తెలంగాణలోని హైదరాబాద్‌కు చర్లపల్లి రైల్వేస్టేషన్ మరో మణిహారంగా మారింది. అత్యాధునిక సదుపాయాలతో మొత్తం తొమ్మది ప్లాట్‌ఫారంలతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో దేశంలో అత్యధిక ప్లాట్‌ఫారంలు కలిగిన రైల్వే స్టేషన్ల గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లాట్‌ఫారంల సంఖ్య, విస్తీర్ణం పరంగా దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కోల్‌కతాలోని హౌరా జంక్షన్. రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం దేశంలోని రైల్వే లైన్ల మొత్తం పొడవు 1,50,368 కిలోమీటర్లు. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్లు, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాప్-6 రైల్వేస్టేషన్లు
హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్
ప్రారంభమైన సంవత్సరం: 1854
స్టేషన్ కోడ్: హెచ్‌డబ్ల్యుహెచ్
స్థానం: హౌరా, పశ్చిమ బెంగాల్
ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్య: 23
రోజువారీ ప్రయాణికులు: 10 లక్షలకు పైగా..
కనెక్టివిటీ: ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంది.
ఆకర్షణలు: హౌరా వంతెన, ప్రిన్సెప్ ఘాట్, బేలూర్ మఠం
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న హౌరా రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత పురాతన రైల్వే స్టేషన్‌లలో ఒకటి. దేశం మొత్తాన్ని రైలు మార్గం ద్వారా ఈ స్టేషన్ అనుసంధానిస్తుంది. ఈ స్టేషన్ తూర్పు భారతదేశాన్ని మిగిలిన రైల్వే వ్యవస్థతో అనుసంధానించడంలో ప్రధాన భూమిక వహిస్తోంది.
సీల్దా రైల్వే స్టేషన్
చిరునామా: కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
స్టేషన్ కోడ్: ఎస్‌డీఏహెచ్
ప్లాట్‌ఫారంల సంఖ్య: 21
రోజువారీ ప్రయాణికులు: 12 లక్షలకు పైగా
కనెక్టివిటీ: ఇది కోల్‌కతాలోని ప్రధాన రైల్వే టెర్మినల్. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి అనుసంధానం ఉంది. కోల్‌కతా మెట్రోకు కూడా ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది.
ఆకర్షణలు: హౌరా వంతెన, విక్టోరియా మెమోరియల్, ఇండియన్ మ్యూజియం.
సీల్దా స్టేషన్.. కోల్‌కతా నగరంలోని మరొక ప్రసిద్ధ రైల్వే స్టేషన్. దీనికి చరిత్రలో ఘనమైన స్థానం ఉంది. ఇక్కడి నుండి నగరాన్ని చుట్టుముట్టి రావడం చాలా సులభం. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మెట్రో లైన్ 2లో ఒక స్టాప్.
ఛత్రపతి శివాజీ స్టేషన్
ప్రారంభమైన సంవత్సరం: 1887
స్టేషన్ కోడ్: సీఎస్‌ఎంటీ
ఎక్కడుంది: ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఏరియా, ఫోర్ట్, ముంబై, మహారాష్ట్ర
ప్లాట్‌ఫారంల సంఖ్య: 18
రోజువారీ ప్రయాణికులు: ఏడు లక్షలు
కనెక్టివిటీ: ఛత్రపతి శివాజీ టెర్మినస్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంది. ముంబై మెట్రోకు కనెక్టివిటీ ఉంది.
ఆకర్షణలు: గేట్‌వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, కోలాబా కాజ్‌వే, ఎలిఫెంటా గుహలు
మహారాష్ట్రలోని ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఒక చారిత్రక రైల్వే స్టేషన్. పూర్వం దీనిని విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు. 2004లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్
ప్రారంభమైన సంవత్సరం: 1873
స్టేషన్ కోడ్: ఎంఏఎస్
చిరునామా: కన్నప్పర్ తిడల్, పెరియమెట్, చెన్నై, తమిళనాడు
ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్య: 22 (మెయిన్ లైన్ రైళ్లకు 17, సబర్బన్ రైళ్లకు 5)
రోజువారీ ప్రయాణికులు: 3,50,000
కనెక్టివిటీ: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు ద్వారా అనుసంధానమై ఉంది.
ఆకర్షణలు: మెరీనా బీచ్, కపాలీశ్వర్ ఆలయం, ప్రభుత్వ మ్యూజియం
చెన్నైలోని ఈ స్టేషన్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఈ స్టేషన్ నుంచి దేశమంతటీకీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కోల్‌కతా, ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో నేరుగా కనెక్టివిటీ ఉన్నందున, ఈ స్టేషన్ దక్షిణ భారతదేశానికి ప్రధాన ద్వారంగా నిలిచింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ప్రారంభమైన సంవత్సరం: 1956
స్టేషన్ కోడ్: ఎన్‌డీఎల్‌ఎస్
చిరునామా: అజ్మేరి గేట్, పహడ్‌గంజ్, న్యూఢిల్లీ
ప్లాట్‌ఫారంల సంఖ్య: 16
రోజువారీ ప్రయాణికులు: ఐదు లక్షలు
కనెక్టివిటీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమైవుంది. ఇది ఢిల్లీ మెట్రోకు కనెక్ట్ అయివుంది.
ఆకర్షణలు: ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, హుమాయున్ సమాధి, కుతుబ్ మినార్, జామా మసీదు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనేది రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు నిలయం. ఈ స్టేషన్‌కు ప్రపంచంలోని అతిపెద్ద రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ ఉంది. సౌకర్యాల పరంగా కూడా ఈ స్టేషన్ ముందుంది. ఈ స్టేషన్ కూడా ఢిల్లీ మెట్రోకు అనుసంధానమైవుంది.
ఇది కూడా చదవండి: Business Idea: చలికాలంలో అల్లం వ్యాపారం.. జేబుకు ‘వెచ్చదనం’.. లక్షల్లో ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment