platforms
-
వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోలు వీరే!
సినిమా అంటే కొన్ని పరిమితులుంటాయి. వెబ్ సిరీస్‌లకు హద్దులు లేవు. రొమాన్స్, వయొలెన్స్, సెంటిమెంట్.. ఏదైనా కొంచెం ఓవర్‌గా చూపించొచ్చు. ఈ నేపథ్యంలో సినిమా స్టార్స్ తమ ఇమేజ్‌కి భిన్నమైన క్యారెక్టర్లు, కథలు ఒప్పుకుని వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది వెబ్ వరల్డ్‌లోకి వేంచేసిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ హీరోలలో ఒకరైన వెంకటేశ్ ఓటీటీ వరల్డ్ కోసం కొత్త ట్రాక్‌లోకి వచ్చారు. కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేశారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్ ’ ఆధారంగా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తీశారు దర్శక ద్వయం సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ . వెంకటేశ్‌తో పాటు రానా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సుచిత్రా పిళ్లై కీలక పాత్రలు చేశారు. కథ విషయానికొస్తే.. సెలబ్రిటీల సమస్యలను పరిష్కరించే రానా నాయుడు (రానా)కు అతని తండ్రి నాగ నాయుడు (వెంకటేశ్) అంటే ద్వేషం. పదిహేనేళ్ల జైలు జీవితం తర్వాత తిరిగొచ్చిన నాగ నాయుడుతో రానా నాయుడు తిరిగి కలుస్తాడా? నాగ నాయుడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అనే అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది. పది ఎపిసోడ్ల ఈ సిరీస్‌కి డైలాగ్స్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ఈ ఏడాది మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ‘రానా నాయుడు’ సెకండ్ సీజన్ కూడా ఉంటుంది. ► ‘దూత’గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. ఆయన హీరోగా ‘మనం’, ‘థ్యాంక్యూ’ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ‘దూత’కు దర్శకుడు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా సాగే ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియాభవానీ శంకర్, పశుపతి కీలక పాత్రలు పోషించారు. పాత్రికేయ విలువల కన్నా ధనమే ముఖ్యమని భావించే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ వర్మ (నాగచైతన్య పాత్ర) ‘సమాచార పత్రిక’కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. సాగర్‌కు దొరికే పేపర్ క్లిప్పింగ్‌లో ఉన్నవారు చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాగర్ ఏం చేశాడు? అన్నది ‘దూత’ సిరీస్‌లో చూడొచ్చు. డిసెంబరు 1 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ► ‘హనుమాన్ జంక్షన్ ’, ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో..’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపీ గోపికా గోదావరి’ వంటి సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వెండితెరపై కాస్త స్లో అయిన వేణు డిజిటల్ తెరపై సత్తా చాటాలని హారర్ థ్రిల్లర్ జానర్లో సాగే ‘అతిథి’ వెబ్ సిరీస్‌లో నటించారు. అవంతికా మిశ్రా, అదితీ గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. వైజీ భరత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్స్‌గా సాగుతోంది. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం సాగే దెయ్యాల మిట్ట అనే ప్రాంతానికి సమీపాన సంధ్య నిలయం అనే పెద్ద భవంతిలో రచయిత రవివర్మ (వేణు తొట్టెంపూడి), అతని భార్య సంధ్య (అదితీ గౌతమ్) నివసిస్తుంటారు. అయితే దెయ్యాలు లేవని నమ్మే యూట్యూబర్ సవారి (వెంకటేశ్ కాకుమాను) అక్కడికి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని ఘటనలకు భయపడి సంధ్య నిలయంకు వెళ్తాడు. తన కంటే ముందే సంధ్య నిలయంకు వచ్చిన మాయ (అవంతిక మిశ్రా) చనిపోతుందని తెలుసుకుంటాడు సవారి. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా దెయ్యాల మిట్టలో దెయ్యాల సంచారం ఉందా? మాయ చావుకు కారణం ఎవరు? ఫైనల్‌గా సవారి ఏం తెలుసుకుంటాడు? అన్నది క్లుప్తంగా ‘అతిథి’ సిరీస్ కథ. ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ► నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది వెబ్ వరల్డ్‌లో డబుల్ ధమాకా ఇచ్చారు జేడీ. ఆయన టైటిల్ రోల్ చేసిన వెబ్ సిరీస్ ‘దయా’. ఈ సిరీస్‌కు పవన్ సాధినేని దర్శకుడు. ఈషా రెబ్బా, పృథ్వీరాజ్, రమ్యా నంబీసన్ , కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించారు. చేపలు ట్రాన్స్పోర్ట్ చేసే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ దయా (జేడీ చక్రవర్తి). అతని భార్య అలివేలు (ఈషా రెబ్బా) నిండు గర్భిణి. ఓ రోజు దయా పని మీద కాకినాడకు బయలుదేరతాడు. అయితే తన వ్యాన్ లో శవం ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. ఆ శవం దయా బండిలోకి ఎందుకు వచ్చింది. ఈ ఘటనకు, జర్నలిస్ట్ కవిత (రమ్యా నంబీసన్)కు సంబంధం ఏంటి? అనేది సిరీస్‌లో చూడాలి. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జేడీ చక్రవర్తి ఓ ముఖ్య పాత్రలో నటించిన మరో వెబ్ సిరీస్ ‘తాజా ఖబర్’ జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆది సాయికుమార్ నటించిన వెబ్ సిరీస్ ‘పులిమేక’. ఈ సిరీస్‌కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకుడు. లావణ్యా త్రిపాఠి ఓ లీడ్ రోల్ చేశారు. కథ విషయానికొస్తే...హైదరాబాద్‌లో జరుగుతున్న పోలీసుల వరుస హత్యల మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగుతారు కిరణ్ ప్రభ (లావణ్యా త్రిపాఠి). ఫోరెన్సిక్ హెడ్ ప్రభాకర్ శర్మగా పోలీ సులకు హెల్ప్ చేస్తుంటాడు ఆది సాయికుమార్. మరి.. కిల్లర్‌ను కిరణ్ ప్రభ పట్టుకున్నారా? అతను పోలీసులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అనేది ‘పులి మేక’ సిరీస్ కథాంశం. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. -
క్రెడిట్ కార్డ్‌లు వినియోగిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది. సోషల్ మీడియా, ఈ–కామర్స్, ఎంటర్ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం.. గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. ఇందులోని మరిన్ని అంశాలు.. ► ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి. ► లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది. ► కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. -
మితిమీరితే ఒప్పుకోం.. ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం సీరియస్!
ఇటీవల ఓటీటీలో అశ్లీలత, అసభ్య పదజాలంతో కూడిన కంటెంట్ పెరుగుతోందన్న సంగతి తెలిసిందే. సినిమాలకు ఉన్నట్లుగా సెన్సార్ కత్తెర ఓటీటీ కంటెంట్లకు లేకపోవడంతో వీళ్లు హద్దలు దాటి ప్రవర్తిస్తున్నారని కొందరి వాదన. అయితే తాజాగా దీనిపై కేంద్రం స్పందించింది. ఓటీటీకి ఇచ్చిన స్వేచ్ఛ క్రియేటివిటీ కోసమని.. అశ్లీలత, అసభ్య పదజాలం వాడేందుకు కాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరైనా పరిమితి దాటితే జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని ఆయన ఘటుగా స్పందించారు. నాగ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకునేందుకు వెనకాడబోం ఓటీటీ ప్లాట్‌ఫారంలు చేస్తున్న దుర్వినియోగం, అశ్లీల కంటెంట్‌పై ఇటీవల ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన.. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఈ ప్లాట్‌ఫారంకు ఇచ్చిన స్వేచ్ఛ సృజనాత్మకత కోసం తప్ప అశ్లీలత లేదా దుర్వినియోగం కోసం కాదని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో మార్పులు తీసుకురావడానికి నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తుందని తెలిపారు. వీటిపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, నిర్మాతలు ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఇటీవల వెబ్ సిరీస్ "కాలేజ్ రొమాన్స్" గురించి ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఠాకూర్ వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. వెబ్ సీరిస్ కంటెంట్‌లో అసభ్యకర పదజాలం వంటి భాష విస్తృతంగా ఉన్నందున అవి ప్రజలను ప్రభావితం చేయగలదని కోర్టు పేర్కొంది. क्रिएटिविटी के नाम पर गाली गलौज, असभ्यता बर्दाश्त नहीं की जा सकती। ओटीटी पर बढ़ते अश्लील कंटेंट की शिकायत पर सरकार गंभीर है।अगर इसको लेकर नियमों में कोई बदलाव करने की ज़रूरत पड़ी तो @MIB_India उस दिशा में भी पीछे नहीं हटेगा। अश्लीलता, गाली गलौज रोकने के लिए कड़ी कार्यवाई करेगा। pic.twitter.com/6pOL66s88L — Anurag Thakur (@ianuragthakur) March 19, 2023 -
ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టుబడులు
ముంబై: ఐటీ సర్వీసుల దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ విభాగంపై రూ. 700 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. రానున్న రెండేళ్లలో ఈ పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. టెలికం రంగానికి సేవలందిస్తున్న కామ్వివా కొనుగోలు ద్వారా కంపెనీ ఇప్పటికే ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ బిజినెస్‌లో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటితోపాటు ఇతర సర్వీసులు సైతం అందిస్తున్న కామ్వివా వార్షికంగా 45 కోట్ల డాలర్ల ఆదాయ రన్‌రేట్‌ను సాధించినట్లు గుర్నానీ వెల్లడించారు. కాగా.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ బిజినెస్ ద్వారా రెండేళ్లలో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఇన్వెస్టర్ డే సందర్భంగా పుణే నుంచి వర్చువల్‌గా గుర్నానీ ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగంపై పెట్టుబడులను కామ్వివా బృందం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న కామ్వివా భువనేవ్వర్, బెంగళూరులలోనూ కార్యకలాపాలు విస్తరించినట్లు తెలియజేశారు. టెలికంతోపాటు తాజా విభాగం బీఎఫ్ఎస్ఐ తదితర రంగాలకూ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా మరో 20 కోట్ల డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ వార్తల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 1,085 దిగువన ముగిసింది. -
అగ్నిపథ్: సికింద్రాబాద్‌లో దాడులు ఇలా జరిగాయి
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, దాడిలో తీవ్ర నష్టం జరిగింది. ఆర్మీ అభ్యర్థులు సైతం పోలీసుల దాడిలో గాయపడ్డారు. కాగా, దాడి ఇలా జరిగింది.. ప్లాట్‌ఫామ్ నెం.1: సికింద్రాబాద్–దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ చివరలో నిలిపి ఉండటంతో దీనిపై దాడి జరగలేదు. ప్లాట్‌ఫామ్ 2: హైదరాబాద్–హౌరా. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, లగేజీ వ్యాన్ పోర్షన్ పూర్తిగా, ఒక సీట్ కార్లోని సీట్లన్నీ దహనం. ఏసీ కోచ్‌ల కిటీకీల అద్దాలన్నీ ధ్వంసం. ప్లాట్‌ఫామ్ 3: ఖాళీగా ఉంది ప్లాట్‌ఫామ్ 4: విశాఖపట్నం–సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్. 8 కోచ్‌ల కిటికీ అద్దాలన్నీ ధ్వంసం ప్లాట్‌ఫామ్ 5: సికింద్రాబాద్–త్రివేండ్రం సెంట్రల్ శబరి ఎక్స్‌ప్రెస్ ఎసీ కోచ్‌ల కిటికీల అద్దాలన్నీ ధ్వంసం ప్లాట్‌ఫామ్ 6: రాజ్‌కోట్–సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: ఏసీ కోచ్‌ల కిటికీల అద్దాలన్నీ ధ్వంసం ప్లాట్‌ఫామ్ 7: ఖాళీగా ఉంది ప్లాట్‌ఫామ్ 8: రాయ్‌పూర్–సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: నాలుగు ఏసీ కోచ్‌లు, ఒక నాన్ ఏసీ కోచ్ కిటికీల అద్దాలన్నీ ధ్వంసం. ఎస్2 కోచ్‌లో రెండు బెర్తులు దహనం. ప్లాట్‌ఫామ్ 9: మన్మాడ్ జంక్షన్–సికింద్రాబాద్ జంక్షన్, అజంతాఎక్స్ప్రెస్: ఒక జనరల్ సీటింగ్ కోచ్ పూర్తిగా దహనం స్లీపర్ కమ్ లగేజీ కోచ్ పూర్తిగా దహనం, అన్ని కోచ్‌ల కిటికీల అద్దాలు పూర్తిగా ధ్వంసం ప్లాట్‌ఫామ్ 10: లింగంపల్లి–ఫలక్‌నుమా ఎంఎంటీఎస్: అన్ని కిటీకీల అద్దాలు పూర్తిగా ధ్వంసం పార్కింగ్ లైన్స్ 1: విశాఖపట్నం–సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్: 4500 బెడ్‌రోల్స్ బుగ్గి 2: మెడికల్ రిలీఫ్ వ్యాన్: అన్ని కిటికీల అద్దాలు ధ్వంసం 3: సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రెయిన్: కోచ్‌ల బయటి భాగం ఆహుతి 4: సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇన్స్పెక్షన్ కార్: అన్ని కిటికీల అద్దాలు ధ్వంసం అగ్నికి ఆహుతి: ఐదు కోచ్‌లు ధ్వంసమైన ఏసీ కోచ్‌లు: 30 ధ్వంసమైన నాన్ ఏసీ కోచ్‌లు: 47 ఎంఎంటీఎస్: పూర్తి రేక్ అద్దాలు ధ్వంసం దహనమైన బెర్తులు: 150 అద్దాలు ద్వంసమైన కిటికీలు: 400 దహనమైన బెడ్ రోల్స్: 4500 -
ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహిస్తాం– రానా
‘మా సౌత్ బే’కు ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా ఉండేందుకు ‘బిలీవ్ ఇండియా’ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం వల్ల సౌత్ బే మరింతగా వ్యూయర్స్‌కు రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. ప్రతిభ గల కొత్త కళాకారులకు అవకాశాలు ఇవ్వడం, కమర్షియల్ కంటెంట్ తయారు చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టనున్నాం’’ అన్నారు రానా. ఇటీవల ‘సౌత్ బే’ పేరుతో రానా ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చానెల్ ద్వారా సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో పాటు వర్తమాన విషయాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తున్నారాయన. తాజాగా ‘సౌత్ బే’ తో వరల్డ్ లీడింగ్ డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘బిలీవ్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘‘ప్రతిభ ఉన్న కొత్త కళాకారులను, మ్యూజిక్ లేబుల్స్‌ను ప్రోత్సహించడం బిలీవ్ ఇండియా కార్యాచరణలో కీలకమైంది. సౌత్ బేతో ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం చేసుకోవడం కూడా ఇందులో భాగమే. ఇలాంటి భాగస్వామ్యాలతో సంగీత ప్రపంచంలో కొత్త దారిని ఏర్పర్చగలమని నమ్ముతున్నాం’’ అన్నారు ‘బిలీవ్ ఇండియా’ డైరెక్టర్ కెజీవీ కిరణ్ కుమార్. -
కష్టాలే ప్లాట్‌ఫాం.. నవ్య సోపానం
బతుకు బండిని లాగేందుకు ప్లాట్‌ఫాంపై టిఫిన్ బండి నడుపుతున్న తల్లిదండ్రుల కష్టాలు ఆమెలో కసిపెంచాయి. వారి ఆశలను, తన ఆశయాలను నెరవేర్చేందుకు చదువొక్కటే మార్గమని భావించింది. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూనే చదువులో సత్తా చూపింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించి, ప్రస్తుతం చెన్నైలోని ఓ సంస్థలో ఆర్టికల్‌షిప్ చేస్తోంది పాకాల మండలానికి చెందిన వి.నవ్య. ఆమె గురించి ఆమె మాటల్లోనే.. – తిరుపతి ఎడ్యుకేషన్ మాది పాకాల మండలం వల్లివేడు గ్రామం. మా తల్లిదండ్రులు వి.శివారెడ్డి, వి.గోమతిలకు మేం ముగ్గురు సంతానం. అక్క వి.నందిప్రియ నీట్‌కు సిద్ధమవుతోంది. నేను రెండో కుమార్తెను. చెల్లెలు వి.దివ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వ్యవసాయం పెద్దగా అచ్చిరాలేదు. మా ఉన్నత చదువుల కోసం అమ్మానాన్న పొట్ట చేత్తో పట్టుకుని మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చేశారు. రుయా ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై టిఫిన్ బండి పెట్టారు. వచ్చే ఆదాయంతో మమ్మల్ని చదివిస్తున్నారు.– సీఏ–ఐపీసీసీ ఆలిండియా 21వ ర్యాంకర్ వి.