ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహిస్తాం– రానా | Rana Daggubati Talks About New Digital Platform South Bay | Sakshi
Sakshi News home page

ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహిస్తాం– రానా

Published Wed, Jan 13 2021 1:12 AM | Last Updated on Wed, Jan 13 2021 7:03 AM

Rana Daggubati Talks About New Digital Platform South Bay - Sakshi

రానా, కిరణ్‌ కుమార్

‘మా సౌత్‌ బే’కు ఎక్స్‌క్లూజివ్‌ డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వామిగా ఉండేందుకు ‘బిలీవ్‌ ఇండియా’ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం వల్ల సౌత్‌ బే మరింతగా వ్యూయర్స్‌కు రీచ్‌ అవుతుందని ఆశిస్తున్నాం. ప్రతిభ గల కొత్త కళాకారులకు అవకాశాలు ఇవ్వడం, కమర్షియల్‌ కంటెంట్‌ తయారు చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టనున్నాం’’ అన్నారు రానా. ఇటీవల ‘సౌత్‌ బే’ పేరుతో రానా ఓ యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చానెల్‌ ద్వారా సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో పాటు వర్తమాన విషయాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తున్నారాయన.

తాజాగా ‘సౌత్‌ బే’ తో వరల్డ్‌ లీడింగ్‌ డిజిటల్‌ మ్యూజిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ‘బిలీవ్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘‘ప్రతిభ ఉన్న కొత్త కళాకారులను, మ్యూజిక్‌ లేబుల్స్‌ను ప్రోత్సహించడం బిలీవ్‌ ఇండియా కార్యాచరణలో కీలకమైంది. సౌత్‌ బేతో ఎక్స్‌క్లూజివ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఒప్పందం చేసుకోవడం కూడా ఇందులో భాగమే. ఇలాంటి భాగస్వామ్యాలతో సంగీత ప్రపంచంలో కొత్త దారిని ఏర్పర్చగలమని నమ్ముతున్నాం’’ అన్నారు ‘బిలీవ్‌ ఇండియా’ డైరెక్టర్‌ కెజీవీ కిరణ్‌ కుమార్‌.‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement