంగా నిలిచింది.న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ప్రారంభమైన సంవత్సరం: 1956స్టేషన్ కోడ్: ఎన్డీఎల్ఎస్చిరునామా: అజ్మేరి గేట్, పహడ్గంజ్, న్యూఢిల్లీప్లాట్ఫారంల సంఖ్య: 16రోజువారీ ప్రయాణికులు: ఐదు లక్షలుకనెక్టివిటీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమైవుంది. ఇది ఢిల్లీ మెట్రోకు కనెక్ట్ అయివుంది.ఆకర్షణలు: ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, హుమాయున్ సమాధి, కుతుబ్ మినార్, జామా మసీదు.న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనేది రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు నిలయం. ఈ స్టేషన్‌కు ప్రపంచంలోని అతిపెద్ద రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ ఉంది. సౌకర్యాల పరంగా కూడా ఈ స్టేషన్ ముందుంది. ఈ స్టేషన్ కూడా ఢిల్లీ మెట్రోకు అనుసంధానమైవుంది.ఇది కూడా చదవండి: Business Idea: చలికాలంలో అల్లం వ్యాపారం.. జేబుకు ‘వెచ్చదనం’.. లక్షల్లో ఆదాయం -
చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం నేడే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: భాగ్యనగరం సిగలో ముస్తాబైన మరో మణిహారం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు రూ. 413 కోట్ల వ్యయంతో, పర్యావరణ అనుకూలంగా నిర్మించిన చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారని ప్రధాని కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి సంజయ్, మంత్రి శ్రీధర్‌బాబు, దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తదితరులు పాల్గొననున్నారు.వాస్తవానికి గతేడాది డిసెంబర్ 28నే టెర్మినల్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణంతో వారం రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రారంపొత్సవం వాయిదా పడింది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక సికింద్రాబా ద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచైనా సులువుగా ఈ స్టేషన్‌కు చేరుకొనే వీలుంది. ఆధునిక హంగులు.. సదుపాయాలు.. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చర్లపల్లి రెండవ ప్రవేశద్వారం, నూతన రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. స్టేషన్లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్త్రీ, పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జితోపాటు 6 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మొత్తం 9 ప్లాట్‌ఫాంలలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఉన్నాయి. రైళ్ల నిర్వహణ కోసం ఆధునిక కోచ్ డిపోను కూడా నిర్మించారు. బస్బే తోపాటు కార్లు, బైక్‌లను నిలిపేందుకు విశాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. మూడు రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ⇒ చర్లపల్లి టెర్మినల్‌లో మంగళవారం నుంచి మూడు రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించనున్నారు. ⇒ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు వెళ్లే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (12757/12758) మంగళవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 8:32 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. నిమిషంపాటు ఆగాక సికింద్రాబాద్ బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 7:02 గంటలకు చర్లపల్లికి చేరుకొని నిమిషం హాల్టింగ్ తరువాత సిర్పూర్ కాగజ్‌నగర్ బయలుదేరుతుంది. ⇒ గుంటూరు–సికింద్రాబాద్ (17201/1702) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు మధ్యాహ్నం 12:41కు.. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12:50 గంటలకు నిమిషంపాటు చర్లపల్లిలో ఆగనుంది. ⇒ సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233/17234) మధ్యాహ్నం 3:47 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఉదయం 9:20 గంటలకు నిమిషంపాటు ఆగుతుంది. త్వరలో ఎంఎంటీఎస్ సర్విసులు... సికింద్రాబాద్–చర్లపల్లి, బొల్లారం–చర్లపల్లి, ఫలక్‌నుమా–చర్లపల్లి, లింగంపల్లి–చర్లపల్లి, మేడ్చల్–చర్లపల్లి స్టేషన్ల మధ్య త్వరలో ఎంఎంటీఎస్ సర్విసులు ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్ల రాకపోకలు, సమయపాలనపై కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాయగడ డివిజన్‌కు శంకుస్థాపన కూడా.. ఈస్ట్ కోస్ట్ రైల్వే రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ప్రధాని మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పరిసర ప్రాంతాల్లో రైల్వే అనుసంధానం మెరుగుపడటంతోపాటు సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. మరోవైపు 742.1 కి.మీ. మేర కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ రైల్వే డివిజన్‌ను మోదీ ప్రారంభించనున్నట్లు తెలిపింది.సంక్రాంతి ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచే.. సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి ఈ నెల 17 వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 9 నుంచి 13 మధ్య ఎక్కువ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్లలో సుమారు 30 రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి–తిరుపతి (07077/ 07078), చర్లపల్లి–తిరుపతి (02764/02763), చర్లపల్లి–నర్సాపూర్ (07035/ 07036), చర్లపల్లి–నర్సాపూర్ (07033/07034), చర్లపల్లి–కాకినాడ (07031/ 07032), చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు (07041/07042) తదితర రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. అలాగే కాచిగూడ–తిరుపతి, సికింద్రాబాద్–కాకినాడ, కాచిగూడ–శ్రీకాకుళం రోడ్డు, నాందేడ్–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.మార్చి నుంచి రెగ్యులర్ రైళ్లు ⇒మార్చి నుంచి రెగ్యులర్ రైళ్ల సేవలు ప్రారంభమవుతాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాంపల్లి నుంచి చెన్నైకి రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మార్చి 7 నుంచి చెన్నై సెంట్రల్–చర్లపల్లి (12603/12604)గా సేవలు అందించనుంది. తిరుగు ప్రయాణంలో 8వ తేదీ నుంచి సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరి మర్నాటి ఉదయం 5:40 గంటలకు చెన్నైకి చేరుకుంటుంది. ⇒ ప్రస్తుతం గోరఖ్‌పూర్–సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ మార్చి 12 నుంచి గోరఖ్‌పూర్–చర్లపల్లి మధ్య రాకపోకలు సాగించనుంది. ఈమేరకు గోరఖ్‌పూర్–చర్లపల్లి (12589/12590) 12న ఉదయం 6:35 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 13న రాత్రి 9:45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మర్నాటి ఉదయం 6:40 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకోనుంది.సిటీ బస్సులు ఇలా..⇒ ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి (250సీ) బస్సు ప్రతి 10 నిమిషాలకు ఒకటి అందుబాటులో ఉంది.⇒ బోరబండ నుంచి చర్లపల్లికి (113 రూట్) సిటీ బస్సు సదుపాయం ఉంది. ⇒ ఉప్పల్ నుంచి చెంగిచెర్ల మీదుగా చర్లపల్లికి రెండు రోజుల్లో సర్విసులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ⇒ రైళ్ల రాకపోకలకు అనుగుణమైన వేళల్లో మరిన్ని బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. -
చర్లపల్లి టెర్మినల్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రయాణికులకు సకల సదుపాయాలతో ఎయిర్‌పోర్టు తరహాలో చర్లపల్లి టెర్మినల్‌ను తీర్చిదిద్దారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైన ఒత్తిడిని తగ్గించేందుకు నాలుగో టెర్మినల్‌గా దక్షిణమధ్య రైల్వే చర్లపల్లి పునరి్నర్మాణం చేపట్టింది. సుమారు రూ.434 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 98 శాతం పూర్తయినట్లు స్వయంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే దీన్ని వినియోగంలోకి తేవాలని భావించినప్పటికీ అప్పట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడం వల్ల సాధ్యం కాలేదు. ఆ తరువాత ఎన్నికల కోడ్ వచ్చేసింది. ప్రస్తుతం దాదాపుగా పనులన్నీ పూర్తి కావడంతోనే త్వరలోనే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు.రోజుకి 50 రైళ్ల రాకపోకలకు అవకాశంసికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న దృష్ట్యా ప్రస్తుతం సికింద్రాబాద్ వరకు రాకపోకలు సాగిస్తున్న కొన్ని రైళ్లను త్వరలో చర్లపల్లి నుంచి నడుపనున్నారు. 9 ప్లాట్‌ఫామ్‌లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి నుంచి రోజుకు 50 రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 30 రైళ్లతో (15 జతలు) చర్లపల్లి స్టేషన్‌ను వినియోగంలోకి తేనున్నారు. మొదట 25 వేల మందికి పైగా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నారు. రైళ్లు పెరిగే కొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరగనుంది.ఔటర్‌కు చేరువలో...⇒ ఔటర్‌రింగ్ రోడ్డుకు చేరువలో ఉన్న చర్లపల్లి స్టేషన్‌కు నగరవాసులు వివిధ ప్రాంతాల నుంచి ఔటర్ మీదుగా చేరుకొనేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఎంఎంటీఎస్ రెండో దశలో విస్తరించిన సికింద్రాబాద్–ఘట్కేసర్ రూట్లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభం కానున్నాయి.⇒ దీంతో ప్రయాణికులు నగరానికి పడమటి నుంచి తూర్పు వైపు తేలిగ్గా రాకపోకలు సాగించవచ్చు. ⇒ ప్రయాణికుల సదుపాయాల్లో భాగంగా 5 లిఫ్టులు, 9 ఎస్కలేటర్లు ఉన్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సోలార్ పవర్ ప్రాజెక్టును చేపట్టారు. ⇒ ప్రయాణికుల రాకపోకల కోసం రెండు సబ్‌వేలను నిర్మించారు. అలాగే రహదారులను విస్తరించారు. సుమారు 4 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకర్లను సిద్ధం చేశారు.చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ⇒ షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045/18046),. ⇒ చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604) ⇒ గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. ⇒ హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), ⇒ గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్.. ⇒ విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్‌ప్రెస్, తదితర రైళ్లను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. ⇒ మొత్తంగా మొదట 15 జతల రైళ్లు చర్లపల్లి నుంచి ప్రారంభం కానున్నాయి. -
చర్లపల్లి టెర్మినల్ నుంచి త్వరలో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నాలుగో రైల్వే టెర్మినల్‌గా చర్లపల్లి స్టేషన్ సేవలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే రూ.221 కోట్లతో చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్‌ను విస్తరించారు. సరుకు రవాణాకు పార్శిల్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను నియంత్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే చర్లపల్లి స్టేషన్ విస్తరణ పూర్తి కావడంతో మార్చి నుంచి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని మోదీతో ప్రారంభం! ప్రధాని మోదీతోనే త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. అదే రోజు రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ► షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045/18046) త్వరలో సికింద్రాబాద్‌కు బదులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడిచే చార్మి నార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604) చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. మరో 6 రైళ్లకు హాల్టింగ్... ► హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్‌ప్రెస్ రైళ్లను మార్చి నుంచి చర్లపల్లి స్టేషన్లో నిలుపనున్నారు.ఈ మేరకు రైల్వేబోర్డు అనుమతులను ఇచ్చింది. -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. బొంతు శ్రీదేవి కంటతడి
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్లో మరో వర్గపోరు బయటపడింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ నడుమ వివాదం చోటు చేసుకుంది. చర్లపల్లిలో సోమవారం ఓ ప్రారంభోత్సవం సందర్భంగా వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ఎదుట.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. తన డివిజనల్లో తనకు తెలియకుండానే.. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆమె ఆరోపిస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ‘‘నేను మాత్రం ఊరుకునేది లేదు. మూడేళ్లు ఊరుకున్నా. ఇక ఊరుకోను. ఈసారి సాక్ష్యాలు ఉన్నాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పదివేలు పడేస్తే.. చంపేస్తారంటూ బెదిరిస్తున్నారు. నా సత్తా ఏంటో కూడా చూపిస్తా’’ అంటూ ఆమె సవాల్ విసిరారు. కులం పేరుతో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై ఆరోపిస్తూనే.. బీసీ సంఘాలు ఈ వ్యవహారంపై స్పందించాలని ఆమె కోరారు. ఈ వ్యవహారంపై అధిష్టానానికి కలిసి ఫిర్యాదు చేస్తానని బొంతు శ్రీదేవి చెప్పారు. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి సీరియస్ ఇదిలా ఉంటే.. నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి. ఉప్పల్‌లో గత కొంతకాలంగా బొంతు, బేతి వర్గాల నడుమ విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా.. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చేసిన ఆరోపణలపై ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి స్పందించారు. ఆమె వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. శ్రీదేవి చేసిన అసత్య ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని సుభాష్‌రెడ్డి ప్రకటించారు. ఇదీ చదవండి: ‘దొంగ–పోలీసు–దోస్తీ’ వ్యవహారాలు -
చర్లపల్లిలో... చుక్ చుక్..
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణ ప్రాజెక్టుకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను రిమోట్ కంట్రోల్ లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఎర్రగుంట్ల–నంద్యాల సెక్షన్లో విద్యుదీకరణకు శంకుస్థాపన చేశారు. గుంతకల్లు–కల్లూరు మధ్య పూర్తయిన రెండవ లైన్ మార్గం, విద్యుద్దీకరణను జాతికి అంకితం చేశారు. రూ.221 కోట్ల అంచనాలతో చేపట్టిన చర్లపల్లి టెర్మినల్ విస్తరణ వల్ల నిత్యం లక్ష మందికి రవాణా సదుపాయం లభించనుంది. రోజుకు 50 నుంచి 60 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్న ప్రైవేట్ రైళ్ల రాకపోకలకు చర్లపల్లి కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న 3 ప్లాట్‌ఫామ్‌లను 6 ప్లాట్‌ఫామ్‌ల వరకు విస్తరించనున్నారు. హైలెవల్ ఐలాండ్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేస్తారు. రైల్వేస్టేషన్ కొత్త భవనాన్ని నిర్మిస్తారు. స్టేషన్‌కు అప్రోచ్ రోడ్డు ఏర్పాటుతో పాటు స్టేషన్‌లోపల 9 లిఫ్టులను, 6 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడి, రద్దీని దృష్టిలో ఉంచుకొని 4వ టెర్మినల్‌గా చర్లపల్లి విస్తరణ చేపట్టారు. వచ్చే రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెర్మినల్‌తో పాటు మరో 4 ఫిట్లైన్లను ఏర్పాటు చేయనున్నారు. చర్లపల్లి టెర్మినల్ వల్ల శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు నగరంలోకి ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఔటర్ మీదుగా రాకపోకలు సాగించవచ్చు. ఘట్కేసర్ నుంచి యాదాద్రికి వెళ్లేందుకు నిర్మించనున్న ఎంఎంటీఎస్ కూడా చర్లపల్లి మీదుగానే వెళ్తుంది. సబర్బన్ రైల్ నెట్ వర్క్‌కు ఇది కేంద్రం కానుంది. పెరగనున్న వేగం గుంతకల్లు–కల్లూరు సెక్షన్లో రూ.322 కోట్ల అంచనాలతో చేపట్టిన 41 కిలోమీటర్ల రెండవ లైన్ మార్గం నిర్మాణం పూర్తయింది. విద్యుదీకరణ పనులను పూర్తి చేశారు. ఈ మార్గాన్ని మంత్రి జాతికి అంకితం చేశారు. దీనివల్ల ఢిల్లీ, ముంబై, సికింద్రాబాద్‌ల నుంచి బెంగళూర్ వైపు వెళ్లే మార్గానికి ఇది అనుసంధానమవుతుంది. ఈ మార్గంలో రైళ్ల వేగం గంటకు 100 కి.మీ. వరకు పెరగనుంది. ఎర్రగుంట్ల–నంద్యాల విద్యుదీకరణ ఎర్రగుంట్ల–నంద్యాల సెక్షన్లో రూ.112 కోట్ల అంచనాలతో చేపట్టనున్న 123 కి.మీ. మేర విద్యుదీకరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. సరుకు రవాణాకు, ప్రయాణికుల రవాణా సదుపాయానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీలోని కర్నూలు, కడప జిల్లాలకు రైల్వేసదుపాయం విస్తరించనుంది. మద్దూరు, బనగానపల్లె, కోయిలకుంట్ల, సంజమల, నొస్సం, ఎస్.ఉప్పలపాడు, జమ్మలమడుగు, పొద్దుటూరు రైల్వేస్టేషన్ల నుంచి రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ సెక్షన్‌ను దక్షిణమధ్య రైల్వే మొట్టమొదటి సౌరశక్తి వినియోగ సెక్షన్‌గా ప్రకటించింది. 427 స్టేషన్లలో ఉచిత హై స్పీడ్ వైఫై దక్షిణమధ్య రైల్వేలో ఉచిత హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని మొట్టమొదట 2016లో సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టేషన్ వైఫై వినియోగంలో దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రూ.65 కోట్లతో 427 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కొత్తగా ప్రారంభించారు. దీన్ని మంత్రి మంగళవారం సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. ఆ రైళ్లు కేటాయించండి: లక్ష్మణ్ తెలంగాణకు తేజస్, హమ్‌సఫర్, అంత్యోదయ రైళ్లను కేటాయించాలని కోరుతూ పీయూష్ గోయల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వినతిపత్రం అందజేశారు. కాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన పీయూష్ గోయల్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రం