నవ్య కష్టాలు కసి పెంచాయి.. మా ముగ్గురిని చదివించేందుకు అమ్మాన్నాన్న ఎంతో కష్టపడుతున్నారు. సొంత ఊరిని వదిలిపెట్టి తిరుపతికి వచ్చారు. ఫ్లాట్‌ఫాంపై టిఫిన్ బండి నడుపుతున్నారు. వారు పడుతున్న కష్టం, బాధ చూసి నాలో కసి పెరిగింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించాను. చదువు ప్రస్థానం.. పదో తరగతి వరకు పాకాల మండలం, రమణయ్యగారిపల్లెలోని వశిష్ఠ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నాను. పదిలో 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించాను. మదనపల్లిలోని జవహర్ నవోదయలో ఎంపీసీ చేశాను. 94.4శాతం మార్కులను సాధించాను. సీఏ చేయాలన్న కోరికతో తిరుపతిలోని ఎమరాల్డ్స్ కళాశాలలో 6నెలలు సీఏ–సీపీటీలో శిక్షణ తీసుకున్నా. ఇంటర్ మార్కుల ఆధారంతో సీపీటీలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఈ పరీక్షలో 200కు 177మార్కులు సాధించడంతో సెకెండ్ లెవెల్ అయిన సీఏ–ఐపీసీసీలోనూ ఎమరాల్డ్స్ కళాశాల యాజమాన్యం 9నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించింది. కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 21వ ర్యాంకు సాధించగలిగాను. సీఏ ఫైనల్ చేయాలంటే తప్పనిసరిగా రెండున్నర ఏళ్ల పాటు ఆడిటర్ వద్ద ఆర్టికల్‌షిప్ చేయాలి. దీనికోసం చెన్నైలోని డెలాయిట్ సంస్థలో చేరాను. సీఏ ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకోవాలి. దీనికి అయ్యే ఖర్చును ఎమరాల్డ్స్ కళాశాల యాజమాన్యం భరించింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తల్లిదండ్రులకు సాయంగా.. అమ్మానాన్న ఇద్దరూ టిఫిన్ బండిపై కష్టపడేవారు. వారి కష్టంలో నేను కూడా పాలుపంచుకోవాలని వారికి సాయంగా ఉంటున్నాను. టిఫిన్ బండిపై దోసెలు పోస్తూ, వచ్చిన కస్టమర్లకు టిఫిన్ వడ్డిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నా. ఖాళీ సమయంలో చదువుపైనే దృష్టి పెడుతున్నా. సివిల్స్ సాధించడమే నా కల... సీఏ పూర్తయిన తరువాత సివిల్స్‌కు సిద్ధమవుతాను. సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ కావడమే నా కల. నాలాంటి పేద విద్యార్థులు చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ పరంగా వారికి అండగా నిలవడానికి, మరెందరో పేదలకు సేవ చేయడానికి తప్పకుండా నా కలను సాకారం చేసుకుంటా. నా తల్లిదండ్రుల ఆశలను నెరువేరుస్తా. -
బెజవాడ రైల్వేస్టేషన్లో మరో రెండు ఫ్లాట్‌ఫామ్స్
సాక్షి,విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్లో మరో రెండు ఫ్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం 6,7 ప్లాట్‌ఫారాల మధ్య ఉన్న భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త ప్లాట్ ఫారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త ప్లాట్‌ఫారాల ఏర్పాటుకు రూ.12 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు వేశారు. దీనికి రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ సుముఖంగా వున్నట్టు రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీ విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం 250 పాసింజర్ రైళ్లు, మరో 150 గూడ్స్ రైళ్లు వెళుతున్నాయి.నిత్యం 2లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వేస్టేషన్లో ప్రస్తుతం పది ప్రయాణికుల రైళ్లు ఆగే ప్లాట్‌ఫారాలు ఉండగా అదనంగా మరో 12 గూడ్స్ రైళ్ల ట్రాక్‌లు ఉన్నాయి. అయినప్పటికీ పెరుగుతున్న అవసరాలకు తగినట్టుగా ప్లాట్‌ఫారాలు సరిపోవడం లేదు దీంతో కొత్త ప్లాట్‌ఫారాల ఏర్పాటుపై అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒన్‌టౌన్ తారాపేట వైపు కొండ అడ్డంగా ఉండడం, తూర్పువైపు రైల్వే భవనం ఉండడంతో దీన్ని విస్తరించడం సాధ్యపడడం లేదు. శిథిలమైన పాత భవనాలు 6,7 నంబర్ ప్లాట్‌ఫారాలపై నిర్మించిన భవనాలు వంద సంవత్సరాలు దాటిపోయాయి. గతంలో ఏడవ ఫ్లాట్‌ఫారం వరకు మాత్రమే ఉండేది అందువల్ల అక్కడ భవనాలు నిర్మించారు. ఆ భవనాల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లు, క్రూ ఆఫీసు, సీటీఐ కార్యాలయం, ఆర్ఎంఎస్ కార్యాలయం తదితర కార్యాలయాలను నడుపుతున్నారు. 