సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శుక‍్రవారం ఉదయం.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, దాడిలో తీవ్ర నష్టం జరిగింది. ఆర్మీ అభ్యర్థులు సైతం పోలీసుల దాడిలో గాయపడ్డారు.
కాగా, దాడి ఇలా జరిగింది..
ప్లాట్‌ఫామ్ నెం.1: సికింద్రాబాద్–దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ చివరలో నిలిపి ఉండటంతో దీనిపై దాడి జరగలేదు.
ప్లాట్‌ఫామ్ 2: హైదరాబాద్–హౌరా. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, లగేజీ వ్యాన్ పోర్షన్ పూర్తిగా, ఒక సీట్ కార్‌లోని సీట్లన్నీ దహనం.
ఏసీ కోచ్‌ల కిటీకీల అద్దాలన్నీ ధ్వంసం.
ప్లాట్‌ఫామ్ 3: ఖాళీగా ఉంది
ప్లాట్‌ఫామ్ 4: విశాఖపట్నం–సికింద్రాబాద్
గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్. 8 కోచ్‌ల కిటికీ అద్దాలన్నీ ధ్వంసం
ప్లాట్‌ఫామ్ 5: సికింద్రాబాద్–త్రివేండ్రం
సెంట్రల్ శబరి ఎక్స్‌ప్రెస్ ఎసీ కోచ్‌ల కిటికీల అద్దాలన్నీ ధ్వంసం
ప్లాట్‌ఫామ్ 6: రాజ్‌కోట్–సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: ఏసీ కోచ్‌ల కిటికీల అద్దాలన్నీ ధ్వంసం
ప్లాట్‌ఫామ్ 7: ఖాళీగా ఉంది
ప్లాట్‌ఫామ్ 8: రాయ్‌పూర్–సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: నాలుగు ఏసీ కోచ్‌లు, ఒక నాన్ ఏసీ కోచ్ కిటికీల అద్దాలన్నీ ధ్వంసం.
ఎస్2 కోచ్‌లో రెండు బెర్తులు దహనం.
ప్లాట్‌ఫామ్ 9: మన్మాడ్ జంక్షన్–సికింద్రాబాద్ జంక్షన్, అజంతాఎక్స్‌ప్రెస్:
ఒక జనరల్ సీటింగ్ కోచ్ పూర్తిగా దహనం
స్లీపర్ కమ్ లగేజీ కోచ్ పూర్తిగా దహనం, అన్ని కోచ్‌ల కిటికీల అద్దాలు పూర్తిగా ధ్వంసం
ప్లాట్‌ఫామ్ 10: లింగంపల్లి–ఫలక్‌నుమా ఎంఎంటీఎస్: అన్ని కిటీకీల అద్దాలు పూర్తిగా ధ్వంసం
పార్కింగ్ లైన్స్ 1:
విశాఖపట్నం–సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్: 4500 బెడ్‌రోల్స్ బుగ్గి
2: మెడికల్ రిలీఫ్ వ్యాన్:
అన్ని కిటికీల అద్దాలు ధ్వంసం
3: సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రెయిన్:
కోచ్‌ల బయటి భాగం ఆహుతి
4: సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇన్‌స్పెక్షన్ కార్:
అన్ని కిటికీల అద్దాలు ధ్వంసం
అగ్నికి ఆహుతి: ఐదు కోచ్‌లు
ధ్వంసమైన ఏసీ కోచ్‌లు: 30
ధ్వంసమైన నాన్ ఏసీ కోచ్‌లు: 47
ఎంఎంటీఎస్: పూర్తి రేక్ అద్దాలు ధ్వంసం
దహనమైన బెర్తులు: 150
అద్దాలు ద్వంసమైన కిటికీలు: 400
దహనమైన బెడ్ రోల్స్: 4500
Comments
Please login to add a commentAdd a comment