x రాష్ట్రం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, పీయూష్ గోయల్‌ల పరస్పర విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల కేటాయింపుల్లో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా విస్మరించిం దని తలసాని ఆరోపించారు. బడ్జెట్లో దక్షిణ భారతదేశానికి అతి తక్కువ నిధులను కేటాయించిందన్నారు. అనంతరం పీయూష్ మాట్లాడుతూ.. కేంద్రానికి ఏ ఒక్క రాష్ట్రం పట్ల ప్రత్యేక అభిమానం ఉండబోదని.. అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.450 కోట్లు ఇవ్వకపోవడం వల్లనే పనులు నిలిచిపోయినట్లు పీయూష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, సీఎం రమేష్, రఘురామ కృష్ణంరాజు, పి.రంగయ్య, ధర్మపురి అరవింద్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, ఎన్వీఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చర్లపల్లి గ్యాస్ గోడౌన్లో అగ్నిప్రమాదం
♦ సిలిండర్లలో గ్యాస్ నింపుతుండగా ఎగసిపడిన మంటలు ♦ భారీ శబ్దాలతో పేలిపోయిన సిలిండర్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామికవాడలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్లాంటులో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్లలో ఎల్పీజీ గ్యాస్ నింపుతున్న సమయంలో చిన్న నిప్పురవ్వతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేలాయి. అయితే వెంటనే అందులో పనిచేసే కార్మికులు, కంపెనీ చుట్టుపక్కల నివసించే ప్రజలు దూరంగా పరుగులు తీశారు. దీంతో ప్రాణనష్టం ఏమీ జరగలేదని రాచకొండ పోలీసులు వెల్లడించారు. నీటిని వదిలేయడంతో తప్పిన ముప్పు హెచ్‌పీసీఎల్ ప్లాంటులో షిఫ్టు పద్ధతిలో 24 గంటల పాటు సిలిండర్లలో గ్యాస్ ఫిల్లింగ్ పని నడుస్తుంటుంది. అయితే వారం రోజుల నుంచి సిలిండర్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో పైపులు పగిలి నిప్పురవ్వలు వస్తున్నట్లు కార్మికులు గుర్తించారు. అలా పగిలిన పైపులైన్ల మరమ్మతు పని కొనసాగిస్తున్నారు. అయితే గురువారం రాత్రి యథావిధిగా సిలిండర్లు నింపుతున్న సమయంలో నిప్పురవ్వలు వచ్చి, మంటలు చెలరేగాయి. చిన్న మంటగా ఉన్నప్పుడే కార్మికులు గుర్తించి బయటికి పరుగులు పెట్టారు. ఈ సమయంలోనే వరుసగా సిలిండర్లు పేలడం మొదలైంది. కొందరు కార్మికులు అగ్ని ప్రమాద హెచ్చరిక (ఫైర్ అలారం)ను మోగించారు. దీంతో ప్లాంటులో ఉన్న ఇతర సిబ్బంది.. 45 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన రెండు వాటర్ ట్యాంకుల్లోని నీటిని ప్లాంటులోకి వదిలారు. దాంతో ప్లాంట్‌లో మొత్తం నీరు వ్యాపించి మంటలు తగ్గాయి. ప్రమాద సమయంలో ప్లాంటులో 200 మందికిపైగా ఉన్నట్టు తెలిసింది. వారిలో గ్యాస్ నింపే కార్మికులతో పాటు సిలిండర్ల లోడ్లు తీసుకెళ్లే లారీ డ్రైవర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం విషయం తెలిసిన రాచకొండ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. ప్లాంటు గేట్లు మూసివేశారు. రెండు అంబులెన్సులను మాత్రమే లోపలికి అనుమతించారు. ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదని పోలీసులు చెప్పారు. పరుగులు పెట్టిన ప్రజలు హెచ్‌పీసీఎల్ ప్లాంటులో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో సమీపంలోని జనం భయకంపితులయ్యారు. సమీపంలోని ఇళ్లలోని వారు తమ సామగ్రి తీసుకుని ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టారు. చర్లపల్లి, భరత్‌నగర్, బీఎన్ రెడ్డి నగర్, పెద్ద చర్లపల్లి సమీపంలోని ప్రజలు కుషాయిగూడ, నాగారం వైపు వెళ్లారు. ఇక ప్లాంటులో పనిచేసే కొందరు కార్మికుల కుటుంబ సభ్యులు, మహిళలు ప్లాంటు గేటు వద్దకు వచ్చి తమవారికి ఏమైందోనన్న ఆందోళనతో ఏడవడం కనిపించింది. -
చర్లపల్లి గ్యాస్ గోడౌన్లో అగ్నిప్రమాదం..