2004లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమం వైపు 8,9,10 ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేశారు. అయినా ప్రస్తుతం ట్రాఫిక్‌కు తగినట్టుగా ప్లాట్‌ఫారాలు సరిపోకపోవడంతో రాబోయే రోజుల్లో రాజధానికి వచ్చే వారి సంఖ్య పెరిగితే మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలో వందేళ్ల నాటి భవనాలను తొలగించి అక్కడ మరొక రెండు ట్రాక్‌లు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని విజయవాడ డివిజన్ అధికారులు నిర్ణయించారు. ఇటీవల రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ వచ్చినప్పుడు ఇదే విషయం చర్చించగా, ఆయన స్టేషన్‌ను పరిశీలించారు. ఫ్లాట్‌ఫారంపై ఉన్న భవనాలు ఏ నిముషంలోనైనా కూలిపోవచ్చని, అదే జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని భావించిన అధికారులు వాటిని తొలగించాలని నిర్ణయించారు. అక్కడ తిరిగి కొత్త భవనాలు నిర్మించే కంటే మరో రెండు ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చారు. కార్యాలయాలు సర్దుబాటు 6,7 నంబర్ ప్లాట్‌ఫారాలను పదవ నంబరు లేదా ఒకటవ నంబర్ ప్లాట్ఫారానికి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. స్టేషన్లో ఉండాల్సిన అవసరం లేని కార్యాలయాలను డీఆర్ఎం కార్యాలయంలో కాని మరొక చోట కాని సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల తూర్పు వైపు ఒక భవనం, పశ్చిమం వైపు పదవ నంబర్ ఫ్లాట్‌ఫారంపై మరొక భవనం మాత్రమే ఉంటుంది. ఫ్లాట్‌ఫారాలు పెరగడం వల్ల ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని నిర్ణయించారు. -
మత్స్య సంపదకు డ్రై ప్లాట్ ఫారమ్స్
డ్వామా పీడీ రాజకుమారి అల్లవరం (అమలాపురం) : మత్స్య సంపదను ఆరబెట్టేందుకు డ్రై ప్లాట్ ఫారమ్స్ ఉపాధి నిధులతో నిర్మిస్తున్నామని డ్వామా పీడీ రాజకుమారి అన్నారు. బెండమూర్లంక, బోడసకుర్రు, ఎస్.పల్లిపాలెం, ఓడలరేవు, గుండెపూడి గ్రామాల్లో ఏడుచోట్ల డ్రై ప్లాట్ ఫారమ్స్ నిర్మాణానికి రూ.22.73 లక్షలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం బోడసకుర్రులో డ్రై ప్లాట్ ఫారమ్స్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావుతో కలసి పరిశీలించారు. డ్వామా పీడీ మాట్లాడుతూ డ్రై ప్లాట్‌ఫారమ్స్ నిర్మాణానికి 48 మత్స్యకార గ్రామాలకు రూ.80 లక్షల చొప్పున ఉపాధి నిధులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకూ 20 పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు బండ్ ప్లాంటేషన్, హోమ్ ప్లాంటేషన్, పట్టు పురుగుల పెంపకం, వన సంరక్షణ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం ఉపాధి హామీ నిధులతో చేపడుతున్నామన్నారు. జిల్లాలో 400 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్మాణాలు చేపట్టామని, 46 పూర్తయ్యాయని, 141 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510 కిలోమీటర్ల పొడవునా సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఉపాధి కూలీలకు వేతనాలు బ్యాంకు ఆకౌంట్లో జమ కాకపోవడానికి ఆధార్ లింక్ చేయకపోవడమే కారణమన్నారు. ఆధార్ లింక్ కాని ఉపాధి కూలీలకు బ్యాంకు అకౌంట్లో జమ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. పీడీ వెంట ఏపీడీ భానుప్రకాష్, ఎంపీడీఓ వి.శాంతామణి, సర్పంచ్ దొమ్మేటి శ్యాంప్రకాష్ ఉన్నారు. డిసెంబర్ నాటికి మినీ హార్బర్ అంతర్వేదిలో రూ. 30 కోట్లతో నిర్మిస్తున్న మినీ హార్బర్ డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు అన్నారు. బోడసకుర్రులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఓడలరేవులో రూ.5.3 కోట్లతో జెట్టీ నిర్మాణం జరుగుతోందన్నారు. -
టీఎస్ వర్సెస్ ఏపీ
►ఆర్టీసీ బస్టాండ్లలో ప్లాట్ ఫాంల గొడవ ► ఆంధ్రా బస్సులను ప్లాట్‌ఫాంపైకి రాకుండా అడ్డగింత ► విజయవాడలో తమను రానివ్వడం లేదని ఆరోపణ ► కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడలో అడ్డుకునేందుకు ప్రత్యేక సిబ్బంది కోదాడటౌన్ : ఆర్టీసీలో తెలంగాణ- ఆంధ్ర వివాదం ముదిరి పాకాన పడింది. బస్టాండ్లలో ప్లాట్ ఫాంలపైకి రాకుండా అక్కడి బస్సులను ఇక్కడి వారు.. ఇక్కడి బస్సులను అక్కడి వారు అడ్డుకుంటున్నారు. జాతీయ రహదారిపై ఉన్న కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి బస్టాండ్లతో పాటు ఆంధ్ర బస్సులు ఎక్కువగా వచ్చే మిర్యాలగూడెం, మల్లేపల్లి బస్టాండ్లలో ఆంధ్ర బస్సులకు ఒక్క ప్లాట్ ఫాం మాత్రమే కేటాయించారు. వారు అక్కడ తప్పా మిగతా ఫ్లాట్‌ఫాంలపై బస్సులను నిలపకుండా ప్రతి బస్టాండ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించి అడ్డుకుంటున్నారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి టీఎస్ ఆర్టీసీ సిబ్బందికి బస్టాండ్లలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. వివాదం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బస్టాండ్ నుంచి కోదాడతో పాటు నల్లగొండ, మిర్యాలగూడకు నిత్యం బస్సుల రాక పోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి తెలంగాణ బస్సులు హైదరాబాద్‌కు కూడా సర్వీస్‌లు కొనసాగి స్తున్నారు. అయితే తెలంగాణ బస్సుల్లో చార్జీలు ఆంధ్ర బస్సుల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులను ఎక్కుతున్నారని తమకు తీవ్ర నష్టం వస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ బస్టాండ్‌లో 80 ప్లాట్‌ఫాంలు ఉండగా తెలంగాణ బస్సులన్నింటికి కలిపి ఒక్క ప్లాట్ పాం మాత్రమే ఇచ్చారు. బస్సులు బయట నిలపడానికి అవకాశం లేక, ప్లాట్‌ఫాం మీదకు వెళ్లనీయకపోవడంతో తెలంగాణ బస్సులు కొద్ది రోజులుగా అక్కడి నుంచి ఖాళీగా రావాల్సి వస్తుంది. నల్లగొండ నుంచి కాకినాడకు వెళ్లే బస్సుకు, పరకాల నుంచి గుంటూరు వెళ్లే బస్సులకు కూడా అక్కడ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మేమేం తక్కువ... కోదాడ డిపో నుంచి విజయవాడకు నిత్యం నడిచే బస్సుల సిబ్బంది దీనిపై తీవ్రంగా స్పందించారు. కోదాడ బస్టాండ్‌లో మొత్తం 10 ప్లాట్ ఫాంలు ఉండగా బస్టాండ్ చివరి ప్లాట్ ఫాం ఒక్క దానిని మాత్రమే వారికి కేటాయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులన్నీ ఆ ఒక్క ప్లాట్ ఫాం మీద మాత్రమే ఆగాలి. దీంతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్టీసీ ఆర్డినరీ బస్సులు, విజయవాడ-కోదాడ షటిల్ బస్సులన్నింటికి ఇది ఒక్కటే కేటాయించారు. ఈ ప్లాట్‌ఫాం ఖాళీ లేకపోతే దూరంగా చెట్ల కింద ప్రయాణికులను దింపి అక్కడి నుంచి అటే వెళ్లాల్సి వస్తుంది. ఇతర ప్లాట్ ఫాంలు ఖాళీగా ఉన్నా వీరి బస్సులను మాత్రం అక్కడ నిలపనీయకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఈ విధంగా ఆంధ్ర బస్సుల తాకిడి ఎక్కువగా ఉండే సూర్యాపేట, మిర్యాలగూడ, మల్లేపల్లి బస్టాండ్లలో ఆంధ్ర బస్సులకు ప్లాట్‌ఫాంల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. దీంతో ఇరు రాష్ట్రాల సిబ్బంది నిత్యం ప్లాట్‌ఫాంల విషయంలో గొడవ పడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా బస్సులకు ఒక ప్లాట్‌ఫాం కేటాయించాం కోదాడ బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంల కొరత ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కొన్ని బస్సులు వచ్చి ప్లాట్‌ఫాంలపై ఎక్కువ సమయం నిలపడం వల్ల కోదాడ డిపో బస్సులకు ప్లాట్‌ఫాం దొరకడం లే దు. వారి బస్సులు ఖాళీ ఉన్నప్పుడే బస్టాండ్‌కు వస్తున్నారు. నిండుగా ఉంటే బైపాస్‌లో వెళ్తున్నారు. ఈ సమస్యల వల్ల వారికి ఒక్క ప్లాట్ పాం కేటాయించాం. వారు అక్కడే నిలపాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడుపుతాం. - శ్రీనివాసరావు,కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ -
రైలు ఢీకొని మహిళ మృతి
నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. బుధవారం ఉదయం ప్లాట్ ఫామ్ నంబర్ 5 వద్ద పట్టాలు దాటుతున్న మహిళను.. రైలు ఢీ కొంది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. రైలు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని విరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
స్తంభించిన రైళ్లు
విశాఖపట్నం సిటీ: తూర్పు కోస్తా రైల్వేలోని ప్రధానమైన విశాఖ రైల్వే స్టేషన్ చిగురుటాకులా వణికిపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచే మొదలైన గాలులకు రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. భీకర గాలులకు ఎగిరిపోతున్న పైకప్పులను సరి చేసే లోపే మరో ప్లాట్‌ఫాం మీద వున్న పై కప్పులు ఎగిరిపోతుండడంతో ఆఖరికి సిబ్బంది సైతం చేతులెత్తేశారు. ప్లాట్‌ఫార పై ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ప్లాట్‌ఫాంపై వున్న ఐఆర్సీటీసీ దుకాణాలన్నీ బంతుల్లా దొర్లాయి. విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8 ప్లాట్‌ఫాంలపై ఉన్న ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులు, ఐరన్ షీట్లు కాగితాల్లా ఎగిరిపోయాయి. అత్యవసర ప్రయాణాలు చేద్దామనుకున్న వారంతా చిగురుటాకుల్లా వణికిపోయారు. రైళ్లరద్దుతో వేలాది మంది ప్రయాణికులు వచ్చి టికెట్లు రద్దు చేసుకుంటారనుకున్నా భయంకర తుఫాన్‌కు ఎవరు స్టేషన్ వైపు రాలేదు. వచ్చిన వారు మాత్రం ఎటూ వెళ్లలేక స్టేషన్లోనే దిగాలుగా పడిగాపులు కాస్తున్నారు. ఏ సమాచారం తెలియక తంటాలు పడుతున్నారు. రైల్వే ఉద్యోగులు సైతం ఆదివారం