-
చర్లపల్లి గ్యాస్ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
అద్భుతంగా చర్లపల్లి రైల్వే టర్మినల్
సాక్షి, సిటీబ్యూరో: చర్లపల్లిలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రైల్వే టర్మినల్ ప్రత్యేకతలివి. ఈ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల నగరంలో పర్యటించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు గ్రీన్‌ఫీల్డ్ రైల్వే టర్మినళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి.. చర్లపల్లి, వట్టినాగులపల్లిలో ఈ తరహా టర్మినళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిలో నాలుగో టర్మినల్ నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రూ.360 కోట్ల అంచనా వ్యయంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్న ఈ టర్మినల్ కోసం రైల్వే శాఖ ఇప్పటికే రూ.30 కోట్లు కేటాయించింది. తాజాగా రైల్వే మంత్రి ప్రకటన నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ పర్యావరణహిత టర్మినల్‌ను అంతర్జాతీయ హంగులతో నిర్మించేం దుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ► స్టేషన్ చుట్టూ గ్రీన్‌ఫీల్డ్ (పచ్చని పరిసరాలు) అభివృద్ధి చేస్తారు. కాలుష్యానికి తావులేకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తారు. బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. ► స్టేషన్ అంతటా సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తారు. సోలార్ విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం. ► భూగర్భ జలాల పెంపు, వాననీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. వాటర్ రీసైక్లింగ్ యూనిట్లూ ఏర్పాటు చేస్తారు. ► కాగిత రహిత స్టేషన్‌గా అభివృద్ధి చేస్తారు. టికెట్ వివరాలు ప్రయాణికులకు ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తారు. ► రైళ్ల రాకపోకల వివరాలు, ఇతర ప్రకటనలు ప్రయాణికులు తెలుసుకునేందుకు ప్రతీ ప్లాట్ఫామ్లో డిస్ప్లే బోర్డులు ఉంటాయి. ► ఎంటర్టైన్మెంట్, షాపింగ్, విశ్రాంతి గదులు తదితర సదుపాయాలు ఉంటాయి. -
లాభాల బాటలో చర్లపల్లి ఓపెన్ జైలు
కుషాయిగూడ: ఆరు నెలల క్రితం అప్పుల్లో ఉన్న చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం (ఓపెన్ ఎయిర్‌జైలు) ప్రస్తుతం మిగులుతో నడుస్తోంది. ఈ జైలులో ఖైదీలు కూరగాయల సాగు, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం చేపడుతూ ఆదాయం చూపుతున్నారు. కూరగాయలు, పాలు, చికెన్ వంటి ఉత్పత్తులను చర్లపల్లి కేంద్ర కారాగార ఖైదీలకు సరఫరా చేయడంతో పాటుగా మిగిలిన ఉత్పత్తులను సాధారణ ప్రజానీకానికి విక్రయిస్తున్నారు. దీంతో పాటు చర్లపల్లి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్ ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. ఆరు నెలల క్రితం ఇదే జైలు సుమారు రూ.12 లక్షల లోటుతో ఉంది. ఈ జైలు పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజేష్‌కుమార్ ఆదాయ పెంపుపై దృష్టి సారించి ఆమేరకు ఫలితాలు రాబట్టారు. పెట్రోలు బంక్ ద్వారా ఐదు లక్షలు, కూరగాయల ద్వారా రూ.1.5 లక్షలు, పాడి, పౌల్ట్రీ ఇతర రంగాల ద్వారా మరో రూ. 2.5 లక్షల ఆదాయం సమకూరుతోందని రాజేష్‌కుమార్ వెల్లడించారు. దీంతో ఆరు నెలల క్రితం 12 లక్షల అప్పుల్లో ఉన్న చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు ప్రస్తుతం రూ.30 లక్షల మిగులులో ఉందన్నారు. ఇది ఖైదీల సమిష్టి కృషితోనే సాధ్యమయిందని తెలిపారు. -
చర్లపల్లి, చంచల్ గూడలో జామర్లు: వీకే సింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. కరప్షన్ ప్రీ అడ్మిస్ట్రేటివ్ అడ్మిషన్లకు కృషి చేస్తున్నామని వీకే సింగ్ మీడియాకు తెలిపారు. అవినీతిక అడ్డుకట్ట వేయలేకపోతే పూర్తి బాధ్యత నాదేనని ఆయన అన్నారు. 3 నెలల కాలంలో జైళ్లలో అవినీతిని నిర్మూలిస్తామన్నారు. చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలో జామర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని జైళ్ల శాఖలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యదానం కార్యక్రమం ఖైదీలలో మంచి సత్పలితాలను ఇస్తోందని వీకేసింగ్ చెప్పారు.