విధుల్లోకి రావాల్సిన వారంతా రాలేదు. దీంతో శనివారం రాత్రి విధుల్లో వున్న వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఖాళీ రైళ్లు ఢీ: తూర్పు కోస్తా రైల్వే చిగురుటాకులా వణికిపోయింది. హుదూద్ తుఫాను బీభత్సం సృష్టించనుందని ముందే హెచ్చరించడంతో దాదాపు 50కు పైగా రైళ్లను ఎక్కడున్న వాటిని అక్కడే నిలిపివేసినా వాటిని నియంత్రించడం కష్టతరమైంది. విశాఖలో నిలిపివేసిన పలు రైళ్లు భారీ ఈదురుగాలులకు పట్టాలపై దొర్లుకుపోవడం రైల్వే వర్గాలను కలవరపెట్టాయి. అందులో ప్రయాణికులు లేకపోయినా ఈదురు గాలులకు రైళ్లు సైతం కొట్టుకుపోతున్నాయని కలవరపడ్డారు. ఆదివారం రోజంతా అవి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూనే ఉన్నాయి. బ్రేక్‌లపై నిలిపివేసిన రైళ్లు సైతం చిగురుటాకుల్లా దొర్లిపోయేవి. వాటిని పట్టాలపై నియంత్రించడం సాధ్యమయ్యేది కాదు. ప్రయాణాలకు బ్రేక్ గత రెండు రోజులుగా విశాఖలో హుదూద్ చేస్తున్న హడావుడితో పలువురు ప్రయాణాలు బ్రేక్ చేసుకున్నారు. వేలాది మంది తమ టికెట్లను శనివారం రాత్రే రద్దు చేసుకున్నారు. దాదాపు నాలుగు నుంచి 5 వేల మంది ప్రయాణికులకు రూ. కోట్లలో చెల్లింపులు(రిఫండ్) చేశారు. మరో రెండు మూడు రోజుల వరకూ ప్రయాణాల పరిస్థితి మందకొడిగానే కొనసాగే అవకాశాలున్నాయి. -
పేరుకే జంక్షన్.. సమస్యలతో టెన్షన్
125 సంవత్సరాల క్రితం అప్పటి బ్రిటిష్ పాలకులు సింగరేణి ఫిర్కాలో బొగ్గు నిక్షేపాలను తరలించేందుకు కారేపల్లి రైల్వే జంక్షన్‌గా చేసుకుని ఇల్లెందు వరకు, వయా కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) మణుగూరు వరకు రైలు మార్గాన్ని నిర్మించారు. 1982లో మండలంలోని మాధారం గ్రామంలో డోలమైట్ ఖనిజం నిల్వలు ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని విశాఖ స్టీల్‌కు తరలించేందుకు కారేపల్లి రైల్వే జంక్షన్ నుంచి మాధారం వరకు లైన్ ఏర్పాటు చేశారు. 1996 వరకు బొగ్గు ఇంజన్లు, డీజిల్ ఇంజన్లతో ఈ మార్గంలో రైళ్లు నడిచాయి. ఆ తర్వాత విద్యుత్ లైన్లు వేసి 1996 డిసెంబర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజన్లతో రైళ్లు నడుపుతున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న కారేపల్లి రైల్వే స్టేషన్లో మాత్రం కనీస సౌకర్యాలు లేవు. ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. రైలు ఎక్కడమే కష్టం... కారేపల్లి మండలంలో ఉన్న పోచారం, కారేపల్లి, గాంధీపురం, చీమలపహాడ్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాంలు ఎత్తు తక్కువగా ఉండడంతో పాటు పొడవుగా కూడా లేవు. దీంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్లాట్ ఫాం పొడవు తక్కువగా ఉండడంతో ఒక్కోసారి కంకర రాళ్లపై పడి గాయపడుతున్నారు. ఈ రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు కూడా లేవు. తాగేందుకు చుక్క నీరు కూడా దొరకడం లేదు. మరోపక్క నిల్చునేందుకు నీడ లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్ ఫాంలపై షెడ్లు నిర్మించాలని ప్రయాణికులు పలుమార్లు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కారేపల్లి రైల్వే జంక్షన్ అభివృద్ధిపై నిర్లక్ష్యం కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తున్నా అధికారులు మాత్రం కారేపల్లి రైల్వే జంక్షన్ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారేపల్లి - ఇల్లెందు, కారేపల్లి - పేరుపల్లి, ఖమ్మం - ఇల్లెందు(గాంధీపురం గేటు) రైల్వే గేట్లకు అండర్ బ్రిడ్జిలు మాత్రం ఏర్పాటు చేయలేదు. అరగంటకోసారి గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు ఈ మార్గంలో వచ్చి వెళ్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు అనేకమార్లు రైల్వే అధికారులకు విన్నవించినా ఫలితం మాత్ర ం కరువైంది. అలాగే రొట్టమాకిరేవు, బస్వాపురం రైల్వే గేటు వద్ద కీపర్(వాచర్)లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గాంధీపురం, చీమలపహార్ రైల్వే స్టేషన్లకు మధ్య చింతలపాడు వద్ద అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినప్పటికీ రాకపోకలకు మాత్రం అనువుగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి రానున్న రైల్వే బడ్జెట్లోనైనా మండలంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించేలా చూడాలని, జిల్లాలోని ఏకైక రైల్వే జంక్షన్ అయిన కారేపల్లిని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
చేపా.. చేపా! ఎందుకెండలేదు?
=ప్లాట్‌ఫారాలు లేక నాణ్యత కోల్పోతున్న ఎండు చేపలు =ఇసుక దిబ్బల్లో ఎండబెట్టి నష్టపోతున్న గంగపుత్రులు =స్టోర్ రూం లేక ఒడ్డునే వలల మరమ్మతులు ఈ ప్రశ్నకు జవాబు కోసం పెద్దగా శ్రమపడక్కర్లేదు. దానికి సమాధానం ఇదిగో.. సముద్రంపై ఆటుపోట్లతో వేటసాగిస్తూ అరకొరగా చేపలు దక్కించుకుంటున్న అడుగడుగునా అష్టకష్టాలే. తీరప్రాం తాల్లో మౌలిక సదుపాయాల కల్పన అల్లంత దూరంలోనే ఉంటోంది. నిద్రాహారాలు మాని, ప్రాణాలకు తెగించి వేటాడి తెచ్చుకున్న చేపలను ఎండబెట్టుకోవడానికి ప్లాట్‌ఫారాల కొరత వేధిస్తోంది. తీరం వెంబడి ఉన్న ఇసుకతిన్నెలే వీరికి ఆధారమవుతున్నాయి. నక్కపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో 11 మండలాల్లో 132 కిలోమీటర్ల తీరం ఉంది. 62 మత్స్యకార గ్రామాల్లోని 30 వేల మంది రోజూ వేటకు వెళతారు. వీరిలో 30శాతం మందికి వేట లేకుంటే పూట గడవదు. సుమారు లక్ష మంది వేట ఆధారంగా జీవిస్తున్నారు. మరో లక్ష మంది పరోక్షంగా అనుబంధరంగాలపై ఆధారపడి బతుకుతున్నారు. మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలను ప్లాట్‌ఫారాలపై ఎండబెడితే నాణ్యత బాగుంటుంది. వాటికి మంచి ధర పలుకుతుంది. ఇసుకపై ఎండబెట్టిన చేపలకంటే ప్లాట్‌ఫారాలపై ఎండిన వాటికి కిలోకు రూ.20-30ల ధర అధికంగా ఉంటుంది. తీర ప్రాంతంలో చేపలను భద్రపరచుకోవడం, ఎండబెట్టుకోవడానికి ప్లాట్‌ఫారాలు, వేలాది రూపాయలు విలువైన వలలు దాచుకోవడం, మరమ్మతులు చేసుకోవడానికి స్టోర్‌రూంలు నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా మత్య్సకారులు చేస్తున్న డిమాండ్ సాగర రోదనే అవుతోంది. జిల్లాలో తీరప్రాంతం వెంబడి 11 మండలాల్లో సుమారు 1800కి పైగా మోటారు బోట్లు, తెప్పలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎండుచేపలకు గిరాకీ ఉంది. చేపలను ఇసుకతిన్నెల్లో ఎండబెట్టి పూరీ, పారాదీప్, నాగార్జునసాగర్, కోల్‌కతా, శ్రీశైలం, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. 50 బోట్లకు పైగా ఉన్న తీర ప్రాంత గ్రామంలో చేపలు ఎండబెట్టుకోవడానికి కనీసం రెండు ప్లాట్ఫారాలుండాలి. కానీ చాలా గ్రామాల్లో ఒకటి కూడా లేదు. పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట, కొర్లయ్యపేట, వెంకటనగరం, నక్కపల్లి మండలం రాజయ్యపేట తదితర పెద్ద గ్రామాల్లో ఒక్కో ప్లాట్ ఫారం ఉంది. పెదతీనార్ల, చినతీనార్ల, రాజవరం,కేశవరం గ్రామాల్లో లేనేలేవు. ఎస్. రాయవరం మండలం రేవుపోలవరం, బంగారయ్మపాలెం, అచ్చుతాపురం మండలంలో పూడిమడక, తదితర గ్రామాల్లో 4-5 ప్లాట్‌ఫారాలు నిర్మించాలి. కానీ ఎక్కడా ఒకటికి మించి లేవు. దీంతో జోరుగా వేటసాగే సమయంలో దొరికిన చేపలను ఇసుక తిన్నెలపైనే ఉంచాల్సి వస్తోంది.తీరప్రాంతం నుంచి మత్య్ససంపదను మార్కెటింగ్ చేసేందుకు సరైన రహదారి సదుపాయాలు లేవని వీరు వాపోతున్నారు. గ్రామాల నుంచి సముద్రపు ఒడ్డుకు పక్కా రోడ్డు లేక ఆటోలో చేపలు తరలించడానికి రవాణా చార్జీలు తడిసిమోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ీతీరప్రాంతాల్లో తగినన్ని ప్లాట్‌ఫారాలు నిర్మించాలని కోరుతున్నారు. -
రెండేళ్లలో ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపు
సాక్షి, ముంబై: పశ్చిమరైల్వే చేపట్టిన ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపు పనులు 2015నాటికి పూర్తవనున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. నగరంలోని కొన్ని రైల్వే స్టేషన్లలో లోకల్ రైలు-ప్లాట్‌ఫాంల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో రైలు ఎక్కే సమయంలో అనేకమంది ప్రయాణికులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ రైల్వే నెల రోజుల క్రితం ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపు పనులను ప్రారంభించింది. ప్లాట్‌ఫాంల ఎత్తును 760 మిల్లీమీటర్ల నుంచి 920 మిల్లీమీటర్ల వరకు పెంచేందుకు రైల్వే డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతించింది. ప్రస్తుతం గ్రాంట్‌రోడ్‌లో ప్లాట్‌ఫాం ఎత్తు పెంపు పనులు కొనసాగుతున్నాయి. త్వరలో చర్నిరోడ్, ఎల్ఫిస్టన్, లోయర్ పరేల్, విలేపార్లే, ఖార్ తదితర స్టేషన్లలో ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపు పనులను ప్రారంభించనున్నారు. ఒక్క ప్లాట్‌ఫాం ఎత్తు పెంపు పనులు పూర్తి కావడానికి రెండు నెలల సమయం పడుతోంది. ఒక ప్లాట్‌ఫాం పనులు పూర్తయిన వెంటనే మరో ప్లాట్‌ఫాం పనులు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్లాట్‌ఫాంల ఎత్తును పెంచే ప్రక్రియ చాలా ఆలస్యంగా చేపట్టారని కొందరు సామాజిక కార్యకర్తలు ఆరోపించారు.కాగా 2004లోనే ప్లాట్‌ఫాంల ఎత్తును పెంచాలంటూ రైల్వేశాఖను హైకోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటికీ పనులను పూర్తికాలేదని ప్రయాణికుల సంఘం సభ్యుడు సమీర్ ఆరోపించారు.